Jump to content

రాష్ట్రానికి కేంద్రం మరో షాక్‌


Recommended Posts

రోడ్డు’న పడేశారు!
13-04-2018 02:22:58
 
636592099717375962.jpg
  • రాష్ట్రానికి కేంద్రం మరో షాక్‌
  •  ఎల్‌డబ్ల్యూఈ పనుల నుంచి రాష్ట్ర రోడ్ల తొలగింపు
  •  డీనోటిఫై చేసిన ఆర్‌అండ్‌బీ
అమరావతి(ఆంధ్రజ్యోతి): తీవ్ర ఆర్థికభారంలో ఉన్న రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖకు కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి ( ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈ) కింద చేపట్టే పనుల్లో రాష్ట్ర ప్రధాన రహదారులను చేర్చవద్దని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ, జిల్లా ప్రధాన రహదారుల వర్క్‌లను మాత్రమే ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని సంబంధిత విభాగాలకు సర్క్యులర్‌ పంపించింది. మార్గదర్శకాలకు భిన్నంగా ఇతర రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు చేపడితే నిధులు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీలేక రాష్ట్ర ప్రధాన రహదారులు, ఇతర రాష్ట్ర రహదారులను ఎల్‌డబ్ల్యూఈ జాబితా నుంచి తొలగించారు. ఇక ఇప్పటికే ప్రతిపాదించిన వర్క్‌ల జాబితా నుంచి ఐదు వర్క్‌లను డీనోటిఫై చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కింద రహదారులు, వంతెనలు, సెల్‌ఫోన్‌ టవర్లు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్రం రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలు తీవ్రవాదబాట పట్టకుండా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి కార్యక్రమాలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో గత కొన్నేళ్లుగా ఈ పద్దుకింద అనేక వర్క్‌లు చేపట్టారు. ప్రత్యేకించి గోదావరి జిల్లాలతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో మౌలికసదుపాయాల కల్పన కింద ఎక్కువగా రహదారుల నిర్మాణం చేపడుతున్నారు.
 
ఇందులో గ్రామీణ, జిల్లా ప్రధాన రహదారులతోపాటు స్టేట్‌ హైవేలు కూడా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలను ప్రధాన నగరాలతో అనుసంధానించే స్టేట్‌ హైవేలు ఇందులో ఉంటున్నాయి.ఉదాహరణకు కర్నూలు నుంచి అనంతపురం లేక కర్నూలు నుంచి ఒంగోలు, విశాఖ నుంచి ఏజెన్సీ మీదుగా ఒడిసాకు వెళ్లే రహదారులున్నాయి. ఇవన్నీ నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో గత కొన్నేళ్లుగా ఎల్‌డబ్ల్యూఈ వర్క్‌ల జాబితాలో చేర్చి అభివృద్ధి చేస్తున్నారు. అయితే, ఇకపై రాష్ట్ర రహదారులను ఈ జాబితాలో చేర్చవద్దంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఎల్‌డబ్ల్యూఈ విభాగాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. ఇప్పటికే జాబితాలో చేర్చిన వర్క్‌లను గుర్తించి తొలగించాలని స్పష్టం చేశాయి. ఈ నిర్ణయం ఏపీకి శరాఘాతమే కానున్నదని అధికారులు చెబుతున్నారు.
 
ఐదు రోడ్లు డీనోటిఫై
విశాఖ జిల్లాలో అనంతగిరి-అరకు రోడ్డు, సీతంపేట-దొనుబాయి రోడ్లను డీ నోటి ఫై చేశారు. అంటే ఈ రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులను ఆర్‌అండ్‌బీ ఇతర పద్దుల కింద చేపట్టాల్సిందే. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం-దొనుబాయి, పాలకొండ హద్దుబండి రోడ్లను.. విజయనగరం జిల్లా ఎల్విన్‌పేట-రమ్మనగూడ, తోటపల్లి-గుణుపురం రోడ్‌ వయా పెద్ద మారంగి జంక్షన్‌ రోడ్లను డీ నోటిఫై చేశారు. ఇవన్నీ గతంలో జిల్లా ప్రధాన రోడ్లుగా ఉన్నవే. పెరిగిన ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని ఇటీవలే రాష్ట్ర ప్రధాన రోడ్ల జాబితాలో చేర్చారు. ఇప్పుడు అదే సమస్యగా మారింది. మొత్తం 269 కిలోమీటర్ల జిల్లా రహదారులను రాష్ట్ర ప్రధాన రహదారులుగా మార్చి అందులో 100 కిలోమీటర్ల రహదారిని ఎల్‌డబ్ల్యూఈ కింద అభివృద్ధి చేసేలా గతంలోనే ప్రతిపాదనలు ఇచ్చారు. తొలుత అంగీకరించిన కేంద్రం, ఇప్పుడు మారిన మార్గదర్శకాల పేరిట వాటిని తొలగించాలని ఆదేశించింది.
Link to comment
Share on other sites

Guest Urban Legend
20 minutes ago, Naren_EGDT said:

Kendram mana mida depend ayyi pani chese roju vaste ne anni samasyalaku parishkaaram.

 

Telugudesanni anni sthanallo gelipinchali. Ide andhra pradesh ayudham Andhrapradesh kartavyam.give tdp 25 mps, babu will take care the rest

 

Link to comment
Share on other sites

1 hour ago, Naren_EGDT said:

Kendram mana mida depend ayyi pani chese roju vaste ne anni samasyalaku parishkaaram.

Telugudesanni anni sthanallo gelipinchali. Ide andhra pradesh ayudham Andhrapradesh kartavyam.give tdp 25 mps, babu will take care the rest

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...