Jump to content

Chandranna pelli kanuka


Saichandra

Recommended Posts

చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా బీసీలకు రూ.35 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు, కాపులకు రూ.30 వేలు, మైనారిటీలకు రూ.35వేలు ప్రభుత్వం అందించనుంది.

చంద్రన్న పెళ్లి కానుక పధకానికి దరఖాస్తు చేసుకోవడానికి పీపుల్ ఫస్ట్ యాప్(https://bit.ly/2JNgC9n  ),వెబ్ సైట్( http://www.chpk.ap.gov.in/  ) మరియు మీసేవ కేంద్రాల్లో సంప్రదించగలరు.

ఈ దరఖాస్తు కొరకు పెళ్లి కూతురు,మరియు పెళ్లి కొడుకు ఆధార్ కార్డు నెంబరు, కుల, ఆదాయ ధ్రువీకరణ నెంబర్, జనన తేదీ(పదో తరగతి),బ్యాంకు ఖాతా నెంబర్, పెళ్ళికార్డు వంటి వివరాలు తెలియజేయాలి.

ఈ పధకం కోసం పెళ్లికి 15రోజుల ముందుగానే దరఖాస్తులు చేసుకోగలరు.

Link to comment
Share on other sites

  • Replies 158
  • Created
  • Last Reply
ధ్రువీకరణ ఉంటేనే పెళ్లి కానుక
అశనిపాతంలా మారిన ప్రభుత్వ నిబంధన
  ఇప్పటికిప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవడం ఇబ్బందే
  ఆధార్‌, ప్రజాసాధికార సర్వేని ప్రాతిపదికగా చేసుకుంటే సమస్యకు పరిష్కారం
ఈనాడు డిజిటల్‌ - అమరావతి
25ap-main1a.jpg

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన చంద్రన్న పెళ్లికానుక పథకానికి దరఖాస్తు చేసుకునేవారు కచ్చితంగా జనన ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలన్న నిబంధన చాలా మందికి అశనిపాతంలా మారుతోంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 8 మధ్య 8 వేల మంది దరఖాస్తు చేసుకోగా... జనన ధ్రువీకరణ పత్రం లేదన్న కారణంతోనే 20-30 శాతం మంది దరఖాస్తుల్ని తిరస్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోను, పేదలు, నిరక్షరాస్యుల్లోను జనన తేదీలు నమోదు చేసుకునే అలవాటు తక్కువ. అలాంటి వారిని ఇప్పటికిప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు తెమ్మంటే... ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకి ఆధార్‌ని గానీ, ప్రజా సాధికార సర్వేని గానీ ప్రాతిపదికగా చేసుకుంటోంది. చంద్రన్న పెళ్లికానుకకు మాత్రం వాటిని ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు.

పథకం మంచిదే గానీ..!
పేదింటి ఆడపిల్లలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుకను ఏప్రిల్‌ 20 నుంచి అమల్లోకి తెచ్చింది. బీసీలకు రూ.35 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీ, మైనార్టీలకు రూ.50 వేలు ప్రకటించింది. ఈ మొత్తంలో పెళ్లి రోజున 20%, పెళ్లయిన నెలరోజుల్లో మిగతా మొత్తం లబ్ధిదారులకు అందజేస్తారు. వివాహ తేదీకి కనీసం 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్‌ 20 నుంచి మే 8 మధ్య వివాహం చేసుకున్న వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. పథకం మొదలై నెల రోజులు దాటినా... ఇంకా చాలా మందికి లబ్ధి చేకూరలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు నేరుగా చెక్కులు అందించిన వారికే ఇంత వరకు లబ్ధి చేకూరింది. సాఫ్ట్‌వేర్‌ ఇబ్బందుల వల్ల దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం జరగడంతో... పథకం అమలు ఆలస్యమైంది. ఇది ఒక కోణమైతే... జనన ధ్రువీకరణ పత్రాలు లేవన్న కారణంతో చాలా మంది దరఖాస్తుల్ని పక్కన పెట్టడం మరో కోణం.

నిరక్షరాస్యులకు పథకం చేరేదెలా?
గిరిజన, వెనుకబడిన ప్రాంతాలతో పాటు మెజార్టీ ప్రజల దగ్గర జనన ధ్రువీకరణ పత్రాల్లేవు. ఇప్పుడైతే పిల్లలు పుట్టిన వెంటనే జనన ధ్రువీకరణకు ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి. ప్రజల్లో కొంత అవగాహనా పెరిగింది. 20-25 ఏళ్ల క్రితం పటిష్ఠమైన వ్యవస్థలూ లేవు. ప్రజల్లో పూర్తి అవగాహనా లేదు. అలాంటి వారికి ఇప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు కావాలంటే... మొదట తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. మండల రెవెన్యూ అధికారులు విచారణ జరిపి, ఆర్డీఓకి నివేదిక పంపిస్తారు. ఆర్డీఓ ప్రొసీడింగ్స్‌ ఇస్తే... సంబంధిత గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ అధికారులు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. నిరక్షరాస్యులు ఈ ప్రక్రియంతా పూర్తి చేసుకోవాలంటే కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. కనీసం రెండు మూడు నెలల సమయమైనా పడుతుంది. ఆ క్రమంలో చాలా మంది చేతులు కూడా తడపాల్సి ఉంటుంది. మే 8 తర్వాత చంద్రన్న పెళ్లికానుక పథకానికి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. జనన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు సాధ్యం కావడంలేదు. 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనపై కూడా ప్రజల్లో ఇంకా పూర్తి అవగాహన ఏర్పడలేదు. అంత గడువు లేకుండా ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి వెళితే తిప్పి పంపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశిబుగ్గకు చెందిన పొందర సింహాచలం అనే యువతి ఈ పథకానికి ఏప్రిల్‌ 22న 1100 నంబర్‌కు ఫోన్‌ చేసి దరఖాస్తు చేసుకున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన ఈమె వివాహం జరిగి నెల రోజుల గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి అందలేదు. జనన ధ్రువీకరణ పత్రం లేని కారణంగానే ఆమెకు పథకం వర్తింపజేయలేదు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన సింగినాల సురేఖకు మే 6న వివాహం జరిగింది. ఈమె తల్లిదండ్రులు చంద్రన్న పెళ్లికానుక పథకానికి దరఖాస్తు చేసేందుకు ఏప్రిల్‌ 28న డ్వాక్రా అధికారులను ఆశ్రయించారు. పెళ్లికి 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలన్న కారణంతో పథకం వర్తించదని చెప్పి వెనక్కి పంపించారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...