Jump to content

చంద్రబాబుతో సెల్ఫీ.. ఆపై సోషల్‌మీడియాలో వైరల్!


Recommended Posts

చంద్రబాబుతో సెల్ఫీ.. ఆపై సోషల్‌మీడియాలో వైరల్!
10-04-2018 10:15:25
 
636589522488464836.jpg
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏపీ సీఎం చంద్రబాబు అన్ని పార్టీల నేతలను కలుస్తున్నారు. వారితో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి, కేంద్రప్రభుత్వ వైఖరి గురించి వివరిస్తున్నారు. ఈ సమయంలోనే ఓ నేత వచ్చి "సార్.. నేను మీ అభిమానిని..'' అని చెబుతూ సెల్ఫీ తీసుకుని మురిసిపోయారు. ఆ తర్వాత చంద్రబాబుతో కరచాలనం చేసి వెళ్లిపోయారు. ఇదంతా నిముషాల్లో జరిగిపోయింది. ఈ సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఇంతకీ సెల్ఫీ తీసుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఆయన గురించి తెలుసుకున్నాక చంద్రబాబు ఎలా స్పందించారు? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
    పార్లమెంట్ సెంట్రల్ హాలుకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి.. పలు పార్టీల నేతలను కలుసుకున్న సంగతి తెలిసిందే. వివిధ పక్షాల నేతలతో మాట్లాడుతూ ఆయన బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ఎంపీలు వేరే పార్టీలకు చెందిన ఎంపీలను చంద్రబాబుకు పరిచయం చేశారు. వారందరితో కూడా చంద్రబాబు మంతనాలు సాగించారు. ఇదే తరుణంలో ఓ వ్యక్తి చకాచకా చంద్రబాబు వద్దకు వచ్చారు. "నేను మీ అభిమానిని. కేంద్ర మంత్రిని'' అంటూ తనని తాను పరిచయం చేసుకున్నారు. "మిమ్మల్ని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది'' అంటూ సంతోషపడ్డారు. ఆత్మీయంగా కరచాలనం చేసి సెల్ఫీ తీసుకున్నారు. "మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉందని'' మరోసారి గౌరవంగా చెప్పి వెళ్లిపోయారు.
 
 
     ఈ సంఘటనతో చంద్రబాబు చుట్టూ ఉన్న తెలుగుదేశం ఎంపీలు, ఇతర పార్టీల ఎంపీలు ఆశ్చర్యపోయారు. ఆ వచ్చిన వ్యక్తి హరదీప్‌సింగ్ పూరీ. ఆయన స్వతంత్ర హోదాలో ఉన్న నగర, గృహనిర్మాణ శాఖమంత్రి. చంద్రబాబుని పరిచయం చేసుకున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని కూడా చెప్పారు. "నేను బ్యూరోక్రాట్‌గా ఉన్నప్పటినుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను'' అని తొలుత అభిమానపూర్వకంగా మాట కలిపారు. "మీరు ఎన్‌డీఏలో లేనప్పటికీ మీపై ఉన్న అభిమానంతో వచ్చాను'' అంటూ వినయాన్ని ప్రదర్శించారు.
 
 
    హరిదీప్‌సింగ్ గతంలో ఇండియా ఫారిన్ సర్వీస్ అధికారిగా పనిచేశారు. ఈ సర్వీస్‌లో ముప్పయ్యేళ్లు పనిచేసిన అనుభవజ్ఞులు. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌కు అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. వంద దేశాలను చుట్టివచ్చిన అనుభవశాలి. అటువంటి అధికారి వచ్చి "మీ అభిమానిని'' అని చెప్పడం చంద్రబాబుతో పాటు అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చంద్రబాబు వెంట ఢిల్లీ వెళ్లిన ఏపీ అధికారుల బృందం ఈ ఘటనను చెప్పి సీఎంవోలో చంద్రబాబు స్థాయి ఏంటో తెలుసుకోవాలంటూ మీడియా ప్రతినిధులకు చెప్పారు. పెరటిమొక్క వైద్యానికి పనికిరాదన్నట్టుగా రాష్ట్రంలో కొందరికి చంద్రబాబు విలువ తెలియదని ఈ సందర్భంగా ఒక అధికారి వ్యాఖ్యానించారు కూడా. ఇలాంటి మరికొన్ని సంఘటనలను కూడా వారు గుర్తుచేశారు.
 
 
     పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో చంద్రబాబు ఉన్నారని తెలుసుకుని పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఆయన వద్దకు వచ్చారు. ఆయన్ని పలుకరించి ఫోటోలు దిగారు. "మేము మీ అభిమానులం'' అంటూ ఈ సందర్భంగ పలువురు ఆయనతో ముచ్చటించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి అడుగుపెట్టింది మొదలు బయటకి వచ్చేవరకు ఆయన ఎంతో బిజీబిజీగా గడిపారు. ఈ సమయంలో కొందరు ఎంపీలు ఆయనతో మాట్లాడుతూ "మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాలి'' అన్నారు. ఈ పరిణామం చూసి ఢిల్లీలో చంద్రబాబుపై నోరుపారేసుకున్న కొంతమంది తెలుగుదేశం ఎంపీలు సైతం సైలెంట్ అయ్యారు. బీజేపీ అగ్రనేతల వద్ద చంద్రబాబు గురించి చులకనగా మాట్లాడిన ఒకరిద్దరు ఎంపీలైతే బిత్తరపోయారు. ఇప్పటికే సదరు ఎంపీల వ్యవహారం గురించి తెలుసుకున్న చంద్రబాబు వారికి తోకలు కత్తిరించడం ప్రారంభించారు. చంద్రబాబుతో కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ దిగిన సెల్ఫీ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌కాడంతో సీఎంవో, ఇతర అధికారులు ఆ వార్త చదివి ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇదే అదనుగా టీడీపీ నేతలు "దటీజ్ చంద్రబాబు'' అంటూ మరింత హుషారయ్యారు.
Link to comment
Share on other sites

చంద్రబాబుపై నోరుపారేసుకున్న కొంతమంది తెలుగుదేశం ఎంపీలు సైతం సైలెంట్ అయ్యారు. బీజేపీ అగ్రనేతల వద్ద చంద్రబాబు గురించి చులకనగా మాట్లాడిన ఒకరిద్దరు ఎంపీలైతే బిత్తరపోయారు. ఇప్పటికే సదరు ఎంపీల వ్యవహారం గురించి తెలుసుకున్న చంద్రబాబు వారికి తోకలు కత్తిరించడం ప్రారంభించారు

 

yevaru villu?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...