Jump to content

అమిత్ షాకే షాక్ ఇచ్చిన శివసేన


DVSDev

Recommended Posts

శివసేన పార్టీ దృఢ వైఖరిని అవలంబిస్తోంది. స్నేహంగా ఉందామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్తున్నా ససేమిరా అంటోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని అమిత్ షా పంపిన స్నేహపూర్వక ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకోరాదని గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు శనివారం మరింత స్పష్టంగా ప్రకటించింది.
 
బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో అమిత్ షా మాట్లాడుతూ శివసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే ఉండాలని నిజాయతీగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
 
ఈ నేపథ్యంలో శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్ శనివారం నవీ ముంబైలో మాట్లాడుతూ వాళ్ళ (బీజేపీ) భాష మారిందన్నారు. ఆరు నెలల క్రితం వాళ్ళు బీజేపీ ప్రభుత్వమనే అనేవారని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎన్డీయే ప్రభుత్వమని అనడం ప్రారంభించారన్నారు. దీన్నిబట్టి వాళ్ళ ఆత్మవిశ్వాసం క్షీణించినట్లు అర్థమవుతోందన్నారు. శివసేన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే గతంలో చేసిన ప్రకటనను సుభాశ్ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ఉద్ధవ్ చెప్పారని తెలిపారు. ఆ నిర్ణయం నుంచి ఆయన వెనుదిరగలేదన్నారు. అందువల్ల శివసేన సొంతంగానే పోటీ చేసి, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
Link to comment
Share on other sites

See how this Gujju Potato Sha is begging ShivSena in  MH state where they don’t have any friends to collide with and Here in AP the same Potti Potato cheats TDP and wants to beat his friend under the belt as he has YCheaP as jackal friend

 

Link to comment
Share on other sites

Maharashtra

 

Big jolt to BJP in local body bypols ,Cng-NCP alliance won highest no of seats

 

Total Seats: 21

 

CNG-NCP : 11

 

BJP : 5

 

Shivsena :2

 

Interestingly, in the municipal corporation bypoll, out of six seats, the BJP did not win a single seat

 

Link to comment
Share on other sites

ఆరు నెలల క్రితం వాళ్ళు బీజేపీ ప్రభుత్వమనే అనేవారని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎన్డీయే ప్రభుత్వమని అనడం ప్రారంభించారన్నారు. దీన్నిబట్టి వాళ్ళ ఆత్మవిశ్వాసం క్షీణించినట్లు అర్థమవుతోందన్నారు.

 

bemmi.entry.gif

Link to comment
Share on other sites

No automatic alt text available.

 

 
Page Liked · 2 hrs · 
 
 
 
‘ఇండియా ఈజె ల్యాండ్ ఆఫ్ స్నేక్ ఛార్మర్స్’అంటారు. ఈ దేశంలో ఆఫ్రికా, ఆస్ట్రేలియా అడవుల్లో తిరిగే కొన్ని ప్రమాదకరమైన విషనాగులున్నాయి. ఆఫ్రికన్ బ్లాక్ మాంబాలు, ఆస్ట్రేలియన్ పైథాన్లు తప్ప దాదాపు అనేక జాతులు ఇక్కడా ఉన్నాయి. అయితే ఇవి ఇక్కడి రాజకీయ చదరంగంలోనూ ఉండటం విశేషం. పైథాన్లు, కోబ్రాలు విరజిమ్మలేని విషాన్నీ మన సైతాన్లు విరజిమ్ముతున్నాయిక్కడ. 
మనం ఇంకా జంతువుల భాషలోనే మాట్లాడుకుంటే శతాబ్దాలు దాటినా విదేశీయులు మన దేశాన్ని పాములు ఆడించే వాళ్ల దేశం అని పిలవక ఇంకెలా పిలుస్తారు? 
బిజేపీ అధ్యక్షులు అమిత్ షా గారు ప్రతిపక్షాలను లేదా విపక్షాలను జంతువులతో పోల్చారు. ఆయనకు స్క్రిప్టు ఎవరు రాశారో కానీ వాళ్లకు జోహార్లు అర్పించాలి. చిరుతలు చెట్టు ఎక్కడం వీడియోల్లో చూశాను. కానీ సింహాలు చెట్లు ఎక్కుతాయా? అమిత్ షా గారు ఏమన్నారు. ‘ భారీ వరదలు వచ్చినప్పుడు తమను తాము కాపాడుకోవడానికి పాములు, ముంగిసలు, కుక్కలు, పిల్లులు, చిరుతలు, సింహాలు తదితర జంతువులన్నీ ఒక పెద్ద చెట్టు మీదికి ఎక్కుతుంటాయి. వరద పెరుగుతున్నకొద్దీ వాటికి భయం పెరుగుతుంది’. అబ్బో చాలా గొప్ప పోలికలు, విశేషణాలు ఉపయోగించారు. చిన్న చిన్న పార్టీలు పాములు, ముంగిసలు అయితే మహాపెద్ద పార్టీ అయిన మీ పార్టీ రాకాసి బల్లి అవుతుందా? రాకాసిబల్లులు అంతరించిపోయాయి. అంతరిస్తాయి. చిన్నవే మిగిలాయి. చరిత్ర చెబుతున్న సత్యం ఇది.
మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. వరదలొచ్చినా, ఉపద్రవాలొచ్చినా, తుఫానులొచ్చినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోనసీమలో తుఫానులో హెలికాప్టర్ లో దిగారు. ఎంతో సాహసం చేశారు. ఆయన దేనీకి భయపడరు. ధైర్యంగా కోనసీమలో పెనుతుఫానును ఎదుర్కొన్నారు. ప్రజలను కాపాడారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయ్యాక విశాఖలో హుద్ హుద్ తుఫానొస్తే వారం రోజులు అక్కడే ఉండి యుద్ధం చేసి జయించారు. చంద్రబాబు నాయుడు గారికి మునగటం, ముంచటం తెలియదు. విపత్తులు, ఉపద్రవాలు వాటిల్లితే వారాలు క్యాంపువేసి వాటి మీద యుద్ధం చేయడమే తెలుసు ఆయనకు. వరదలొస్తే ఎలా ఎదుర్కోవాలో, ఆ నీటిని ఎలా మళ్లించాలో ఎందో దార్శనికత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ వరద నీటిని పట్టిసీమకు, పురుషోత్తమ పట్నానికి, ముందు ముందు బొల్లాపల్లి ఎత్తిపోతలకు మళ్లిస్తారు. భయపడకండి ఎవరూ మునిగిపోరు. ఎన్నో తుఫాన్లు, వరదలు చూశారు ముఖ్యమంత్రిగారు. 
రాజకీయ పార్టీలు జంతువులయితే మీ దృష్టిలో ఈ దేశంలో నివసించే ప్రజలంతా చీమలయి వుండాలి. అయితే మీరిలాంటి చెణుకులు విసిరితే చీమలే చలిచీమలవుతాయి. 
మీరే ప్రతిపక్షాలనయితే పాములు, ముంగిసలతో పోల్చారో అవే జంతువులు అటల్ బిహారీ వాజ్ పేయీ గారిని మూడు పర్యాయాలు ప్రధాన మంత్రిని చేసిన విషయం మరచిపోవద్దు అమిత్ షా గారు. అవునూ అప్పుడు మీరు బీజేపీలోనే ఉన్నారా? అసలు రాజకీయాల్లో ఉన్నారా? 1996లో మొదటి పర్యాయం వాజ్ పేయీజీ తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు. దురదృష్ట వశాత్తు మీ భాషలో చెప్పాలంటే అప్పుడు లెక్కకు ఒక జంతువు తక్కువై ఆయన ప్రభుత్వం విశ్వాస పరీక్షలో వీగిపోయింది. వాజ్ పేయీ గారు ధైర్యంగా విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఇప్పటిలా రెండు వారాలు లోక్ సభను వాయిదా వేయిస్తూ డ్రామాలు నడపలేదు. ఒకే ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయీ ప్రభుత్వం కూలిపోయింది. 1998లో ఆయన తిరిగి ప్రధాని అయినా 13 నెలలే కొనసాగారు. 1999లో మరోసారి ప్రధాని అయ్యి 2004 వరకు జనరంజకంగా పరిపాలించారు. 
డీమోనిటైజేషన్లు, జీఎస్టీలతో వాజ్‌పేయీ గారు దేశాన్ని దెబ్బతీయలేదు. ఆయన దేశం గర్వించే మహా పండితుడు, పాలనా దక్షుడు. అందరి మెప్పునూ, ఆమోదాన్నీ పొంది ఆయన ఈ దేశ ప్రధాని అయ్యారు. అటల్‌జీ హిట్లర్ లా దూకుడుగా వెళ్తి అన్ని పార్టీలనీ కబళించి వేయాలని ఎన్నడూ ప్రయత్నించలేదు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా అడ్డుకోలేదు. మీరు జంతువులుగా భావిస్తున్న ప్రతిపక్షాలే ఆయనకు అండగా నిలిచాయి. 
అవిశ్వాస తీర్మానం ఎదుర్కోలేక పార్లమెంటును రెండువారాలు వాయిదా వేసిన చరిత్ర ఎక్కడా లేదు. మీరు ఎగదోసిన అన్నాడీఎంకే సభ్యులే డ్రామాలో బాగా నటించారు. విపక్షాలన్నీ అడ్డుపడి పార్లమెంటును స్తంభింపజేశాయని ప్రధాని గారు తెగబాధపడిపోతున్నారు. మళ్లీ ఇందుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తారట? కర్నాటక ఎన్నికల్లో టంగ్ స్లిప్ అయ్యినా వాస్తవాన్నే మాట్లాడారు మీరు. యడ్యూరప్ప ప్రభుత్వమంత అవినీతి ప్రభుత్వం లేదన్నారు.
రాజధాని అమరావతిలో పిచుకలపాలెం-దొండపాడుల మధ్య బీఆర్‌ షెట్టి మెడిసిటీ హెల్త్‌కేర్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. కానీ ఇంకా తాత్సారం చేస్తున్నరాయన. ఆయన్నీ భయపెట్టారా మీరు? వెనక్కి వెళ్లిపోయారా? అబుదాబిలో బి.ఆర్. షెట్టిని చంద్రబాబుకు బినామీ అని విషప్రచారం చేస్తున్నారు? ఎంత దుర్మార్మం? ఇంకా నయం బిల్ గేట్స్, వార్న్ బఫెట్ లను చంద్రబాబుకు బినామీలు అనలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడుగారు ఒప్పించడం వల్లనే ఆంధ్రప్రదేశ్ హీరోమోటార్స్ పరిశ్రమ పెడతాం అని వస్తున్నాం అని ప్రకటించారు హీరో మోటార్స్ అధినేత పవన్ ముంజాల్ గారు. చంద్రబాబుకు బినామీ అని చెబుతారేమో? మీ అజ్ఞానానికి ఆంధ్రమహాజనులు నవ్వుకుంటున్నారు. 
రాష్ట్రమంత్రి ఐటీ మంత్రి లోకేష్ గారు ముకేశ్ అంబానీగారికి ఎదురేగి స్వాగతం పలికి ముఖ్యమంత్రి కార్యాలయానికి తోడ్కొని వచ్చారు. ముకేశ్ అంబానీ రాయల సీమలో పరిశ్రమ పెడతామని ప్రకటించారు. ముకేశ్ అంబానీ గారిని కూడా చంద్రబాబు గారికి బినామీ అంటారా? వాళ్లిద్దరికీ అవినీతి అంటగడతారా? సీఐఐ సదస్సుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న వాళ్లు, దావోస్ సదస్సుల్లో ముఖ్యమంత్రిగారితో మాట్లాడిన, చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకున్న వారంతా అవినీతిపరులేనా? వాళ్లకూ క్విడ్ ప్రోకోలు అంటగడతారా? 
అవినీతి మనకు అంటిందని పక్కవారికీ అంటించాలనా ఉద్దేశం? గుడ్డకాల్చి ముఖం మీద వేయడం ఇదే. బీఆర్ షెట్టి వెనక్కి తిరిగివెళితే, లేదా ఏ పరిశ్రమ వెనక్కి వెళ్లినా అందుకు కారణం మీరే అని జనం గట్టిగా నమ్ముతారు. మా తిరుపతి వెంకటేశ్వర స్వామి వాహనం గరుత్మంతుడే. ఆపరేషన్ గరుడాలు చంద్రబాబు నాయుడుగారిని ఏమి చేస్తాయి? మా వాళ్లకు గరుడాలు కాదు. గరుడ పురాణాలు తెలుసు. చేసిన వాగ్దానాలను మరచి ముఖ్యమంత్రి గారికి అవినీతి మకిలి అంటిద్దామన్న మీ వెకిలి ఆలోచనలను చాలించండి. గరుడ పురాణాలు తెలిసిన మమ్మల్ని ఆపరేషన్ గరుడాలు ఏం చేస్తాయి?
చేసిన బాసల్ని మరచినట్లు నటిస్తే, ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకుని తప్పు చేసిన వాళ్లను, పోలవరాన్ని, అమరావతిని, చివరికి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రబుద్ధులను 2019 ఎన్నికల్లో ఎలా శిక్షించాలో ఆత్మగౌరవం ఉన్న ఆంధ్రులకు తెలుసు. ఎవరి కాళ్లూ మొక్కని చంద్రబాబు నాయుడు గారు ఎవరికీ భయపడరు. చరిత్ర చెబుతున్న సత్యం. వెంకన్న పాదాల సాక్షిగా, ఆ తిరునామాల వైపే చూస్తూ ఆరోజు మోడీ గారూ ఆరోజు ఢిల్లీకి మించిన రాజధానిని కట్టుకోండి అని మీరన్న మాటలు ఇక్కడి ప్రజలు మర్చిపోలేదు. 
చంద్రబాబు గారిని అసమర్ధుడంటారా? మీ గుజరాత్ కంటే మంచిగా పరిపాలిస్తున్నారు. దేశ ప్రధానిగా మీరు దేశ వృద్ధి రేటును 7.8% మించి తేలేకపోయారు. చంద్రబాబు గారు నవజాత శిశువు లాంటి నవ్యాంధ్రప్రదేశ్ ను నాలుగేళ్లుగా సగటున 10.8% వృద్దిరేటు తెస్తున్నారు కష్టపడి. మీరు అరచేతిని అడ్డుపెట్టినా, ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నా, అంతర్జాతీయంగా అప్పు పుట్టకుండా చేసినప్పటికీ చంద్రబాబు నాయుడుగారు, ఆయన మంత్రివర్గం, ప్రభుత్వ యంత్రాంగం యావత్ ఉద్యోగులూ కష్టపడుతున్నారు. ప్రజలు అండగా నిలుస్తున్నారు. 
మీ రాష్ట్రంలో నర్మదా ప్రాజెక్టును పాతికేళ్లు నిర్మించారు. మా దగ్గర భాక్రానంగల్ కంటే విశిష్టమైన పోలవరం ప్రాజెక్టును మీరెన్ని అడ్డంకులు సృష్టించినా నాలుగేళ్లలో 50 శాతం పనులకు పైగా పూర్తి చేశారు. వచ్చే ఏడాది గ్రావిటీ ద్వారా నీళ్లివ్వడానికి సిద్ధమవుతున్నారు చంద్రబాబు. నిధులివ్వకుండా మీరు నీరుగార్చినా, మా ముఖ్యమంత్రి గారు పంటచేలకు నీళ్లను ప్రవహింపజేస్తారు. (క్యారికేచర్: వన్ ఇండియా సౌజన్యంతో)

 

Link to comment
Share on other sites

6 minutes ago, vinayak said:

ఆరు నెలల క్రితం వాళ్ళు బీజేపీ ప్రభుత్వమనే అనేవారని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎన్డీయే ప్రభుత్వమని అనడం ప్రారంభించారన్నారు. దీన్నిబట్టి వాళ్ళ ఆత్మవిశ్వాసం క్షీణించినట్లు అర్థమవుతోందన్నారు.

B0000di gaaa..jUXZok.gif

Link to comment
Share on other sites

Cong - NCP tie up tho contest chesthe SS-BJP will contest as alliance, otherwise both SS and BJP naakipothai. Last time all parties individual ga contest cheyyadam, anti incumbency, huge corruption Valla NCP ki less seats vachchai. Despite above factors, congress fared well. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...