Jump to content

CAG Report on AP Financial Position


RKumar

Recommended Posts

కడిగేసిన కాగ్‌ 
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగాలేదని ఆక్షేపణ 
ఈనాడు - అమరావతి 
6ap-main7a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నిర్వహణ తీరు నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాల వరకు...పన్నుల వసూళ్లలో లోటుపాట్ల నుంచి అంచనాలు పెరుగుతూ పోతున్న ప్రాజెక్టుల వరకు భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక (కాగ్‌) కారాలు మిరియాలు నూరింది. ‘రాష్ట్రంలో వ్యయ నియంత్రణ, పర్యవేక్షణ బలహీనంగానే ఉన్నాయి. హడావుడిగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఆఖరి త్రైమాసికంలోనే సగానికి పైగా నిధులు ఖర్చు చేసేస్తున్నారు...’ అని పేర్కొంటూ ఆర్థికవ్యవస్థకు తీరూతెన్నూ లేకుండా పోయిందని తప్పుపట్టింది. ప్రాథమిక విద్యకు మౌలిక వసతులే కరవయ్యాయని, బాలల సంఖ్యపై సరైన మదింపు లేదని నిందించింది. బడిమానేసే వారి వివరాల్లో ఒక నివేదికకు మరో నివేదికకు పొంతన ఏదీ అంటూ నిలదీసింది. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించడమేమిటని ప్రశ్నించింది. రాబోయే ఏడేళ్లలో ఏకంగా రూ.76,888 కోట్ల మేర అప్పులు చెల్లించాల్సి ఉందని, ఈ భారం బడ్జెట్‌లపై ఎంతో ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో శుక్రవారం కాగ్‌ నివేదికలను ప్రవేశపెట్టారు. మొత్తం ఆరు నివేదికలు ఉండగా వాటిలో అయిదింటిని మాత్రమే సమర్పించారు. ప్రభుత్వేతర రంగ సంస్థల నివేదికను ప్రవేశపెట్టలేదు. 2016-17 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి-నిర్వహణ, రెవెన్యూ వసూలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల తీరు తెన్నులు, స్థానిక సంస్థలకు సంబంధించిన అనేక అంశాలను కాగ్‌ అధ్యయనం చేసింది. సాధారణ అంశాల్లో భాగంగా జాతీయ రక్షిత మంచినీటి పథకం, ప్రాథమిక, మాధ్యమిక, సాంకేతిక విద్య తీరుతెన్నులను కూలంకషంగా పరిశీలించింది. తిరుపతి కార్పొరేషన్‌, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది.  ‘‘ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ గ్రామీణ తాగునీటి పథకంలో ఏకంగా రూ.491.83 కోట్ల నిధులు నిష్ఫలమయ్యాయి. రాష్ట్రంలో 271 చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో ఏకంగా రూ.28 వేల కోట్లకు పైగా అంచనాలు పెంచేశారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.  64 ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయాయి. రూ.25,367 కోట్ల మేర నష్టాల్లో చిక్కుకున్నాయి. ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే...’’ అని కాగ్‌ నివేదిక తప్పుపట్టింది.

మూడు అధ్యాయాలుగా పరిశీలించాం 
‘‘ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మూడు అధ్యాయాలుగా పరిశీలించాం. మదింపు చేశాం. రాష్ట్ర ప్రభుత్వ వనరులు, వాటి వినియోగాన్ని విశ్లేషించి విపులీకరించాం... ’’ అని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (ఆడిట్‌) టుచావాంగ్‌ వెల్లడించారు. ఆయన విజయవాడలో శుక్రవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు వివిధ శాఖలకు కేటాయించిన నిధులను నిర్వహించిన తీరును విశ్లేషించామని చెప్పారు.

నిర్మించినా....నీరందించలేకపోయారు 
జాతీయ గ్రామీణ నీటి సరఫరా పథకం కింద రాష్ట్రంలో ఏడు పథకాలను నిర్మించినా ప్రారంభించలేకపోయారు. నీటి ఆధారం లేకపోవడమే కారణం. మరో ఏడు మధ్యలోనే ఆగిపోయి రూ.491.83 కోట్లు నిష్ఫలమయ్యాయి.

లోటుపాట్లతో రూ.కోట్ల ఆదాయం హుష్‌.... 
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో అనేక లోటుపాట్ల వల్ల రూ.607.51 కోట్ల ఆదాయానికి గండి పడింది. దాదాపు 369 కార్యాలయాల్లో తక్కువ పన్ను విధింపు, ఆస్తి విలువ తక్కువగా నిర్ధరించడం, తదితర కారణాల వల్ల ఈ నష్టం వాటిల్లింది.

కాగ్‌ నివేదిక ప్రవేశపెట్టిన మంత్రి కాలవ 
మార్చి 2017 నాటికి ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై  భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ సమర్పించిన నివేదికను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తరపున మంత్రి కాలవ శ్రీనివాసులు శుక్రవారం శాసనసభలో ప్రవేశ పెట్టారు. రాష్ట్ర ఆహార కమిషన్‌ సమర్పించిన 2017-18 వార్షిక నివేదికను పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సభ ముందుంచారు. 

Link to comment
Share on other sites

రూ.608 కోట్లకు గండి 
తక్కువ పన్ను విధింపు, ఆస్తి విలువ తగ్గించి నిర్ధరించిన ఫలితం 
మొత్తం 1,541 కేసుల్లో లోటుపాట్లు 
ఈనాడు - అమరావతి 
6ap-main15a.jpg

2016-17 ఆర్థిక సంవత్సరంలో పన్ను, పన్నేతర రాబడుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.607.51 కోట్ల ఆదాయానికి గండిపడిందని కాగ్‌ తేల్చింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రవాణా, భూమిశిస్తు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఇతర శాఖలకు సంబంధించి 369 కార్యాలయాల్లోని దస్త్రాలను పరిశీలించగా 1,541 కేసుల్లో ఈ లోటుపాట్లు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. తక్కువ పన్ను విధింపు, ఆస్తి విలువ తక్కువగా నిర్ధరించడం తదితర అంశాల్లో ఇవి జరిగాయని పేర్కొంది. అందులో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

* డిస్టలరీల ఉత్పత్తి సామర్థ్యాన్ని నిబంధనలు ఉల్లంఘించి 2,000 లక్షల ప్రూఫ్‌ లీటర్ల నుంచి 1,000 లక్షల ప్రూఫ్‌ లీటర్లకు తగ్గించడంతో ప్రభుత్వం రూ.60 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. 1913 కంపెనీల చట్టం ప్రకారం రిజస్టరైన క్లబ్బులకు లైసెన్స్‌లు మంజూరు చేసేందుకు బార్‌లైసెన్సులకు ఎంత రుసుము విధిస్తారో అంతే రుసుము విధించాలి.

* చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం ఉప రవాణా కమిషనర్ల కార్యాలయాలు, గూడూరు, హిందూపురం, నరసరావుపేట, తిరుపతి ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లోని దస్త్రాలు పరిశీలించిన కాగ్‌ 10,20,089 రవాణేతర వాహనాల రిజిస్ట్రేషన్‌ గడువు 2016 మార్చితో ముగిసిందని గుర్తించింది. యజమానులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, వాహనాల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేసి, రిజిస్ట్రేషన్‌ గడువును పొడిగించాలి. రవాణా శాఖ ఈ పనిని సక్రమంగా చేపట్టకపోవడంతో హరితపన్ను రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరాల్సిన రూ.32.85 కోట్ల ఆదాయం రాలేదు.

* అనంతపురం, కర్నూలు, నెల్లూరుల్లోని ఎల్‌టీయూలు, ఇబ్రహీంపట్నం, శ్రీకాకుళం, స్టీలుప్లాంటు సీటీవో సర్కిళ్లలోని దస్త్రాల్లో కొన్నింటిని తనిఖీ చేస్తే 11 పారిశ్రామిక సంస్థలు 1998-99 నుంచి 2002-03 మధ్య కాలంలో రూ.12.18 కోట్ల మేర అమ్మకపు పన్ను వాయిదా పొందాయి. కానీ గడువు తేదీలోగా వాయిదా వేసిన పన్నును చెల్లించలేదు. దాన్ని వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ 2012 నుంచి అసెసింగ్‌ అధికారులు ఆ పని చేయలేదు. ఇబ్రహీంపట్నం, శ్రీకాకుళం, కర్నూలు-3, ఒంగోలు-2, శ్రీకాకుళం సీటీవో కార్యాలయాల్లోని రికార్డులను తనిఖీ చేసినప్పుడు 2005-06 నుంచి 2009-10 మధ్య 31 పారిశ్రామిక సంస్థలు అమ్మకపు పన్ను వాయిదా సదుపాయాన్ని వినియోగించుకున్నాయి. గడువు తేదీలో దాన్ని చెల్లించలేదు. దీనిపై వడ్డీ రూపంలో రూ.16.99 కోట్లను విధించాల్సి ఉన్నప్పటికీ అసెసింగ్‌ అధికారులు అలా చేయలేదు.

* తక్కువ విద్యుత్తు సంకాన్ని విధించడం, సక్రమంగా వసూలు చేయకపోవడం ఫలితంగా రూ.33.4 కోట్ల మేర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడింది. ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేటు వ్యక్తులకు 197.64 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును విక్రయించింది. దీనిపై రూ.1.19 కోట్ల మేర విద్యుత్తు సుంకం విధించాల్సి ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి 880 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తిపైన రూ.5.28కోట్ల విద్యుత్తు సుంకాన్ని విద్యుత్తు భదత్రా సంచాలకులు వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ అలా చేయలేదు.

* అనంతపురం జిల్లాలోని ధర్మవరం, కల్యాణదుర్గం ఆర్డీవోల అనుమతి లేకుండానే 22 కేసులకు సంబంధించి 119.29 ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి అందులో లే అవుట్లు వేశారు. ఫలితంగా నాలా పన్ను, దానిపైన అపరాధ రుసుము రూపంలో ప్రభుత్వానికి సమకూరాల్సిన రూ.6.50 కోట్ల ఆదాయం రాలేదు.

* హిందూపూర్‌లోని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఆళ్లగడ్డ, కల్లూరు, కామవరపు కోట, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, రేణిగుంట, సూళ్లూరుపేట తాడిపత్రి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని 2016 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్యకాలానికి సంబంధించిన కొన్ని దస్తావేజులను కాగ్‌ పరిశీలించింది. వాటిలో 23 దస్తావేజుల్లో వ్యవసాయేతర భూములను వ్యవసాయ భూములుగా పేర్కొన్నట్లు గుర్తించింది. దీంతో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుమును తక్కువగా లెక్కించడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.2.78 కోట్ల ఆదాయానికి గండిపడింది.

Link to comment
Share on other sites

కేంద్రానిది పచ్చి మోసం
07-04-2018 03:49:58
 
636586697996601736.jpg
  • రాష్ట్రానికి సాయంపై అబద్ధాలు..
  • కాగ్‌ నివేదికతో తేటతెల్లం..
  • ఏపీకి రావాల్సిన నిధుల్లో కోత
  • పన్నుల వాటాల్లోనూ మెలికే
  • 14వ ఆర్థిక సంఘం నిధుల్లోనూ తకరారు
  • ఇలాగైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనమై
  • ప్రమాదంలో పడుతుందని కాగ్‌ హెచ్చరిక
 
అమరావతి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు సాయం విషయంలో కేంద్రం చెబుతోంది అబద్ధాలేనని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ ఉభయసభల్లో శుక్రవారం ప్రవేశపెట్టిన 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్‌ నివేదిక ఈ విషయాన్నే తేటతెల్లం చేసింది. లెక్కల్లోని నిజాల నిగ్గును బయటపెట్టింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో రావడం లేదని తన నివేదికలో పేర్కొంది. 2016-17లో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.26,264 కోట్లు వచ్చాయి. బడ్జెట్‌ అంచనాల కంటే ఇవి రూ.1,627 కోట్లు తక్కువ. ఫలితంగా రాష్ట్రం తన అవసరాల కోసం రుణాలపై ఆధారపడుతోందని.. ఇటువంటి ధోరణి వల్ల కొంత కాలానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమేణా బలహీనమయ్యే ప్రమాదం ఉందని కాగ్‌ హెచ్చరించింది. రాష్ట్ర విభజన తర్వాత పట్టణ స్థానిక సంస్థలకు 13వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌కు రూ.818.36 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సదరు గ్రాంట్లు కేంద్రం నుంచి వస్తాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం నిధులను పట్టణ, స్థానిక సంస్థలకు ముందుగానే విడుదల చేసింది. అయితే, కేంద్ర సర్కారు నుంచి ఆశించిన దానికంటే రూ.185.21 కోట్ల మేర నిధులు తక్కువ విడుదలయ్యాయి. 14వ ఆర్థిక సంఘం కేటాయింపుల ప్రకారం రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 2016-17లో రూ.2,089.18 కోట్ల నిధులు రావాలి. కానీ రూ.2065.53 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా రూ.23.65 కోట్లు రావాల్సి ఉంది. ఇలా నిధుల్లో కేంద్రం కోత విధించడంవల్ల ఆ ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై పడుతోందని కాగ్‌ పేర్కొంది. రాష్ట్ర జీడీపీలో 16.62 శాతంగా ఉన్న రెవెన్యూ ఖర్చు రూ.1,16,215 కోట్లు. ఇది బడ్జెట్‌ అంచనాలు రూ.1,14168 కోట్లను అధిగమించింది. 2016-17లో రెవెన్యూ వ్యయంలో 85.17ు రెవెన్యూ రాబడుల నుంచి ఖర్చు చేయగా.. మిగిలిన ఖర్చుల కోసం రుణాలపై ఆధారపడ్డారు. రూ.17,231 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడినట్టు కాగ్‌ పేర్కొంది.
 
కాగ్‌ ప్రస్తావించిన లోపాలు
  • 2016-17లో పెట్టుబడి వ్యయం బడ్జెట్‌లో రూ.15,388 కోట్లకుగాను రూ.15,143 కోట్లు వెచ్చించారు.
  • 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2016-17లో రాష్ట్రానికి అదనంగా రూ.4,370 కోట్లు వచ్చాయి. వీటిని మూలధన ఆస్తుల కల్పన కోసం కాకుండా రెవెన్యూ ఖర్చు కోసం వినియోగించారు.
  • బకాయిల్లో 50 శాతానికి మించిన మొత్తాన్ని రానున్న 7 ఏళ్ల కాలంలో తీర్చాల్సి ఉంటుంది. వీటి విలువ రూ.76,888 కోట్లు. ఇది ఆయా సంవత్సరాల బడ్జెట్‌లపై భారాన్ని మోపే అవకాశం ఉంది.
  • ద్రవ్యలోటును రాష్ట్ర జీడీపీలో 3 శాతానికి తగ్గించుకోవాలని స్థూల ఆర్థిక కార్యాచరణ ప్రకటనలో లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ జీఎ్‌సడీపీలో ద్రవ్యలోటు 4.42 (రూ.30,908 కోట్లు) శాతంగా ఉంది.
  • 13వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.709.69 కోట్లు 2016 ఏప్రిల్‌ 1 నాటికి ప్రజాపద్దుల్లో ఉండిపోవడంతో.. ఆ నిధుల ఉద్దేశం నెరవేరలేదు.
  • వ్యయ నియంత్రణ, పర్యవేక్షణ బలహీనం.
  • 35 పద్దుల కింద రూ.21,967.05 కోట్లు మిగులు ఏర్పడింది. 5 పద్దుల కింద కేటాయింపులకు మించి రూ.1686.83 కోట్లు అధికంగా ఖర్చు చేశారు.
  • 2004-16 మధ్యకాలంలో బడ్జెట్‌ కేటాయింపులకు మించి చేసిన రూ.53,673.19 కోట్ల అధిక వ్యయాన్ని 2017 నవంబరు నాటికీ క్రమబద్ధీకరించలేదు.
  • రూ.55,903.07 కోట్లలో అనుబంధ కేటాయింపుల్లో వాస్తవ ఆవశ్యకత రూ.35,622.84 కోట్లు అయితే రూ.20,280.23 కోట్లు ఎక్కువ కేటాయించారు.
  • మొత్తం మిగులులో 2016-17లో రూ.22,382.96 కోట్లు సరెండర్‌ చేశారు. అందులో సంవత్సరం చివరి రోజున రూ.21,684 కోట్లు సరెండరు చేశారు. దీంతో ప్రాధాన్య అంశాలకు నిధులు ఖర్చుపెట్టలేదు.
Link to comment
Share on other sites

good

tg,delhi,gj,mh cag reports ghoranga icharu,

manaki ekkuva financial situation meeda chusukomannaru,

irrigation projects-ivi telsinde,last year ey chala avvalsinivi court lo acquisition cases tho chala varuku aginiyyi,e june kalla chala varuku avutayi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...