Jump to content

కోనసీమ వైసీపీలో సెగ..(Konaseema)


Recommended Posts

కోనసీమ వైసీపీలో సెగ..
02-04-2018 15:07:12
 
636582784330549636.jpg
  • పార్టీలో మొదలైన లుకలుకలు
  • కాకినాడ కోఆర్డినేటర్‌ శశిధర్‌కి ఆశాభంగం
  • సిటీ టికెట్‌ ద్వారంపూడికి కేటాయింపు
  • మూడు సీట్లివ్వాలంటూ ఓ నేత హుకుం
  • రాజమహేంద్రవరం పార్టీ మీటింగ్‌కి గైర్హాజరు
 
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)
ఎన్నికల బరిలోకి దిగేందుకు వైసీపీ ముందస్తు వ్యూహాలు రూపొందించుకునే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా జిల్లాలో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. రెండు రోజుల కిందట రాజమహేంద్రవరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులపై కొంత స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. కాకినాడ సిటీ అసెంబ్లీ సీటు ఇస్తామని పార్టీలోకి తీసుకున్న ముత్తా శశిధర్‌కి ఝలక్‌ ఇచ్చి.. జగన్‌ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి కాకినాడ సిటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ద్వారంపూడికి అనపర్తి టికెట్‌ ఇస్తామని, శశిధర్‌కి కాకినాడ సిటీలో అవకాశం కల్పిస్తామని పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చారని శశిధర్‌ వర్గీయులు అసహనంతో ఉన్నారు. టికెట్‌ ప్రకటనతో ఆదివారం ద్వారంపూడి ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తల హడావుడి కన్పించింది.
 
 
మూడు సీట్లివ్వాలి.. ఓ నేత హుకుం
బీసీలలో బలమైన సామాజిక వర్గమైన తమకు మూడు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత విధేయుడైన ఓ నేత డిమాండు చేస్తున్నారు. రామచంద్రపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్‌ స్థానాలు తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుపడుతున్న సదరు నేత శనివారం రాజమహేంద్రవరంలో జరిగిన వైవీ సుబ్బారెడ్డి సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. ఆ మూడు స్థానాలలో ఇవ్వకపోతే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ తేల్చి చెప్పినట్టు కేడర్‌లో ప్రచారం సాగుతోంది. ముమ్మిడివరం సీటు కూడా తమకే కేటాయించాలన్న కీలక నేత డిమాండును వైసీపీ లెక్కచేయకుండా ముమ్మిడివరం టికెట్‌ని మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకి దాదాపు ఖరారు చేశారు.
 
 
పిఠాపురం సీటు కోసం పోటీ..
పిఠాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసేందుకు తమకు టికెట్‌ కావాలని ఓ టీడీపీ ప్రజాప్రతినిధి గతం నుంచీ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గం టికెట్‌ను ఓ సామాజిక ఉద్యమ నాయకుడి కుమారుడికి ఇవ్వాలన్న డిమాండు ఉంది. జగ్గంపేట నుంచి పోటీచేసేందుకు రెండేళ్ల నుంచీ వర్కవుట్‌ చేసుకుంటున్నానని, ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన వారికి టిక్కెట్టు ఎలా ఇస్తారంటూ అక్కడ పార్టీ కోఆర్డినేటర్‌ ప్రశ్నిస్తున్నారు.
 
 
మండపేటపై మీమాంస..
మండపేట అసెంబ్లీ సీటు కోసం గతంలో పోటీచేసిన వారే మళ్లీ ప్రయత్నిస్తుండగా.. అక్కడ అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం సాగుతోంది. కొత్తవారికి ఛాన్స్‌ ఇస్తే గతంలో పోటీచేసిన అభ్యర్థికి ఎమ్మెల్సీ ఆఫర్‌ చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే మండపేటలో రాజకీయ సమీకరణలు మారతాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
 
 
అమలాపురం లోక్‌సభ అభ్యర్థిపై..
అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసేందుకు వైసీపీ రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. అయితే మాజీ ఎంపీ ఒకరు తనకు అవకాశం ఇస్తే అమలాపురం లోక్‌సభ నుంచి పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే రాజమహేంద్రవరం లోక్‌సభకు పోటీ చేసేందుకు కూడా వైసీపీ కొత్త అభ్యర్థి కోసం వెతుకుతోంది.
 
 
జనసేన చీల్చే ఓట్లు ఎవరికి నష్టం
జనసేన వచ్చే ఎన్నికలలో రంగంలోకి దిగుతోందన్న ప్రచారం ఉంది. టీడీపీ, వైసీపీలలో ఏ పార్టీకి జనసేన వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్న దానిపై వైసీపీలోనూ జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఆ పార్టీ ముఖ్యనాయకులు ఇప్పటికే రెండు, మూడు అసెంబ్లీల సామాజిక వర్గాల వారీగా ఓట్ల జాబితాలను పరిశీలించి విశ్లేషణలు రూపొందించే పనిలో ఉన్నారు. జిల్లాలో జనసేన ప్రభావం ఇతర జిల్లాల కంటే ఎక్కువగా ఉంటుందన్న దానిపైనా వైసీపీలో చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఏడాది ముందే అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుపెడితే.. అసంతృప్తులు, అసమ్మతులు, ఆగ్రహావేశాలు అప్పటికి చల్లారతాయన్న భావనతో వైసీపీ నేతలు ఇప్పటి నుంచే ఎంపిక ప్రక్రియ ప్రారంభించినట్టు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

Mandapeta tkt max vegulla pattabhiramayya chowdary ki inko candidate vegulla leelakrishna evarki ichina e seat kastame tdp mla vegulla jogeswarao malli gelustadu ikkada ycp gelisthe state lo ycp 140 seats cross ayynateee

Link to comment
Share on other sites

పిఠాపురం సీటు కోసం పోటీ..
పిఠాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసేందుకు తమకు టికెట్‌ కావాలని ఓ టీడీపీ ప్రజాప్రతినిధి గతం నుంచీ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు edi thota narasimham na brother leka evaru ayina unnara
Link to comment
Share on other sites

Just now, sonykongara said:
పిఠాపురం సీటు కోసం పోటీ..
పిఠాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసేందుకు తమకు టికెట్‌ కావాలని ఓ టీడీపీ ప్రజాప్రతినిధి గతం నుంచీ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు edi thota narasimham na brother leka evaru ayina unnara

Yes ikkada varma gelavadamu kastamu antunaru  nxt timee tdp vallee but i think he can ...2009 lone 1000votes tho odipoyadu pitapuram lo 8 sc booths lo 7 lo majority ochinayi 2009 lo so vere castes vallatho lagestademo chudali :dream:

Link to comment
Share on other sites

14 minutes ago, Godavari said:

Yes ikkada varma gelavadamu kastamu antunaru  nxt timee tdp vallee but i think he can ...2009 lone 1000votes tho odipoyadu pitapuram lo 8 sc booths lo 7 lo majority ochinayi 2009 lo so vere castes vallatho lagestademo chudali :dream:

varma ni antha easy ga anchana veyyalemu anipisthundi 2014 chusaka

Link to comment
Share on other sites

3 hours ago, Godavari said:

Yes ikkada varma gelavadamu kastamu antunaru  nxt timee tdp vallee but i think he can ...2009 lone 1000votes tho odipoyadu pitapuram lo 8 sc booths lo 7 lo majority ochinayi 2009 lo so vere castes vallatho lagestademo chudali :dream:

Maa peddapuram ki malli pakka ooru kaapu ni dimputhunnara :damn:

Link to comment
Share on other sites

54 minutes ago, Nandamuri Rulz said:

Maa peddapuram lo chows ante minorities... 

Minority ke minority ayina Verma gelavaleda. Minority majority doesn't matter. Alagaithe Kaps ee eppudu MLAs avvali in most of Godavari seats.

Link to comment
Share on other sites

Breaking news:-
గుంటూరు బహిరంగ సభలో గుర్తు తెలియాని అగంతుకులు జఫ్ఫా గాడిని టమాటాలు కోడి గుడ్లుతో కోట్టారు అంటా1f602.png?1f602.png?1f602.png?..నిజమేనా.....

Image may contain: 1 person, sunglasses

 

Link to comment
Share on other sites

వైసీపీకి శెట్టిబలిజ వర్గం షాక్
10-04-2018 13:51:27
 
636589650877218315.jpg
తూ.గో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శెట్టిబలిజ వర్గం షాకిచ్చింది. కోనసీమలో శెట్టిబలిజలకు వైసీపీ ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై నిరసన తెలిపింది. శెట్టిబలిజ సామాజిక వర్గం వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంది. దీక్షా శిబిరాల్లో ఉన్న శెట్టిబలిజ కార్యకర్తలను నేతలు తీసుకెళ్ళిపోయారు. జగన్ తన నిర్ణయం మార్చుకోకుంటే.. శెట్టిబలిజ సామాజికవర్గం వైసీపీకి శాశ్వతంగా దూరమవుతుందని వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కుడిపూడి చిట్టబ్బాయి తదితరులు హెచ్చరించారు.
Link to comment
Share on other sites

Just now, sonykongara said:
వైసీపీకి శెట్టిబలిజ వర్గం షాక్
10-04-2018 13:51:27
 
636589650877218315.jpg
తూ.గో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శెట్టిబలిజ వర్గం షాకిచ్చింది. కోనసీమలో శెట్టిబలిజలకు వైసీపీ ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై నిరసన తెలిపింది. శెట్టిబలిజ సామాజిక వర్గం వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంది. దీక్షా శిబిరాల్లో ఉన్న శెట్టిబలిజ కార్యకర్తలను నేతలు తీసుకెళ్ళిపోయారు. జగన్ తన నిర్ణయం మార్చుకోకుంటే.. శెట్టిబలిజ సామాజికవర్గం వైసీపీకి శాశ్వతంగా దూరమవుతుందని వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కుడిపూడి చిట్టబ్బాయి తదితరులు హెచ్చరించారు.

@Godavaribro

Link to comment
Share on other sites

13 minutes ago, Godavari said:

Hmm ponnada satish joining ycp tomoroww .....

Debba esesaduga  dabbu karchu pettinchi 4yrs ga inchargelaku ipudu side chesesi

Hmm even vij east kuda anthe,bhav kumar ki seat ista pani chesuko ani cheppadu anta,ninna ravi deggara nenu evariki mata ivvaledu seat ista ani annadu anta jaggad 

Link to comment
Share on other sites

వైసీపీకి శెట్టిబలిజల షాక్‌!
11-04-2018 00:57:05
 
636590050264243915.jpg
  • పార్టీ కార్యకలాపాలకు ఇక దూరం
  • అధిష్టానం దిగిరాకపోతే కీలక నిర్ణయాలు
  • శెట్టిబలిజల పెద్దల సమావేశం హెచ్చరిక
  • హాజరైన వైసీపీ ఎమ్మెల్సీ బోస్‌, చిట్టబ్బాయి
అమలాపురం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంవత్సరంలో వైసీపీలో సంకుల సమరం మొదలైంది. శెట్టిబలిజలు ఆ పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని పనిచేస్తున్న తమను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని...దీంతో ఇకపై ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తీర్మానించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహంలో ఆయన అధ్యక్షతన వివిధ నియోజకవర్గాల శెట్టిబలిజ సామాజికవర్గ పెద్దలు సమావేశమయ్యారు.
 
వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభా్‌షచంద్రబోస్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్‌ వైఖరిని నిరసిస్తూ శెట్టిబలిజ పెద్దలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముమ్మిడివరం నియోజకవర్గ టికెట్‌ను ప్రస్తుత సమన్వయకర్త పితాని బాలకృష్ణకు గానీ, లేదంటే విజయావకాశాలున్న మరే శెట్టిబలిజ నాయకుడికైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సీటు మీదేనని మత్స్యకార వర్గానికి చెందిన పొన్నాడ సతీశ్‌కుమార్‌కు జగన్‌ భరోసా ఇవ్వడాన్ని తప్పుబట్టారు. సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను వైసీపీ నాయకత్వానికి నివేదించే బాధ్యతను ఎమ్మెల్సీ బోస్‌, చిట్టబ్బాయిలకు అప్పగించారు. అనంతరం శెట్టిబలిజ నేతలతో కలిసి వీరిద్దరూ విలేకరులతో మాట్లాడారు.
 
‘మాకు కులమే ప్రధానం. వారి మద్దతుతోనే ఈ స్థాయిలో ఉన్నాం. వారి నిర్ణయమే మాకు శిరోధార్యం.. మా సామాజికవర్గం కోసం దేనికైనా సిద్ధం. పార్టీ అధినేత జగన్‌ను కలిసి.. కాకినాడ టికెట్‌ను మత్స్యకారులకిచ్చి ముమ్మిడివరం టికెట్‌ను శెట్టిబలిజ వర్గానికి కేటాయించాలని కోరాం. కానీ ఆయన నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో నేటి (మంగళవారం) నుంచి వైసీపీ కార్యకలాపాలకు శెట్టిబలిజలంతా దూరంగా ఉండాలని నిర్ణయించాం’ అని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా దళితులు, ఆ తర్వాత స్థానంలో శెట్టిబలిజలు, కాపులు ఉన్నారని బోస్‌ చెప్పారు. శెట్టిబలిజల నుంచి గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలుగా, జడ్పీ చైర్మన్‌, కాకినాడ మేయర్‌గా పదవులు నిర్వహించారని, బలమైన తమ సామాజిక వర్గాన్ని దూరంగా ఉంచుతున్నందుకు వైసీపీపై తమ పెద్దలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారని తెలిపారు.
 
అధిష్ఠానం దిగిరాకపోతే త్వరలో ముమ్మిడివరంలో జిల్లాస్థాయి శెట్టిబలిజల సమావేశాన్ని ఏర్పాటుచేసి అక్కడ కీలక నిర్ణయాలు తీసుకుంటామని నాయకులు హెచ్చరించారు. సమావేశం అనంతరం శెట్టిబలిజ వర్గీయులు అమలాపురం హైస్కూలు సెంటర్‌లో వైసీపీ ఎంపీల దీక్షకు మద్దతుగా చేపడుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరానికి చేరుకున్నారు. దీక్షకు మద్దతిస్తున్న తమ కార్యకర్తలను తీసుకుని వెళ్లిపోయారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...