Jump to content

APNRT


Recommended Posts

ప్రవాసాంధ్రా.. అందుకో భరోసా!
ఉద్యోగం, విద్యాభ్యాసం చేసేవారికి అవకాశం
విదేశాల్లో ఉన్నవారి కోసం రాష్ట్ర ప్రభుత్వ పథకం
స్వల్ప ప్రీమియంతో సరికొత్త బీమా పథకం
kri-sty1a.jpg
ఉద్యోగం, విద్యాభ్యాసం నిమిత్తం స్వదేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లి  అనుకోకుండా ప్రమాదాలకు గురై మరణించినా, శాశ్వత అంగవైకల్యం పాలైనా, అక్కడ ఉపాధికి ఆటంకం ఏర్పడినా ఆ బాధితుడికి, ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ప్రవాసాంధ్ర భరోసా పేరిట బీమా పథకాన్ని ప్రారంభించింది. చంద్రన్న బీమా రీతిలో ఈ పథకాన్ని అమలు చేయటానికి ఏర్పాట్లు చేశారు. వార్షిక ఆదాయంతో నిమిత్తం లేకుండా.. తెల్లరేషన్‌ కార్డుతో పనిలేకుండా.. విదేశాల్లో ఉన్నవారందరికి ఈ పథకం వర్తింపజేసేందుకు సన్నాహాలు చేశారు.

 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి చాలామంది ఇతర దేశాలకు ఉద్యోగం, విద్యాభ్యాసం, ఉపాధి కోసం వెళుతున్నారు. అక్కడ జరుగుతున్న ప్రమాదాలు, ఇతర అనుకోని సంఘటనల వల్ల ప్రాణాలు కోల్పోతున్న, అంగవైకల్యానికి గురవుతున్నవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించనుంది. ఇందుకు సంబంధిత వ్యక్తుల కుటుంబాల నుంచి విదేశాల్లో ఉన్న ఆంధ్రుల వివరాలు సేకరించాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో మెప్మా సిబ్బంది ఈ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. విదేశాల్లో సహజ మరణానికి        ఈ పథకం వర్తించదు.

kri-sty1b.jpg

ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లినవారికి..
* 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి.
* ఈసీఆర్‌ (ఇమిగ్రేషన్‌ చెక్‌ రిక్వైర్డు), ఈసీఎన్‌ఆర్‌ (ఇమిగ్రేషన్‌ చెక్‌ నాట్‌ రిక్వైర్డు) దేశాల్లో జీవనోపాధికి ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసాôధ్రులు అర్హులు.
* ఉద్యోగులకు బీమా పరిమితి మూడేళ్లు ఉంటుంది. తరువాత పునరుద్ధరించుకోవచ్చు.
* మూడేళ్లకు రూ.150 ప్రీమియం చెల్లించాలి.

kri-sty1c.jpg
విద్య, నైపుణ్య మెరుగుదలకు వెళితే..
* 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి.
* విదేశాల్లో చదవడానికి, ఏరకమైన నైపుణ్య పెంపుదలకు వెళ్లినా అర్హులే.
* ఏడాదికి రూ.75 ప్రీమియం చెల్లించాలి.
* బీమా ఏడాది పాటు అమల్లº ఉంటుంది. తరువాత పునరుద్ధరించుకోవాలి.
kri-sty1d.jpg
నమోదుకు ఇవి అవసరం..
*  బీమా చేసే వ్యక్తి స్వదేశ, విదేశ చిరునామా ధ్రువీకరణ పత్రాలు
*  ఎన్‌ఆర్‌ఐ హోదా ధ్రువీకరణ పత్రం
*  విదేశీ డ్రైవింగ్‌ లైసెన్సు
*  విదేశీ పాసుపోర్టు
*  ఇండియన్‌ పాస్‌పోర్టు, వీసా
*  విదేశాల్లో పనిచేస్తున్న సంస్థ పేరు, చిరునామా, యజమాని వివరాలు
*  విద్యార్థి వివరాలు సమర్పించాలి.

విద్యార్థులకు ప్రయోజనాలివీ
‌*  ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా రూ.10 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తారు.
*  ప్రమాదంలో సంభవించే గాయాలు, అస్వస్థత చికిత్సకు ఆసుపత్రి ఖర్చు కింద రూ.లక్ష చెల్లిస్తారు.
*  ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైక్యం పొందినా ఒక సహాయకుడితో స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాధారణ విమాన ఛార్జీలు చెల్లిస్తారు.
*  బీమా చేసిన విద్యార్థి ప్రమాదానికి గురై విద్య కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తిస్తే ఆ వ్యక్తి, ఒక సహాయకుడితో స్వదేశానికి వచ్చేందుకు సాధారణ విమాన ఛార్జీలు చెల్లిస్తారు.

ఉద్యోగులకు ఉపయుక్తమిలా..
*  ప్రమాదంలో మరణం సంభవించినా, శాశ్వత అంగవైకల్యం పొంది ఉద్యోగం, ఉపాధి కోల్పోతే రూ.10 లక్షల బీమా పరిహారం అందుతుంది.
*  ప్రమాదంలో మరణించిన వ్యక్తి పార్థివ దేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి, అంగవైకల్యం పొందిన వ్యక్తిని తీసుకురావడానికి సాధారణ విమాన ఛార్జీలు అందిస్తారు. ఒక వ్యక్తిని సహాయంగా ఇచ్చి పంపుతారు. సహాయకుని విమాన ఛార్జీలు చెల్లిస్తారు.
* బీమా చేయించుకున్న వ్యక్తి అస్వస్థతకు గురై ఉద్యోగం చేయడానికి అనర్హుడిగా గుర్తిస్తే ఆ వ్యక్తి, ఒక సహాయకుడికి స్వదేశానికి వచ్చేందుకు సాధారణ విమాన ఛార్జీలు చెల్లిస్తారు.
*  ప్రమాదంలో గాయపడినా, అస్వస్థతకు గురైనా చికిత్స నిమిత్తం ఆసుపత్రి ఖర్చుల కింద రూ.లక్ష చెల్లిస్తారు.
*  భారత విమానాశ్రయం నుంచి స్వస్థలం చేరడానికి అంబులెన్స్‌ సౌకర్యం  కల్పిస్తారు.
*  మహిళలకు సాధారణ ప్రసూతి ఖర్చు కింద రూ.35 వేలు, శస్త్రచికిత్స జరిగితే రూ.50 వేలు చెల్లిస్తారు.

*  బీమా చేసిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా బీమా కాలపరిమితిలో సంవత్సరానికి రూ.50 వేలు చొప్పున కుటుంబసభ్యులకు చెల్లిస్తారు.
 
Edited by sonykongara
Link to comment
Share on other sites

కువైత్‌లో వలస వెతలు!
03-04-2018 03:27:11
 
636583228322232761.jpg
  • కొలువు కాదది కొలిమి
  •  బతుకు వెతుకులాటలో బలవుతున్న ఏపీకూలీలు
  •  ప్రత్యేక చట్టం సాయంతో ఇల్లుచేరిన కడపవాసులు
సుండుపల్లె,  ఏప్రిల్‌ 2: సయ్యద్‌ మహమ్మద్‌ రెండేళ్లు కువైత్‌లో ఉన్నాడు. డ్రైవరుగా కొంతకాలం పనిచేశాడు. ఆ పని కడుపు నింపకపోగా, అవమానాలను మిగిల్చింది. అక్కడినుంచి పారిపోయాడు. ఖాదర్‌వలి ఎనిమిదేళ్లు ఎడారిలో గొర్రెలు కాశాడు. అప్పుడప్పుడు వచ్చే యజమాని గొర్రెల మంచిచెడ్డలు అడిగేవాడేగానీ, ఖాదర్‌ వలి తిన్నాడా లేదా అనేది ఏనాడూ పట్టించుకోలేదు. అక్కడే ఉంటే చనిపోతానని భయపడి, పరారయ్యాడు. కువైత్‌తో తన సేఠ్‌ కోసం రొట్టెలు కాల్చే మస్తానీ.. ఆ పొయ్యిలో తానూ కాలిపోతానని భయపడి, అక్కడినుంచి తప్పించుకొని బయటపడింది. ఈ ముగ్గురిదీ ఏపీలోని కడప జిల్లా సుండుపల్లె మండలం సిద్దారెడ్డిగారి పల్లె గ్రామం. ఎక్కడో కానిదేశంలో దిక్కూమొక్కూ లేకుండా పోవాల్సిన వీరి కథను కువైత్‌ తీసుకొచ్చిన ‘ఖానూన్‌’ మార్చివేసింది. సరైన పత్రాలు, అనుమతులు లేకుండా దేశంలో ఉంటున్నవారు.. శిక్షలు, జరిమానాలు లేకుండా దేశం వదిలిపెట్టిపోవడానికి ఈ చట్టం అనుమతి ఇచ్చింది. ఈ చట్టం సాయంతోనే ఈ ముగ్గురూ ఇటీవల తమ స్వగ్రామాలకు చేరుకొన్నారు. అలాగే, కువైత్‌ ఉదారత కారణంగా మన రాష్ట్రానికి చెందిన మొత్తం 10 వేల మందికిపైగా బయటపడ్డారు.
 
తిరిగొస్తానని అనుకోలేదు
సేఠ్‌ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసేవాడిని. రోజంతా పని చేసినా భోజనం పెట్టేవారు కాదు. జీతం అడిగితే చిత్రహింసలు పెట్టేవారు. ఆ బాధలు తట్టుకోలేక ఎనిమిది నెలల క్రితం అక్కడినుంచి పారిపోయాను. పొట్టకూటి కోసం ఇటుకలు మోశాను. డిష్‌లు బిగించాను. ki1.jpgనా జీవితం కువైత్‌లోనే ముగిసిపోతుందని భయపడ్డాను. ఆ నరకం నుంచి బయటపడతానని కలలో కూడా అనుకోలేదు. 15 రోజుల క్రితం కువైత్‌లో ని ఇండియన్‌ ఎంబసీ ద్వారా విమానం టికెట్‌ సంపాదించి చెన్నైకి, అక్కడనుంచి మా ఊరుకు చేరుకొన్నాను.
- సయ్యద్‌ మహమ్మద్‌
 
పాస్‌పోర్టు లాగేసుకొన్నారు
సేఠ్‌ ఇంట్లో పని ఎక్కువగా ఉండేది. దానికి తగ్గట్టు జీతం ఇవ్వకపోగా, చిత్రహింసలు పెట్టేవారు. పనిలో పెట్టుకొన్న రోజే నా పాస్‌పోర్టు లాగేసుకొన్నారు. తిరిగి మా దేశం k1.jpgపంపించివేయాలని వేడుకొన్నా, కనికరించలేదు. స్నేహితులు, బంధుమిత్రుల సాయంతో ఆ ఇంటినుంచి బయటపడ్డాను. ఆ పాస్‌పోర్టు జిరాక్సు చూపించి.. ఎట్టకేలకు ఇల్లు చేరుకొన్నాను.
- మస్తానీ
 
 
 
జీవితమంతా నరకమే..
బతుకుతెరువు కోసం కువైత్‌ వెళ్లాను. చాలాకాలం పని దొరకలేదు. చిన్న చిన్న పనులు దొరికినా, వాటితో కడుపు నిండేది కాదు. ఏడాది క్రితం ఓ భూస్వామి నన్ను తన దగ్గర పనికి పెట్టుకొన్నాడు. అక్కడ గొర్రెలు కాసేవాడిని. వాటిని మేపడానికి నన్ను ఎడారి ప్రాంతానికి పంపించారు. అక్కడ తల దాచుకోడానికి చిన్న గుడారం కూడా ఉండేది కాదు. ఎండలో రోజంతా మాడిపోవాల్సిందే! ఆ నరకం నుంచి బయటపడి ఇంటికి చేరుకోవడం చాలా కష్టమయింది. - ఖాదర్‌వలి
 
k2.jpg 
Link to comment
Share on other sites

  • 3 weeks later...
ప్రవాసాంధ్రులకూ బీమా ధీమా
18-04-2018 02:02:07
 
636596137285466720.jpg
  • మూడేళ్లకు 150 చెల్లిస్తే 10 లక్షల బీమా
  • విదేశాల్లో చదివేవారికి కూడా
  • 18-60లోపు వ్యక్తులకు లబ్ధి
  • మృతదేహం తరలింపునకు సాయంచేయనున్న సర్కారు
  • శాశ్వత వైకల్యానికీ 10 లక్షలు
 
అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ‘బీమా’ భరోసా కల్పించింది. చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థులు, బతుకుదెరువు కోసం దుబాయ్‌, కువైత్‌ తదితర దూరదేశాలకు పోతున్న పేద కుటుంబాల ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించింది. వీరి కోసం ప్రవాసాంధ్రుల బీమా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్స్‌ తెలుగుసొసైటీ సహకారంతో సెర్ప్‌ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలుచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. చంద్రన్న బీమా తరహాలో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఒకసారి బీమా ప్రీమియం చెల్లిస్తే, మూడేళ్ల దాకా ఈ పథక లబ్ధిని పొందవచ్చు. దీనికోసం లబ్ధిదారులు కట్టాల్సింది కేవలం రూ. 150. ప్రవాసాంధ్ర ఉద్యోగులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. విదేశాల్లో ఉన్న తమవారి తరఫున రాష్ట్రంలోని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రీమియం కట్టి పేరు నమోదు చేయించే వెసులుబాటు కల్పించారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 16వ తేదీదాకా నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. లబ్ధిదారులు లేక వారి తరఫు కుటుంబసభ్యులు పూర్తిచేసిన తమ దరఖాస్తులను వెలుగు సభ్యులకు లేక ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్స్‌ తెలుగుసొసైటీ కో-ఆర్డినేటర్లకు అందించాల్సి ఉంటుంది. దీనిపై మంగళవారం సెర్ప్‌ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
 
బీమా ఎందుకంటే..
ప్రవాసాంధ్ర బీమా పథకంలో చేరిన వ్యక్తి, విదేశాల్లో ప్రమాదవశాత్తు మరణిస్తే.. మృతదేహాన్ని విమానంలో తీసుకొచ్చి, స్వస్థలంలో ఆయన కుటుంబసభ్యులకు అప్పగించేదాకా, అయ్యే ఖర్చులో కొంత ప్రభుత్వం భరిస్తుంది. మృతదేహానికి, వెంట ఉన్న వ్యక్తికి అయ్యే విమాన ఖర్చులను పెట్టుకొంటుంది. విమానంలోంచి ఆ మృతదేహాన్ని దించి.. అంబులెన్స్‌లో స్వస్థలం వరకు తరలిస్తారు. నిజానికి, ఇదంతా వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. ఇప్పుడు ఈ బీమా పథకంతో ప్రభుత్వం అండ బాధితులకు ప్రతి అడుగులో లభించే వీలు కలిగింది. అలాగే, లబ్ధిదారు శాశ్వత అంగవైకల్యం పొందితే, ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు బీమా అందిస్తారు. ఆ స్థితిలో ఉన్న ఆయనను స్వదేశం తీసుకెళ్లాలని కుటుంబసభ్యులు భావిస్తే, ఆయనకు, వెంట ఉన్న సహాయకుడికి విమానంలో సాధారణ టికెట్‌ను బుక్‌ చేస్తారు. ఏదైనా ప్రమాదంలో గాయపడిన సందర్భంలో.. అందుకు లబ్ధిదారుకు అయ్యే చికిత్సఖర్చుల కింద రూ.ఒక లక్ష చెల్లిస్తారు.
 
విద్యార్థులకు వేరుగా..
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం అమలుచేయనున్నారు. ఈ పథకం కాలపరిమితి ఏడాది. విదేశాల్లో చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు. వీరు ఏడాదికి రూ.75 ప్రీమియం చెల్లించాలి. ప్రమాదం వల్ల సంభవించే గాయాలు /అస్వస్థతకు అయ్యే చికిత్సకు అయ్యే ఖర్చుల కింద రూ. లక్ష చెల్లిస్తారు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా, రూ.10 లక్షలు బీమా చెల్లించడం జరుగుతుందని సెర్ప్‌ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
  • 2 months later...
  • 2 weeks later...

APNRT @APNRTOfficial 25m25 minutes ago

 
 

1/2 యూఏఈ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ఉపయోగించుకోదలచిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రవాసులు ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT)వారి వెబ్ సైటు http://www.apnrt.com/uae  లో నమోదు చేసుకోవచ్చు...

DlRGOYnU8AAmYKM.jpg
1 reply 0 retweets 0 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

APNRT @APNRTOfficial 27m27 minutes ago

 
 

2/2 క్షమాభిక్ష పథకంలో సహాయం పొందగోరు వారు యూఏఈ దేశంలోని దుబాయ్‌, అబుదాబి, షార్జా, రాసల్ ఖైమా తదితర ప్రాంతాలలో ఉన్న ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను సంప్రదించవచ్చు. #APNRT #UAEAmnesty #UAE #Dubai #NonResidentTelugu #AmnestyUAE #NRI #NRTnews #Telugu #TeluguNews #TeluguNRI

DlRGtA1UwAA-GKK.jpg
0 replies 0 retweets 0 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

  • 3 weeks later...

APNRT @APNRTOfficial 5m5 minutes ago

 
 

దుబాయ్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధితులకు విమాన టిక్కెట్లు , నగదును అందిస్తున్న APNRT సభ్యులు ముక్కు తులసి కుమార్ , విశ్వేశ్వరావు ,నిరంజన్ , వాసిరెడ్డి #APNRT #UAEAmnesty #Dubai #NonResidentTelugu #HelplingHand #UAE #donate

DmezOYGUwAMoqYb.jpg
Link to comment
Share on other sites

ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక విభాగం
ఫిర్యాదుల స్వీకరణకు  24 గంటల కాల్‌సెంటర్‌
ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో  త్వరలో ఏర్పాటు
ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం
డీజీపీ అధ్యక్షతన సలహా మండలి

ఈనాడు, అమరావతి: ప్రవాసాంధ్రుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏపీ పోలీసు విభాగం కొత్తగా ఎన్‌ఆర్‌ఐ వినతుల పరిష్కార విభాగం (ఎన్‌ఆర్‌ఐ గ్రీవెన్స్‌ రీడ్రెసెల్‌ సెల్‌)ను ఏర్పాటు చేయనుంది. విదేశాల్లో ఉండే తెలుగు వారు గృహహింస, వరకట్న వేధింపులు, మోసం, ఫోర్జరీ, నమ్మించి వంచించడం తదితర కేసులకు సంబంధించి ఈ విభాగానికి నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. వాటిని స్వీకరించేందుకు గాను రాష్ట్రస్థాయిలో 24 గంటలూ పనిచేసే కాల్‌ సెంటర్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. వీటితో పాటు మెయిల్‌ ఐడీ, ఫ్యాక్స్‌ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు. తొలుత ఏపీ ఎన్‌ఆర్‌టీ విభాగం ఫిర్యాదులను పరిశీలించి వాటిలో నిజమైన వాటిని ఈ విభాగానికి పంపిస్తుంది. అనంతరం పోలీసు శాఖ వాటిపై ప్రాథమిక విచారణ చేపడుతుంది. నేర స్వభావం ఉంటే నిందితులపై స్థానిక పోలీసులు లేదా సీఐడీ కేసులు నమోదు చేస్తుంది. సీఐడీ ఆధ్వర్యంలోనే ఈ విభాగం పనిచేస్తుంది. దీనికి ఓ ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. ఆయన ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఇన్‌స్పెక్టర్లతోపాటు మరికొంత మంది పోలీసులు పనిచేస్తారు. ఈ విభాగానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు డీజీపీ ఆధ్వర్యంలో సలహామండలి ఏర్పాటు చేస్తారు. నిఘా విభాగం, సీఐడీ విభాగం అదనపు డీజీపీలు, ఏపీఎన్‌ఆర్టీ ప్రతినిధులు, ఐటీ, ఇతర రంగాల ప్రతినిధులు సలహామండలిలో సభ్యులుగా ఉంటారు. డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ ఈ విభాగానికి రూపకల్పన చేశారు. ఈ విభాగం పనితీరు విధివిధానాలు, కాల్‌సెంటర్‌ నెంబర్‌ తదితర వివరాలన్నింటినీ ఈ నెల 12న ఆయన ప్రకటిస్తారు. మరోవైపు, ప్రవాసాంధ్రుల కోసం ఏపీ పోలీసులు శ్రద్ధ చూపడం హర్షణీయమని ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిన డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Link to comment
Share on other sites

 

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో APNRT ద్వారా UAE ఆమ్నెస్టీ ని (క్షమాభిక్ష) ఉపయోగించుకుని రెండవ విడతగా September 15,2018 న స్వస్థలాలకు చేరిన ప్రవాసాంధ్రులు.వీరికి హైదరాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన APNRT సిబ్బంది. #APNRT #UAEAmnesty #NonResidentTelugu #AndhraPradesh #Dubai #Telugu

DnSA39zUYAEzomB.jpg
DnSA39xU8AAst28.jpg
 
 
 
 
 
 
 

 

Link to comment
Share on other sites

APNRT @APNRTOfficial 59m59 minutes ago

 
 

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో APNRT ద్వారా UAE ఆమ్నెస్టీ ని (క్షమాభిక్ష) ఉపయోగించుకుని రెండవ విడతగా September 15,2018 న స్వస్థలాలకు చేరిన ప్రవాసాంధ్రులు.వీరికి హైదరాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన APNRT సిబ్బంది. #APNRT #UAEAmnesty #NonResidentTelugu #AndhraPradesh #Dubai #Telugu

DnSA39zUYAEzomB.jpg
Link to comment
Share on other sites

On 9/13/2018 at 1:07 PM, sonykongara said:

S4L5UHW.jpg

Preservation and protection of capital is the fundamental aspect any investor looks for ...  I'm glad AP took steps towards addressing that ... 

Entire US economy is based on that trust ... trust that US treasuries are safe ... trust that FDIC and SIPC means something ...

I want to take this opportunity and remind people of the importance of govt assured insurance ... Indian govt only guarantees upto 1 lakh on your deposits. Its important to understand that ...

It was never a problem before because we never saw the kind of banking scams we're seeing now under Modi ... protect your money.

No wonder deposits from common people dropped. It shows their confidence in the banking system.

 

 

 

Link to comment
Share on other sites

1 minute ago, baagunnara said:

Got below email:

Free IT Training

To create better employment opportunity to NRT's. APNRT offers world-class IT training for all members free of cost in partnership with Kelly Technologies.

Starting September 23rd.

Courses covered: Data Science, AWS, Block Chain, Artificial Intelligence, Python etc. 

yes its free training

Dns2LKtV4AIcy2H.jpg

Link to comment
Share on other sites

11 minutes ago, baagunnara said:

Got below email:

Free IT Training

To create better employment opportunity to NRT's. APNRT offers world-class IT training for all members free of cost in partnership with Kelly Technologies.

Starting September 23rd.

Courses covered: Data Science, AWS, Block Chain, Artificial Intelligence, Python etc. 

 

 

8 minutes ago, Yaswanth526 said:

yes its free training

Dns2LKtV4AIcy2H.jpg

Excellent.

Our young who are in college and just graduating should take notice ... this is a step into the corporate world ... 

experiment ... you have nothing to lose ... 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...