Jump to content

Nandyal


Recommended Posts

ఆ రెండింటిపై గురి
01-04-2018 14:32:47
 
636581899660291345.jpg
  • నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలపై ఎస్పీవై దృష్టి
  • వారసులను రంగంలోకి దించేందుకు పావులు
  • అధినాయకత్వం ఆదేశిస్తే పోటీ చేస్తామని వెల్లడి
  • నేటి నుంచి విస్తృత సేవా కార్యక్రమాలకు శ్రీకారం
నంద్యాల(కర్నూలు జిల్లా): నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన ఎస్పీవై రెడ్డి వచ్చే ఎన్నికల్లో తన వారసులను పోటీ చేయించేందుకు పావులు కదుపుతున్నారు. ఎస్పీవైరెడ్డికి అనారోగ్యం కారణంగా వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ సీటుకు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నంద్యాల లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో తన వారసులు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఎంపీ ఎస్పీవై ప్రకటించారు. అధినాయకత్వం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఎస్పీవై రాజకీయ వారసులుగా పోటీ చేయడానికి సిద్ధమని ఆయన అల్లుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. శనివారం ఎస్పీవై రెడ్డితో పాటు నంది గ్రూపు సంస్థల ఎండీ సజ్జల సుజలతో కలిసి విలేఖరులతో శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ఎస్పీవై రెడ్డి పోటీ చేసిన ప్రతీసారి ఆయన గెలుపు కోసం తెరవెనుక కుటుంబ సభ్యులంతా పనిచేశారన్నారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని చేపట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చించామని తెలిపారు. పార్టీలో చురుగ్గా, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై తక్షణమే స్పందించాలని వారు తమకు సూచించారని చెప్పారు.
 
 
ఎస్పీవై రెడ్డి ప్రజలతో మమేకమవుతూ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన బాటలోనే తాము కూడా రాజకీయాల్లో సక్సెస్‌ అయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా సాగుతామని పేర్కొన్నారు. నంద్యాల లోక్‌సభ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉచిత వైద్యం, వివిధ సేవా కార్యక్రమాలను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ చేపట్టినట్లుగా వైద్య రంగంలో ఉచిత కన్సల్టెన్సీతో పాటు మందులు కూడా ఉచితంగా సరఫరా చేసే క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయోగాత్మకంగా ఏప్రిల్‌లో ఒక క్లినిక్‌ను నెలకొల్పి ఫలితాలను విశ్లేషించాక మిగతా వాటిపై దృష్టి పెడతా మన్నారు. పాజిటివ్‌ రాజకీయాలు చేయడానికి తామంతా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎవరినీ విమర్శించమని, ఇతరులు తమను విమర్శించినా పట్టించుకోమని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతామని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...