Jump to content

Vijayawada's Bhavani Island


Husker

Recommended Posts

On 4/1/2018 at 4:10 AM, NBK-Dravid said:

2 months back vella... malli ivala veltuna

Brother, please give some details on best way to get there and things we need to plan when going with kids.

Though I belong to GUntur Dt,  Education antha Vijayawada and Guntur areas lo jarigina kani never been here.

If everything is good, will plan a trip with family 

Link to comment
Share on other sites

  • 1 month later...
భవానీ ఐల్యాండ్‌లో సీల్యాండ్‌ పార్క్‌
06-05-2018 07:36:59
 
636611890185580175.jpg
  • రూ.10 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచిన బీఐటీసీ
  • డాల్ఫిన్స్‌, సీల్స్‌ వంటి జలచరాలు..
  • జంతువులు, పక్షుల విన్యాస వినోద హేల
  • టర్కీ సంస్థల ఆసక్తి
  • ఐల్యాండ్‌ను సందర్శించి అధ్యయనం చేస్తున్న ఔత్సాహిక సంస్థలు
 
పర్యాటకులకు స్వర్గధామంగా తీర్చిదిద్దటం కోసం... ఇటీవల భవానీ ఐల్యాండ్‌లో కోట్లాది రూపాయల వ్యయంతో పర్యాటక ఆకర్షణలతో సొబగులు అద్దుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోనే ఇప్పటివరకు ఎక్కడా లేని సీ ల్యాండ్‌ పార్క్ మీద బీఐటీసీ అధికారులు దృష్టి సారించారు. ఒక్క సీ ల్యాండ్‌ మాత్రమే కాకుండా జంతువులు, పక్షులతో కూడిన ఈ పార్క్‌ను పర్యాటకుల కోసం ప్రత్యేక వినోదకేంద్రంగా అభివృద్ధి చేయాలని బీఐటీసీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డాల్ఫిన్స్‌, సీల్స్‌ వంటి జల చరాలు, సప్తవర్ణాలు అద్దుకున్న పక్షులు.. జంతువులు.. శిక్షకులు చెప్పినట్టు అవి చేసే విన్యాసాలు ఇలా మీకు వినోదాన్ని పంచుతాయి...
 
 
 
విజయవాడ: భవానీ ఐల్యాండ్‌లో దేశంలోనే మరెక్కలా లేని ‘సీ ల్యాండ్‌ పార్క్‌’ ఏర్పాటు చేయటానికి రంగం సిద్ధమైంది. రూ.10 కోట్ల వ్యయంతో భవానీ ఐల్యాండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (బీఐటీసీ) అధికారులు టెండర్లు పిలిచారు. ఈ సీ ల్యాండ్‌ పార్క్‌లో టర్కీ సంస్థలు భాగస్వామ్యం పంచుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. సీ ఐల్యాండ్‌ పార్క్‌లు పర్యాటకంగా అభివృద్ధి చెందిన దేశాలలో సెంటరాఫ్‌ అట్రాక్షన్స్‌గా నిలుస్తున్నాయి. జలచరాలు, జంతువులు, పక్షులతో ఓపెన్‌ డయాస్‌పై విన్యాసాలు చేయించటమే సీ ల్యాండ్‌ పార్క్‌ ఉద్దేశం. సీల్యాండ్‌ పార్క్‌ అంటే సహజంగా జల చరాలు మాత్రమే ఉంటాయి.
 
   పర్యాటకుల కోసం ఒక పెద్ద ఓపెన్‌ గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీ ముందు భాగంలో ఒక స్విమ్మింగ్‌ పూల్‌ ఉంటుంది. ఈ పూల్‌లో డాల్ఫిన్స్‌, సీల్స్‌ వంటి వాటితో శిక్షకులు విన్యాసాలు చేయిస్తారు. భవానీ ఐల్యాండ్‌లో మాత్రం జల చరాలతో పాటు.. జంతువులు, పక్షులు కూడా ఉండేవిధంగా మల్టీపర్పస్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఆ మేరకు టెండర్లు పిలిచారు. అనేక రకాలైన జంతువులను ఒక వేదిక మీదకు తీసుకు వచ్చి శిక్షకులు వాటి చేత అబ్బురపడే విన్యాసాలు చేయిస్తారు. వాటి విన్యాసాలు చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే రంగురంగుల చిలకలు, కొంగలు, అనేక రకాల పక్షులతో నేల మీద, గాలిలో శిక్షకులు విన్యాసాలు చేయిస్తారు.
 
యాంపీ థియేటర్‌ ఎంపిక
భవానీ ఐల్యాండ్‌లో దీనిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై బీఐటీసీ అధికారులు పెద్ద కసరత్తే చేశారు. ఐల్యాండ్‌లో నిరుపయోగంగా ఉంటున్న యాంపీ థియేటర్‌ మీద వీరి దృష్టి పడింది. యాంపీ థియేటర్‌ను సరికొత్తగా మలచేందుకు అధికారులు నిర్ణయించారు. గ్యాలరీలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి ఆకర్షణీయమైన రూఫ్‌ను ఏర్పాటు చేసి ఇంటీరియర్‌ చేస్తే సరిపోతుందని నిర్ణయించారు. సీల్యాండ్‌ పార్క్‌ కోసం ఏకంగా ఓపన్‌ డయాస్‌ మధ్యలో ఒక భారీ స్విమ్మింగ్‌ పూల్‌ను ఏర్పాటు చేయాలని బీఐటీసీ అధికారులు నిర్ణయించారు. ఈ స్విమ్మింగ్‌పూల్‌లో జలచరాలు విన్యాసాలు చేస్తాయి. పూల్‌కు దగ్గరగా మరో వేదికను ఏర్పాటు చేసి దానిని జంతువుల విన్యాసాలకు ఉపయోగిస్తారు.
 
ఐల్యాండ్‌ను సందర్శించిన ఔత్సాహికులు
సీ ఐల్యాండ్‌ పార్క్‌కు టెండర్లు పిలిచిన నేపథ్యంలో, ఔత్సాహిక సంస్థలకు చెందిన ప్రతినిథులు భవానీ ఐల్యాండ్‌ వచ్చి పరిశీలన జరిపి వెళుతున్నారు. భవానీ ఐల్యాండ్‌లో వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి వెళ్లారు. ఇక్కడ పరిస్థితులకు అనువుగా ఉన్న జలచరాలు, జంతువులు, పక్షులను మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేదంటే అవి చనిపోతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఔత్సాహికులు అధ్యయనం చేసి వెళ్లారు. సివిల్‌ నిర్మాణాలు బీఐటీసీ అధికారులు చేయించినా.. శిక్షణ పొందిన జల చరాలు, పక్షులు, జంతువులతో పాటు సిబ్బంది, శిక్షకులను కూడా కాంట్రాక్టు సంస్థలే సొంతంగా చేపట్టాల్సి ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జంతువులు ఉంటాయో ముందుగా అధ్యయనం చేయటానికి వస్తున్నారు.
 
భవానీ ఐల్యాండ్‌లో సీ ఐల్యాండ్‌ పార్క్‌ ఏర్పాటు చేయటం ద్వారా దేశీయంగానే ఈ తరహా తొలి పర్యాటక ప్రాంతంగా భాసిల్లనుంది. ఇప్పటికే భవానీ ఐల్యాండ్‌లో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో మ్యూజికల్‌ డ్యాన్సింగ్‌ ఫౌంటెయిన్‌ అండ్‌ లేజర్‌ షోను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రోజ్‌ గార్డెన్‌, మినీ జంగిల్‌, గోల్ఫ్‌ సిమ్యులేటర్‌, మేజ్‌ గార్డెన్‌ , మిర్రర్‌ గార్డెన్స్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇవి తుది దశలో ఉన్నాయి. తాజాగా సీ ఐల్యాండ్‌ పార్క్‌ అన్నది దేశంలోనే ఎక్కడా లేకపోవటంతో ఈ రికార్డును భవానీ ఐల్యాండ్‌ సొంతం చేసుకోబోతోంది. దేశీయంగా కూడా భవానీ ఐల్యాండ్‌ ప్రత్యేక ఆక ర్షణగా మారనుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...