Jump to content

జై తెలుగుదేశం !!


Recommended Posts

తెలుగువాడైన టంగుటూరి అంజయ్య వంటి నాయకుడికి రాష్ట్ర విమానాశ్రయంలోనే జరిగిన అవమానానికి కాంగ్రెస్ నేతలు సర్దుకుపోయినా, సాటి తెలుగువాడిగా ఎన్టీఆర్ భరించలేకపోయారు. ఆనాడే తెలుగువారి చేతికి ఒక ప్రత్యేక కేతనాన్ని అందించాలని, ఆ జెండా చేతబూని తెలుగువాడు చేసే ఆత్మగౌరవ నినాదం సింహ గర్జనలా దేశమంతా ప్రతిధ్వనించాలని భావించిన ఎన్టీఆర్ మార్చి 29, 1982 న తాను పార్టీ స్థాపిస్తున్నానని... ఆ పార్టీ పేరు 'తెలుగుదేశం' అని ప్రకటించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ మహాశయుల స్ఫూర్తిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని... తెలుగుప్రజలందరిదీ ఒకటే కుటుంబమని, తెలుగుదేశం ప్రతిష్ట కోసం తెలుగువారందరూ కలసికట్టుగా ముందంజ వేయడానికే పార్టీకి తెలుగుదేశం అని పేరు పెట్టామని ఆనాడు ఎన్టీఆర్ అన్నారు.

ప్రత్యేక హోదా కోసం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాటం చేస్తున్న ఈ తరుణంలో నాడు ఎన్టీఆర్ అందించిన స్ఫూర్తిని మనం తిరిగి అందుకోవాలి. తెలుగువారి హక్కులను సాధించేంతవరకూ తెలుగుదేశం అండగా విరామమెరుగని శాంతియుత పోరాటం చేయాలి.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేడు గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన సీనియర్‌ కార్యకర్తలను తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సత్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెదేపా అధ్యక్షులు కళా వెంకట్రావ్‌, తెలంగాణ తెదేపా అధ్యక్షులు ఎల్‌.వి.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

https://scontent-iad3-1.xx.fbcdn.net/v/t31.0-8/29662353_2035568493123398_5439552343256096493_o.jpg?_nc_cat=0&oh=d6114cb9b1aaa5660ebe966a2f8bf420&oe=5B739C4C

Link to comment
Share on other sites

Guest Urban Legend

36 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక చరిత్ర పుట్టింది.....

చరిత్ర తో సై అనే జండా పుట్టింది
చరిత్ర ను తిరగరాసే తెలుగోడి అండ పుట్టింది
చరిత్ర మెడలో మిగిలిపోయే ఒక దండ పుట్టింది

తెలుగుజాతి చరిత్రలో ఎప్పటికి రెపరెపలాడే తెలుగు దేశం పుట్టింది.... #TdpformationDay

Link to comment
Share on other sites

Most of the youngsters here don't even know the real glorious days of Telugu Desam.

 

That was once in a life time opportunity. Those are the days when elections were considered as festivals.

 

Party is still remain same at the levels of top leader and party activists, it is completely polluted in between....

 

Ee paata vasthunte....state motham vugipoyindi. Those days will never come....just like changes in society.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...