Jump to content

Public investment for state government


Recommended Posts

అమరావతి నిర్మాణానికి మేము సైతం
11-04-2018 00:29:53
 
636590033945341806.jpg
  • పింఛన్‌ మొత్తాన్ని అందించిన వృద్ధులు
హరిపురం, (శ్రీకాకుళం), ఏప్రిల్‌ 10: శ్రీకాకుళం జిల్లా మందస మండలం బిన్నళ మదనాపురం గ్రామానికి చెందిన 12 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.12 వేలను అమరావతి నిర్మాణానికి విరాళంగా అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషకు మంగళవారం ఈ మొత్తాన్ని అందించి స్ఫూర్తిని చాటారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని.. అందుకే తమ వంతు సాయంగా పింఛను అందిస్తున్నట్టు వృద్ధులు చెప్పారు.
Link to comment
Share on other sites

  • Replies 66
  • Created
  • Last Reply
రాష్ట్రాభివృద్ధికి రూ.10 లక్షల విరాళం
10ap-state10a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అభివృద్ధి కోసం రమేష్‌ హాస్పిటల్స్‌ రూ.10 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేసింది. రమేష్‌ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ మద్దిపాటి సీతారామ్మోహనరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌బాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు చెక్‌ అందచేసినట్లు  ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
రాజధాని నిర్మాణానికి బంగారు గాజులిచ్చిన మహిళ

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన మహిళ వేగి సరోజిని శుక్రవారం విజయవాడలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష శిబిరానికి హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు దీక్ష శిబిరంలో కూర్చున్న ఆమె అప్పటికప్పుడు స్ఫూర్తి పొంది తన చేతికి ఉన్న  బంగారు గాజులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. అమరావతి ప్రాంత రైతు అనుమోలు సూర్యప్రకాష్‌ రూ.4లక్షల విరాళం ప్రకటించారు.

Link to comment
Share on other sites

అమరావతికి రూ.20 లక్షల విరాళమిచ్చిన సినీ నిర్మాత
23-04-2018 20:54:37
 
అమరావతి: సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 20 లక్షల విరాళం అందజేశారు. అంతేకాదు.. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది రూ. 10 లక్షల చొప్పున విరాళం ఇస్తానని నిర్మాత .. సీఎంకు చెప్పారు
Link to comment
Share on other sites

రాజధానికి కూలీ వితరణ
ముఖ్యమంత్రి అభినందన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తాను కష్టపడి దాచుకున్న సొమ్మును ఓ కూలీ విరాళంగా అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కృష్ణా జిల్లా పెనుగ్రంచిప్రోలు మండలం కుల్లికోళ్ల గ్రామానికి చెందిన నారిశెట్టి పుల్లయ్య రాజధాని నిర్మాణానికిగాను రూ.22,210ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం సీఎం నివాస ప్రాంగణంలోని గ్రీవెన్స్‌ హాలులో అందించారు. కూలీ పని చేసుకునే పుల్లయ్య రాజధానికి విరాళం ఇచ్చిన స్ఫూర్తిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. తనకు ఉన్నంతలో ఎదుటివారికి సాయం చేయాలనే తెలుగువారి సేవా గుణానికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.

Link to comment
Share on other sites

రాజధానికి ఇంకొల్లు విశ్రాంత ఉద్యోగుల విరాళం
27-04-2018 07:43:48
 
636604118279973419.jpg
 
 
విజయవాడ: రాజధాని నగర నిర్మాణార్ధం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండల శాఖ సభ్యులు అయిదుగురు మొత్తం రూ.25,000 విరాళాన్ని సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌కు గురువారంనాడు అందజేశారు. ఆలా శ్రీకృష్ణమూర్తి, ఎన్‌.చెన్నకేశవరావు, కరి శేషయ్య, బోడెంపూడి రామమూర్తి, పి.వి.సుబ్బారావు అనే వారు ఒక్కొక్కరు రూ.5,000 చొప్పున మొత్తం రూ.25,000లకు చెక్కులు, డీడీలను చెన్నకేశవరావు ద్వారా ఇచ్చారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అమరావతి నిర్మాణానికి తమ వంతు సహాయంగా ఈ మొత్తాన్ని అందజేసినట్లు చెప్పారు. విరాళం అందజేసినందుకుగాను రిటైర్డ్‌ ఉద్యోగులను శ్రీధర్‌ అభినందించారు.
Link to comment
Share on other sites

బెకెమ్‌ ఇన్‌ఫ్రా రూ.కోటి విరాళం
01-05-2018 01:58:19
 
636607367033576759.jpg
ముఖ్యమంత్రి సహాయ నిధి, అమరావతి నిర్మాణం కోసం బెకెమ్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌... రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చింది. బెకెమ్‌ ఇన్‌ఫ్రా చైర్మన్‌ బొల్లినేని కృష్ణమోహన్‌... తన తండ్రి పూర్ణచంద్రరావు చేతుల మీదుగా ముఖ్యమంత్రికి ఈ చెక్కును అందించారు. బెకెమ్‌ ఇన్‌ఫ్రా సంస్థ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉంది.
Link to comment
Share on other sites

On 3/28/2018 at 9:44 AM, BalayyaTarak said:

It appears that CBN is going to ask public to invest in government which would yield 1 or 2% more than bank interest rates

 

from 8:00 in this video

 

 

actually waiting for this!

Link to comment
Share on other sites

రాజధాని అమరావతిని చూసి తనువు చాలిస్తా...
05-05-2018 14:31:02
 
అమరావతి: ‘పెద్ద కొడుకుగా ఆదుకుంటానన్నారు... ఆదుకున్నారు.., రాజధాని అమరావతిని చూసి తనువు చాలిస్తా.. మీరే నిర్మించాలి’ అంటూ ఓ వృద్ధురాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామానికి చెందిన పలువురు పెన్షనర్లు శనివారం అమరావతికి విచ్చేసి సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా ఆగ్రామంలో ఫించన్లు అందుకుంటున్న వారు తమ మొదటి ఫించన్లను రూ. 40వేలను అమరావతి నిర్మాణానికి విరాళంగా అందజేశారు. కాగా... అందులో కటారి ఆదెమ్మ అనే ఫించనుదారు చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఫించన్ అందజేసి తమను పెద్దకొడుకుగా ఆదుకుంటున్నారని, రాజధాని అమరావతిని మీరే నిర్మించాలని, దానిని చూసి తనువు చాలించాలని ఉందని అన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ... ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాజధానిని నిర్మించి తీరుతామని, మీరే చూస్తారంటూ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణానికి ఎన్ఆర్ఐ రూ.10లక్షల విరాళం
09-05-2018 15:50:13
 
636614778129325624.jpg
అమరావతి: ఏపీపై కేంద్రం చూపుతున్న వివక్షను ప్రవాసాంధ్రులం గమనిస్తున్నామని ఎన్‌ఆర్ఐ చావా పద్మ అన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం నూజెర్సీకి చెందిన ఎన్‌ఆర్‌ఐ చావా పద్మ రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ.. అమెరికాలో నివాసం ఉంటున్నా పుట్టినగడ్డపై వున్న మమకారంతో విరాళం ఇచ్చానని అన్నారు.
 
రాజధాని నిర్మాణం కోసం సాయం చేయాలని సీఎం ఇచ్చిన పిలుపు, ఆయన నిరంతర శ్రమ మమ్మల్ని కదిలించిందని పేర్కొన్నారు. చంద్రబాబు ముందుచూపుతో వేలమంది తెలుగువారు దేశవిదేశాల్లో ఉన్నత స్థితిలో వున్నారని కొనియాడారు. రాజధాని నిర్మాణం కోసం మరింత మంది ఎన్‌ఆర్ఐలు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా వున్నారని చావా పద్మ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
రాజ‌ధాని నిధుల కోసం అమ‌రావ‌తి బాండ్ల జారీ
18-05-2018 18:09:00
 
636622637409287182.jpg
 
అమరావతి: సీఆర్డీఏపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ‌ధాని నిధుల కోసం అమ‌రావ‌తి బాండ్లు జారీ చేశామన్నారు. ప్రభుత్వం గ్యారంటీతో బాండ్ల ద్వారా నిధుల స‌మీక‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. తొలిద‌శ‌లో రూ.2 వేల కోట్ల విలువైన బాండ్లు మార్కెట్‌లోకి విడుద‌ల‌ చేశామన్నారు. ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేకంగా బాండ్ల రూప‌క‌ల్పన‌ చేసినట్లు చెప్పారు. అమ‌రావ‌తికి వ‌చ్చి స్థిర‌ప‌డే వారి కోసం 12 వేల ఇళ్లు నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు. రాజ‌ధాని ప్రాంత రైతులను పారిశ్రామిక‌వేత్తలుగా మారుస్తామన్నారు. దీనిపై ప్రత్యేక చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించినట్లు చంద్రబాబు చెప్పారు.
Link to comment
Share on other sites

21 minutes ago, sonykongara said:
రాజ‌ధాని నిధుల కోసం అమ‌రావ‌తి బాండ్ల జారీ
18-05-2018 18:09:00
 
636622637409287182.jpg
 
అమరావతి: సీఆర్డీఏపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ‌ధాని నిధుల కోసం అమ‌రావ‌తి బాండ్లు జారీ చేశామన్నారు. ప్రభుత్వం గ్యారంటీతో బాండ్ల ద్వారా నిధుల స‌మీక‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. తొలిద‌శ‌లో రూ.2 వేల కోట్ల విలువైన బాండ్లు మార్కెట్‌లోకి విడుద‌ల‌ చేశామన్నారు. ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేకంగా బాండ్ల రూప‌క‌ల్పన‌ చేసినట్లు చెప్పారు. అమ‌రావ‌తికి వ‌చ్చి స్థిర‌ప‌డే వారి కోసం 12 వేల ఇళ్లు నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు. రాజ‌ధాని ప్రాంత రైతులను పారిశ్రామిక‌వేత్తలుగా మారుస్తామన్నారు. దీనిపై ప్రత్యేక చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించినట్లు చంద్రబాబు చెప్పారు.

Can someone please give a link or more information on these bonds. When they were issued and how to buy them. He mentioned they issued some bonds for NRI's also. Where can we buy them ?

 

Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణానికి రూ.9.5లక్షలు
18-05-2018 07:46:54
 
636622264150695216.jpg
  • సీఎంకు అందజేసిన బడేవారిపాలెం వాసులు
విజయవాడ: నవ్యాంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణా నికి ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామస్థులు 9.50 లక్షల విరాళాన్ని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. బడేవారిపాళెంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎంకు తాము సేకరించిన విరాళాలను అందజేశారు. వృద్ధాప్యంతో నడవలేని స్థితిలో ఉండి కూడా వీల్‌చైర్‌లో వచ్చి రూ.5 లక్షలు అందజేసిన ఇంటూరి నరసయ్యను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించి సత్కరించారు. బడేవారిపాలెం గ్రామానికి చెందిన నల్లూరి స్వాతి రూ.2 లక్షలు, పి. కృష్ణబాబు, మాధురి దంపతులు రూ.2 లక్షలు, ఉన్నం శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు 50 వేలు అమరావతి నిర్మాణానికి అందజేశారు.
Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణానికి 'మహానటి' నిర్మాతలు రూ.50 లక్షల విరాళం
26-05-2018 13:18:11
 
636629374934887763.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబును ‘మహానటి’ సినిమా యూనిట్‌ కలిసింది. సినిమా విజయవంతం కావడంతో చిత్ర యూనిట్‌ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వైజయంతి సంస్థ తరఫున రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ హిట్టయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మరీ ముఖ్యంగా సావిత్ర పాత్ర పోషించడం గొప్పతనమని, ఈ పాత్రతో తనకు మంచి గుర్తింపు ఇచ్చిన చిత్ర యూనిట్‌కు, అభిమానులకు కీర్తి సురేష్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్‌, చిత్ర నిర్మాతలు, డైరెక్టర్‌తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణానికి ‘మహానటి’ టీం రూ.50 లక్షల విరాళం
26-05-2018 13:18:11
 
636629374934887763.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబును ‘మహానటి’ సినిమా యూనిట్‌ కలిసింది. సినిమా విజయవంతం కావడంతో చిత్ర యూనిట్‌ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వైజయంతి సంస్థ తరఫున రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ హిట్టయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మరీ ముఖ్యంగా సావిత్ర పాత్ర పోషించడం గొప్పతనమని, ఈ పాత్రతో తనకు మంచి గుర్తింపు ఇచ్చిన చిత్ర యూనిట్‌కు, అభిమానులకు కీర్తి సురేష్ అభినందనలు తెలిపారు. మహానటి సావిత్రి పుట్టన ఊరు గుంటూరని, ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం గొప్పతనమని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్‌, చిత్ర నిర్మాతలు, డైరెక్టర్‌తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
అమరావతి బాండ్ల జారీకి క్యాబినెట్‌ ఓకే
03-08-2018 07:15:46
 
636688773475265431.jpg
  • రూ.2,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా వారం రోజుల్లో ఇష్యూ
  • బాండ్లపై 10.32 శాతం త్రైమాసిక స్థిర వడ్డీ
  • తొలుత రూ.1300 కోట్లకు జారీ- స్పందన బాగుంటే మిగిలిన రూ.700 కోట్లకు సైతం
  • విధివిధానాల ఖరారుకు నిపుణులు, అధికారులతో స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటు
 
అమరావతి: రాజధాని నగర నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ.2,000 కోట్లను మదుపరుల నుంచి సేకరించే నిమిత్తం ఏపీసీఆర్డీయే జారీ చేయదలచిన అమరావతి బాండ్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాండ్ల జారీకి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఆర్థికరంగ నిపుణులు, ఉన్నతాధికారులతో కూడిన ఒక స్టాండింగ్‌ కమిటీని కూడా ఈ సందర్భంగా నియమించారు.
 
రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీనిచ్చే ఈ బాండ్ల కోసం ఈ నెల ఆరు లేదా ఏడు తేదీల్లో బిడ్లను పిలుస్తారని, తర్వాత మూడు నాలుగు రోజుల్లో అవి బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎ్‌సఈ)లో లిస్టవుతాయని తెలుస్తోంది. బాండ్ల ద్వారా నిధుల సమీకరణ మదుపరులకు, సీఆర్డీయేకు కూడా ప్రయోజనకరమైనందున రాష్ట్ర ప్రభుత్వం వీటి జారీకి ఆమోదముద్ర వేసింది.
 
త్రైమాసిక స్థిర వడ్డీ 10.32 శాతం..
  • అమరావతి బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఆకర్షణీయమైన వడ్డీ ఇచ్చేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలియజేసింది. వీటిపై 10.32 శాతం స్థిర వడ్డీని, ప్రతి మూడు నెలలకూ ఒకసారి మదుపరులకు చెల్లించేందుకు అంగీకరించడం ద్వారా వీటిపై పలువురు ఆసక్తి కనబరచేలా చూసింది.
  • మొత్తం సేకరించదలచిన రూ.2,000 కోట్లకు తొలి దశలో (బేసిక్‌ ఇష్యూ) రూ.1300 కోట్ల విలువైన బాండ్లను బీఎ్‌సఈ ఎలకా్ట్రనిక్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫాం (ఈబీపీ)పై జారీ చేయనున్నారు.
  • వీటికి ఆశించిన స్పందన లభిస్తే మిగిలిన రూ.700 కోట్ల (గ్రీన్‌ షూ ఆప్షన్‌)కూ బాండ్లను సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఇష్యూ చేసేందుకు క్యాబినెట్‌ అనుమతించింది.
స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటు
  • పైన పేర్కొన్న విధంగా బహుళ ప్రయోజనకరమైన అమరావతి బాండ్ల జారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటును సైతం క్యాబినెట్‌ సమావేశం ఆమోదించింది.
  • కాగా ఈ స్టాండింగ్‌ కమిటీకి రాష్ట్ర ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
  • రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీసీఆర్డీయే కమిషనర్‌, స్పెషల్‌ కమిషనర్‌, సంబంధిత అంశంలో నిపుణుడు సభ్యులుగా ఉంటారు.
 
 
ఇవీ.. సీఆర్డీయేకు కలిగే ప్రయోజనాలు
  • అమరావతి బాండ్లు మదుపరులకు భద్రతతో కూడిన మంచి ఆదాయాన్ని ఇస్తూనే.. వాటిని జారీ చేసే సీఆర్డీయేకూ ప్రయోజనాలను కలిగించనున్నాయి. బాండ్ల ద్వారా లభించే నిధులను అవసరాలు, ప్రాథమ్యాలకు అనుగుణంగా ఖర్చు చేసుకునే సౌలభ్యం సీఆర్డీయేకు ఉంటుంది.
  • కాలహరణం జరగదు. బాండ్ల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది. ఆ వెంటనే నిధులు అందుతాయి.
  • అమరావతి బాండ్లపై ఐదు సంవత్సరాల మారిటోరియం ఉంది. అంటే.. 2023 తర్వాత మాత్రమే మదుపరులకు రీపేమెంట్లు ప్రారంభమవుతాయి. ఇది సీఆర్డీయేకు ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తుంది.
Link to comment
Share on other sites

Naku oka doubt

Educational Institutions, Hospitals, hotels, malls, office space, Banks etc   kavalsina valaki State govt land ichesthundhi..

 

Farmers ki iche commercial lands lo office space pettakudadhu annaru.. Inka farmers ki iche lands lo em pettukovali ? Ikkada public patnership emuntadhi ? And medium  small Investors commercial lands konukunna development chesukovadaniki permissions ivvaru.. So Farmers, Small scale vala paristhiti enti ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...