Jump to content

formula l1 in amaravathi


Saichandra

Recommended Posts

అమరావతికో ఫార్ములా 
ఎఫ్‌-1హెచ్‌2ఓ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు వేదికగా ప్రకాశం బ్యారేజీ 
నవంబరు 22-24 పోటీలు 
పోటీలో 10 ప్రపంచస్థాయి బృందాలు 
ఈనాడు - దిల్లీ 
25ap-main8a.jpg

వాయువేగంతో దూసుకుపోయే పవర్‌బోట్లు..కళ్లు గగుర్పొడిచేస్థాయిలో నీటిలో విన్యాసాలు..రెప్పపాటులో కిలోమీటర్ల మేర దూసుకువెళ్లే బోట్లు..అబ్బురపరుస్తూ ఔరా అనిపించేలా ఉండే పవర్‌బోటింగ్‌..ఏదో ఆంగ్ల చిత్రాల్లో చూడడమే తప్ప వాస్తవంలో వీటిని చూడడం అందరికీ సాధ్యపడదు. ఇలాంటి పవర్‌బోటింగ్‌లను మించిన స్థాయిలో ఉండే ఫార్ములా-1 రేసింగ్‌ అదీ నీటిపైన మనం అసలు చూడలేం కదా. కానీ, ఆ రేసింగ్‌ మనవద్దే.. మన ముందే జరగనుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఈ రేసింగ్‌కు వేదిక కానుంది. యూఐఎం ఎఫ్‌-1హెచ్‌2ఓ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఇందుకోసం ఈ సంవత్సరానికి కేలెండర్‌ను నిర్వహకులు విడుదల చేశారు. అందులో అమరావతి ఓ వేదికగా ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఎంపికైన వేదికలు-పోటీలు నిర్వహించే తేదీలు 
* మే 18-20 పోర్టీమావో(పోర్చుగల్‌), 
* జూన్‌ 15-17 లండన్‌(యూకే), 
* జూన్‌ 29-జులై 1 ఇవియాన్‌(ఫ్రాన్స్‌), 
* ఆగస్టు 26-26 హార్బిన్‌(చైనా), 
* సెప్టెంబరు 29-అక్టోబరు 1 లీజుహు(చైనా), 
* నవంబరు 22-24 అమరావతి(ఏపీˆ,భారత్‌) 
* డిసెబరు 6-8 అబూధాబి (యూఏఈ), 
* డిసెంబరు 13-15 షార్జా(యూఏఈ).

పోటీలు ఇలా: క్రికెట్‌లో ఐపీఎల్‌లాగే ఎఫ్‌-1హెచ్‌2ఓ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనే బోటు డ్రైవర్లను సంస్థలు కొనుగోలు చేస్తాయి. డిసెంబరు వరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోటీలు నిర్వహించి చివరగా ప్రపంచ విజేతను తేలుస్తారు.

అమరావతిలో ఎలా... 
భారత్‌లో చివరిసారిగా పదేళ్ల కిందట ఒకసారి ఈ పోటీలు జరిగాయి. తర్వాత ఇప్పుడు అమరావతి వేదిక కానుంది. ఈ ఛాంపియన్‌ షిప్‌ నిర్వాహకులను రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు గతేడాది కలిసి అమరావతి గురించి, ప్రకాశం బ్యారేజీ వద్ద ఎఫ్‌-1 రేస్‌ నిర్వహించేందుకు ఉన్న సానుకూల వాతావరణం గురించి వివరించారు. తర్వాత యూఐఎం నుంచి నిపుణులు అమరావతికి వచ్చి పరిశీలించారు. బ్యారేజీ నుంచి నది 23కి.మీ. మేర ఉండడం, 11 లంకలు(ఐలాండ్‌లు), అక్కడక్కడా నది వంపులు, నీటిలో అలలు లేకుండా నిర్మలంగా ఉండడం వంటి సాంకేతిక కారణాలను పరిశీలించి ఈ ప్రాంతాన్ని రేసింగ్‌కు అనువైనదిగా గుర్తించారు. తర్వాత యూఐఎం ప్రతినిధులు రెండు నెలల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబును వెలగపూడిలోని సచివాలయంలో కలిశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి అమరావతి రాజధాని ప్రాజెక్టు గురించి వారికి వివరించారు. ఈ రేస్‌లు అమరావతిలో నిర్వహిస్తే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని కోరారు. సాంకేతికంగా కూడా అనువుగా ఉండడంతో ఈ ఏడాది ఛాంపియన్‌షిప్‌ కేలెండర్‌లో అమరావతిని వేదికగా ఎంపిక చేశారు.

మరి ఏర్పాట్ల సంగతి...! 
అంతర్జాతీయ స్థాయి వ్యవహారం కావడంతో సహజంగా ఇక్కడ ఆతిథ్యం, 5నక్షత్రాల హోటల్‌ గదులు అతిథులందరికీ సరిపోతాయా? లేదా? వసతి సాధ్యమేనా? వంటి విషయాలనూ యూఐఎం ప్రతినిధులు అమరావతి పరిధిలో పరిశీలించి సంతృప్తి చెందినట్లు పర్యాటక శాఖ ఉన్నతాధికారి తెలిపారు. బోటు డ్రైవర్లు, వారి సహాయకులు ఇలా వారే మొత్తం 500మంది మేర పోటీల నిర్వాహక టీం ఉంటుందట. అంతర్జాతీయ పర్యాటకులు, ఈ క్రీడాభిమానులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు ఇలా అనేకమంది రాకతో నవంబరులో విజయవాడలో సందడి నెలకొననుంది.

Link to comment
Share on other sites

22 minutes ago, dusukochadu said:

We were very close to getting F1 to Hyd before 2004 elections. 

Finally, this got materialized at the correct time. 

:super: 

 

formula-1 vachindi....cancel chesaru...vallu bribes ivvaru kada so danni atla sentimental ga vadadu adedo papam annattu......malli eedu 1000's of acres matram decoits rasesadu...

http://www.thehindu.com/2004/10/28/stories/2004102808610400.htm

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...