Jump to content

UCs proofs


Recommended Posts

Guest Urban Legend
3 minutes ago, Godavari said:

Indulo central govt approval unnatu ekkada chudalii valla nunchi vachina reply lu emi undava

DZIKHlfXcAA9atC.jpg

Link to comment
Share on other sites

చంద్రబాబు ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇక్కడ... ఇవిగోండి UCలు... ఇప్పుడు చెప్పండి ఢిల్లీ పెద్దలు...

Super User
25 March 2018
Hits: 149
 
uc-25032018-1.jpg
share.png

మా రాష్టానికి మీరు హామీ ఇచ్చినవి ఇవ్వండి, చట్టంలో ఉన్నవి అమలు చెయ్యండి అంటే, ఢిల్లీ పార్టీ ఎలా ఎదురుదాడి చేస్తుందో చూసాం... అన్నీ ఇచ్చేసామని, కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, చేసిన పనులకు యూసీలు, ఇవ్వలేదు అంటూ, బీజేపీ బుకాయిస్తూ వస్తుంది.. చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, మేము యూసీలు ఇచ్చాం అంటూ, డేట్ వైజ్ చెప్పినా, బీజేపీ మాత్రం, అవే అసత్యాలు చెప్తూ, ప్రజలను కన్ఫ్యుస్ చేస్తుంది... అయితే వీటన్నటికీ చెక్ పెడుతూ, ఈ రోజు చంద్రబాబు చివరకు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన, యూసీలు కూడా పారదర్శకంగా ప్రజల ముందు పెట్టారు...

 

uc 25032018 1

uc 25032018 1

వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.1050 కోట్లలో 940 కోట్లకు యూసీలు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. గుంటూరు, విజయవాడకు ఇచ్చిన నిధుల్లో రూ.350 కోట్లకు యూసీలు ఇచ్చామని, అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇచ్చిన రూ.1000కోట్లకు కూడా యూసీలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు...

uc 25032018 1

uc 25032018 1

అయితే, ఎంత చెప్పినా బీజేపీ అవే అబద్ధాలు చెప్తూ, చంద్రబాబు వైపు తప్పు చూపించటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ యూసీలు అన్నీ బయట పెట్టింది... ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు రూ.150కోట్ల చొప్పున ఇచ్చారని... శ్రీకాకుళంలో రూ.135.15కోట్లు, విజయనగరంలో రూ.134.74కోట్లు, విశాఖపట్నంలో రూ.135.46 కోట్లు, చిత్తూరులో రూ.134.90కోట్లు, కడపలో రూ.137.08కోట్లు, అనంతపురంలో రూ.124.59కోట్లు, కర్నూలులో రూ.144.55 కోట్లు ఖర్చు చేసినట్లు, కేంద్రానికి పంపించిన యూసీలు విడుదల చేసారు..

uc 25032018 6

అలాగే, ఈ సంవత్సరం, 350 కోట్లు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చి, వెంటనే పియంఓ పర్మిషన్ లేదు అని, డబ్బులు మళ్ళీ వెనక్కు తీసుకున్న వివరాలు కూడా బయట పెట్టారు... అలాగే అమరావతికి, అండర్ గ్రౌండ్ డ్రైనేజికి ఇచ్చిన యూసీలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది...

uc 25032018 7

మరి ప్రభుత్వం యూసీలు సమర్పించకపోతే ఇన్నాళ్ళు అసలు నిధులు ఎలా విడుదల చేశారు ? ఇప్పుడు ఈ వివరాలు చుసిన తరువాత, ఎవరు అన్యాయం చేసారో ప్రజలకు తెలుస్తుంది.. నిన్న ఉత్తరం రాసి, చంద్రబాబు ముసుగులో గుద్దులాట ఆడుతున్నారు అంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఇవి చూసి, మన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ మేధావులతో చర్చించండి... ఎవరిది తప్పో చెప్తారు... మీరు ఎలాగు మోడీని ఏమి అనలేరు కాదా, ఆ మేధావులు అయినా స్పందిస్తారు... ఇక జగన్ గురించి, మాట్లాడటం కూడా అనవసరం... ఈ వాస్తవాలు చూసి, ఇక ప్రజలే నిర్ణయించాలి...

uc 25032018 1

uc 25032018 1

Link to comment
Share on other sites

ఇవీ నిజానిజాలు! 
‘అమిత్‌షా ఆరోపణలు-వాస్తవాలు’ పేరిట అధ్యయన పత్రం 
పార్టీ శ్రేణుల కోసం సిద్ధం చేసిన తెదేపా 
ఆ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన 
 

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ వాస్తవ విరుద్ధమని తెదేపా పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ నాలెడ్జ్‌ సెంటర్‌ ‘‘అమిత్‌ షా ఆరోపణలు-వాస్తవాలు’’ పేరిట ఓ అధ్యయన పత్రాన్ని రూపొందించింది. దీన్ని పార్టీ శ్రేణులకు పంపిణీ చేస్తోంది. అందులోని అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారికి సూచించింది. అధ్యయన పత్రంలోని వివరాలిలా ఉన్నాయి.

అమిత్‌ షా: రాజధాని అమరావతికి రూ.2500 కోట్లిచ్చాం. పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన రూ.1000 కోట్లలో 8 శాతమే ఖర్చు చేశారు. 
తెదేపా: విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికిచ్చిన రూ.1000 కోట్లతో చేపట్టిన వాటిల్లో ఇప్పటికే 42 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా వాటిని కూడా గడువులోగా పూర్తి చేస్తాం. రాజధానికి రూ.1500 కోట్లే ఇచ్చారు. ఆ మొత్తంతో 6 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్‌ భవనాలు నిర్మించాం. 80 లక్షల చదరపు అడుగుల్లో అధికారుల, సిబ్బంది, ఎమ్మెల్యేల నివాస సముదాయాలను నిర్మిస్తున్నాం. కొండవీటి వాగు ఎత్తిపోతల నిర్మాణం వేగంగా సాగుతోంది.

అమిత్‌ షా: వెనుకబడిన ప్రాంతాలకు, రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులు పెద్దగా ఖర్చు పెట్టలేదు. 12 శాతం ఖర్చుకే వినియోగపత్రాలిచ్చారు. 
తెదేపా: రాయలసీమ, ఉత్తరాంధ్రల్లోని వెనుకబడిన ఏడు జిల్లాలకు కేంద్రం రూ.1050 కోట్లే ఇచ్చింది. అందులో 92 శాతం ఖర్చు చేశాం. 12 శాతమే ఖర్చు చేశామనడం అసత్యం. వినియోగపత్రాలు సమర్పిస్తేనే రెండు, మూడో విడతల నిధులు విడుదల చేశారు. నాలుగో విడతలో రూ.350 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేయగా... ప్రధాని కార్యాలయం ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది.

అమిత్‌ షా:విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు(ఈఏపీ) నిధుల కోసం ప్రత్యేక వాహక సంస్థ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 
తెదేపా: ఈశాన్య రాష్ట్రాలకు 2027 వరకూ ప్రత్యేక హోదాను కొనసాగిస్తున్న కేంద్రం వారికి ఎస్‌పీవీ ద్వారా కాకుండా నేరుగానే నిధులిస్తోంది. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వరు. ఇది వివక్ష కాదా? ఎస్‌పీవీ ఏర్పాటు అంటేనే మన డిమాండును కోల్డ్‌స్టోరేజీలోకి నెట్టడమే. ప్రత్యేక హోదా హక్కు నిరాకరించడమే.

అమిత్‌ షా:కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాం. 
తెదేపా: ఇలా 29 రాష్ట్రాలకూ ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది కాదు. పేరుకే 42 శాతం కానీ వాస్తవంగా ఇస్తోంది 37 శాతం నిధులే. అదీ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే ఆదాయంలో ప్రతి రూ.100లో రూ.37 మాత్రమే తిరిగిస్తున్నారు. మన డబ్బులో కొంతే మనకు ఇస్తున్నారు.

అమిత్‌ షా:2014-15 సంవత్సరం రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం రూ.3,970 కోట్లు విడుదల చేసింది. 2015-16 సంవత్సరానికి మరో రూ.1,600 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించింది. 2014-15 సంవత్సరం లోటులో రైతు రుణమాఫీ, పింఛన్లు వ్యయాన్ని చేర్చి రూ.16,000 కోట్లు లోటుగా చూపడం సరైంది కాదు. 
తెదేపా: 2014-15లో రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లు ఉందని కాగ్‌ నిర్ధారించినా అందుకు కేంద్రం ఎందుకు అంగీకరించడం లేదు. రాష్ట్ర విభజనలో భాగం పంచుకున్న భాజపా లోటు భర్తీ చేసే బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదు?

అమిత్‌ షా: విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి రూ.8991.38 కోట్ల మేరకు సంతకాలు జరిగాయి 
తెదేపా: 2016 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకూ ఒక్క రూపాయీ విడుదల కాలేదు. ఒప్పందంపై సంతకాలు చేసినా నిధుల విడుదలకు సంబంధించిన నియమాలు రూపొందించకుండా కేంద్రం నిర్లక్ష్యం చేసింది. చంద్రబాబు 29 సార్లు దిల్లీ వెళ్లినా, తెదేపా కేంద్ర మంత్రులిద్దరూ ఎంత ప్రయత్నించినా నియమాలు రూపొందించలేదు. అందుకే ఆ సంతకాలు కాగితాలకే పరిమితమయ్యాయి.

అమిత్‌ షా: పోలవరానికి ఇప్పటి వరకూ కేంద్రం రూ.5364 కోట్లు ఇచ్చింది. 
తెదేపా: పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.12 వేల కోట్లు ఖర్చు చేసింది. ఆ లెక్కన రాష్ట్రానికి కేంద్రమే రుణపడి ఉంది. జాతీయ ప్రాజెక్టు ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలి. గిరిజనులు, రైతుల పరిహారం, పునరావాసానికి అవసరమయ్యే రూ.33 వేల కోట్లకు సంబంధించి అమిత్‌షా ఎందుకు తన లేఖలో స్పష్టత ఇవ్వలేదు.

అమిత్‌ షా: 2022 నాటికి 11 జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉండగా...9 విద్యాసంస్థలు ఇప్పటికే ఏర్పాటు చేశాం. 
తెదేపా: జాతీయ విద్యాసంస్థలకు రూ.11,762 కోట్లు  అవసరమైతే నాలుగేళ్లలో రూ.576 కోట్లు ఇచ్చారు. దామాషా ప్రకారం చూసినా రూ.4 వేల కోట్లు ఇవ్వాలి. ఇలా అయితే నిర్మాణాలు పూర్తికావడానికి 30 ఏళ్లు పైగా పడుతుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...