Jump to content

New Biscuits to AP


DVSDev

Recommended Posts

కలహమెందుకు.. కలిసుందాం!
22-03-2018 02:36:43
 
636572830030391354.jpg
  • రంగంలోకి కేంద్ర కీలక మంత్రి
  • నిధులివ్వడంలో జాప్యం నిజమే
  • ప్యాకేజీ సహాయం పూర్తి చేస్తాం
  • పోలవరానికి 1400 కోట్లు ఇచ్చాం
  • మీ పార్టీతో ఇతర విభేదాలేవీ లేవు
  • ఇంకా దూరం పెంచుకోవద్దు!
  • కేంద్ర మంత్రి రాజీ ప్రతిపాదన
  • సీఎంకు వివరించిన టీడీపీ ఎంపీలు
  • నాలుగేళ్లుగా మాటలే చెప్పారు
  • హోదాపై ప్రకటన చేయమనండి
  • విభజన హామీలపై స్పష్టత కావాలి
  • అప్పుడే స్వాగతిస్తామన్న సీఎం
 
ఎన్డీయే నుంచి టీడీపీ నిష్క్రమణను తొలుత ‘లైట్‌’గా తీసుకున్న బీజేపీ వైఖరిలో కాస్త మార్పు కనిపిస్తోంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని.. దూరం పెంచుకోవద్దని టీడీపీ ఎంపీలను బుజ్జగించే ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే హోదా ఇస్తున్నట్లు ప్రకటించి, విభజన హామీలన్నీ నెరవేరిస్తేనే స్వాగతిస్తామని, రాజీ ప్రసక్తే లేదని టీడీపీ తేల్చి చెప్పినట్లు తెలిసింది.
 
 
ఎన్డీయేకు కటీఫ్‌ చెప్పిన టీడీపీపై బీజేపీ వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మంత్రి ఒకరు మంగళవారం టీడీపీ ఎంపీల్లో కొందరితో మాట్లాడారు. ‘‘టీడీపీని దూరం చేసుకోవాలని మాకు లేదు. మమ్మల్ని శత్రువుగా చూడవద్దు. రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఆ సమస్య పరిష్కరిస్తాం. హోదాకు సమానమైన ప్రయోజనాలతో ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఇవ్వాల్సిన నిధులు కూడా ఇస్తాం.
 
దీనివల్ల మీ రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది’’ అని ఆయన వివరించారు. పరిస్థితి ఇక్కడిదాకా తెచ్చుకోకుండా ఉంటే బాగుండేదని ఆ కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘టీడీపీతో మాకు ఇతరత్రా విభేదాలు ఏవీ లేవు. మీకు కూడా వేరే కారణాలు ఉన్నాయని మేం అనుకోవడం లేదు. కేంద్రంలో మీ మంత్రుల రాజీనామాకు ముందు ప్రధాని మీ ముఖ్యమంత్రికి ఫోన్‌ చేసి చర్చలకు రావాలని కోరారు. వస్తే బాగుండేది. ఇప్పటికైనా మీరు చొరవ తీసుకొని మాట్లాడండి’’ అని ఆయన వారిని కోరారు. వాతావరణం బాగుండాలనే ఉద్దేశంతోనే నాబార్డ్‌ నుంచి పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన రూ.1400 కోట్లు కూడా తాజాగా మంజూరు చేయించామని, అర్థం చేసుకోవాలని ఆయన వారితో అన్నారు.
 
ఆ పని ముందే చేసి ఉంటే...
నాలుగేళ్లు చూసీచూసీ విసిగిపోయిన తర్వాతే తాము కేంద్ర మంత్రివర్గం నుంచి, ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని టీడీపీ ఎంపీలు సదరు కేంద్ర మంత్రికి చెప్పారు. ఇచ్చే నిధులేవో ముందే ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదని అన్నారు. ‘‘జైట్లీ విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్రానికి ఇక ఇచ్చేదేమీ లేదన్నట్లుగా మాట్లాడటం వల్లే వాతావరణం చెడిపోయింది. మా మంత్రులు రాజీనామా చేశారు. ప్రధానిని మా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసి మాట్లాడినా ఫలితం లేకపోయింది. మా కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మర్నాడు ప్రధాని ఫోన్‌ చేసి మాట్లాడారు. అప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది’’ అని వారు వివరించారు. ఈ విషయాలను ఎంపీలు బుధవారం తమ పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించారు. ‘‘ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పారు. వారికి సమయం ఇవ్వాలని మనం ఎంతో సహనంతో నాలుగేళ్లు ఎదురు చూశాం. ఇంకా అవే మాటలు చెబితే ఎలా? హోదా ఇవ్వడానికి ముందుకు వచ్చి ప్రకటన చేయమనండి. విభజన హామీలన్నీ నెరవేర్చమనండి. స్వాగతిద్దాం. అది తప్ప మరో మాట లేదు. అదే మన వైఖరి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
 
అంతకు ముందు ఇలా...
మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్‌ మంత్రి కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో తమ పార్టీ అధిష్ఠాన ప్రముఖుడిని కలిశారు. టీడీపీని వదులుకోవడం తప్పని, నమ్మకంగా ఉన్న మిత్రపక్షాన్ని దూరం చేసుకోవడంపై పార్టీలో కూడా అసంతృప్తి ఉందని ఆయనతో అన్నారు. అయితే... ఇందులో తమ తప్పేమీ లేదని బీజేపీ ప్రముఖుడు స్పందించారు. ‘‘మనం ఊహించనంత వేగంగా ఆ పార్టీ మనకు దూరం అయింది. అంత వేగంగా నిర్ణయాలు తీసుకొంటారని అనుకోలేదు. ఏదైనా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మీకు ఏవైనా మార్గం ఉంటే మాట్లాడండి’’ అని సూచించారు. దీంతో... సదరు మంత్రి ఏపీలో తనకు బాగా పరిచయం ఉన్న టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేశారు. చంద్రబాబుతో తాను మాట్లాడదామని అనుకొంటున్నానని అన్నారు. అయితే, ఈ అంశం చాలా దూరం వెళ్లిపోయిందని, ఇప్పుడు ఈ స్థాయిలో మాట్లాడటం సాధ్యం కాదని ఆయన తేల్చేశారు.
Link to comment
Share on other sites

26 minutes ago, Gunner said:

Intha jatigaka bjp-tdp coalition ante noti tho kadu inko danitho navvutaru..

Good or bad bjp tho kalavakudadu ika...

Spl status vasthe enthuku navvutharu? Tdp pressure succeeded ane vasthundhi ga 

Link to comment
Share on other sites

28 minutes ago, Kiran said:

Spl status vasthe enthuku navvutharu? Tdp pressure succeeded ane vasthundhi ga 

@Kiran Bro - icchey vaallu ayithey Minsiters resign cheseyyy daaka ivvakundaa vundaru nee B0di an Shaw batch - NDA nundi velthaam anna rojeyy maatlaadeyy vaallu - NCM pettina rojannaa maatlaadeyyy vallu - intha egoistic fellows istheyyy desam talla kindulu avvadaa

 

Definitely, they will not give anything till they see final figures in 2019 - if luck favors us INC gains momentum and BJP stops before the magic figure without any friends to go in their friendship.

 

Link to comment
Share on other sites

intha kutra jaruguthoooo - inni chestooo - TG state nundi raavalsina Schedule 9 and 10 and mana valla Taxes matter meda decision theesko kundaa anni rakaala ibbandi peduthuntey inka venakki thaggitheyy - political suicide to TDP

Link to comment
Share on other sites

Ilanti article rayadam Adi nijam ani aniukodam , BJP thaggindi ani manam anukodadam. Enthaima ee vidhya lo RK aritheradu . Kakapothe janam kuda ippudu  original Veedi veshalo anukuntunnaru 

 

Monneppudo Rajnath, jetly, Modi missed calls emayyayi thirigi and chesara Leda Inka.

Link to comment
Share on other sites

itlu mee Budankai.. 

ఏపీకి చాలా ఇచ్చాం
ఏ కేంద్ర ప్రభుత్వమూ ఇన్ని నిధులివ్వలేదు
రాష్ట్ర ప్రజలకు ప్రతి పైసాకూ లెక్క చెబుతాం
చంద్రబాబు కావాలనే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లారు
అవిశ్వాసానికి భయపడటంలేదు
టైమ్స్‌ నౌ ముఖాముఖీలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా
21ap-main3a.jpg
ఈనాడు, దిల్లీ: విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తగిన న్యాయం చేసేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గట్టిప్రయత్నమే చేసిందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. ఆ రాష్ట్రానికి గత నాలుగేళ్లలో ఇచ్చినన్ని నిధులను సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఏ కేంద్ర ప్రభుత్వమూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి పైసాకూ లెక్క చెబుతామని బుధవారం ‘టైమ్స్‌ నౌ’ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్డీయే నుంచి చంద్రబాబును తాము వెళ్లగొట్టలేదని, ఆయనే బయటకు వెళ్లారని వ్యాఖ్యానించారు. కూటమిలో ఇంకా 30 పార్టీలున్నాయని, ఎన్డీయే ఏ మాత్రం బలహీనపడలేదని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ 300కు పైగా స్థానాలతో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. చంద్రబాబు వెళ్లటం వల్ల భాజపా దక్షిణాది కలలకు ఆటంకం కలిగిందా అన్న ప్రశ్నకు అమిత్‌ షా సమాధానమిస్తూ...అక్కడ ఇంకా బలపడవచ్చేమో అన్నారు. మిత్రపక్షాలు ఎవరినీ తాము బయటకు పంపాలని అనుకోలేదని, చంద్రబాబు వెళ్లాలనుకున్నప్పుడు ఎలా ఆపగలమని వ్యాఖ్యానించారు. ‘‘మిత్రపక్షాలు రెచ్చిపోవటం మంచిది కాదన్నది మా భావన. కానీ వారే వెళ్లిపోతే మేం ఏమి చేయగలం. మాకు ఏపీలో ఇప్పుడు రెండు సీట్లే ఉన్నాయి. భవిష్యత్తులో పెరగవచ్చేమో. కాంగ్రెస్‌ మాదిరిగా.. అవసరాలకు తగ్గట్లు మేము వ్యవహారాలు నడపలేదు. మాకు కేంద్రంలోనూ, యూపీలోనూ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మిత్రపక్షాలను ప్రభుత్వాలలో చేర్చుకుని వారికి గౌరవాన్ని ఇచ్చాం. అవిశ్వాసానికి మేం భయపడటంలేదు. ఎన్డీయేకు 300 మంది బలం ఉంది. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. భాజపా ఎంపీలు ఎవరూ సభామధ్యంలోకి వెళ్లి సభను అడ్డుకోవటం లేదు. తొలి వారం కాంగ్రెస్‌, ఆ తర్వాత  తెదేపా, ఇప్పుడు ఏఐఏడీఎంకే, తెరాస సభ్యులు సభామధ్యంలోకి వెళ్లి ఆందోళన చేస్తున్నారు. నియమానుసారం చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుటికే విషయాన్ని రాజ్‌నాథ్‌సింగ్‌, రవిశంకర్‌ప్రసాద్‌, అనంత్‌కుమార్‌లు ఉభయ సభల్లో ప్రకటించారు. చర్చ జరగాలని, ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నదే మా ఉద్దేశం. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావటానికి ముందే జైట్లీ, రాజ్‌నాథ్‌లు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలు మాట్లాడిన ప్రతి అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. కానీ, విపక్షాలే సభను అడ్డుకుంటున్నాయి’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.
 

ముఖ్యాంశాలు

 
Link to comment
Share on other sites

for your kind info, dheenikee bjp ki em sambandham ledhu..
 
ఏపీకి సహకరించాల్సిన అవసరం లేదు
22-03-2018 02:23:24
 
636572897086648135.jpg
  • బీజేపీ సర్కారును కూల్చే ఉద్దేశం లేదు
  • అన్నాడీఎంకే అధికార పత్రిక కథనం
 
చెన్నై, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): బీజేపీతో ‘బంధం’పై అన్నాడీఎంకే అధికార పత్రిక ‘నమదు అమ్మ’ కుండబద్దలు కొట్టింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం అన్నాడీఎంకేకి లేశమాత్రమైనా లేదని స్పష్టం చేసింది. ఏపీ హక్కుల సాధనకు, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు మనమెందుకు సహకరించాలని ప్రశ్నించింది. లోక్‌సభ వేదికగా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని, ఏ పార్టీకీ వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంలేదని పేర్కొంది. ‘ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన టీడీపీ మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మనమెందుకు మద్దతు ఇవ్వాలి? ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిన పక్షంలో మన రాష్ట్రానికి ఎంతో హాని జరుగుతుంది. జయలలిత కూడా ఇదే చెప్పేవారు’ అని ‘నమదు అమ్మ’ పత్రిక పేర్కొంది.
Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిన పక్షంలో మన రాష్ట్రానికి ఎంతో హాని జరుగుతుంది.

@AnnaGaru and calling other DB brothers - why should we give water to TN and Chennai from Telugu Ganga - why can’t we stop it abruptly and quote this as a reason?? 

 

Chettha L K donga naa k0 lu - eee Sambar L K gaallu - appudu chennai ivva kundaa manalni munchi then gaaru ippudu support ivvaalsina daani ki koodaa ivvadam ledu

Link to comment
Share on other sites

6 minutes ago, DVSDev said:

@AnnaGaru and calling other DB brothers - why should we give water to TN and Chennai from Telugu Ganga - why can’t we stop it abruptly and quote this as a reason?? 

 

Chettha L K donga naa k0 lu - eee Sambar L K gaallu - appudu chennai ivva kundaa manalni munchi then gaaru ippudu support ivvaalsina daani ki koodaa ivvadam ledu

South states ki aa states thone planned ga stopping

Link to comment
Share on other sites

13 minutes ago, sreentr said:

South states ki aa states thone planned ga stopping

danam (sahayam) ichchina daanni tirigi aasincha kuudadu le bro. gurthu vunchukovatam marchi povatam TN vaalla vishayam.

thalupulu muusi Parliament lo chesina vibhajana lo desam moththaaniki vaataa vundhi, aa quota lo meda meedha katti pettainaa demand cheyyocchu

Link to comment
Share on other sites

AP ki SS iste, TN ki debba padiddi. no doubt. AIADMK ki nijamga vere agenda lekapothe, sabha ni jaraganicchi, NCM accept chesina taruvatha, voting vacchinappudu "NO" vote veyyocchu kada. 

ee drama oka political party compulsions valana jarugutundi. I don't think majority Tambis support this behavior. even if they do, stopping drinking water may not be a good idea in the long run. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...