Jump to content

selfie star vs real actions.Real actions get unnoticed than selfies


AnnaGaru

Recommended Posts

selfie star: Siddipeta vasi chanipoyi papam week datina selfie star ki time dorakala

 

real actions: APNRT&AP govt done hardwork and arranged 3000 peoplebatch-1  safe return from KUWAIT...Till they reached here AP govt provided shelter and food
as they will be arrested if they step out.

 

So ippudu confused star marks istaru......AP ki 2.5 Kachara 6...

 

21cd499e-78e5-44d9-bc9d-4371b191a6fc

 

 

 

DXmLLhYU8AAjgEe.jpg

 

DXmLLhtVMAAwOjO.jpg

 

 

 

 

Corruption ante cheppu debba anna dora ippudu koduku ni emi chestadu??

 

 

 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

innalu local media bajana chesina Mission kakatiya partisti

DZg8B9nVwAABgTG.jpg

vs

Andhra pradesh 30% share in whole India in Farm ponds(confirmed  by Delhi after 3 inspections specially for AP)

MNREGA center dabbulatho pani kanichadu CBN....andule A2,Subbareddy deni meda padi edcharu..

 

T is 1/10th of Andhra pradesh....PK ippudu marks vestaru ippudu..

 

:clickhere: see the graph provided by GOvt of India and then decide ......Andhra :dance2:

https://community.data.gov.in/top-10-states-in-farm-ponds-construction-target-under-mgnrega-during-2016-17/

 

 

9.gif~c200

Link to comment
Share on other sites

ప్రవాసాంధ్రులకు భరోసా
30-03-2018 14:44:48
 
636580180499190587.jpg
  • అమలులో బీమా పథకం
  • ఒకటి నుంచి కొత్త పింఛన్లు
  • డీఆర్‌డీఏ పీడీ
 
నెల్లూరు: ప్రవాసాంధ్ర ఉద్యోగు లకు, విద్యార్థులకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని డీఆర్‌డీఏ పీడీ బీ.లావణ్యవేణి చెప్పారు. డీఆర్‌డీఏ కార్యాలయంలో గురువారం ఆమె విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి విదేశాలకు ఉపాధి కోసం వెళ్లిన ఉద్యోగులు, ఉన్నత ఉద్యోగం చేస్తున్న విద్యార్థులు అనుకోకుండా ప్రమాదాలకు లోనైనప్పుడు వారి ఉపాధికి ఆటంకం కలగకుండా ఈ పథకం ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ పథకంపై అవగాహన కల్పించి, అర్హులైన వారి వివరాలను సేకరించి ప్రీమియం వసూలు చేస్తామన్నారు. ప్రవాసాంధ్ర ఉద్యోగులు 3 సంవత్సరాలకు రూ.150ల ప్రీమి యం చెల్లించాలన్నారు. విదేశాలలో జీవనోపాధుల కోసం ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసాంధ్ర ఉద్యోగులు ఈ పథకంలో చేరడానికి అర్హులన్నారు. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలన్నారు.
 
ఉద్యోగులకు బీమా కాల పరిమితి 3 సంవత్సరాలని తెలిపారు. మూడేళ్ల తరువాత రెన్యువల్‌ చేసుకోవాలన్నారు. బీమా చేయించుకొన్న వారి సహజ మర ణానికి బీమా వర్తించదని తెలిపారు. ప్రమాద మరణం జరిగి, శాశ్వత అంగవైకల్యం కలిగి విదేశాలలో ఉద్యోగం కోల్పోతే రూ.10 లక్షల బీమా పరిహారం చెల్లిస్తారన్నారు. ఉద్యోగి మహి ళ అయితే, బీమా చేయబడిన మహిళా ప్రవాసాంరఽధురాలికి బీమా కాలపరిమితిలో సాధారణ ప్రసూతి ఖర్చుల కింద రూ.35వేలు, సిజేరియన్‌ ఖర్చుల కింద రూ.50లు చెల్లిస్తార న్నారు. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా బీమా కాలపరిమితిలో సంవత్స రానికి రూ.50వేలు వైద్యశాల ఖర్చుల కింద కుటుంబసభ్యులకు చెల్లిస్తారన్నారు. ఉద్యోగ సమయంలో కంపెనీ యాజమాన్యంతో ఏదైనా సమస్యలు తలెత్త్తితే ఆ సమస్యల పరిష్కారానికి అయ్యే న్యాయ పరిష్కార ఖర్చుల కింద రూ.45 వేలు చెల్లిస్తారన్నారు.
 
విద్యార్థులకు..
విద్యార్థులకు బీమా ఒక సంవత్సర కాలం అందుబాటులో ఉంటుందన్నారు. సంవత్సరం తరువాత రెన్యూవల్‌ చేసుకో వచ్చని అన్నారు. సంవత్సరానికి రూ.75ల ప్రీమియం చెల్లించాలన్నారు. ఈ పథకం కింద సహజ మరణానికి బీమా వర్తించదన్నారు. ప్రమాద మరణం జరిగి, శాశ్వత అంగవైక ల్యం కలిగితే రూ. 10 లక్షలు చెల్లిస్తారన్నారు. ప్రమాదం వలన సంభవించే గాయాలకు వైద్యశాల ఖర్చులకు రూ. లక్ష చెల్లిస్తారన్నారు.
 
1 నుంచి కొత్త పింఛన్లు
జిల్లాకు మంజూరైన కొత్త పింఛన్ల పంపిణీకి అనుమతులు వచ్చాయని, ఈ పింఛన్లను ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు. విలేఖరుల సమావేశంలో డీఆర్‌డీఏ సామాజిక భద్రతా విభాగం డీపీఎం శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
జిల్లాకు ప్రథమస్థానం
చంద్రన్న బీమా స్కాలర్స్‌ షిప్స్‌ నమోదులో జిల్లాకు ప్రథమస్థానం లభించిందని లావణ్యవేణి చెప్పారు.
Link to comment
Share on other sites

ప్రవాసాంధ్రా.. అందుకో భరోసా!
ఉద్యోగం, విద్యాభ్యాసం చేసేవారికి అవకాశం
విదేశాల్లో ఉన్నవారి కోసం రాష్ట్ర ప్రభుత్వ పథకం
స్వల్ప ప్రీమియంతో సరికొత్త బీమా పథకం
kri-sty1a.jpg

ఉద్యోగం, విద్యాభ్యాసం నిమిత్తం స్వదేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లి  అనుకోకుండా ప్రమాదాలకు గురై మరణించినా, శాశ్వత అంగవైకల్యం పాలైనా, అక్కడ ఉపాధికి ఆటంకం ఏర్పడినా ఆ బాధితుడికి, ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ప్రవాసాంధ్ర భరోసా పేరిట బీమా పథకాన్ని ప్రారంభించింది. చంద్రన్న బీమా రీతిలో ఈ పథకాన్ని అమలు చేయటానికి ఏర్పాట్లు చేశారు. వార్షిక ఆదాయంతో నిమిత్తం లేకుండా.. తెల్లరేషన్‌ కార్డుతో పనిలేకుండా.. విదేశాల్లో ఉన్నవారందరికి ఈ పథకం వర్తింపజేసేందుకు సన్నాహాలు చేశారు.

 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి చాలామంది ఇతర దేశాలకు ఉద్యోగం, విద్యాభ్యాసం, ఉపాధి కోసం వెళుతున్నారు. అక్కడ జరుగుతున్న ప్రమాదాలు, ఇతర అనుకోని సంఘటనల వల్ల ప్రాణాలు కోల్పోతున్న, అంగవైకల్యానికి గురవుతున్నవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించనుంది. ఇందుకు సంబంధిత వ్యక్తుల కుటుంబాల నుంచి విదేశాల్లో ఉన్న ఆంధ్రుల వివరాలు సేకరించాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో మెప్మా సిబ్బంది ఈ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. విదేశాల్లో సహజ మరణానికి        ఈ పథకం వర్తించదు.

kri-sty1b.jpg

ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లినవారికి..
* 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి.
* ఈసీఆర్‌ (ఇమిగ్రేషన్‌ చెక్‌ రిక్వైర్డు), ఈసీఎన్‌ఆర్‌ (ఇమిగ్రేషన్‌ చెక్‌ నాట్‌ రిక్వైర్డు) దేశాల్లో జీవనోపాధికి ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసాôధ్రులు అర్హులు.
* ఉద్యోగులకు బీమా పరిమితి మూడేళ్లు ఉంటుంది. తరువాత పునరుద్ధరించుకోవచ్చు.
* మూడేళ్లకు రూ.150 ప్రీమియం చెల్లించాలి.

kri-sty1c.jpg

విద్య, నైపుణ్య మెరుగుదలకు వెళితే..
* 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి.
* విదేశాల్లో చదవడానికి, ఏరకమైన నైపుణ్య పెంపుదలకు వెళ్లినా అర్హులే.
* ఏడాదికి రూ.75 ప్రీమియం చెల్లించాలి.
* బీమా ఏడాది పాటు అమల్లº ఉంటుంది. తరువాత పునరుద్ధరించుకోవాలి.

kri-sty1d.jpg

నమోదుకు ఇవి అవసరం..
*  బీమా చేసే వ్యక్తి స్వదేశ, విదేశ చిరునామా ధ్రువీకరణ పత్రాలు
*  ఎన్‌ఆర్‌ఐ హోదా ధ్రువీకరణ పత్రం
*  విదేశీ డ్రైవింగ్‌ లైసెన్సు
*  విదేశీ పాసుపోర్టు
*  ఇండియన్‌ పాస్‌పోర్టు, వీసా
*  విదేశాల్లో పనిచేస్తున్న సంస్థ పేరు, చిరునామా, యజమాని వివరాలు
*  విద్యార్థి వివరాలు సమర్పించాలి.

విద్యార్థులకు ప్రయోజనాలివీ
‌*  ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా రూ.10 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తారు.
*  ప్రమాదంలో సంభవించే గాయాలు, అస్వస్థత చికిత్సకు ఆసుపత్రి ఖర్చు కింద రూ.లక్ష చెల్లిస్తారు.
*  ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైక్యం పొందినా ఒక సహాయకుడితో స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాధారణ విమాన ఛార్జీలు చెల్లిస్తారు.
*  బీమా చేసిన విద్యార్థి ప్రమాదానికి గురై విద్య కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తిస్తే ఆ వ్యక్తి, ఒక సహాయకుడితో స్వదేశానికి వచ్చేందుకు సాధారణ విమాన ఛార్జీలు చెల్లిస్తారు.

ఉద్యోగులకు ఉపయుక్తమిలా..
*  ప్రమాదంలో మరణం సంభవించినా, శాశ్వత అంగవైకల్యం పొంది ఉద్యోగం, ఉపాధి కోల్పోతే రూ.10 లక్షల బీమా పరిహారం అందుతుంది.
*  ప్రమాదంలో మరణించిన వ్యక్తి పార్థివ దేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి, అంగవైకల్యం పొందిన వ్యక్తిని తీసుకురావడానికి సాధారణ విమాన ఛార్జీలు అందిస్తారు. ఒక వ్యక్తిని సహాయంగా ఇచ్చి పంపుతారు. సహాయకుని విమాన ఛార్జీలు చెల్లిస్తారు.
* బీమా చేయించుకున్న వ్యక్తి అస్వస్థతకు గురై ఉద్యోగం చేయడానికి అనర్హుడిగా గుర్తిస్తే ఆ వ్యక్తి, ఒక సహాయకుడికి స్వదేశానికి వచ్చేందుకు సాధారణ విమాన ఛార్జీలు చెల్లిస్తారు.
*  ప్రమాదంలో గాయపడినా, అస్వస్థతకు గురైనా చికిత్స నిమిత్తం ఆసుపత్రి ఖర్చుల కింద రూ.లక్ష చెల్లిస్తారు.
*  భారత విమానాశ్రయం నుంచి స్వస్థలం చేరడానికి అంబులెన్స్‌ సౌకర్యం  కల్పిస్తారు.
*  మహిళలకు సాధారణ ప్రసూతి ఖర్చు కింద రూ.35 వేలు, శస్త్రచికిత్స జరిగితే రూ.50 వేలు చెల్లిస్తారు.

*  బీమా చేసిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా బీమా కాలపరిమితిలో సంవత్సరానికి రూ.50 వేలు చొప్పున కుటుంబసభ్యులకు చెల్లిస్తారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...