Jump to content

అవిశ్వాసంపై ఓటింగ్‌లో ఎంపీలు డుమ్మా? అందుకే తీర్మానంపై చర్చకు వెనుకంజ


vinayak

Recommended Posts

బీజేపీలో లుకలుకలు!
20-03-2018 02:22:50
 
636571093694647250.jpg
  • అవిశ్వాసంపై ఓటింగ్‌లో ఎంపీలు డుమ్మా?
  • అందుకే తీర్మానంపై చర్చకు వెనుకంజ
  • చర్చకు అంగీకరిద్దామన్న రాజ్‌నాథ్‌
  • ఈ వారంలోనే సభ నిరవధిక వాయిదా?
న్యూఢిల్లీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): బీజేపీలో అంతర్గతంగా లుకలుకలు చెలరేగినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగితే కమలదళం సభ్యులే ఎంతమంది హాజరవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అవిశ్వాస తీర్మానం నెగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రధాన కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై లెక్కలు తీశారు. దీని ప్రకారం 302 మంది మద్దతు తమకు లభిస్తుందని అంచనాకు వచ్చారు. అంతర్గత వర్గాల కథనం ప్రకారం.. ఎన్డీఏలోని మిత్రపక్షాలు, అన్నాడీఎంకే తదితర పార్టీల సంగతి అటుంచితే అసలు బీజేపీ ఎంపీల్లోనే ఎంతమంది ఓటింగ్‌కు హాజరవుతారన్న భయం పార్టీ పెద్దల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది.
 
 
ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా వైఖరి నచ్చని అనేక మంది సభ్యులు గైర్హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల త్రిపురలో బీజేపీ అగ్రనేత ఆడ్వాణీని మోదీ అవమానించిన తీరు చాలా మంది పార్టీ ఎంపీల మనసు గాయపరిచింది. పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు పూర్తి సంఖ్యలో ఎంపీలు రాకపోవడం.. విప్‌ జారీ చేసినా ఉభయసభల్లో ట్రెజరీ బెంచీలు ఖాళీగా కనపడడం పార్టీ అగ్ర నేతలను కలవరపరుస్తోంది.
 
 
అవిశ్వాస పరీక్షకు అంగీకరించడమో లేదా విశ్వాస పరీక్షను ఎదుర్కోవడమో చేయాలనే హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సూచనకు మోదీ, అమిత్‌ షా అంగీకరించడం లేదని తెలిసింది. చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి పలు అంశాలు బయటకు వస్తాయని, అది కర్ణాటక ఎన్నికల్లో తమకు నష్టం చేకూరుస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకంటే ఈ వారంలోనే పార్లమెంటు ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేయడం మంచిదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

నా చావుకు నోట్లరద్దు, జీఎస్టీలే కారణం!
20-03-2018 04:20:38
 
  • సోషల్‌ మీడియాలో శివసేన కార్యకర్త ‘చివరి’ పోస్ట్‌
ముంబై, మార్చి 19: నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగానే తనువు చాలిస్తున్నానంటూ శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడడం మహారాష్ట్ర అసెంబ్లీలో కలకలం సృష్టించింది. ప్రధాన ప్రతిపక్ష(కాంగ్రెస్‌) నేత రాధాకృష్ణ విఖే పాటిల్‌ ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. ఎన్డీయే సర్కారు తీసుకున్న ఇలాంటి నిర్ణయాల వల్ల అమాయకులు బలవుతున్నా ఎందుకు స్పందించడం లేదని ఆయన ఉద్ధవ్‌ ఠాక్రేను నిలదీశారు. ‘‘కరద్‌ జిల్లాకు చెందిన శివసేన కార్యకర్త రాహుల్‌ ఫలాకే ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడాడు. తన బలవన్మరణానికి గల కారణాలను ఆయన చివరిసారిగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. తన చావుకు నోట్ల రద్దు, జీఎస్టీలే కారణమని పేర్కొన్నాడు’’ అని పాటిల్‌ సోమవారం శాసనసభలో తెలిపారు. తాజాగా మిత్రపక్షాలే ఎన్డీయే సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాయని.. అయినా శివసేన కేంద్రానికి ఎందుకు మద్దతిస్తోందని ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

మోదీ లేని భారత్‌ రావాలి
20-03-2018 03:28:02
 
636571132817273238.jpg
‘‘ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలతో దేశం విసిగిపోయింది. అందుకే 2019 ఎన్నికల్లో మోదీ లేని భారత్‌(మోదీ ముక్త్‌ భారత్‌) రావాలి. దానికోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి.’’
 
- రాజ్‌ ఠాక్రే, ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌
Link to comment
Share on other sites

మళ్లీ అదే సీన్‌!
20-03-2018 03:20:46
 
636571128458522546.jpg
  • చర్చకు రాని అవిశ్వాస తీర్మానాలు
  • అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ నిరసనలు
  • కేంద్రానికి కలిసొచ్చిన ‘ఆందోళన’
  • వందమందికి పైగా మద్దతున్నా వృథా
  • పరిగణనలోకి తీసుకోవాలని
  • టీడీపీ, వైసీపీ, విపక్షాల విన్నపం
  • ఎవరు ఎటువైపో తెలియడంలేదన్న స్పీకర్‌
  • నోటీసులను పక్కన పెట్టేసిన సుమిత్ర
  • మరోమారు నోటీసులిచ్చిన టీడీపీ, వైసీపీ
న్యూఢిల్లీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అనుకున్నదే జరిగింది! అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో శుక్రవారం నాటి దృశ్యం పునరావృతమైంది. తెలుగుదేశం, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టేందుకు అవసరమైనదానికంటే ఎక్కువ మద్దతు ఉన్నప్పటికీ, అవి మరోసారి ‘గందరగోళం’లో కలిసిపోయాయి. వాటిని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పరిగణనలోకి తీసుకోలేదు. శుక్రవారం అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన నేపథ్యంలో... సభ సవ్యంగా లేదంటూ అవిశ్వాస తీర్మాన నోటీసులను స్పీకర్‌ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ లోక్‌సభా పక్ష నేత తోట నరసింహం, గల్లా జయదేవ్‌తోపాటు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేర్వేరుగా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు.
 
 
సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ప్రత్యేక హోదా, ఇతర సమస్యలపై టీడీపీ, వైసీపీ ఎంపీలు, రిజర్వేషన్లపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్‌ సభ్యులు, కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుపై అన్నా డీఎంకే ఎంపీలు నిరసనకు దిగారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దీంతో... సభ మొదలైన 20 క్షణాల్లోనే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగింది. సభ్యులు ఎటువంటి చర్చ కోరుకున్నా ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవిశ్వాసంపైనా చర్చకు సిద్ధమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సభలో ప్రకటించారు. దీంతో... అవిశ్వాస తీర్మానంపై నోటీసులను పరిగణనలోకి తీసుకోవడం ఖాయమని అంతా భావించారు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటన చేశారు.
 
 
‘‘కేంద్ర మంత్రి మండలిపై తమకు విశ్వాసం లేదని టీడీపీ ఎంపీలు ఎంపీ తోట నరసింహం, గల్లాజయదేవ్‌, వైసీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నుంచి నోటీసులు అందాయి. ఈ విషయం సభ తెలియజేయడం నా బాధ్యత. హౌస్‌ ఆర్డర్‌లో ఉంటే దీనికి మద్దతుగా వారి స్థానాల్లో నిలబడే 50 మంది సభ్యులను నేను లెక్కించగలను. అప్పుడే తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించగలను’ అంటూ రూలింగ్‌ ఇచ్చారు. అంతే... అన్నా డీఎంకే సభ్యులు అత్యంత నాటకీయంగా తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. ‘ఊ...ఊ...’ అంటో నోటితో వింత శబ్దాలు కూడా చేశారు. ప్లకార్డులను మరింత జోరుగా ప్రదర్శించారు. మరోవైపు... అవిశ్వాసానికి మద్దతుగా కాంగ్రెస్‌, తృణమూల్‌, ఎస్పీ, ఆర్జేడీ, ఆప్‌, ఎంఐఎం, ఎన్సీపీ, జేడీఎస్‌, బీజేడీ, వామపక్షాల ఎంపీలు తమతమ స్థానాలలో లేచి నిల్చున్నారు.
 
 
అయితే, వెల్‌లో అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులు ఉండటంవల్ల అవిశ్వాసానికి ఎవరు మద్దతు ఇస్తున్నారో కనిపించడం లేదని స్పీకర్‌ పేర్కొన్నారు. వెంటనే టీడీపీ, వైసీపీతోపాటు ఇతర విపక్ష ఎంపీలంతా మద్దతుగా ఉన్నామంటూ చేతులుకూడా పైకెత్తారు. వెల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులు కూడా చేతులెత్తి ఆందోళన చేశారు. దీంతో ఎవరు నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఎవరు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిల్చున్నారో తనకు తెలియడంలేదని స్పీకర్‌ తేల్చేశారు. ‘సభ సవ్యంగా ఉంటేనే నోటీసులను పరిగణనలోకి తీసుకోగలను’ అని చెప్పారు.
 
విపక్ష సభ్యులు ‘మేమున్నాం’ అనేలా చేతులు పైకెత్తి, తీర్మానాన్ని స్వీకరించాలని స్పీకర్‌ను కోరారు. అయినప్పటికీ స్పీకర్‌ పట్టించుకోలేదు. సభను మంగళవారానికి వాయిదా వేశారు. వివిధ రాష్ట్రాల కొత్త సంవత్సరాల సందర్భంగా స్పీకర్‌ లోక్‌సభలో ఎంపీలకు సోమవారం విందు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోనందుకు నిరసనగా టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆ విందును బహిష్కరించారు. మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి స్పీకర్‌ కార్యాలయంలో విడివిడిగా నోటీసులు ఇచ్చారు.
 
 
ఏపీపై మహారాష్ట్ర ఎంపీ వాయిదా తీర్మానం
ఏపీకి హోదా అంశంపై మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌సతవ్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని అందజేశారు. ప్రత్యేక హోదా ప్రకటించాలన్న న్యాయమైన డిమాండ్‌పై కేంద్రం నుంచి స్పందన లేదని నోటీసులో పేర్కొన్నారు. పదేపదే ఇచ్చిన హామీలు, నిర్ణయాలను కేంద్రం విస్మరించిందని, దాంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తోసిపుచ్చారు.
Link to comment
Share on other sites

గొడవ పేరుతో తప్పించుకోలేరు
20-03-2018 02:27:59
 
  • లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ ఆచార్య
న్యూఢిల్లీ, మార్చి 19: సభ గందరగోళంగా ఉందన్న కారణంగా అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేయటం సరికాదని లోక్‌ సభ విశ్రాంత సెక్రటరీ జనరల్‌ పీడీటీ ఆచార్య అభిప్రాయపడ్డారు. రెండోరోజూ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోకుండా ‘‘సభ సుజావుగా లేనందున తీర్మానంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నాను’’ అంటూ వాయిదా వేయటంపై ఆయన పీటీఐతో మాట్లాడారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని మిగిలిన తీర్మానాలతో పోల్చలేమని అన్నారు. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ తీర్మానం గురించి సభ్యులకు స్పీకర్‌ తెలియచెప్పాల్సిందేనని చెప్పారు.
 
 
తీర్మానం నిబంధనల మేరకు ఉంటే చాలుననీ, స్పీకర్‌ ముందుకు వెళ్ళవచ్చని ఆయన వివరించారు. తీర్మానానికి మద్దతుగా 50 మంది సభ్యులుంటే చాలుననీ, తీర్మానంపై చర్చ తేదీని, సమయాన్ని నిర్ణయించే అధికారం స్పీకర్‌కు ఉంటుందని ఆయన వివరించారు. మరో విశ్రాంత సెక్రటరీ జనరల్‌ బాల్‌ శేఖర్‌ పీటీఐతో మాట్లాడుతూ, సభ గొడవగా ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం వంటి ముఖ్యమైన అంశాలను చేపట్టడంలో ఆచరణాత్మక ఇబ్బందులు ఉంటాయని వివరించారు.
 
 
తీర్మానానికి మద్దతుగా కొందరు, గొడవ చేస్తూ వెల్‌లో మరికొందరు ఉన్నప్పుడు లెక్కింపు ఇబ్బందికరంగా మారుతుందని శేఖర్‌ అభిప్రాయపడ్డారు. ఓటింగ్‌ లేకుండా కేవలం లెక్కింపునకు మాత్రమే పరిమితమయ్యే ఈ సందర్భంలో అలాంటి వాతావారణం మరికొన్ని వివాదాలకు కారణం అవుతుందన్నారు. నిలబడిన వారు తీర్మానానికి మద్దతుగా కాదని, నిరసన తెలుపుతున్నారని అనే అవకాశం ఉందని వివరించారు
Link to comment
Share on other sites

Just now, DVSDev said:

Modi Saab face lo Pretha kala vutti paduthundi gaa - looks something wrong just check - during election campaign and now

Peekoleka lakkoleka sastunnaru malli Amit gadu 2019 2024 2029 2034 lo meme antunnadu 6VLds7.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...