Jump to content

pittala dora


Recommended Posts

3 minutes ago, navayuvarathna said:

Mamathane oka iron ledy left kanchu kotani baddalu kottindi modini kooda lekka cheyyadu kcr gadu comedyki anthu panthu undadu :P

Inko comedy enti ante hemanth sorem maku support annadu,pakka roju congress tho alliance chesukunnaru :roflmao:

Link to comment
Share on other sites

http://archives.eenadu.net/03-21-2018/district/inner.aspx?dsname=Karimnagar&info=krn-sty1

 

ప్రత్యేక కథనాలు

గుక్కెడు నీళ్లు... మహాప్రభో 
krn-sty1a.jpg
గత రెండు వారాలుగా ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది... ట్యాంకర్ల ద్వారా తెప్పించుకోవడం, కొనుగోలు చేయడం, వ్యవసాయబావుల వద్దకు వెళ్లి తెచ్చుకోవడం, ఇలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి కోసం మహిళలు రోజూ ఎక్కడో ఓ చోట ధర్నాలు చేస్తున్నారు. మిషన్‌ భగీరథపై భారం వేయకుండా నీటి పథకాలపై, తాత్కాలిక ఏర్పాట్లపై అధికారయంత్రాంగ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నీటి సమస్యపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక ఫోకస్‌....
 -న్యూస్‌టుడే, యంత్రాంగం

హుజూరాబాద్‌లో నీటి తిప్పలు 
krn-sty1b.jpg
హుజూరాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ పట్టణంలోని విద్యానగర్‌కాలనీతో పాటు పలు కాలనీల్లో నీటి తిప్పలు చెప్పుకోలేని రీతిన ఉన్నాయి. కొన్ని కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా ఉదయం నుంచి ప్రయివేటు నీటి ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు తప్పటం లేదు. రెండు, మూడు నెలలుగా తాగునీటి సరఫరా కోసం మిషన్‌ భగీరథ భారీ పైపులైన్లను వేసే అభివృద్ధి పనిలో భాగంగా సంబంధిత గుత్తేదారులు నిమగ్నమయ్యారు. కాగా రోజువారిగా కుళాయిలకు నీరు సరఫరా జరిగే పైపులైనుకు సమీపంలో సదరు అభివృద్ధి పనుల పైపులను వేయడానికి గోతులు తీశారు. ఈ క్రమంలో కుళాయిలకు తాగునీటి సరఫరా జరిగే పైపులు కాస్త ధ్వంసమయ్యాయి. లీకేజీ జరిగితే ఒకటి, రెండ్రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశించిన ఆయా కాలనీలవాసులకు సుమారు 3, 4 నెలలకుపైగా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాలకు నగర పంచాయతీ వారు సరఫరా చేయకపోవడంతో ఏరోజుకారోజే నీటి అవసరాలను తీర్చుకునేందుకు నానా ఇబ్బందులపాలవుతున్నారు. దీంతో  డ్రమ్ముకు రూ.30 నుంచి రూ.50 చెల్లించి కొనుక్కుంటున్నారు.

తెల్లారితే చాలు..నీటి కోసం వేట! 
krn-sty1c.jpg
జమ్మికుంట, న్యూస్‌టుడే: తెల్లారితే చాలు నీటికి తంటాలు తప్పటం లేదు. ఎక్కడ నీరు దొరుకుతుందోనని ద్విచక‌్ర వాహనాలపై వెళ్లి ఆరా తీయటం..క్యాన్లు, బిందెలతో నీళ్ల కోసం గంటల తరబడి నిల్చొని నీళు పట్టుకుంటున్నారు. బోర్లు, బావులు, చివరకు నీటి సరఫరా చేసే వాల్వ్‌ల వద్ద నీటిని వృథా పోకుండా తెచ్చుకుంటున్నారు. అడుగంటిన బావులు, బోర్లు ఉన్నా, నీళ్లు సరిగా రాక తంటాలు పడుతున్నారు. వేసవి రాక ముందే నీటి తంటాలు ఆరంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో బోరు నీళ్లు మట్టితో కల్సి వస్తున్నాయి. పది లేదా పన్నెండు రోజుల కోసారి నీటి సరఫరా కావటంతో అవసరాలకు ప్రైవేట్‌ ట్యాంకర్ల ద్వారా నీటి కొంటున్నారు. ట్యాంకర్‌కు రూ.400 చొప్పున కొంటున్నారు. జమ్మికుంటకు 12కిలో మీటర్ల దూరంలోని మానేరు పరివాహక ప్రాంతం నుంచి తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. యాభై ఏళ్ల క్రితంవేసిన పైపులైన్‌ కాలం చెల్లడం, లీకేజీలు, పైపు పగటం వల్ల తరచుగా నీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. విలాసాగర్‌ సమీపం మానేరు ప్రాంతంలోని ఒక నాలుగు బావులు, మూడు బోర్ల నుంచి తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. తాజాగా బావుల్లో నీటి మట్టం తగ్గటంతో నీటి కష్టాలు మొదలయ్యాయి.

నాలుగు గ్రామాల్లో ఇబ్బందులు 
krn-sty1d.jpg
గంగాధర, న్యూస్‌టుడే: గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల్లో తాగు నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వేసవికి ముందు నుంచే నీటి కష్టాలు ప్రారంభం కాగా గ్రామపంచాయతీ రెండు నెలలుగా ట్యాంకర్లతో సరఫరా చేస్తోంది. నర్సింహులపల్లిలో రెండు రక్షిత నీటి బావులు, మర్రిగడ్డ, సర్వారెడ్డిపల్లి, పెండలోనిపల్లి, ముప్పిడిపల్లి గ్రామాల్లో ఒక్కో రక్షిత బావి ఉంది. అయితే ముప్పిడిపల్లి మినహా నాలుగు గ్రామాల్లోని బావుల్లో నీరు అడుగంటడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మర్రిగడ్డలో రెండు, నర్సింహులపల్లిలో మూడు ట్రిప్పుల ట్యాంకర్లతో నీటిని ప్రజలకు అందజేస్తున్నారు. సర్వారెడ్డిపల్లిలో వ్యవసాయ బావిని అద్దెకు తీసుకుని నీటిని అందజేస్తున్నామని సర్పంచి అమీనాభీ తెలిపారు. రాబోయే నాలుగు నెలల్లో సమస్య మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.

రాజన్నక్షేత్రంలో తీవ్ర నీటి ఎద్దడి
వేములవాడ, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ప్రతిరోజు ఆలయ అవసరాలకు సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. మరో వైపు భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ధర్మగుండంలోనూ పూర్తిస్థాయిలో నీరు లేక అసంతృప్తితో షవర్ల కింద స్నానం చేయాల్సి వస్తుంది. మరోవైపు భక్తులు బస చేసేందుకు ఆలయ వసతి గదులను నీటి సౌకర్యం లేకపోవడంతో పలుమార్లు కేటాయించడం లేదు. వేములవాడ పట్టణంలో గత రెండు నెలలుగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. పట్టణంలో 20 వార్డుల్లో దాదాపుగా నివాసాల్లోని 70 శాతం బోర్లు ఎండిపోవడంతో అవసరాలకు సరిపడా నీరందక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో నగర పంచాయతీ నుంచి 20ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశగంగ పథకంలో భాగంగా వార్డుల్లో ఉన్న 85 బోర్లల్లో ప్రస్తుతం 70 బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అవి సరిపోకపోవడంతో ప్రైవేట్‌గా ట్యాంకర్ల ద్వారా ప్రతి నిత్యం ఇంటి అవసరాలకు నీటి కొంటున్నారు.

నీటిని కొంటున్నారు... 
krn-sty1e.jpg
మెట్‌పల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఉదయం లేచినప్పటి నుంచి మెట్‌పల్లి పట్టణ ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడాల్సిన దుస్థితి వచ్చింది.  భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. రోజూ దూరప్రాంతాల నుంచి లేదా పాత బల్దియాలో ఉన్న నిరంతర కొళాయి నుంచి నీటిని సైకిళ్లు, మోటారు సైకిళ్లు, తోపుడు బండ్లపై తెచ్చుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలోని 8, 13, 14, 15 వార్డులు మఠంవాడ, శివాజీనగర్‌, సాయిరాం కాలనీ, ఇందిరానగర్‌, కాశీబాగు ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తూ డ్రమ్ముకు రూ.40 నుంచి రూ.50 వరకు చెల్లించి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రైవేటు ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తూనే ఉంటున్నారు. కొందరు మూడు లేదా నాలుగు డ్రమ్ములను ఇంటి ముందు ఉంచి నీటిని పట్టుకుంటున్నారు.  14, 15 వార్డుల్లో ఆయా కౌన్సిలర్లు తమ సొంత ఖర్చులతో రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలు ఉచితంగానే అందిస్తున్నారు. అయినా ప్రజలకు నీటి కష్టం తీరడం లేదు.  ఈవిషయంపై మెట్‌పల్లి బల్దియా కమిషనర్‌ అయాజ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ట్యాంకర్ల కోసం కౌన్సిల్‌ తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపామన్నారు. రెండు రోజుల్లో అనుమతులు వస్తాయని ఆ తర్వాత వచ్చే సోమవారం నుంచి బల్దియా ట్యాంకర్లతో ప్రజలకు నీటి కష్టాలు తీర్చుతామన్నారు.

పల్లెల్లో కష్టాలు మొదలు
సిరిసిల్లపట్టణం, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువ ప్రాంతంలో ఉంది. వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి ఎద్దడి కనిపిస్తుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న పథకాలు..ప్రణాళిక లోపంతో నీరుగారిపోతున్నాయి. ప్రతీ వేసవిలో పల్లెల్లో తాత్కాలికంగా తాగునీటి కోసం రూ.కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. శాశ్వత చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. సిరిసిల్లపట్టణంలోని ఇందిరానగర్‌, తారకరామానగర్‌, బీవైనగర్‌, సుందరయ్యనగర్‌, శివనగర్‌, నెహ్రూనగర్‌, జయప్రకాశ్‌నగర్‌, పద్మనగర్‌, తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మకాలనీ, చిన్నలింగాపూర్‌, రామన్నపల్లి,సారంపల్లి, ముస్తాబాద్‌ మండలంలోని తెర్లుమద్ది, సేవాలాల్‌తండా, బందనకల్‌ ఇల్లంతకుంట మండలంలోని చిక్కుడోనిపల్లి, రెడ్డివాడ, తెనుగువానిపల్లి, పత్తికుంటపల్లి, అనంతగిరిలో తాగునీటికి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. ప్రతీ నిత్యం నీటికోసం ప్రత్యేక సమయం కేటాయించాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు.

గంభీరావుపేటలో
గంభీరావుపేట: గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలోని 8వ వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉంది. వార్డులో రెండు బోర్లు ఉండగా వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రెండు బోర్లనుంచి చుక్క నీరు రావడం లేదు. దీంతో కాలనీ వాసులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 రోజుల నుంచి సమస్య తీవ్ర రూపం దాల్చటంతో సర్పంచి ఈరవేని వనిత ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చాలాచోట్ల బోరుబావులు వట్టిపోతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ట్యాంకర్లు పెట్టవద్దని వ్యవసాయ బావులను లీజుకు తీసుకొమ్మని చెబుతున్నారని సాగుకే నీరు సరిపోక పంటలు ఎండిపోతున్నాయని వ్యవసాయదారులు నీటిని ఇవ్వడానికి ముందుకు రావడం లేదని సర్పంచి ఈరవేని వనిత తెలిపారు.

పల్లెల్లో దాహం దాహం
వీర్నపల్లి, న్యూస్‌టుడే: వీర్నపల్లి మండలంలో ఏడు గ్రామాలుండగా దాదాపు అన్ని గ్రామాల్లోనూ తాగునీటి కటకట నెలకొంది. మండలకేంద్రంతోపాటు కంచర్ల, మద్దిమల్ల, రంగంపేట, అడవిపదిర, గర్జనపల్లి, వన్‌పల్లి గ్రామాలు.. వాటి పరిధిలోని గిరిజన తండాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. మంచినీటి వనరులు వట్టిపోతుండడంతో క్రమంగా సమస్య జఠిలమవుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గుక్కెడు నీటి కోసం జనం అల్లాడుతున్నారు. కరవు నేపథ్యంలో బావులు, గొట్టపు బావులు వెనక్కితగ్గడం వల్ల ట్యాంకులకు నీరందడం లేదు. కొన్ని గ్రామాల్లో మూడునాలుగు రోజులకోసారి నీటిని అందిస్తున్నారు. ప్రతి రోజు 500 నుంచి రెండు వేల లీటర్ల శుద్ధజలాన్ని అందించే కేంద్రాలు అన్ని గ్రామాల్లో ఉన్నా వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గర్జనపల్లి, వన్‌పల్లి తదితర కొన్ని గ్రామాల్లో ఇప్పటి నుంచే ట్యాంకర్లను వినియోగిస్తూ నీటిని సరఫరా చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తలాపునే గోదారి.. గొంతులు తడారి!
న్యూస్‌టుడే, ధర్మారం: పక్కనే గోదావరి పారుతున్నా ధర్మపురి నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఎల్లంపల్లి జలాశయంలో నిల్వ నీటితో ధర్మపురి వరకు నది నిండుకుండలా కళకళలాడుతున్నా ఎద్దడి షరామామూలుగా మారింది. చేదబావులు ఎండిపోవడంతో ఆరు మండలాల్లోని 129 పంచాయతీల పరిధిలో రక్షిత పథకాల ద్వారా సరఫరా చేస్తున్న నీటినే అన్ని అవసరాలకూ వాడుతున్నారు. ధర్మపురి పట్టణంలో చేదబావులన్నీ ఇప్పటికే ఎండిపోగా, రోళ్లవాగు పథకం ద్వారా అందిస్తున్న జలమే శరణ్యమైంది. ఇప్పటికే రెండు ట్యాంకులుండగా మరో ట్యాంకు నిర్మిస్తేనే సమస్య తీరనుంది. జైన, రాజారం, తీగలధర్మారం, దొంతాపూర్‌, తుమ్మెనాల, దమ్మన్నపేట గ్రామాల్లో ఎద్దడి నెలకొంది. ధర్మారం మండలం కొత్తపల్లి, నందిమేడారంలలో సమస్య ఉంది. కొత్తపల్లిలో అద్దె బావుల ద్వారా సరఫరా చేస్తున్నారు. నందిమేడారంలో మరమ్మతుల కోసం గతేడాది జూన్‌లో చెరువు కట్టకు గండి పెట్టడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. పక్షం రోజుల క్రితం చెరువులో నీళ్లు నింపినప్పటికీ ఇప్పటికీ భూగర్భ జలాలు పెరగలేదు. గ్రామ పంచాయతీ ద్వారా కేవలం పావు గంట సరఫరా చేస్తుండగా చివర కుటుంబాలకు సరిపోవడం లేదు. గ్రామస్థులు ఎడ్లబండ్లు, సైకిళ్లపై వెళ్లి వ్యవసాయ బావులవద్ద, చేతిపంపుల వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు. వెల్గటూరు మండలం గొడిశెలపేట, తాళ్లకొత్తపేట పునరావాస కాలనీ, శాఖాపూర్‌ గ్రామాల్లో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుని డ్రమ్ముల్లో నింపుకుంటున్నారు. పెగడపల్లి మండల కేంద్రంతోపాటు ఐతుపల్లి, నందగిరి గ్రామాల్లో తాగునీటి కొరత ఉంది. బుగ్గారం మండలం సిరికొండలో బావుల్లో నీళ్లున్నా కుళాయిల వ్యవస్థ సరిగా లేకపోవడంతో సమస్య నెలకొంది. వేసవిలో ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ చర్యల కోసం ఫిబ్రవరి మూడో వారంలోనే ఎంపీడీవోల ద్వారా ప్రతిపాదనలు వెళ్లాయి. బావులను అద్దెకు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తుండగా, రైతులు పంటలు సాగు చేసుకోవడంతో అమలుకు నోచుకోవడం లేదు.

మొదలైన తాగునీటి ఎద్దడి 
krn-sty1f.jpg
పెద్దపల్లి, న్యూస్‌టుడే: శ్రీరాంపూర్‌, ఓదెల మండలాల్లోనే నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఆరు గ్రామాల్లో నీటి ఇబ్బందులు ఉన్నట్లు గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు గుర్తించారు. ఓదెల మండలం పొత్కపల్లిలో తాగునీటి బావి ఎండిపోవడంతో ఇటీవల గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. సుల్తానాబాద్‌ మండలం నారాయణపూర్‌, జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామల్లో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సుల్తానాబాద్‌ మండలం దేవునిపల్లికి కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌లోని బావి ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు. శ్రీరాంపూర్‌ మండల కేంద్రంలో నీటి ఎద్దడి దృష్ట్యా అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో తాగునీటి కోసం తవ్వించిన నాలుగు బావుల్లో మూడు ఎండిపోవడంతో వ్యవసాయ బావులను అద్దెకు తీసుకొని నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న రెండు ట్యాంకర్లు మండల కేంద్రం ప్రజలు అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. వారానికి ఒకసారి చొప్పున నీటి సరఫరా జరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మేలుకుంటేనే నీటి సమస్య తీరేది
మంథని, న్యూస్‌టుడే: వేసవి అనగానే గుర్తొచ్చేది నీటి సమస్య. ఉమ్మడి జిల్లాలో నీటి సమస్య అధికంగా ఉండే గ్రామాలు కూడా మంథని నియోజకవర్గంలోనివే. 9 మండలాల్లో 122 పంచాయతీలుండగా ఇప్పటికే పలుచోట్ల నీటి ఎద్దడి నెలకొంది. వాన జాడ లేక నెలలు గడవడంతో భూగర్భంలో జలం అడుగంటింది. గ్రామాల్లో తాగునీటి కోసం నెలకొల్పిన బోరుబావులు 250 అడుగులు మించి లేవు. కానీ ఈసారి భూగర్భ జలాలు అంతకు మించి పడిపోయాయి. రోజు రోజుకు పరిస్థితి జేజారిపోతోంది.  శ్రీ మంథని పంచాయతీలో నీటి సమస్య మొదలయింది. గోదావరిలో బోర్లు నీరింకి పోవడంతో రెండు రోజులుగా సరఫరాలో ‘తడబాటు’ ఎదురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రెండు పూటల నీరివ్వగా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గద్దలపల్లి, ఎక్లాస్‌పూర్‌, వెంకటాపూర్‌, గ్రామాల్లో ఇప్పటికే బోరు బావుల్లో జలం అడుగంటి జనం ఇబ్బంది పడుతున్నారు. శ్రీ ముత్తారం మండలం సీతంపేట, జిల్లెలపల్లి, అడవిశ్రీరాంపూర్‌, మైదబండ గ్రామాల్లో నీటి సమస్య నెలకొంది. శ్రీ రామగిరి మండలంలో నాగెపల్లిలో ప్రపంచ బ్యాంకు నిధులతో నెలకొల్పిన నీటి పథకం పనిచేయడం లేదు. దీంతో గ్రామంలో నీటి సమస్య అధికమవుతోంది. బేగంపేట, నవాబుపేట, కల్వచెర్ల పంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  శ్రీ కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి, నాగారం, పెంచికల్‌పేట తదితర గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది.

కొనుగోలు చేస్తున్న ప్రజలు
కోరుట్ల పట్టణం, న్యూస్‌టుడే: కోరుట్ల పట్టణంలో తాగునీటి సమస్య జటిÈలమవుతోంది. రోజూ రోజూకు భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. కొన్ని వార్డుల్లో తాగునీటి పైపులైన్లు లేకపోవడంతో పూర్తిగా బోర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. 1000 నుంచి 1300 అడుగుల వరకు బోరు తవ్వకం జరిపినా చుక్క నీరు రాని పరిస్థితి నెలకొంది. కోరుట్ల పట్టణంలో అల్లమయ్యగుట్ట బీసీ కాలనీ, ఎన్టీఆర్‌ కాలనీ, చింతలవాడ భగత్‌సింగ్‌నగర్‌, భీమునిదుబ్బ ,హాజీపురా, సాయిరాంపురా కాలనీలతో పాటు శివారు ప్రాంతాలైన మాదాపూర్‌ కాలనీ, నక్కలగుట్ట, ఏసుకోనిగుట్ట, అర్బన్‌కాలనీలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. శివారు కాలనీల్లో తాగునీటి పైపులైను ఏర్పాటు చేయలేదు. అల్లమయ్యగుట్ట చుట్టూ ఉన్న కాలనీల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. మహిళలు బోర్లు, బావులు ఉన్న చోటుకు వెళ్లి నీటిని బిందెల్లో తెచ్చుకుంటున్నారు. ఆయా కాలనీల్లో నిత్యం ప్రైవేట్‌ ట్యాంకర్‌ ద్వారా డ్రమ్ముకు రూ.40 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.

ట్యాంకర్లతో నీటి కొనుగోలు
కొదురుపాక(బోయినపల్లి): వేసవికి ముందే మధ్యమానేరు ముంపు గ్రామాల పునరావాస కాలనీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి కాలనీల్లో వేసిన చేతి పంపుల్లో నీరు లేదు. రెండు మూడు బోర్లలో అరగంటకు మించి నీరు రావడం లేదు. ఒక్కో ట్యాంకరుకు రూ.500 వెచ్చించి నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రక్షిత మంచీటి ట్యాంకులు నిర్మించినప్పటికి మూడు కాలనీల్లో తాగు నీరు అందడంలేదు.

మరిన్ని వార్తలు

Link to comment
Share on other sites

https://www.bbc.com/telugu/india-43469286

 

 

బాబు కట్టిన ఇంట్లో దూరిన రావు. 
బయటకు నెట్టివేయ బడ్డ బాబు. 
కొత్త ఇంటికి పునాదులు తవ్వుతున్న బాబు. 
బాబు కట్టిన ఇంటి మిద్దె మీదకి ఎక్కి వచ్చీ పోయే జనాలతో "చూసారా! నా ఇంట్లో అన్నీ వున్నయ్యి. జబ్బర్దస్త్ గ కట్టాను ఈ ఇల్లు. మీకేమన్నా సలహాలు కావాలంటే అడగండి. నా అనుభవంతో మీకు దగ్గరుండి కట్టిపిస్తా ఇల్లు" అంటున్నాడు. 

తలెత్తి పైకి చూసి తిరిగి తన పనిలో నిమగ్నమైన బాబు . 

>> మొట్ట మొదటి సారి రైతు సమన్వయ సంఘాల ప్రతినిధుల సభలోనే బయటపడిన కేసీఆర్ అంతరంగం. భవిష్యత్ లో జాతీయ స్థాయిలో జరిగే ఆందోళనలకు మన రైతు సమన్వయ సంఘాల నాయకులే నాయకత్వం వహించాలి అన్నప్పుడే అర్ధం అయ్యింది. రైతుల ఆత్మహత్యల్ని తన ప్రభుత్వం పై నుండి తొలగించుకొని కాంగ్రెస్, భాజపా ల మీద తోస్తున్నాడని. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల దృష్టిలో హీరో అవ్వడానికి అడుగులు కదుపుతున్నాడని. 

తన వైఫల్యాలను ఇతరుల మీదకు 
ఇతరుల విజయాలను తన ఖాతా లోకి 

ఇంకో నెల్లో బాబు బీజేపీకి దూరంగా జరిగితే దేశ వ్యాప్తంగా చర్చ మూడో ఫ్రంట్ మీదే. కింగ్ పిన్ బాబే. బాబుకి బలాదూర్ తిరిగే వెసులుబాటు లేదు. రాజధాని కూడా లేని ఒక రాష్ట్ర నిర్మాణం పునాదుల నుండి మొదలు పెట్టాల్సిన పెద్ద భాధ్యత బుజాల మీద ఉంది. 

సమయం చూసి పావులు కదిపిన కేసీఆర్. అయితే ప్రగతి భవన్లో లేదంటే ఫాం హౌజ్ లో సేద తీరే కేసీఆర్ బయటకి వచ్చాడంటేనే ఏదో విశేషం ఉన్నట్లు. కొత్త కథేదో జనాలకి చెప్పాల్సి వస్తే తప్ప బయటకి రాడు. 

ఈ మొత్తం పథకం వల్ల కేసీఆర్ కు కలిగే ప్రయోజనాలు. 
1. తెలంగాణలో అత్యధికంగా ఉన్న రైతుల ఆత్మహత్యలు ఎన్నికల్లో తన పార్టీపై ప్రభావం చూపక ముందే దాన్ని ఇతరులపై నెట్టి వాళ్ళని డిఫెన్స్ లో పడెయ్యడం. 
2. కొండకి వెంట్రుక వేస్తాడు. వస్తే కొండ, పోతే వెంట్రుక. దేశ రాజకీయాల్లో పరిచయాలు, ప్రాభవం. 
3. తన వాక్చాతుర్యం, హిందీ ఇంగ్లీష్ లలో అనర్గళంగా మాట్లాడగల్గడం. తనకున్న ముఖ్యమంత్రి హోదా. వీటితో పరిచయాలు పెరిగే కొద్దీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని దాటి ముందుకు వెళ్ళగలగడం. 
4. మిషన్ భగీరధలో ఇంటింటికీ నీళ్ళ పంప్ రాకుంటే ఓట్లు అడగను అన్న దాన్ని నిజం చెయ్యొచ్చు. ఇప్పుడు ఆయన అడగడు. ఆయన దేశ రాజకీయాలని బయట తిరుగుతుంటే ఇక్కడ కూతురూ, అల్లుడూ, కొడుకూ ఓట్లడుగుతారు. 
5. దేశ రాజకీయాలు అంటూ హైప్ క్రియేట్ చేసి తద్వారా రాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు, ఇతర పార్టీల నేతలూ, కార్యకర్తలని సులభంగా లాక్కోవచ్చు. 
6. కేంద్రంలో ప్రత్యామ్నాయంగా నిలిచే పార్టీని రాష్టృం లో ప్రజలు ఓడించుకోరు. మోడీ, షాలు కేంద్రంలో ఉంటే గుజరాతీయులు భాజపాని ఎలా గెలిపించుకుంటారో అలా. అలాంటి నమ్మకాన్నే తెలంగాణలో సృష్టించడం. 
7. సుడి బాగుండి అన్నీ అనుకున్నట్లు జరిగితే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం. 

ఇలా కేసీఆర్ కు అన్నీ లాభాలే తప్ప నష్టాలేమీ లేవు. చాలా మంది భావిస్తున్నట్లు ఇది చంద్రబాబు వేసిన స్కెచ్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ. నిజానికి ఇది చంద్రబాబుని వెనక్కి నెట్టి తాను ముందుకి వెళ్ళడానికి కేసీఆర్ రచిస్తున్న పన్నాగం. 

అయితే ఇతర ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో పోల్చితే తక్కువ అనుభవం ఉన్న, ఏరు దాటాక తెప్ప తగలేసే స్వభావమున్న కేసీఆర్ ను ఎంత మంది నమ్ముతారో ఆ ఫ్రంట్ ఎలా రూపుదిద్దుకుంటుందో వేచి చూడాలి. 

గమనిక : మొదటి రెండేళ్ళూ ఇప్పుడే పుట్టిన రాష్ట్రం, అప్పుడే అన్ని పనులూ ఎట్లవుతయ్యి అన్న కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్లో ఇక్కడ చెయ్యాల్సినవన్నీ అయ్యిపొయ్యాయి. ప్రజలు సుఖంగా ఉన్నారు. హాయిగా తింటున్నారు. కాబట్టి ఇంక దేశ రాజకీయాల మీద దృష్టి సారిస్తున్నాం అనడం అత్యంత హాస్యాస్పదం. ఒకటి. గతంలోనే బాబు లాంటి నాయకులు హైద్రాబాద్ ని అభివృద్ధి చేసి చేతిలో పెట్టడంతో ఆ ఫలాలను అనుభవిస్తున్న పరాన్న జీవి అయినా అయ్యుండాలి. రెండు. చెయ్యాల్సినవి చాలా ఉన్నా చేసేసాం అని ప్రజల్ని మోసగిస్తూ అయినా ఉండాలి. రెండింటిలో ఏది నిజమో కేసీఆరే చెప్పాలి.

Link to comment
Share on other sites

On 3/19/2018 at 5:20 PM, Chandasasanudu said:

avv 1<3...elli pk ...........first nuvvu ee party no decide ayye db ki raa...ledu antey....mee kcr laa kasepu congres...kasepu trs..kasepu pk anukunta thiragali

Chandas uncle .. mimmalni maa Datar goru antaaru ani kaadu kaani... Shit kanipiste mukku moosukoni pakkaki tappukoni vellipovaali anthe kaani daani paina raayesta ante etta anta

Link to comment
Share on other sites

Just now, JVC said:

Chandas uncle .. mimmalni maa Datar goru antaaru ani kaadu kaani... Shit kanipiste mukku moosukoni pakkaki tappukoni vellipovaali anthe kaani daani paina raayesta ante etta anta

inka mee daatar gurunche cheppukovali...uff...modi and kcr edhavalu swamy antey visionary adi idi ani cbn ni dobbadu malla ippudu pk laa uturn...bjp supporters ni evadni aina attack sesam...bcoz they spoil some naive ppl mindset which is not good...kcr lanti idiot ni shit ani vadilesi politicians antha lite theesukunnaru...sivaraki seda goparam pettadu...theda evaru aina counter cheyali..recent example pk...cbn constantly fails in that...eventually we pay for that

Link to comment
Share on other sites

1 hour ago, Bob Marley said:

Shit is in yellow color 

Vande Jagatgurum cinema lo oka manchi dialogue untundi.

Tananu kanadaaniki amma padina kashtanni ardam chesukune vaadu manishavutaadu... Amma nanna sukhapadite puttanu anukune vaadu Pasuvavutaadu ani.

 

alaage.. Yellow ante  Pasupu rangu.. aa Pasupu rangu  subha soochakam ga maaku kanipistundi.. Mee laantollaki ade pasupu rangu chuste Asudhdham  kanipistundi. 

 

daaniki evaru emi cheyagalaru. 

Link to comment
Share on other sites

2 hours ago, JVC said:

Chandas uncle .. mimmalni maa Datar goru antaaru ani kaadu kaani... Shit kanipiste mukku moosukoni pakkaki tappukoni vellipovaali anthe kaani daani paina raayesta ante etta anta

Friend pelliki elli pellikoothuru character bad antaadu aayana.....aallu maararu Rao garu....

Link to comment
Share on other sites

32 minutes ago, JVC said:

Vande Jagatgurum cinema lo oka manchi dialogue untundi.

Tananu kanadaaniki amma padina kashtanni ardam chesukune vaadu manishavutaadu... Amma nanna sukhapadite puttanu anukune vaadu Pasuvavutaadu ani.

 

alaage.. Yellow ante  Pasupu rangu.. aa Pasupu rangu  subha soochakam ga maaku kanipistundi.. Mee laantollaki ade pasupu rangu chuste Asudhdham  kanipistundi. 

 

daaniki evaru emi cheyagalaru. 

Eppatikaina aa chandas ki kooda intha lothuga gunapam dhimpaali anedhi naa yokka idhi...adhi eppatiki neraveriddo endho rao garu

Link to comment
Share on other sites

17 minutes ago, chsrk said:

Eppatikaina aa chandas ki kooda intha lothuga gunapam dhimpaali anedhi naa yokka idhi...adhi eppatiki neraveriddo endho rao garu

Narada Muni maadiri tayarayyaru. Evarini eppudu buk chestaaro teliyadu. nenu walking out. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...