Jump to content

Rahul plenary speech


rama123

Recommended Posts

Ee congress actors will come fore front before elections saying will fulfill AP promises, 10 years state & center lo adhikaram lo vundi emi cheyaleni vaallu 2019-24 emi chesthaaru with 100-120 MP seats max.

Link to comment
Share on other sites

2 minutes ago, rama123 said:

We have to believe someone can't go against all parties.

Congress much better than BJP.

Chennai lo mosam chesaru.

Kurnool lo mosam chesaru.

Hyderabad lo mosam chesaru.

Who from AP believe these congress idiots who are main reason for AP current situation.

Link to comment
Share on other sites

Without BJP support bifurcation should not have happened.

They dragged for 10 years and taken all parties opinion and called CBN for his demands.what else a ruling party can do.

It is the opposition party who have to fight for ap rights rather they want tg people to remember as chinnamma.

Link to comment
Share on other sites

18 minutes ago, RKumar said:

Chennai lo mosam chesaru.

Kurnool lo mosam chesaru.

Hyderabad lo mosam chesaru.

Who from AP believe these congress idiots who are main reason for AP current situation.

 

Link to comment
Share on other sites

We have only two options..

1) Drive for collation govt. with out Cong and BJP

2) Support one of them

Have to see how things turn out before elections... if collation govt is not possible, have to support cong. demanding things to be done for AP. Next 6 years politics will be very interesting. 

Link to comment
Share on other sites

మోదీయే అవినీతి 
నీరవ్‌మోదీ ప్రజాధనాన్ని దోచుకెళ్తారు 
దానిని నరేంద్రమోదీకి ఎన్నికల ఖర్చుగా సమకూరుస్తారు 
భాజపా అంటే కౌరవులు... మేం పాండవులం 
యుద్ధంలో గెలుపు సాధించేది మేమే 
కార్యకర్తలకు, నాకు మధ్యనున్న అడ్డుగోడల్ని పగులగొడతా 
గతసారి మేం ప్రజాకాంక్షల్ని నెరవేర్చలేకపోయాం 
ప్లీనరీ ముగింపు సమావేశంలో రాహుల్‌గాంధీ 
విభేదాలు విడనాడి పార్టీ కోసం పనిచేయాలని శ్రేణులకు పిలుపు 
దిల్లీ 
18ap-main5a.jpg
‘మోదీ... భారత్‌లోని ఆశ్రిత పెట్టుబడిదారులకు, ప్రధానమంత్రికి మధ్య ఉన్న అవగాహనకు ప్రతీక ఈ పేరు. ప్రజలకు చెందిన రూ.30,000 కోట్లను ఒక మోదీ మరో మోదీకి ఇస్తారు. ఆ మోదీ తిరిగి ఈ మోదీకి ఆ డబ్బును మార్కెటింగ్‌ కోసం, ఎన్నికల్లో ఖర్చు కోసం సమకూరుస్తారు. ప్రధాని మోదీ ఏమీ అవినీతిపై పోరాడడం లేదు. ఆయనే అవినీతి...’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా ఆరోపించారు. ఆర్థిక కుంభకోణాల్లో నిందితులుగా ఉంటూ పరారైన ప్రముఖ ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీ, వ్యాపారవేత్త లలిత్‌మోదీలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఆదివారం దిల్లీలో కాంగ్రెస్‌ 84వ ప్లీనరీ ముగింపు సమావేశంలో 53 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. దేశం తరఫున తన పార్టీ మాట్లాడుతుందన్నారు. అవినీతిపరులు, శక్తిమంతులు దేశాన్ని నియంత్రిస్తున్నారని చెప్పారు. భాజపా ఒక సంస్థ వాణిని వినిపిస్తుందనీ, కాంగ్రెస్‌ మాత్రం దేశం గుండెచప్పుడు అని పేర్కొన్నారు.

నిజం కోసం పోరాడతాం 
భాజపా అంటే కౌరవ సైన్యమనీ, తాము మాత్రం పాండవుల్లాంటివాళ్లమని రాహుల్‌ చెప్పారు. అధికారం కోసం కౌరవుల్లా భాజపా పోరాడుతుంటే, ధర్మం కోసం నిలబడిన పాండవుల మాదిరిగా తాము నిజం కోసం పోరాడతామని చెప్పారు. యుద్ధంలో గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. ‘అనేక శతాబ్దాల క్రితం కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. కౌరవులు శక్తిమంతులు, అహంకారులు. పాండవులు వినయశీలురు. వారు ధర్మం కోసం పోరాడారు. కౌరవుల్లా భాజపా కూడా అధికారం కోసం పోరాడడానికే ఉంది. పాండవుల మాదిరిగా కాంగ్రెస్‌ నిజం కోసం పోరాడుతుంది. భాజపా కంటే కాంగ్రెస్‌పై ప్రజలకు ఎక్కువ అంచనాలు ఉన్నాయి. మా పార్టీ ఎప్పుడూ భాజపాలాంటిది కాదు. హత్య కేసులో నిందితుడిని భాజపా అధ్యక్షుడిగా ఈ దేశ ప్రజలు ఆమోదిస్తారు. అధికార దాహం ఉన్న వ్యక్తిని వారు భాజపాలో      ఆమోదించినా, అలాంటివారిని కాంగ్రెస్‌లో ఎన్నడూ వారు అంగీకరించబోరు. ప్రమాణాలకు తగ్గట్టుగా మేం లేకపోతే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. భాజపా అంటే ఒక సంస్థ. కాంగ్రెస్‌ మాత్రం దేశవాణి...’ అని వివరించారు.

భ్రమలు వీడుతున్నాయి... 
‘అచ్చేదిన్‌ అని నినదించిన అధికార పార్టీపై వివిధ వర్గాలకున్న భ్రమలు వీడుతున్నాయి. అడవి మీది కాదని వారు గిరిజనులకు చెబుతారు. భాష మార్చుకోవాలని తమిళులకు చెబుతారు. ఎన్నడూ పాకిస్థాన్‌కు వెళ్లని ముస్లింలను పట్టుకుని మీరు ఇక్కడివారు కాదని అంటారు. మీరు తినేది మాకు నచ్చదని ఈశాన్య రాష్ట్రాలవారికి చెబుతారు. మహిళల వస్త్రధారణ గురించీ వారే చెప్పేస్తారు. నేను ఎక్కడ యువతను ప్రశ్నించినా వారు చేయడానికి పనేమీ లేదనే చెబుతున్నారు. ప్రజాకాంక్షల్ని నెరవేర్చకపోవడం వల్లనే 2014లో కాంగ్రెస్‌కి ప్రజలు ఓటు వేయలేదని అంటుంటారు. నిజమే... గత ప్రభుత్వం ప్రజాకాంక్షల్ని నెరవేర్చలేకపోవడంతో ప్రజలు నిరుత్సాహం చెందారు. మనం కూడా మారాలి. కాంగ్రెస్‌లోనూ మార్పు తీసుకురావాలి’ అని రాహుల్‌ చెప్పారు.

పదేళ్లలో భారత్‌ దార్శనికత 
నిరుద్యోగం, రైతాంగం సమస్యలు, బ్యాంకు కుంభకోణాలు వంటివాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆకర్షణీయ కార్యక్రమాల ద్వారా భాజపా ప్రయత్నిస్తోందని రాహుల్‌ విమర్శించారు. ఈ అంశాలపై ప్రధాని మౌనం దాల్చారని చెప్పారు. ‘దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రధాని అంగీకరించడం లేదు. ఊహల్లో తప్పిస్తే సమస్యలు మరెక్కడా లేవన్నట్లుగా వాటి నుంచి మన దృష్టిని ఆయన మళ్లింపజేస్తున్నారు. ఆర్థికంగా మన దేశం పరుగులు తీస్తోందని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. కానీ కోట్ల మంది యువత ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మోదీ మాత్రం గబ్బర్‌సింగ్‌ టాక్స్‌ నుంచి యోగా వరకు ఒకదాని తర్వాత ఒకటిగా వేర్వేరు అంశాల్లోకి వెళ్తూ మన దృష్టి మళ్లిస్తున్నారు. ఈ సమస్యలపై ఆయనెన్నడూ మాట్లాడరు...’ అని వివరించారు. ‘రాబోయే దశాబ్దిలో ప్రపంచ యవనికపై భారత్‌ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటివరకు ప్రపంచం ముందు రెండు దార్శనికతలే ఉన్నాయి. ఒకటి అమెరికా, రెండోది చైనా. పదేళ్లలో భారత్‌ దార్శనికతనూ వాటి సరసన చేర్చాలనేది నా కోరిక.’ అని చెప్పారు. స్వాతంత్య్రం కోసం జాతిపిత మహాత్మాగాంధీ 15 ఏళ్లపాటు కారాగారంలో గడిపితే ఆరెస్సెస్‌ నేత సావర్కర్‌ మాత్రం క్షమాభిక్ష కోసం ప్రాధేయపడ్డారనీ, దేశ ప్రజలు ఆ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని తెలిపారు.

18ap-main5b.jpg
చేసిన తప్పుల్ని మేం అంగీకరిస్తాం... 
తనకు, కార్యకర్తలకు మధ్యనున్న అడ్డుగోడల్ని కూలగొడతానని రాహుల్‌ హామీ ఇచ్చారు. ‘అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడి ఎన్నికల్లో టికెట్టును ఎవరో ఒకరు ఎగరేసుకునిపోతారు. పార్టీ కోసం కష్టపడే అసలైన కార్యకర్తకు మాత్రం- తగినంత డబ్బు లేని కారణంగా టికెట్‌ ఇవ్వలేకపోతున్నామని- చెబుతారు. నేను చెబుతున్నది ఇక్కడ కూర్చొన్నవారిలో కొందరికి నచ్చకపోవచ్చు. మన మధ్య ఈ అడ్డుగోడల్ని తీసేయడం నా మొదటి విధి. మేమూ మనుషులమే. కాంగ్రెస్‌ కూడా తప్పులు చేస్తుంది. అయితే మేం వాటిని ఒప్పుకొంటాం. భాజపా మాత్రం ఎన్నడూ అలా చేయదు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తప్పు అని ప్రపంచమంతా చెప్పింది. అలాంటి తప్పును మేమే చేసి ఉంటే దానిని అంగీకరించి, సరిదిద్దే చర్యలు తీసుకునేవాళ్లం. మోదీ మాత్రం తనను తాను భగవంతుని అవతారంగా భావిస్తారు. అందువల్ల తాను తప్పులే చేయనని అనుకుంటారు’ అని చెప్పారు. వ్యవస్థల్ని ఆరెస్సెస్‌ నాశనం చేస్తోందనీ, ఆ సంస్థ ఛత్రం కిందికి అంతా రావాలని కోరుకుంటోందనీ తెలిపారు. ప్రతిభావంతులైన యువతతో పార్టీ వేదికని భర్తీ చేస్తానని చెప్పారు. క్రమశిక్షణ ఆవశ్యకతను నొక్కిచెబుతూ... విభేదాలన్నింటినీ పక్కనపెట్టి పార్టీ విజయం కోసం పాటుపడదామని పిలుపునిచ్చారు.

సీడబ్ల్యూసీపై నిర్ణయం రాహుల్‌కే 
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుల ఎంపికపై అధికారాన్ని రాహుల్‌గాంధీకే అప్పగిస్తూ ప్లీనరీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. ఈ ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహిద్దామా అని సీనియర్‌ నేత ఆజాద్‌ అడిగినప్పుడు ప్లీనరీ దానిని తిరస్కరించింది.

కాంగ్రెస్‌ హస్తం కాపాడుతుంది 
‘మీరు మా గురించి ఎంత చెడ్డగానైనా రాయండి. ఆరెస్సెస్‌ మీపై దాడి చేసినప్పుడు, అణిచివేయాలని చూసినప్పుడు కాంగ్రెస్‌ చిహ్నమైన హస్తం మాత్రం మిమ్మల్ని కాపాడుతుంది’ అని విలేకరులనుద్దేశించి రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మీడియాకూ బెదిరింపులు ఎదురవుతున్నాయనీ, తాము అధికారంలోకి వచ్చాక మీడియాను కాపాడతామనీ తెలిపారు. ఆహారశుద్ధి సముదాయాలను దేశవ్యాప్తంగా నెలకొల్పి, ప్రతీ జిల్లాలో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా ఈ కర్మాగారాలకు విక్రయించుకునేలా చూస్తామనీ తెలిపారు. ఐ.ఐ.టి. తరహా నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు. రైతుల్ని ఆదుకునేందుకు మరోసారి రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు.

ఈ వేదికను భర్తీ చేయాల్సింది యువతే... 
‘ఈ వేదిక మీదే. ఈ పార్టీ మీదే. పార్టీ లోపలా, బయటా ఉన్న యువత కోసం వేదికను ఖాళీ చేయించాను. యువత లేకపోతే నరేంద్రమోదీ కూడా దేశాన్ని మార్చలేరు. నాలుగేళ్ల క్రితం మోదీ వాహనాన్ని యువత... ముందుకు నెట్టింది. అయితే దానిలో ఒకపక్క నీరవ్‌మోదీ, మరోపక్క లలిత్‌మోదీ కూర్చొన్నారు. ఆ వాహనం వెళ్లిపోయింది’ అని రాహుల్‌ చెప్పారు. ‘ఈ పార్టీ మీ చేతిలో ఆయుధం. మీ ప్రతిభ, సాహసం, శక్తి ఈ దేశానికి అవసరం. మీలాంటివారి కోసం మేం తలుపులు తెరిచిఉంచాం’ అని చెప్పారు. 70-80 ఏళ్ల క్రితం పార్టీకి ఉన్న వైభవాన్ని తిరిగి సాధించాలనేది తన కల అని చెప్పారు. 

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...