Jump to content

బాబుకు ద్రోహం!... మోదీ, పవన్కు బ్యాండే!


NAGA_NTR

Recommended Posts

1521197022-1156.jpg

ప్రస్తుతం ఏపీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగు నేల విభజనతో అగమ్య గోచరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి ఓ వైపు, ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అలుపెరగని కృషి మరో వైపు... వెరసి ఏ చిన్న విషయమైనా లైమ్ లైట్లో కనిపించే పరిస్థితి నెలకొందనే చెప్పాలి.


40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు... ఎలాగైనా రాష్ట్రాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించేందుకు తన అనుభవం మొత్తాన్ని రంగరించి అందుబాటులో ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఇందులో భాగంగా తన సీనియారిటీని కూడా పక్కనపెట్టేసి... రాజకీయాల్లోకి నిన్నగాక మొన్న వచ్చిన నేతలతోనూ కలిసి ముందుకు సాగేందుకు చంద్రబాబు ఏమాత్రం సంశయించడం లేదనే చెప్పాలి.


ఈ క్రమంలోనే రాజకీయాల్లో తనకు ఏమాత్రం సాటి రాని జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి ముందుకు సాగేందుకు కూడా ఆయన ఏమాత్రం సంకోచించలేదనే చెప్పాలి. అంతేనా... కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు... సదరు ప్రభుత్వానికి అధినేతగా, ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వకున్నా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.


ఏడాదిన్నరగా మోదీ కనీసం తన అపాయింట్ మెంట్ వైపు దృష్టి సారించకున్నా కూడా చంద్రబాబు ఏమాత్రం నిరాశ చెందలేదు. వాస్తవానికి రాజకీయాల్లో మోదీ కంటే కూడా చంద్రబాబే సీనియర్. అయినా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతున్న చంద్రబాబు తన సీనియారిటీని ఏమాత్రం పట్టించుకోకుండానే జూనియర్ అయినా కూడా కీలక స్థానంలో ఉన్న మోదీతో భేటీ కోసం అహరహం శ్రమిస్తూనే ఉన్నారు.
మరోవైపు పార్ట్ టైం పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ విషయాన్ని ప్రస్తావించినా... వెంటనే ఆ సమస్య పరిష్కారం దిశగా అధికార యంత్రాంగాన్ని కదిలిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ప్రస్తావించిన చాలా సమస్యలు చిటికెలోనే పరిష్కారమైపోయాయి. ఓ వైపు అభివృద్ధిని చూసేందుకు ససేమిరా అంటూనే నిత్యం బురద చల్లుతున్న విపక్షం వైసీపీ యత్నాలను భరిస్తూనే... వాటికి ధీటైన సమాధానం చెబుతున్న చంద్రబాబు... రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా త్యాగాలే చేశారని చెప్పాలి. తనను పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా... కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్లను గుడ్డిగానే నమ్మారు. గడచిన ఎన్నికల్లో కుదిరిన పొత్తును కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న చంద్రబాబు... ఈ ఇద్దరి వ్యక్తుల నుంచి ఎలాంటి అవమానాలు ఎదురైనా కూడా ఏమాత్రం పట్టించుకోకుండానే వారిని మిత్రులుగానే పరిగణిస్తూ సాగుతున్నారు. అయితే మొన్నటి కేంద్ర బడ్జెట్ లో మోదీ అసలు రంగు బయటపడింది.


విభజన కారణంగా సమస్యల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన మోదీ... ఆ ప్యాకేజీ మాట కూడా ప్రస్తావించకుండానే నాలుగేళ్ల పాలనను ముగించారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయనగా వచ్చిన మొన్నటి కేంద్ర బడ్జెట్ లో మోదీ అసలు రంగు బయటపడగా... చంద్రబాబుకు నిజంగానే షాక్ తగిలిందని చెప్పాలి. తాను నమ్మిన మోదీనే తనను నట్టేట ముంచేశారన్న వాస్తవాన్ని గ్రహించిన చంద్రబాబు... రాష్ట్రం తరఫున పోరు ప్రారంభించక తప్పలేదు.


అప్పటిదాకా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఓకే అన్న చంద్రబాబు... మోదీ నయా మోసం బయటపడిన నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం నాన్ స్టాప్ పోరును ప్రారంభించేశారు. బాబు పోరుకు తెలుగు జాతి ఒక్కుమ్మడిగా మద్దతు పలికింది. దీంతో మరింత ధీమాతో ముందుకు సాగిన బాబు... ఏకంగా మోదీ కేబినెట్ లోని తన ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించడంతో పాటుగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేందుకు కూడా దాదాపుగా నిర్ణయం తీసేసుకున్నారు. ఇలాంటి కీలక తరుణంలో తనకు అండగా నిలబడతాడనుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అనూహ్యంగా ప్లేట్ ఫిరాయించేశాడు.


మొన్న గుంటూరు జిల్లాలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ వేదిక మీద నుంచి పవన్.... చంద్రబాబు పాలనతో పాటు బాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ ఊహించని పరిణామంతో చంద్రబాబుకు మరో షాక్ తగిలిందని చెప్పక తప్పదు. అయితే రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చంద్రబాబు... ఈ షాక్ కు కూడా పెద్దగా చలించిపోలేదనే చెప్పాలి. ఓ వైపు పవన్ కామెంట్లకు దీటుగానే సమాధానం చెబుతూ... మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరును మరింతగా తీవ్రతరం చేసేశారు.


ఈ నేఫథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామాలన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చిన తెలుగు ప్రజలు... బాబుకు అండగా నిలబడేందుకు సిద్ధమైపోయారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబును అటు ప్రధాని మోదీతో పాటుగా ఇటు పవన్ కల్యాణ్ కూడా నట్టేట ముంచిన వైనాన్ని గ్రహించిన ఏపీ ప్రజలు... వాస్తవాలను గ్రహించి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్న బాబుకు మద్దతు ఇచ్చేందుకే నిర్ణయించుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు వెంట నడిచిన మోదీ, పవన్ కల్యాణ్లు... ఇప్పుడు చెప్పా పెట్టకుండా విపక్షం వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పరోక్షంగా మద్దతు పలుకుతున్న వైనాన్ని కూడా జనం గ్రహించేశారనే చెప్పాలి.


ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజలు చూపిస్తున్న ప్రాంతీయ తెగువను మనం కూడా చూపించాల్సిందేనన్న అవగాహనకు వచ్చేసిన ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో మోదీ, పవన్లకు బుద్ధి చెప్పేందుకు దాదాపుగా ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్లుగానే తెలుస్తోంది. అంటే... చంద్రబాబుకు చేసిన నమ్మక ద్రోహం వచ్చే ఎన్నికల్లో మోదీతో పాటు పవన్ ను కూడా గంగ పాలు చేస్తుందన్న మాట.

Link to comment
Share on other sites

4 minutes ago, ask678 said:

Anna VP avvataniki two years pattindhi..veedu overnight lo KVP ayyadu...it's all time record...jaffa gaadu kuda kottaledu ee record...ika PK fans badhalu

OkeOkkadu cinemalo Raghuvarun velli interviewlo VP avtadu kada same ade repeated.

Ila inko 2 days veedu pilli moggalestu self golas veskunte BJP koda bayapadiddemo vidi tho velte kashtam YCP or TDP ne better ani

Link to comment
Share on other sites

38 minutes ago, BalayyaTarak said:

OkeOkkadu cinemalo Raghuvarun velli interviewlo VP avtadu kada same ade repeated.

Ila inko 2 days veedu pilli moggalestu self golas veskunte BJP koda bayapadiddemo vidi tho velte kashtam YCP or TDP ne better ani

TDP no chance with baffas...baffas ki ichi last year, no more chance to boodi

Link to comment
Share on other sites

2 hours ago, Hello26 said:

Pawan Kalyan mari intha shocking ga BJP ku support chestadani...I never expected. honestly what pawan is doing unbelievable 

He is still playing the double game between commies and bjp at the same time

Link to comment
Share on other sites

15 minutes ago, Nfdbno1 said:

He is still playing the double game between commies and bjp at the same time

Commies లేదు em ledu vallu వున్నట్టు ఎవరికి తెలీదు, but bjp tho vellochu once he said అమిత్ shau offered him to merge his party n work under bjp ani.. వాళ్ళకి ఆంధ్ర లో ఒక face కావాలి.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...