Jump to content

నిన్న, పవన్ మా రాష్ట్రం పై, చేసిన ప్రతి ఆరోపణకు సాక్షాలతో సహా సమాధానం


Recommended Posts

నిన్న, పవన్ మా రాష్ట్రం పై, చేసిన ప్రతి ఆరోపణకు సాక్షాలతో సహా సమాధానం...

 

 
pavan-aropanalu-15032018-1.jpg
share.png

మా ఆంధ్ర రాష్ట్రం పై బురద జల్లి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి పై గుడ్డ కాల్చి మొఖాన వేసిన పవన్ కళ్యాణ్ గారికి, ఇవే మా సమాధానాలు... ముందుగా, మీరు తెలుగుదేశం పై, ఆ పార్టీ నాయకుల పై చేసిన ఆరోపణలు మాకు అనవసరం.. మీరు మా రాష్ట్ర ఇమేజ్ పై చేసిన దాడికి, మా అమరావతి పై చిమ్మిన విషానికి, మా 5 కోట్ల ఆంధ్రుల కోసం కుటుంబాన్ని కూడా వదిలి కష్టపడుతున్న మా ముఖ్యమంత్రి గారి పై చేసిన విషపు ఢిల్లీ ప్రచారానికే మేము సమాధానం చెప్తాం...

ముందుగా అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకు, ముఖ్యమంత్రి గారు, 7-8వేల ఎకరాల్లో అయిపోతుంది అన్నారు... ముందు మీ భాషలో చెప్తాం పవన్ గారు.. మీరు ఒక నలుగురు ఉండటానికి, రెండు ఎకరాల్లో ఇల్లు కావలా ? మా 5 కోట్ల మంది ఆంధ్రులకి 33 వేల ఎకరాలు వద్దా ? అవును మీరు చెప్పింది నిజం, 7-8వేల ఎకరాల్లో నే రాజధాని అయిపోతుంది.. ఇప్పుడు కూడా మా అమరావతి వచ్చేది 7-8వేల ఎకరాల్లో నే ... రైతులకు భూములు ఇచ్చి, మౌలిక వసతులు పూర్తి అయితే మిగిలేది ఆ 8000 ఎకరాలు మాత్రమే.. మాకు రాజధాని కట్టుకోవటానికి డబ్బులు లేవంటే, మా రైతులు, మా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఇచ్చారు... మరి వారికి న్యాయం చెయ్యొద్దా ? వారికి డెవలప్ చేసి భూములు తిరిగిస్తే, మా రాజధానికి ఉండేది ఆ 7-8వేల ఎకరాలే...

అభివృద్ధి అంతా అమరావతిలోనే నా అంటున్నారు... అమరావతిలో కేవలం నాలెడ్జ్ సొసైటీ మాత్రమే, హాస్పిటల్స్, హోటల్స్, కాలేజీలు, స్కూల్స్, టౌరిజం తప్ప ఏమి ఉండదు... మీకు కియా ఎక్కడ వచ్చిందో తెలియదు ఏమో... మీకు ఫిన్ టెక్ వాలీ, బ్లాక్ చైన్ హబ్ ఎక్కడ వచ్చిందో తెలియదు ఏమో, మీకు హీరో హోండా, ఫాక్స్ కాన్, ఇసుజు లాంటి కంపెనీలు ఎక్కడ వచ్చాయో తెలియదు ఏమో... జాతీయ విధ్యా సంస్థలకు రాష్ట్రమంతా ఇచ్చిన సంగతి మీకు తెలియదు ఏమో.. అనంతపురంలో ఎంత నీరు వచ్చిందో మీకు తెలియదు ఏమో, గుంటూరులో వచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీలు, గోదావరి జిల్లలో ఆక్వా ప్రగతి మీకు తెలియదు ఏమో... ఒకసారి ఏ పెట్టుబడులు, ఏ రంగం ఎక్కడ విస్తరించి ఉందో, తెలుసుకోండి సార్...

 

అవినీతిలో మా రాష్ట్రం నెంబర్ వన్ అంటున్నారు... మీరు చెప్పే లెక్కలు 2016లోవి... మా ముఖ్యమంత్రి 1100 పెట్టి, ACBని బలోపేతం చేసిన తరువాత, ఈ రాష్ట్రంలో అవినీతి శాతం తగ్గింది... మా రాష్ట్రం 19వ స్థానంలో ఉంది... రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు... http://www.ncaer.org/publication_details.php?pID=282

pavan aropanalu 15032018 1

పోలవరం ప్రైవేటు కాంట్రాక్టర్ లు కడుతున్నారు అంటున్నారు... అవును సార్.. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా ప్రైవేటు కాంట్రాక్టర్ లే కట్టేది... ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, కూలీలని పెట్టుకోరు... మొన్న ఇలాగే పోలవరం పై అవినీతి అన్నారు.. వెబ్సైటు చూసుకోమంటే, తరువాత ఆ పోలవరం అవినీతి ఊసే లేదు... మరొకసారి చూసుకోండి.. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,అన్నిట్లో పారదర్సకత చూపిస్తుంది.. మీ తెలంగాణా రాష్ట్రంలా కాదు... http://polavaram.apegov.com/ispp/home

ఇక పొతే ఎర్ర చందనం... కింద ఇమేజ్ చూడండి... మీకు ఇంగ్లీష్ బాగా వచ్చుగా అర్ధమవుతుంది... ఘట్టమనేని శ్రీనివాస్ అనే IPSని (చిత్తూర్ SP గా పని చేసారు) ఇక్కడ వేసారు... ఎర్ర చందనం మాఫియా తుక్కు రేగకొట్టాడు. ఎర్ర చందనం మాఫియా హిట్ లిస్ట్ లో సీఎం కంటే ముందు ప్లేస్ లో వున్నాడు.... 20 మంది ఎర్ర చందనం స్మగ్లర్లని ఎన్కౌంటర్ చేపించిన చరిత్ర మా ప్రభుత్వానిది...

pavan aropanalu 15032018 1

ఇక మా రాష్ట్రంలో పర్యావరణానికి హాని కలుగుతుంది అంటున్నారు... మీకు ఇంకా తెలియదు ఏమో, లేక మీకు స్క్రిప్ట్ రాసిన వారికి తెలియదు ఏమో... ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2017 ప్రకారం, మా రాష్ట్రం ఫారెస్ట్ ఏరియా కవర్ పెరుగుదలలో మొదటి స్థానంలో ఉంది...

pavan aropanalu 15032018 1

ఇక ఫాతిమా కాలేజీ విద్యార్ధుల సంగతి... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతలా వారి కోసం, చేసిందో మీకు తెలియదా ? మొన్నటి దాకా మీ ఫ్రెండ్ కామినేని శ్రీనివాస్ మీ పక్కనే ఉంటూ, అన్నీ చెప్పారు కదా... సుప్రీమ్ కోర్ట్ కొట్టేసింది.. చెయ్యల్సింది కేంద్రం.. సీట్లు వేరే కాలేజీల్లో సద్దుతాం అని రాష్ట్రం అంటున్నా, మీ కొత్త స్నేహితుడు మోడీ వద్దు అన్నాడు... కేంద్రం కోర్ట్ కి వెళ్తే, సుప్రేం కోర్ట్ వద్దు అంటుంది... మీరు ఎవర్ని నిందించాలి ?

ఉచిత ఇసుక దోపిడీ అంటున్నారు... ప్రభుత్వం ఉచిత ఇసుక అంది... అంటే, కావలసిన వారు లారీ వేసుకుని వెళ్లి, అక్కడ ఇసుక నిబంధనలు ప్రకారం లోడ్ చేసుకుంటే ఫ్రీ... కాని అది అందరికీ కుదరదు కదా ... లారీకి డబ్బులు కట్టాలి, అక్కడ లోడ్ చేసి కూలి వాళ్ళకు డబ్బులు కట్టాలి... ఈ క్రమంలో మధ్యలో వాళ్ళని అప్రోచ్ అవుతారు... మీరు అన్నట్టు 15 వేలు అయితే ఎక్కడా లేదు, 6-7 వేలల్లోనే ఇసుక దొరుకుతుంది...

ఇక స్పెషల్ స్టేటస్ గురించి మాట మార్చారు మా ముఖ్యమంత్రి అంటున్నారు... మాట మార్చింది మీ కొత్త స్నేహితులు... ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి లేదు, ప్యాకేజీ ఇస్తాం, రెండు సమానమే అంటే, మన రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో కేంద్రం తెగేసి చెప్తే, ముఖ్యమంత్రి సరే అన్నారు... ఆ రోజు కూడా, నాకు హోదా ఇస్తే సంతోషం, కాని కుదరదు అంటున్నారు,అందుకే ఒప్పుకున్నా అన్నారు... కాని, ఇప్పుడు మీ కొత్త స్నేహితులు, ప్యాకేజీ ఇవ్వలేదు, పైగా మిగతా రాష్ట్రాలకి హోదా కొనసాగిస్తున్నారు.. మా ముఖ్యమంత్రి అడిగేది ఇది... ఇవ్వం అని చెప్పి, వాళ్లకి ఎందుకు ఇచ్చారు ? మా హక్కుగా ఇచ్చింది, ఇవ్వండి అంటూ, మీ అందరి కంటే ముందే కేంద్రం పై ఎదురు తిరిగారు... మీరు మోడీ అనే పదం పలికి ఆరు నెలలు అయ్యింది... ఎందుకో మీరే చెప్పాలి... కాబట్టి కేంద్రం మాట మార్చింది కాబట్టి, మా ముఖ్యమంత్రి వైఖరి మారింది...

pavan aropanalu 15032018 1

చివరగా నిన్న మా యువతని బాగా రెచ్చగొట్టారు... ఉద్యోగాలు లేవు అన్నారు. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ల నుంచి పైసా పెట్టుబడి రాలేదు అన్నారు... మీ కొత్త స్నేహితుడు, పార్లమెంట్ లో చెప్పింది సార్ ఇది..చూడండి... నాలుగేళ్లల్లో మొత్తం 2680 ఎంవోయూలు కుదిరాయని, రూ.17,80,891 కోట్లు మేర పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 41,99,357 మందికి ఉపాధి లభించనుందని వివరించారు. ఈ నాలుగు ఏళ్ళలో, 531 కంపెనీలు మొదలు పెట్టారని, వాటి విలువ 1,29,661 కోట్లు అని, పరిశ్రమల రాకతో ఏపీలో ఇప్పటి వరకు 2,64,754 మందికి ఉపాధి లభించిందని లిఖిత పూర్వకంగా వెల్లడించారు..

pavan aropanalu 15032018 1

నాలుగేళ్ళు చంద్రబాబు ఏమి చేస్తాడా చూసాను అని, ఏ బాధ్యతా లేని మీరు ఎలా అన్నారో, అలాగే 5 కోట్ల మందికి ప్రతినిధిగా బాధ్యతగా కేంద్ర వైఖరిలో మార్పు కోసం, మా ముఖ్యమంత్రి ఎదురు చూసారు... మీ విషయంలో ఉన్న లాజిక్, ఇక్కడ కూడా వర్తిస్తుంది... ఇక రాజకీయ అవినీతి అనేది అంతం లేనిది... కాని, మా రాష్ట్రంలో అది అంతగా లేదు అని చెప్పగలం.. కులాల గురించి, మీరు, మీ అన్నయ్య గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది... కుల రాజకీయాలు లేకపోతే, నిన్న మీ సభలో పావు వంతు జనం కూడా వచ్చే వారు కాదు... రాజకీయంగా మీరు ఎన్ని విమర్శలు అయినా చేసుకోండి... ఢిల్లీతో చేతులు కలిపి, మా రాష్ట్ర ప్రతిష్ట గురించి, మా అమరావతి పై విషం చిమ్ముతూ, మా భవిషత్తు తరాల కోసం కష్టపడే మా ముఖ్యమంత్రిని అంటే మాత్రం, చూస్తూ కూర్చోం...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...