Jump to content

NPK Fans


mahesh1987

Recommended Posts

  • Replies 131
  • Created
  • Last Reply
లోకేశ్‌ను నేనెప్పుడూ కలవలేదు
15-03-2018 02:37:04
 
636566782258221365.jpg
  • బాబును రెండేసార్లు కలిశాను
  • ఆంధ్రాలో నాకు వ్యాపారమే లేదు
  • పవన్‌ ఆరోపణల్లో నిజం లేదు
  • తమిళనాడు కోటాలోనే టీటీడీలోకి
  • నాటి సీఎం జయ సిఫారసు చేశారు
  • ‘ఆంధ్రజ్యోతి’తో శేఖర్‌రెడ్డి వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తన గురించి చెప్పినవన్నీ అవాస్తవాలేనని తమిళనాడుకు చెందిన మైనింగ్‌ వ్యాపారి శేఖర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను తన జీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదని, ఆయనను చూడనే లేదని చెప్పారు. తనతో లోకేశ్‌కు సంబంధాలున్నాయని, దానికి సంబంధించి ప్రధాని మోదీ వద్ద సమాచారం ఉందని, అందుకే చంద్రబాబు భయపడుతున్నారని పవన్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని తెలిపారు. బుధవారం రాత్రి ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. తమిళనాడులో ఎన్నికలకు పోటీ చేసే కొందరు రాజకీయ నాయకులు తనను పిలుస్తారని, తాను వస్తే తమకు మంచి జరుగుతుందని భావిస్తారని.. బహుశా తన పేరు ఉచ్చరిస్తే సెంటిమెంటల్‌గా జనసేన కూడా విజయం సాధిస్తుందని పవన్‌కు ఎవరో చెప్పి ఉంటారని శేఖర్‌రెడ్డి ఎద్దేవాచేశారు.
 
 
పవన్‌ను తాను టీవీల్లో, సినిమాల్లో చూడడం తప్ప నిజజీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా రెండేసార్లు కలుసుకున్నానని చెప్పారు. తనను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించినప్పుడు కొండమీద పద్మావతి గెస్ట్‌ హౌస్‌లో మిగతా సభ్యులతో పాటు సీఎంను కలిసి ఫొటో తీసుకున్నామని తెలిపారు. తర్వాత ఒకసారి తిరుపతి వచ్చినప్పుడు ఆయనకు ప్రసాదం ఇచ్చేందుకు వెళ్లానని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబును ఎప్పుడూ కలుసుకోలేదన్నారు. తమిళనాడులో ఉన్న వారికి ఆంధ్రా రాజకీయ నాయకులతో సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తనకు వ్యాపారాలు గానీ, కాంట్రాక్టులు గానీ లేవన్నారు.
 
 
తనకు 500 లారీలు, 700 పొక్లెయిన్లు ఉన్నాయని.. ఏడాదికి రూ.వంద కోట్లకుపైగా ఆదాయం ఉంటుందని తెలిపారు. తానే ఇతరులకు సహాయం చేస్తానని, ఇతరుల డబ్బు తన వద్ద ఎందుకు ఉంచుకుంటానని చెప్పారు. తనను టీటీడీలో సభ్యుడిగా తమిళనాడు కోటా నుంచే నియమించారని, తన పేరును నాటి ముఖ్యమంత్రి జయలలిత సిఫారసు చేశారని శేఖర్‌రెడ్డి తెలిపారు. తన ఇంటిపై సీబీఐ దాడులు జరిపిన కేసు గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ దర్యాప్తు అధికారులకు చిన్నమెత్తు సాక్ష్యం కూడా దొరకలేదని, అందుకే తనపై ఎలాంటి నేరారోపణలు చేయలేకపోతున్నారని చెప్పారు. తన కంపెనీ ఖాతాలు, జమ అవుతున్న డబ్బుల వివరాలు, రూ.60 కోట్లు అడ్వాన్స్‌ కట్టిన రసీదు చూశాక ఆధారాల కోసం అన్వేషిస్తున్నారని తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...