Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

బీజేపీకి చంద్రబాబు దిమ్మతిరిగే ఆన్సర్

Recommended Posts

బీజేపీకి చంద్రబాబు దిమ్మతిరిగే ఆన్సర్
13-03-2018 22:28:34
 
636565769154315217.jpg
అమరావతి: ఏపీ అసెంబ్లీలో బీజేపీకి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. రోడ్లకు కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని బీజేపీ చెబుతోందని.. అది వాళ్ల డబ్బేమీ కాదని కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పేశారు. ప్రజా ధనాన్ని వాళ్లు ఇచ్చినట్టు చెప్పుకోవడం ఏంటి? అని ప్రశ్నించారు. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్‌లో రోడ్లు వచ్చాయని.. రేపటి రోజున రోడ్లు వేసిన వాళ్లు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారని తెలిపారు. ట్రాఫిక్‌ను బట్టి రోడ్లు వస్తాయని.. అవి కూడా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతోనే రహదారులు నిర్మించారన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కావని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గడ్కరీకి ఆ రోజే తాను చెప్పానన్నారు. రోడ్లు ఇవ్వకపోతే తానే నిర్మించుకుంటానని చెప్పిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు.
 
ఇలాంటి విషయాలన్నింటినీ రాష్ట్ర బీజేపీ నేతలు.. కేంద్ర ప్రభుత్వానికి వివరించి ఏపీకి నిధులు రాబట్టాలని సీఎం సూచించారు. ఆ పార్టీ నేతలు చేసినా చేయకపోయినా.. తాను మాత్రం పని చేసుకుంటూ వెళతానన్నారు. జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని.. జాతి ప్రయోజనాల దృష్ట్యావెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దారిలోనే బీజేపీ వెళుతోందని.. అది సరైంది కాదని సీఎం ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×