Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

rk09

Heroine Indraja - About NBK

Recommended Posts

Latest in 'Ali tho Saradaga' program

Heroine Indraja - Acted in 'Peddannaya' movie

బాలకృష్ణ: చాలా గౌరవం. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ‘పెద్దన్నయ్య’ చేస్తున్నప్పుడు అప్పటికే హీరోయిన్‌గా బాగా పేరు వచ్చింది. బాలకృష్ణగారి పెద్ద స్టార్‌తో చేయడం అదే ఫస్ట్‌ టైమ్‌. సెట్స్‌కు వెళ్తున్నా. సర్‌ చాలా కోపంగా ఉంటారు. అలా ఉంటారు.. ఇలా ఉంటారు.. అని తలోమాట చెప్పి భయపెట్టేశారు. నాకేమో కాళ్లూ చేతులు వణకిపోయాయి. మీరు నమ్మరు కానీ, వన్‌ అండ్‌ ఓన్లీ, ఫస్ట్‌ హీరో నేను వెళ్లి ‘గుడ్‌మార్నింగ్‌ సర్‌’ అని చెప్పగానే లేచి నిలబడి రెండు చేతులు జోడించి ‘గుడ్‌ మార్నింగ్‌’ అని చెప్పి నన్ను కూర్చోబెట్టి, ఆ తర్వాత ఆయన కూర్చున్నారు. ఆ సంస్కారం అంతకుముందు ఎవరి దగ్గరా చూడలేదు. ఆ తర్వాత కూడా చూడలేదు.(మధ్యలో అలీ మాట్లాడుతూ.. ఆ సంస్కారం ఆయనకు ఎన్టీఆర్‌ నుంచి వచ్చింది) ఆయన ఏం మాట్లాడినా నాన్నగారి గురించే మాట్లాతారు.

 

Share this post


Link to post
Share on other sites
కృష్ణగారి షూటింగ్‌కు పిలిచి పంపించేశారు!

0415111302BRK109-INDRAJA1.JPG

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆమె జీన్‌ ప్యాంటు వేసుకొచ్చి యువకుల ‘మనసు లాగేసింది’. ఆ స్టెప్‌లకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక చైను పట్టుకుని అలా నడిచొస్తే తోటరాముడు కూడా కాంప్రమైజ్‌ అయిపోయాడు. ‘యమలీల’ చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకుని వరుస సినిమాలతో స్టార్‌ కథానాయికగా ఎదిగారు ఇంద్రజ. తన కళ్లలోని మేజిక్‌తో ప్రేక్షకులను మాగ్నట్‌లా లాగేసి, అమాయకపు నటనతో ఫ్రేమ్‌కు బ్యూటీని అద్దింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తన నటనతో మరోసారి అలరిస్తున్నారు. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే కార్యక్రమానికి విచ్చేసి, తన సినీ కెరీర్‌, అనుభవాలు, అభిప్రాయాలు, అభిరుచులను పంచుకున్నారిలా.

‘యమలీల’లో అవకాశం ఎలా వచ్చింది?
ఇంద్రజ: అదే చాలా ఆశ్చర్యకరమైన విషయం. శ్రీకాంత్‌ కథానాయకుడిగా భరత్‌ దర్శకత్వంలో ‘జంతర్‌ మంతర్‌’ షూటింగ్‌ జరుగుతోంది. అప్పటికి షూటింగ్‌ మొదలై పది రోజులైంది. ఎస్వీ కృష్ణారెడ్డిగారు స్వయంగా ఆ సినిమా సెట్స్‌కు వచ్చారు. అందరూ లేచి నిలబడి ఆయనను విష్‌ చేస్తున్నారు. బహుశా లొకేషన్‌ చూసుకునేందుకు వచ్చారేమో అనుకున్నా. నా కోసమే వచ్చారని ఆ తర్వాత తెలిసింది. అప్పటికి తెలుగు అంతగా రాదు. ఆయన మాట్లాడుతుంటే.. నేను తలూపుతున్నా. ‘మన మూవీలో నువ్వు చేస్తున్నావ్‌ అమ్మా’ అన్నారు. ‘సరే సర్‌’ అన్నా అంతే. అది ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

ఇంద్రజ తెలుగు అమ్మాయేనా?
ఇంద్రజ: మా తాతముత్తాలది ఇక్కడే చిత్తూరు. కానీ, మేము ఎప్పుడో చెన్నైలో సెటిల్‌ అయ్యాం. నా చదువంతా అక్కడే సాగింది.

చాలా కష్టపడి సంపాదించిన సొమ్ముతో చదువుకున్నారట. ఆ స్టోరీ ఏంటి?
ఇంద్రజ: నేను స్కూల్‌ టాపర్‌ని. తప్పనిసరి పరిస్థితుల్లో నటించడానికి వచ్చా. దాంతో నేను తొమ్మిదో తరగతి నుంచి చదువు ఆపేయాల్సి వచ్చింది. నాకు ఇప్పటికీ చదువంటే ప్రాణం. ఎంఏ హిస్టారికల్‌ స్టడీస్‌ పూర్తి చేశా. ఇటీవల ఎం.ఫిల్‌ చేయడానికి ఒక కాలేజ్‌లో ప్రయత్నించా. అయితే 2009లో జయలలితగారు ఒక ఆర్డర్‌ పాస్‌ చేశారు. దూర విద్య ద్వారా పీజీ పూర్తి చేసిన వారు ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ చేయడానికి వీల్లేదు. తాజాగా ఆ ఆర్డర్‌ సవరించారట. ఇప్పుడు చదువుకోవచ్చని తెలిసింది.

0415271302BRK109-INDRAJA4.JPG

మరి రజాతి ఎవరు?
ఇంద్రజ: అది రజాతి కాదు.. రాజాతి.. అది నా అసలు పేరు. తెలుగులో అమ్ములు, చిట్టి, పండు అని ముద్దు పేర్లతో ఎలా పిలుచుకుంటామో. తమిళ్‌లో రాజాతి అనేది ముద్దుపేరు. అమ్మానాన్నలకు ఐదేళ్ల తర్వాత పుట్టాను. నేనంటే చాలా ప్రాణం.

‘జంతర్‌మంత్‌’, ‘యమలీల’ సినిమాలు చేస్తున్నప్పుడు ‘హలోబ్రదర్‌’లో సాంగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది?
ఇంద్రజ: దానికి ప్రత్యేక కారణాలంటూ ఏవీ లేవు. నాగార్జునగారు, పెద్ద బ్యానర్‌, పైగా ఈవీవీ సత్యనారాయణగారు దర్శకుడు. నాతో పాటు రంభ, ఆమని కూడా చేస్తున్నారు. అప్పటికే వాళ్లు హీరోయిన్స్‌గా చేసి ఉన్నారు. అలాంటి సీనియర్స్‌ చేస్తుంటే నేను ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంది?

మీ కెరీర్‌లో బిగెస్ట్‌ మూవీ ఏది?
ఇంద్రజ: ఎవరి పక్కన చేశామన్న దాని గురించి మాట్లాడను. అందరూ నాకు ముఖ్యమే. నా వరకూ చాలా ముఖ్యమైన చిత్రమంటే ‘సొగసు చూడతరమా’. నామీద నమ్మకంతో అలాంటి ఒక పాత్రను ఇవ్వడం గుణశేఖర్‌ గొప్పతనం. నా కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అది.

హీరోయిన్‌ ఎన్ని సినిమాలు చేశారు?
ఇంద్రజ: అన్ని భాషల్లో కలిపి సుమారు 80 సినిమాలు చేశా.

ఏ సంవత్సరంలో సినిమాల నుంచి విరామం తీసుకున్నారు?
ఇంద్రజ: 2006లో మా పెళ్లయింది. మాది పక్కా లవ్‌ మ్యారేజ్‌. చెన్నై రిజిస్ట్రార్‌ ఆఫీసులో చేసుకున్నాం. అప్పటికే ఆరేళ్ల నుంచి మేము ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు మాకో ఒక పాప. పేరు సారా.

‘యమలీల’ క్లైమాక్స్‌లో మీ పాత్ర కనిపించదు. ఫీలయ్యారట?
ఇంద్రజ: ఏడ్చేశాను. క్లైమాక్స్‌ ముందు నా పాత్ర సడెన్‌గా కట్‌ అయిపోయింది. చివరిలో సారీ చెప్పి ఆ పాత్రను కూడా కలిపేస్తే బాగుండేదేమో అని ఫీలింగ్‌ ఉండేది. (మధ్యలో అలీ అందుకుని ఎలాగూ నువ్వు వస్తావని ఆడియెన్స్‌కు అర్థమైపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి ‘యమలీల’ పార్ట్‌2 తీయాలి. నవ్వులు)

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడు?
ఇంద్రజ: 2014లో వారాహి వాళ్లు తీసిన ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంతో సినిమాతో మళ్లీ నటించడం మొదలుపెట్టా.

‘అజ్ఞాతవాసి’లో కూడా నటించినట్లున్నారు?
ఇంద్రజ: అవును! చిన్న పాత్ర. అందుకు కారణం ఒకటి పవన్‌కల్యాణ్‌ అయితే మరొకటి త్రివిక్రమ్‌గారు. అందరూ మెచ్చుకునే టెక్నీషియన్‌ ఆయన. పవన్‌గారితో కాంబినేషన్‌ లేదని నాకు కథ చెప్పినప్పుడే తెలుసు. త్రివిక్రమ్‌గారి దర్శకత్వం నాకు ఇష్టం. ‘ఖలేజా’ నాకు చాలా నచ్చిన సినిమా. అది ఆడింది.. ఆడలేదు అన్న విషయాలను పక్కన పెడితే నా ఫెవరెట్‌ ఫిల్మ్‌ అది. ఆయన చిత్రంలో నటించడం ఒక ఎత్తయితే, విరామ సమయంలో ఆయన పక్కన కూర్చుని మాట్లాడటం ఒక అద్భుతమైన అనుభూతి.

‘అమ్మదొంగా’లో కృష్ణగారితో చేశారు? ఆయనతో చేయడం ఎలా అనిపించింది?
ఇంద్రజ: షూటింగ్‌ జరుగుతుండగా సెట్‌కు పిలిచారు. ‘అయ్యో అమ్మాయి చాలా చిన్నపిల్లలా ఉందే’ అని పంపించేశారు. అదో కొత్త అనుభవం. ఎలాగంటే.. నేను చెన్నైలో పుట్టి పెరగడం వల్ల ఇక్కడ ఎక్కువమంది నాకు తెలియదు. అప్పట్లో చెన్నైలో చాలా మందికి ఇద్దరు తెలుగు స్టార్స్‌ మాత్రమే తెలుసు. చిరంజీవిగారు, నాగార్జున గారు. వీళ్లిద్దరూ బాగా తెలుసు. నిజం చెప్పాలంటే కృష్ణగారు కూడా నాకు తెలియదు. రాజకీయాల వల్ల ఎన్టీఆర్‌, ‘దేవదాస్‌’ సినిమా వల్ల ఏఎన్నార్‌గారి గురించి తెలుసు. ‘అమ్మదొంగా’ దర్శకుడు సాగర్‌ చాలా మంచి వ్యక్తి. హర్ట్‌ అయ్యేలా ఒక్క మాట కూడా మాట్లాడరు. చిన్న పిల్లలా ఉన్నానని మొదటి పంపించి వేసినా, ఏం జరిగిందో తెలియదు సినిమాలో తీసుకున్నారు. అందులో రెండు భిన్న మనస్తత్వాలున్న పాత్ర నాది.

0415271302BRK109-INDRAJA6.JPG

ఇంకో విషయం ఏంటంటే అప్పుడు నేను ‘గుడ్‌ మార్నింగ్‌’ అని చెప్పినా, ‘వెళ్లొస్తా’నని చెప్పినా, కృష్ణగారు కేవలం తలమాత్రమే ఊపేవారు. నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. నాపైన ఏమైనా కోపమా? నేను సరిగా నటించడం లేదా? ఆయన టైమింగ్స్‌ను నేను అందుకోవడం లేదా? అని ఫస్ట్‌ డే రూమ్‌కు వెళ్లిపోయి ఏడ్చేశాను. మేకప్‌మ్యాన్‌, హెయిర్‌డ్రస్సెర్‌ అందరూ చెబుతున్నారు. ‘అలా ఏమీ కాదమ్మా! ఆయన అంతే. అందరితోనూ అలాగే ఉంటారు. ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు.’ అని ఎంతమంది చెప్పినా నా కళ్లలో నీళ్లు ఆగేవి కావు. ఆ తర్వాత నెమ్మదిగా అర్థమైంది. ఇక నేను హీరోయిన్‌గా వచ్చిన కొత్తలో నాకు ఇచ్చిన మొదటి సలహా కాలుపై కాలువేసుకుని కూర్చోకూడదు. స్ట్రయిట్‌గా కూర్చోమనేవారు. నాకేమో చిన్నప్పటి నుంచి కాలుమీద కాలువేసుకుని కూర్చోవటం అలవాటు. అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తెలిశాక ‘హమ్మయ్యా’ అంటూ కాలుమీద కాలేసుకుని కూర్చునేదాన్ని. కానీ, కాలుమీద కాలేసుకున్నా అస్సలు పట్టించుకోని ఫస్ట్‌ హీరో కృష్ణగారు. ఆయన ముందు ఛైర్‌మీద కాలు పెట్టినా పట్టించుకోరు. మాట్లాడినా పట్టించుకోరు. షూటింగ్‌లో తప్పుచేసి ‘వన్‌మోర్‌ సర్‌’ అడిగితే ‘పర్లేదు.. పర్లేదు’ అనేవారు. అంత సీనియర్‌, గొప్ప నటుడు అయి ఉండి కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది.

ఆమని, సౌందర్యలతో చేయడం ఎలా అనిపించింది?
ఇంద్రజ: వాళ్లిద్దరూ అప్పటికే చాలా సినిమాలు చేశారు. పైగా కన్నడవాళ్లు ఎప్పుడూ కన్నడలోనే మాట్లాడుకునేవాళ్లు. నేనేమో ఓ పక్కకు కుర్చీవేసుకుని కూర్చుని అలా చూస్తూ ఉండేదాన్ని. దూరంగా వెళ్లిపోయేదాన్ని. ఆ తర్వాత, సౌందర్య, ఆమని రమ్మని పిలిచేవారు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు.

శ్రీకాంత్‌ వైఫ్‌ ఊహ, ఇంద్రజ అక్కాచెల్లిళ్లా?
ఇంద్రజ: దగ్గర పోలికలు ఉంటాయని చెబుతారు. ఈ విషయం చాలామంది నాతో అన్నారు కూడా. మీరు ఊహనా? అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు.

0415221302BRK109-INDRAJA3.JPG

బాలకృష్ణగారితో చేసిన తర్వాత ‘చిన్న హీరోలతో నేను చేయను’ అన్నారట?
ఇంద్రజ: ఇది అస్సలు నిజం కాదు. ఏదైనా ఒకటి రెండు సినిమాలు రిజెక్ట్‌ చేసి ఉంటాను. కానీ, దానికి కారణం మాత్రం ఇది కాదు. నిజం చెప్పాలంటే వరుసగా సినిమాలు చేస్తున్నా, నాకు పేమెంట్‌ మాత్రం పెరగలేదు. 1995లో హీరోయిన్‌గా 13 సినిమాలు చేశా. కానీ, పేమెంట్‌ దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువగా ఉంది. నాకు దగ్గరవాళ్లు ఇచ్చిన ఓ సలహా ఇచ్చారు. ‘సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా, చూసి చేయండి’ అని చెప్పారు. ‘సొగసు చూడతరమా’, ‘పెద్దన్నయ్య’సినిమాల్లో మంచి పాత్రలు దక్కాయి. నేను ఏదైనా సినిమాను రిజెక్ట్‌ చేసి ఉంటే.. అది పేమెంట్‌ లేదా, క్యారెక్టర్‌ నచ్చకపోవడం వల్ల అయి ఉంటుంది. వేరే కారణాలు ఏమీ లేవు.

కృష్ణారెడ్డిగారు, గుణశేఖర్‌ వీరిద్దరూ ఇంద్రజ కెరీర్‌ను మలుపు తిప్పారు? వీరిలో ఫస్ట్‌ మీరు ఎవరి పేరు చెబుతారు?
ఇంద్రజ: కచ్చితంగా ఎస్వీ కృష్ణారెడ్డిగారి పేరే చెబుతా. నేను ఎలా పనిచేస్తానో తెలియదు. ఈ అమ్మాయికి యాక్టింగ్‌, డ్యాన్స్‌ వచ్చా? రాదా? స్క్రీన్‌పై ఎలా ఉంటుంది? వంటివి ఏవీ పట్టించుకోకుండా సినిమాలో తీసుకున్నారు. చివరికి ఫొటో, వీడియో షూట్‌లు కూడా చేయలేదు.

‘యమలీల’ ఎక్కడ చూశారు?
ఇంద్రజ: ఇక్కడే హైదరాబాద్‌లో చూశా!

ఆ సినిమా విడుదలయ్యాక బయటకు వెళ్తే ఎలా ఉండేది?
ఇంద్రజ: చాలా బాగుండేది. రైల్వే స్టేషన్‌, ఎయిర్‌పోర్ట్‌ ఎక్కడికి వెళ్లినా జీను ప్యాంటు.. జీను ప్యాంటు.. అని అరిచేవాళ్లు.

‘సొగసు చూడతరమా’ విడుదలయ్యాక నంది అవార్డు మిస్సయింది కదా!
ఇంద్రజ: అప్పటి వరకూ హీరోయిన్స్‌కు డబ్బింగ్‌ వాయిస్‌ ఉన్నా ఉత్తమనటిగా అవార్డు ఇచ్చారు. కానీ, ఆ సంవత్సరమే ఉత్తమ నటిగా నామినేట్‌ అయ్యేవాళ్లకి డబ్బింగ్‌ వాయిస్‌ ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. అలా నిబంధనలు మార్చారు. ‘సొగసు చూడతరమా’లో నాకు గౌతమిగారు డబ్బింగ్‌ చెప్పారు. అందరూ నాకు నంది అవార్డు వస్తుందని కంగ్రాట్స్‌ కూడా చెబుతుండేవారు. తీరా చూసేసరికి నా పేరు లేదు. చాలా నిరాశపడ్డా. (మధ్యలో అలీ అందుకుని అప్పటినుంచి ఈ గొడవ జరుగుతూనే ఉంది. ‘యమలీల’కు ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సంగీత దర్శకత్వం ఇవ్వాలి.) బెస్ట్‌ మ్యూజిక్‌ అయితే తప్పకుండా ఇవ్వాలి (మళ్లీ అలీ అందుకుని.. కానీ, ఒక్కటి కూడా రాలేదు. 1994లో ఆ సినిమా ఒక థియేటర్‌లో ఏడాది పాటు ఆడింది. కనీసం సినిమాకు ఇచ్చినా బాగుండేది. అవార్డ్స్‌ వాళ్లు ఇవ్వకపోయినా పర్వాలేదు వీళ్లు(ప్రేక్షకులు) ఇస్తేచాలు)

రీ ఎంట్రీ ఇచ్చారు కదా! ఎలాంటి పాత్రలు ఆశిస్తున్నారు?
ఇంద్రజ: నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేయాలని ఉంది.

అందంగా ఉన్న అమ్మాయికి ప్రాబ్లమ్స్‌ వస్తుంటాయి. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా?
ఇంద్రజ: చాలా సమస్యలు వచ్చాయి. తప్పదు కదా! స్విమ్‌సూట్‌, టూపీసెస్‌ వేసుకోమని చెప్పారు. కానీ, నేను సున్నితంగా తిరస్కరించా. చాలా గ్లామర్‌ పాత్రలు చేశా. స్కట్స్‌, షార్ట్స్‌ అన్నీ వేసుకుని చేశా. కానీ, స్విమ్‌ డ్రెస్‌మీద పెద్దగా ఒపీనియన్‌ లేదు. తమిళంలో విజయశాంతి సొంత  బ్యానర్‌లో ‘తడయం’ చేశా. ‘మీరు తప్పక చేయాలి’ అన్నప్పుడు షార్ట్స్‌ వేసుకుని చేయాల్సి వచ్చింది.

0415171302BRK109-INDRAJA2.JPG

‘పెద్దన్నయ్య’ షూటింగ్‌ సమయంలో బాలకృష్ణగారు ఒక గిఫ్ట్‌ ఇచ్చారట!
ఇంద్రజ: నవ్వులు.. అవును! పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ ఇచ్చారు. ఆ బాటిల్‌ ఆర్టిస్టిక్‌గా, మోడల్‌గా అమ్మాయి ఆకారంలో ఉంటుంది. ( వెంటనే అలీ అందుకుని ఆ బాటిల్‌ తన వైఫ్‌కు ఇద్దామని తెచ్చారు. ఛీ.. ఛీ ఇదే బాటిల్‌ అంటే నీకు ఇచ్చారేమో..నవ్వులు)

‘పెద్దన్నయ్య’ తర్వాత పెద్ద హీరోలతో చేసే అవకాశం ఎందుకు రాలేదు?
ఇంద్రజ: అదే నాకూ అర్థం కాలేదు. ఆ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. అయితే రెండు సార్లు చిరంజీవి గారితో నటించే అవకాశం పోయింది. ‘హిట్లర్‌’లో చిరంజీవిగారి చెల్లెలి పాత్రలో రాజేంద్రప్రసాద్‌గారి పక్కన నేను నటించాల్సి ఉంది. ఆ పాత్రను మోహిని చేశారు. డేట్లు ఎక్కువగా కావాలని అడిగారు నాకు కుదరలేదు. రెండోసారి కూడా అవకాశం వచ్చింది. ఆ పాత్రను ఊహ చేసింది. ఈవీవీ సత్యనారాయణగారి దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడా మజాకా’ అనుకుంటా. అయితే అఫీషియల్‌గా వాళ్లు వచ్చి కలవలేదు. ‘డేట్స్‌ ఉన్నాయా’ అని మా మేనేజర్‌ని అడిగారట. ఆ చిత్రం కూడా మిస్సయ్యాను. ఇటీవల ‘శతమానంభవతి’ సక్సెస్‌మీట్‌కు చిరంజీవిగారిని కలిశాను. అసలు నన్ను గుర్తు పడతారా? అనుకున్నా. ‘హేయ్‌ ఇంద్రజా! ఎలా ఉన్నావ్‌. ఎక్కడకు వెళ్లిపోయావ్‌. చాలా రోజులైంది చూసి’ అని ఎంత ప్రేమగా మాట్లాడారో. నాకోసం కూడా సినిమా చూస్తానని చెప్పారు.

‘శతమానంభవతి’లో చేయడం ఎలా అనిపించింది?
ఇంద్రజ: జయసుధ, శ్రీప్రియ అంటే నాకు ఎంతో అభిమానం. జయసుధ చాలా మంచి మనిషి. ప్రకాష్‌రాజు గారు చాలా తక్కువ మాట్లాడతారు. తక్కువ మాట్లాడినా, మీనింగ్‌ఫుల్‌గా మాట్లాడతారు.

‘ఫలానా సినిమాలో ఇంద్రజ హీరోయిన్‌’ అని చెప్పిన తర్వాత మిస్సయినవి ఏవైనా ఉన్నాయా?
ఇంద్రజ: అఫీషియల్‌గా ఎవరూ చెప్పలేదు. కానీ అప్పట్లో ఓ రూమర్‌ విన్నా. ‘పెళ్లి సందడి’లో నేను, ఊహ ‘అక్క, చెల్లిళ్లుగా పెట్టుకుంటే బాగుంటుంది’ అని అనుకున్నారట. ‘చిత్ర బృందం త్వరలోనే మిమ్మల్ని కలుస్తారు’ అని కూడా కొందరు చెప్పారు. నేను కూడా సంతోషపడ్డా. పెద్ద దర్శకుడు, పైగా అదో ప్రత్యేకమైన చిత్రం. అయితే అది రూమర్‌ అని తర్వాత తెలిసింది.

సౌందర్య, ఆమని, మీనా, రోజా వీరిలో నీకు ఎవరు క్లోజ్‌గా ఉండేవాళ్లు?
ఇంద్రజ: సౌందర్య, ఆమని చాలా క్లోజ్‌. వీళ్లతో కలిసి రెండు, మూడు సినిమాలు చేశా. రోజాగారితో కలిసి ఒక్క సినిమానే చేశా. మీనాతో కలిసి తమిళ్‌లో పనిచేశా. తెలుగులో చేయలేదు.

ఇరవై నాలుగేళ్ల కిత్రం ఇండస్ట్రీ బాగుందా? ఇప్పుడు బాగుందా?
ఇంద్రజ: రెండు భిన్నమైన ఇండస్ట్రీలు చూస్తున్నట్లు ఉంది. ఇప్పుడు ఉన్నది పూర్తిగా మారిపోయింది. మంచీ చెడు చెప్పడానికి మనం ఏమీ కాము. మనం కేవలం వచ్చి వెళ్లే వాళ్లము మాత్రమే. ఇంద్రజ కూడా మారింది. బాధ్యతలు, భక్తి పెరిగాయి.

మాట్లాడే ముందు బాబా.. తర్వాత బాబా అంటారు? ఎలా కుదిరింది అనుబంధం?
ఇంద్రజ: జీవితంలో చాలా మిరాకిల్స్‌ జరిగాయి. దేవుడి విషయంలో ఏదో ఒకటి జరిగితే వచ్చేది కాదు. లోపలి నుంచి రావాలి. ఒక సందర్భం వచ్చినప్పుడు గుర్తిస్తాం.

0415321302BRK109-INDRAJA5.JPG

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో ఇంద్రజ సమాధానం
తెలుగు ఇండస్ట్రీ: పుట్టిల్లు
మలయాళం ఇండస్ట్రీ: మెట్టినిల్లు
ఎస్వీ కృష్ణారెడ్డి: గురువు
గుణశేఖర్‌: మాస్టర్‌
అలీ: మంచి స్నేహితుడు
చదువు: ప్రాణం
హైదరాబాద్‌: మై హార్ట్‌
సాయి బాబా: మై లైఫ్‌
కోపం: ఇప్పుడు తగ్గిపోయింది.
బాలకృష్ణ: చాలా గౌరవం. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ‘పెద్దన్నయ్య’ చేస్తున్నప్పుడు అప్పటికే హీరోయిన్‌గా బాగా పేరు వచ్చింది. బాలకృష్ణగారి పెద్ద స్టార్‌తో చేయడం అదే ఫస్ట్‌ టైమ్‌. సెట్స్‌కు వెళ్తున్నా. సర్‌ చాలా కోపంగా ఉంటారు. అలా ఉంటారు.. ఇలా ఉంటారు.. అని తలోమాట చెప్పి భయపెట్టేశారు. నాకేమో కాళ్లూ చేతులు వణకిపోయాయి. మీరు నమ్మరు కానీ, వన్‌ అండ్‌ ఓన్లీ, ఫస్ట్‌ హీరో నేను వెళ్లి ‘గుడ్‌మార్నింగ్‌ సర్‌’ అని చెప్పగానే లేచి నిలబడి రెండు చేతులు జోడించి ‘గుడ్‌ మార్నింగ్‌’ అని చెప్పి నన్ను కూర్చోబెట్టి, ఆ తర్వాత ఆయన కూర్చున్నారు. ఆ సంస్కారం అంతకుముందు ఎవరి దగ్గరా చూడలేదు. ఆ తర్వాత కూడా చూడలేదు.(మధ్యలో అలీ మాట్లాడుతూ.. ఆ సంస్కారం ఆయనకు ఎన్టీఆర్‌ నుంచి వచ్చింది) ఆయన ఏం మాట్లాడినా నాన్నగారి గురించే మాట్లాతారు.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×