Jump to content

ఎట్టకేలకు.. పెద్దల సభకు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి


koushik_k

Recommended Posts

  • ఎట్టకేలకు.. పెద్దల సభకు
  • పోటీకైనా ‘సై’ అంటూ రంగంలోకి..
  • ఊహించని రీతిలో ఏకగ్రీవం
  • వీపీఆర్‌కు దక్కిన రాజ్యసభ స్థానం
ఐదేళ్ల పాటు ఎదురు చూశారు. ఆ పదవి కోసం రెండు ప్రధాన పార్టీలను ఆశ్రయించారు. ఏకగ్రీవం కాకపోయినా.. పోటీకైనా సిద్ధమే అవకాశం ఇవ్వమన్నారు. చివరికి వైసీపీ ఆయనకు ఆ అవకాశమిచ్చింది. పరిస్థితులు కలిసి వచ్చాయి. ఊహించని రీతిలో ఆయన్ను ఏకగ్రీవం చేశాయి. ఇప్పటికే జిల్లా నుంచి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా ఇప్పుడు వీపీఆర్‌ ఎన్నికతో వైసీపీ నుంచి రెండో స్థానం కూడా జిల్లాకే దక్కినట్లయింది.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజకీయ పరిస్థితులు కలిసి రావడం.. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాల ఫలాలు ప్రతిఫలించడం.. కారణం ఏమైతేనేం!. ఊహించని రీతిలో రాజ్యసభకు ఏకగ్రీవమయ్యారు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. తన పేరు పక్కన ఎంపీ అనే రెండక్షరాల గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించడంతో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలు ఏకగీవ్రం అయ్యాయి. ఆ క్రమంలోనే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వీపీఆర్‌ 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు.
 
రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పార్టీ అభిమానుల నుంచి ఆర్థిక వనరులను పార్టీకి సమకూర్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిఉంటే అప్పట్లోనే వీపీఆర్‌కు రాజ్యసభ స్థానం దక్కేది. పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ అవకాశం పార్టీ కీలకనేత విజయ సాయిరెడ్డికి దక్కింది. దీంతో జగన్‌పై కినుక వహించిన వీపీఆర్‌ వైసీపీకి దూరమయ్యారు. ఈ సమయంలోనే మానసికంగా టీడీపీకి దగ్గరయ్యారు. రాజ్యసభ సీటు ఇస్తామంటే పార్టీలో చేరుతానని కండిషన్‌ పెట్టారు. అవసరం అయితే మూడో స్థానానికి పోటీ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని, మొత్తం ఎన్నికల నిర్వహణ భారం తానే మోస్తానని వివరించారు. అయితే దీనికి పార్టీ అధినేత చంద్రబాబు అంగీకరించలేదు. ముందు పార్టీలో చేరండి, పనిచేయండి ఆ తరువాత ఆలోచిద్దాం అనడంతో వీపీఆర్‌ వెనక్కు తగ్గారు. తాజాగా మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యే దశలో జగన్‌ పావులు కదిపారు.
 
 
వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో వలస వెళ్లిన క్రమంలో మూడో స్థానానికి టీడీపీ పోటీ పెడుతుందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇలా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించిన వైసీపీ ఆ పోటీని తట్టుకొని నిలబడగలిగే శక్తి కలిగిన వీపీఆర్‌ను అందుకు ఎన్నుకొంది. పోటీ అనివార్యమైనా తాను సిద్ధమేనని వీపీఆర్‌ స్పష్టం చేయడంతో వైసీపీ ఆయనను బరిలోకి దించింది. అలా అటు తెలుగుదేశంలో, ఇటు వైసీపీ నుంచి కూడా పోటీకి సిద్ధపడిన వీపీఆర్‌ను ఎట్టకేలకు అదృష్టం వరించింది. సంవత్సర కాలంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్న క్రమంలో ప్రతిపక్షాన్ని చీల్చి ప్రజల్లో విలువలకు సంబంధించిన చర్చను లేవనెత్తడం మంచిది కాదన్న ఉద్దేశ్యంతో టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. దీంతో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చిరకాల కాంక్ష సునాయాసంగా నెరవేరింది. ఇప్పటికే జిల్లావాసిగా విజయసాయిరెడ్డి రాజ్యసభలో వైసీపీ ఎంపీగా కొనసా గుతున్నారు. ఇప్పుడు వీపీఆర్‌ ఏకగ్రీవంతో వైసీపీ నుంచి రెండో స్థానం కూడా జిల్లాకే దక్కినట్లయింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...