Jump to content

నిష్క్రమణలూ నిజాలూ - Telkapalli Ravi Analysis


koushik_k

Recommended Posts

జోవాదా కియాతో నిభానా పడేగా. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఒకమాట ఒక బాణం అన్న రాముడే రాజ కీయ చిహ్నంగా రాజ్యాధికారం సాధించుకున్న వారు మరింతగా వాగ్దాన పాలన చేయాలి. చేస్తారనే విశ్వసించారు తెలుగు ప్రజలు. విశ్వసించేలా చేసింది తెలుగుదేశం, ఆ పార్టీ నాయకత్వం. బిజెపి టిడిపి కలిపి కేంద్రంలో ఆంధ్రలో అధికారంలోకి వచ్చాయి నాలుగేళ్లు గడిచాక ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలేవీ కేంద్రం అమలు చేయలేదన్న ఆగ్రహావేదనలు ప్రజల్లో ప్రజ్వరిల్లితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇన్నాళ్లు అవమానించారని ముఖ్యమంత్రి శాసనసభలో చెబుతున్నారు. రావలసినవి రాలేదని ఘోషిస్తున్నారు. ఇదే విషయమై మాలాటి వాళ్లం ఈ గమనంలోనే చాలాసార్లు విమర్శిస్తుంటే, చర్చల్లో చెబుతుంటే నెగిటివ్‌ మైండ్‌ అన్నారు. ముందే కూసిన కోయిలల వలె కేంద్రం సహాయాన్ని కీర్తిస్తూ సన్మానాలూ తీర్మానాలు చేశారు. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీయని వేల్పు... అన్న సుమతి పద్యంలా పైనున్న అరుణ్‌ జైట్లీ మాత్రం ససేమిరా విదిలించేది లేదు పొమ్మని విసిరికొట్టాక ఆఖరి ఘట్టంలో అనివార్యంగా మోడీ ప్రభుత్వం నుంచి నిష్క్రమించారు. ఎన్‌డిఎను అంటిపెట్టుకునే వున్నారు. ఇప్పటిదాకా అడుక్కున్నాం ఇక ఒత్తిడి చేస్తామని గొప్పగా చెప్పినా ఇంకా వేడుకోలు రాగాలే ఆలపిస్తున్నారు. వీరెంత ఆవేదనగా అశ్రుధారలతో మాట్లాడినా అక్కడ అమితాహం తలకెక్కిన, నమో స్మరణకు అలవాటు పడిన వారు పట్టించుకునే ప్రసక్తి వుండదు. తమకు రాజకీయ లాభం రాని చోట వరాలు వనరులు తరలించడం బిజెపి విధానమే కాదు. మిత్రపక్షాలను మింగడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని మహారాష్ట్ర, హర్యానా, అస్సాం, తాజాగా నాగా మిజోరం అనుభవాలు చెబుతున్నాయి. అయినా విభజిత రాష్ట్రానికి విదిలింపులే ప్రసాదం అంటూ ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధి పేరుతో అంటకాగిన తెలుగుదేశం ఆలస్యంగా వ్యూహాత్మకంగా బయటకు వస్తున్నది. ఆ స్థానంలో ప్రవేశిద్దామని ఆశలు పెంచుకున్న వైసీపీ నేత జగన్‌ అవిశ్వాస వ్యూహంతో అస్తిత్వం కాపాడుకోవాలనుకుంటున్నారు.
 
14వ ఫైనాన్స్‌ కమిషన్‌ సాకుతో ప్రత్యేక హోదాను సమాధి చేసినప్పుడూ తాడూ బొంగరం లేని ప్యాకేజి ప్రహసనం నడిపినప్పుడూ ఏళ్లతరబడి పైసలు రాల్చకుండా ప్రదక్షిణలు చేయించినప్పుడూ తెలుగుదేశం నోరెత్తలేదు. పోలవరం ఇఎపి మనకు వరప్రసాదాలైనట్టు వంతపాడిన ఉదంతాలు ఉదహరిస్తే తట్టుకోలేనన్ని వున్నాయి. లోటు భర్తీకి పోటు పోడిచినప్పుడు కూడా మౌనమూనిన సందర్భాలున్నాయి. అభీష్టానికి భిన్నంగా విభజనకు గురైన అగచాట్లలో చిక్కిన రాష్ట్రానికి అత్యవసర ఆర్థిక సహాయం కూడా అందించని కేంద్రంపై అఖిలపక్ష ఒత్తిడి తెచ్చేబదులు ఆర్థిక లాభమే అంతిమమని భావించడం దీనంతటికీ మూల కారణం. పులిమీద పుట్రలా అటూ ఇటూ కేసులూ తిరకాసులతో గట్టిగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు టిడిపి వైసీపీ వైరుధ్యాలను బిజెపి ఉపయోగించుకోగలిగింది. ఆర్ద్రత అన్న పదమే నిఘంటువులో లేని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్ర ప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను సానుభూతి కింద తీసిపారేశారు. రాజ్యాంగ కమిట్‌మెంట్‌ను సెంటిమెంటు కింద ఆయింటుమెంటు కింద ఈసడించేశారు. తెలుగు రాష్ట్రాల న్యాయమైన కోర్కెలను పరిష్కరించే బదులు కేంద్రం బలంగా వుంటేనే మీ మనుగడ అని తేలిక చేశారు. ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీల ప్రసక్తి లేదు, లోటు ఎంతో తేల్చే పద్ధతి లేదు అంటూ హళ్లికి హళ్లి సున్నకు సున్న వేశారు.
 
ఇఎపి కింద రూపాయి రావాలంటే ప్రత్యేక వ్యవస్థ (స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌-–ఎస్‌పివి) వుండాలంటూ ఆరేడు నెలల కాలం పట్టే కొత్త మెలిక పెట్టారు. అవి అయిపోతే రైల్వేజోన్‌ వంటివి చిటికలో పని అంటూ చిటిక మాత్రం వేయకుండా చీదరించుకున్నారు. దీనంతటి తర్వాత కూడా భగ్గున మండిపోవడానికి బదులు బాధేస్తుంది అని మాత్రమే అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబులో అపర బుద్ధుడే అగుపిస్తున్నాడు. ఆయనపై అగ్నిహోత్రుడై విరుచుకుపడే విపక్ష నేత జగన్‌ అరుణ్‌ జైట్లీని ఆక్షేపించేబదులు అదంతాఇదివరకు చెప్పిందేనని సరిపెట్టారు. అప్పుడు వూరుకుండి ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని చంద్రబాబును అడుగుతున్నారే గాని అప్పుడూ ఇప్పుడూ తప్పే చెబుతున్న అరుణ్‌ జైట్లీని నిలదీయడం లేదు. ప్రత్యేక హోదా మంత్రం, అవిశ్వాస తంత్రం తప్ప అన్యమైన ఆయుధాలు కేంద్రంపై ప్రయోగించరాదని నిర్ణయించుకున్నారన్న మాట. ఆఖరి దశకు వచ్చినా ఇంకా దశలవారి వ్యూహం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎలాగూ ఫలించని అవిశ్వాసం నోటీసు, నామకార్థపు రాజీనామాలు, తమ ప్రభుత్వం వచ్చాక జరిగే న్యాయం గురించే జగన్‌ అభిభాషిస్తున్నారు. పాలక పక్షం విఫలమైన చోట ప్రతిపక్షం చొరవ చూపాలి గాని ఇరు పక్షాలూ విఫలం కావడం ఏపీకే ప్రత్యేకం.
 
ఏమైనా ప్రత్యేకహోదానూ చట్టరీత్యా రావలసిన ప్రయోజనాల సమస్యనూ భూస్థాపితం చేయడంలో జయప్రదమైనామని సంతోషించిన వారికి ఈ తాజా పరిణామాలు చెంపపెట్టే. పైనే చెప్పినట్టు దీనికి కారణం వామపక్షాలూ ప్రత్యేక హోదా సాధన సమితి వంటి సంస్థలూ ప్రజా సంఘాలూ మీడియా చర్చలూ తప్ప రెండు ఫ్రధాన పార్టీలు కాదు. చివరి నిముషంలో వీరోచితంగా మాట్లాడినా తెలుగుదేశం ఇప్పటివరకూ రాజీపడిన వాస్తవం చెరిగిపోదు. ప్రత్యేక హోదా మంత్ర జపం ఎంత చేసినా కేంద్రంపై ప్రతిఘటనలో వైసీపీ వెనకంజ దాగదు.తమ తమ రాజకీయ ఘర్షణ ఎలా వున్నా రాష్ట్రం కోసం కలసికట్టుగా అడుగేయాలని వారు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే కేంద్రం దిగివస్తుంది. సీనియర్‌ రాజకీయవేత్తగా ఈ విషయంలో ఈ సమయంలో చొరవ తీసుకుని అందరి సహకారం కూడగట్టవలసిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై వుంటుంది. రాజకీయ అవసరాలకోసం కేంద్రం అనుచిత వైఖరి వాస్తవాలను బయిటపెట్టడంలో తటపటాయిస్తే అందుకు టిడిపి మూల్యం చెల్లించవలసి వస్తుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన నిజాలను అంచనాలను పారదర్శకంగా ప్రజల ముందుంచాల్సిన బాధ్యత కేంద్రంపైనా వుంది. ఇది ఆ రెండు పార్టీల ముచ్చట ఎంతమాత్రం కాదు. పరస్పర ఆధిక్యత కోసం వ్యూహాత్మకంగా ఆరోపణలు వినిపిస్తుంటే ఉభయుల బండారమూ తెలుస్తుంది.
 
సరిగ్గా ఈ సమయంలోనే తృతీయ ప్రత్యామ్నాయం గురించిన చర్చకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెరలేపడం యాదృచ్ఛికం కాదు. గతంలో చాలాసార్లు మోడీని అతిగా పొగిడిన కెసిఆర్‌ ఈ పిలుపునివ్వడంలో అంతర్గత వ్యూహాలు మాత్రమే చూస్తే పాక్షికమవుతుంది. రాష్ట్రాల రాజ్యాంగ హక్కులపై ఆర్థిక వనరులపై మోడీ సర్కారు స్వారీ చేస్తున్న తీరుకు స్పందనగానూ చూడాల్సి వుంది. ఒక్కసారి కేంద్రం జోక్యం కారణంగా తప్ప- నలభై ఏళ్లు సిపిఎం పాలనలో వున్న త్రిపురలో బిజెపి గెలవగానే లెనిన్‌ విగ్రహాలు కూలుస్తున్నతీరు దేశానికి ఒక తీవ్ర హెచ్చరికగా వుంది. తన రాజకీయ ముసాయిదాలో కాంగ్రెస్‌తో కలసి వెళ్లే అవకాశం లేదన్న సిపిఎం, కలసి వెళ్లాలంటున్న సిపిఐ, ఇంకా చాలా ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపిని మతతత్వం అసహన రాజకీయాలను ఓడించే విషయంలో ఏకీభవిస్తాయి. మరోవైపు రాష్ట్రాల వారి ప్రత్యేకతలూ రాజకీయ వైరుధ్యాలు జాతీయ ప్రాంతీయ పాలకపక్షాల ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించాల్సిన పరిస్థితులూ వుంటాయి. యుపిలో ఎస్‌పికి ఉప ఎన్నికల్లో బిఎస్‌పి మద్దతు నివ్వడం గాని, మహారాష్ట్రలో శివసేన దూరం కావడం గాని, రాజస్థాన్‌ ఎంపి ఉప ఎన్నికల ఫలితాలు గాని మోడీత్వ విజృంభణ పరిమితులేమిటో చెబుతున్నాయి. ఏతావాతా తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో పరిణామాలు ఎన్ని కల ముంగిట్లో రాజకీయ పునస్సమీకరణ క్రమాన్ని వేగవంతం చేస్తాయి. మరి ఈ సమరంలో ఏ పార్టీలు ఏ నాయకులు ఏ మేరకు నిలబడేది భవిష్యత్తు చెప్పాలి. దాన్ని బట్టి ప్రజలు తీర్పులివ్వాలి.
Link to comment
Share on other sites

Pratyeka hoda inka janala nolalo nanataniki karanam communist la.. Valu tdp vallu modalu pettina taruvate active ayyaru... Andaru kalisi vathidi tevali antaru malli tdp munduku vaste tdp ni tidatanike mundu untaru kani ycp ni oka mata anaru ee communist lu.. Cbn Noru etaledu antunadu 2014 nunchi monnati daka vellina pratisari ayana press meet petti tana vanini vinipistune unadu inkem emi chestadu  elli kotti ravala pm ni... Leda state lo rally lu cheyala road lu ekki... Ayana atu itu tirigi adukuni company lani teesukuni rataniki try chestunadu ah road lekkina janalani chuste evadana vastada state ki... Prati vishayam centre chetilo unnapudu vinayanga ne undi pani chepinchukovali anukunadu dani kosam  avamanalu paddadu.. Lotu budget lo kuda evariki takkuva cheyakunda munduku teesukuni vellutunadu... Article rayataniki emundi nenu rastanu article pen book unte chalu akkada kastapade vadiki telustundi g lo noppi ento.. 

Link to comment
Share on other sites

First of all, we article rasinapeddavariki BJP meeda clear vyatirekata kanapadutondi. Perhaps communist bavajalam vunna varu ayivundochu. Modi dabbulu ivvadu ani munde vuhincham ani cheppatam aa vyatirekhata lo nundi vachina statement. Last NDA govt Lo nidulu vachai kabatti NDA and govt lo vunnam. CBN NDA lo lekapote dabbulu vacheva ane konam lo above writer rayaledu...also ee article after the fact rasinattu vundi ante anta jarigina taruvata tappulu pattatam.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...