Jump to content

ఏపీకి మరోసారి కేంద్రం మొండిచేయి...


Npower

Recommended Posts

ఏపీకి మరోసారి కేంద్రం మొండిచేయి...
06-03-2018 17:36:54
636559546146888261.jpgన్యూఢిల్లీ: ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై సూటిగా సుత్తిలేకుండా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసేసింది. హోదా ఇవ్వడం కుదరదని కుండబద్దలుకొట్టింది. ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని ప్రకటించింది. హోదాకు బదులుగా ఇంతకుముందు ప్రకటించిన ప్యాకేజీకి మాత్రమే తాము పరిమితమని, మిగిలినవి ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
 
నిన్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ అయింది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జైట్లీకి స్పష్టం చేసింది. అంతేకాదు.. పన్ను రాయితీలు కూడా కల్పించాలని కోరింది. అయితే ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలను ఏపీకి ఇవ్వటం కుదరదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీ కంటే వెనుకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయని, రాయితీలు ఇస్తే ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని కేంద్రం తెలిపింది. మొత్తంగా రాయితీలు ఇవ్వాలా? వద్దా? అనేది వాణిజ్య మంత్రిత్వశాఖతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి.
 
పనిలో పనిగా కొన్ని రాజకీయ వ్యాఖ్యలను కూడా కేంద్రం చేసింది. తెలుగు సానుభూతి అంటూ రాజకీయ వేడిని పెంచుకుని ఏపీ నేతలు సతమతమవుతున్నారని వ్యాఖ్యానించింది ఇప్పుడు తెలుగు సెంటిమెంట్ అంటున్నారని, అలా అనుకుంటే రేపు తమిళం, మలయాళం కూడా అలానే అంటాయని ఢిల్లీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇప్పటి వరకు రూ. 12వేల 500 కోట్లు ఏపీకి ఇచ్చామని, అయితే ఇంత వరకు ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పలేదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
Link to comment
Share on other sites

Just now, sonykongara said:

Modi gadu emi ivvadu, inka  a XXXXX na koduku la unte. Mana ke debba plzz Cbn , ippudu tdp ki  rajakiyamga debba tagilithe state anedi kolukodu

Tune marchaarenti..Nela nunchi nethi noru kottukubta vunnam..at least take some political gaining step ani.

Link to comment
Share on other sites

8 minutes ago, niceguy said:

Tune marchaarenti..Nela nunchi nethi noru kottukubta vunnam..at least take some political gaining step ani.

Emi cheyamantaru ap is not in a position to hold agitations continuously....anta chesina vallu istara anedi no guarantee... Appudu  vache industries poyi ivi poyi adukutinali Ap mottam....appudu malli cbn ne tidataru job lu levani 

Link to comment
Share on other sites

19 minutes ago, MVS said:

Emi cheyamantaru ap is not in a position to hold agitations continuously....anta chesina vallu istara anedi no guarantee... Appudu  vache industries poyi ivi poyi adukutinali Ap mottam....appudu malli cbn ne tidataru job lu levani 

Agitations kaadu brother..come out of NDA..what is wrong in it.Inka mithrapaksham ante janalu voostharu..

why are we not thinking about 2019..gold plate lo petti jaffa gaadiki ivvandi inka..

Link to comment
Share on other sites

1 hour ago, niceguy said:

Agitations kaadu brother..come out of NDA..what is wrong in it.Inka mithrapaksham ante janalu voostharu..

why are we not thinking about 2019..gold plate lo petti jaffa gaadiki ivvandi inka..

Ya i agree they must come out of nda & hold a press meet & answer each point  which bjp leaders in ap are claiming 

Link to comment
Share on other sites

7 hours ago, BalayyaTarak said:

Idi jarigite , not just for AP India ke manchi jarugutadi. PM with this much head weight and arrogance is not good for any nation.

Head weight and Arrogance maatrame kaadu..Vaadiki kullu chaala ekkuva..North feeling choopinchaadu..

Link to comment
Share on other sites

అంతా అబద్ధం
07-03-2018 01:25:48
 
  • హోదా లబ్ధి కొనసాగింపు నిజం
  • పది రాష్ట్రాలకు పదేళ్లు పన్ను వరాలు
  • సీజీఎస్టీ, ఐజీఎస్టీ తిరిగి చెల్లింపు
  • రూ.27,413 కోట్లు బడ్జెటరీ మద్దతు
  • పేరు మార్పు... ప్రయోజనం అదే
  • గత ఏడాది అక్టోబరులోనే నోటిఫికేషన్‌
  • ఇప్పుడు రాష్ట్రాలన్నీ ఒకటేనంటూ కబుర్లు
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వేదికపై ఇచ్చిన హామీలకు దిక్కులేదు! పార్లమెంటులో చేసిన చట్టాలకే విలువ లేదు! ఇప్పుడు... కేంద్ర ప్రభుత్వం అదే పార్లమెంటు వేదికగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ‘ప్రత్యేక హోదా’పై, దానికింద అందే రాయితీలపై లిఖితపూర్వకంగా అవాస్తవాలు చెబుతోంది. హోదా సంబంధిత అంశాలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు... మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శివప్రతాప్‌ శుక్లా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
 
 
ప్రత్యేక హోదాతో పన్ను రాయితీలేవీ ఉండబోవని చెప్పారు. ‘‘జీఎస్టీ అమలు తర్వాత హోదా ఉన్న రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులూ ఇవ్వరాదని కేంద్రం నిర్ణయించింది. హోదా రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహకాలు కూడా లభించవు. అంతేకాదు... జీఎస్టీ నేపథ్యంలో ప్రత్యేక హోదా రాష్ట్రాలకు పన్ను మినహాయింపులేవీ పొడిగించలేదు. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాల్లోని పరిశ్రమలతో సమానంగా కేంద్ర, రాష్ట్ర, సమగ్ర పన్నులు కట్టాల్సి ఉంటుంది’’ అని తెలిపారు.
 
 
దీనిని చూస్తే ఏమనిపిస్తుంది? ప్రత్యేక హోదాకు కాలం చెల్లిందని, పన్ను రాయితీలకు సంబంధించి అది ఉన్న రాష్ట్రాలకూ, లేని రాష్ట్రాలకూ మధ్య ఎలాంటి తేడా లేదని అర్థమవుతుంది కదూ! కానీఇదో మాటల గారడీ! ‘అశ్వత్థామ హతః కుంజరహ’ తరహాలో... పదాలు అటూఇటుగా మార్చి ప్రత్యేక హోదా రాష్ట్రాలన్నింటికీ పన్ను రాయితీలూ పదేళ్లు కొనసాగించాలని ఎప్పుడో నిర్ణయించారు. గతంలో ఉన్న సెంట్రల్‌ ఎక్సైజ్‌ నోటిఫికేషన్‌ పరిధిలోకి వచ్చే పరిశ్రమలకు కేంద్ర పన్నులో కొంత శాతం తిరిగి చెల్లించేలా బడ్జెటరీ మద్దతు ఇవ్వాలని 2017 ఆగస్టు 16న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) తీర్మానించింది.
 
 
జమ్మూ కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు అన్ని ఈశాన్య రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా... ‘జీఎస్టీలో భాగంగా అర్హత ఉన్న రాష్ట్రాలకు బడ్జెటరీ మద్దతు’ పేరిట ఒక పథకాన్ని ఆమోదించారు. పదేళ్లపాటు... అంటే 2027 మార్చి 31వ తేదీ వరకు ఆ రాష్ట్రాలకు రూ.27,413 కోట్లు సహాయం అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు పరిశ్రమల ప్రోత్సాహక, విధానాల శాఖ (డీఐపీపీ) 2017 అక్టోబరు 5న నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది.
 
 
ఏమిటి మతలబు?
జీఎస్టీ నేపథ్యంలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ చట్టాలకు కాలం చెల్లింది. అప్పటిదాకాహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు ఆ చట్టం కింద వర్తించే రాయితీలు రద్దయ్యాయి. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి హోదా ఇవ్వాల్సి ఉన్నా... ‘అబ్బే, జీఎస్టీ వచ్చాక పద్ధతి మారింది. ఎవ్వరికీ పన్ను రాయితీలు ఉండవు. అన్ని రాష్ట్రాలూ ఒక్కటే’ అని కేంద్రం చెబుతూ వచ్చింది. ఇందులో నిజం లేనేలేదు. అప్పటికే ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు జీఎస్టీకి ముందున్న రాయితీలను పొడిగించారు. ఆయా రాష్ట్రాల్లో అర్హత న్న పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాక పదేళ్లపాటు సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను తిరిగి చెల్లించేవారు. ఇప్పుడు ఎక్సైజ్‌ పన్ను లేనందున... సీజీఎస్టీ, ఐజీఎస్టీకి సమానమైన మొత్తాన్ని ‘బడ్జెటరీ మద్దతు’ రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. వెరసి... మాటలు వేరే కానీ, హోదాకింద వచ్చే లబ్ధి మాత్రం యథాతథం!
 
 
జీఎస్టీ అమలు, విధి విధానాల రూపకల్పనకు అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో జీఎస్టీ మండలిని ఏర్పాటు చేశారు. జీఎస్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా దీని ఆమోదంతోనే తీసుకోవాలి. కానీ, మండలితో సంబంధం లేకుండానే 10 రాష్ట్రాలకు జీఎస్టీ మినహాయిపు కల్పించాలని గత ఏడాది ఆగస్టులో సీసీఈఏ భేటీలో ఏకపక్షంగా నిర్ణయించడం గమనార్హం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను రాయితీలు కుదరవు కాబట్టి.. ‘బడ్జెటరీ మద్దతు’ అనే పదం ప్రయోగించారు.
 
 
ప్రతి 100కి రూ.58 రాయితీ
కేంద్రం పది రాష్ట్రాలకు ప్రకటించిన బడ్జెటరీ సపోర్ట్‌ పథకం ప్రకారం... సీజీఎ్‌సటీ, ఐజీఎ్‌సటీలో తన వాటాను తిరిగి చెల్లిస్తోంది. ఆ రాష్ట్రాల్లోని పరిశ్రమలు ఎస్‌జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. ఆ 10 రాష్ట్రాల్లోని పరిశ్రమలు జీఎస్టీ కింద చెల్లించే ప్రతి 100 రూపాయల్లో రూ.58 తిరిగి వచ్చేస్తాయి. ఆ రాష్ట్రాల్లో ఉన్న 4284 పరిశ్రమలకు దీనికింద లబ్ధి చేకూరుతోంది. ఆ రాష్ట్రాలకు ఈ పథకం వర్తింపును కేంద్రం మరో రకంగా సమర్థించుకుంటోంది.
 
 
ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక ప్రోత్సాహక ప్యాకేజీ 2007 కింద ఆ 7 రాష్ట్రాల్లో ఏర్పాటైన పరిశ్రమలు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన నాటి నుంచి పదేళ్ల పాటు ఎక్సైజ్‌ సుంకం రాయితీ ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందాలు జరిగాయని, అందుకే ఆ రాష్ట్రాలకు జీఎస్టీ మినహాయింపు కల్పిస్తున్నామని, ఇవి ముమ్మాటికీ హోదా ప్రయోజనాలు కావని వాదిస్తోంది. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో భాగంకాని జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖంఢ్‌కు ఈ పథకం ఎందుకు వర్తింపజేస్తున్నారు? ఇది హోదా ప్రయోజనాలను పొడిగించడమే కదా? అనే ప్రశ్నలకు కేంద్రం వద్ద సమాధానం లేదు.
 
 
మనదాకా వచ్చేసరికి...
ఆంధ్రప్రదేశ్‌ సహా అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోని పరిశ్రమలకు, కొన్ని ప్రాజెక్టులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగాయి. జీఎస్టీ మండలిలో చర్చించి ఆమోదం లభిస్తేనే నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పింది. మిగిలిన రాష్ట్రాలను వదిలేస్తే... ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి వేరు! విభజన వల్ల పరిశ్రమలు, ఆదాయం లేని రాష్ట్రంగా మారింది. అందుకే... ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు వేదికగా హామీ ఇచ్చారు. చివరికి... మొండిచేయి చూపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...