Jump to content

నా పార్టీ - నా భావ జాలం


hydking

Recommended Posts

ఒక్క టీడీపీలో మాత్రమే ఇలాంటి కార్యకర్తలుంటారు… శబ్బాష్ తమ్ముళ్లూ !
 
లాస్ట్ 2 బాల్స్. కొట్టాల్సింది 13 రన్స్. రెండు సిక్సర్లు కొట్టినా అయ్యేది డ్రానే ! అందులో ఓ బాల్ బౌండరీ అయ్యింది. అంటే ఇక 9 రన్స్ కావాలి. సిక్సర్ కొట్టినా గెలవం ! – తెలిసినా కూడా ఒత్తిడిని తట్టుకుంటూ నరాలు బిగబట్టి… బంతి మీదే గురిపెట్టి… స్టేడియం దాటించాలి అనుకుంటాడు నిఖార్సైన బ్యాట్స్ మన్. కొడతాడు. ఓడిపోతాడేమో కానీ తలెత్తి నడుస్తాడు వాడు. అది స్పోర్ట్స్ మన్ స్పిరిట్. నో కాంప్రమైజ్. తెలంగాణలో టీడీపీ తమ్ముళ్లు కూడా అంతే ! అచ్చం అంతే ! అందుకే చచ్చేందుకైనా సిద్ధం అన్నారు.

ఒక్క చిన్న మాట. లాస్ట్ బాల్ వరకూ మ్యాచ్ అలా రావడానికి కారణం… క్రీజులో ఉన్న ఆ బ్యాట్స్ మన్ కాదు. దానికి చాలా కోణాలున్నాయ్. బౌలింగ్ లో ఎక్కువ రన్స్ ఇచ్చి ఉండొచ్చు. ముందున్న బ్యాట్స్ మన్ బాధ్యత లేకుండా బ్యాట్ ఊపి ఉండొచ్చు. పిచ్ సహకరించకపోయి ఉండొచ్చు. డ్యూ ఫ్యాక్టర్ అయినా కావొచ్చు. కానీ వాడు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. చేయగల్గినంతా చేశాడు. ఇఫ్పుడు తెలంగాణలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా అలాంటి పోరాట యోధులే. సార్… పార్టీని మేం కాపాడుకుంటాం. కొందరు అవకాశవాదులు విలీనం అంటున్నారు. విలీనం అంటూ జరిగే పరిస్థితే వస్తే మేం ఆత్మహత్య చేసుకుంటామన్నారు. వాడికి ఏంటి అవసరం… ? జెండా మోయకపోతే పూట గడవదా…? 15 ఏళ్లుగా అధికారంలో లేని పార్టీ కోసం వాడు ఎందుకు తెగించాలి…? పైగా చంద్రబాబు ముందు అలా ఎందుకు మాట్లాడాలి… ? ఎందుకంటే వాడు తమ్ముడు. నరనరానా టీడీపీని జీర్ణించుకున్న కార్యకర్త. పార్టీని దగ్గరగా చూసి… పార్టీ ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో… జీవితం ఎంత బావుంటుందో దగ్గర నుంచి చూసి, అనుభవించి, ఆస్వాదించిన అభిమానం అది. సామాజిక న్యాయ పునాదులపై పుట్టి… పౌరుషమై పెరిగి… పోరాట బావుటా ఎగరేసిన అభిమాన జెండా అది. అంతకు మించి అజెండా ఏం లేదు. అందుకే వాడు వదలడు. వాణ్ని కోసి చూడండి… పచ్చ రక్తం చిందుతుంది.

ఇలాంటి వాళ్లే టీడీపీ వెన్నెముక. జెండాలో పసుపు వాళ్లే. ఇప్పటికీ నిలబెడుతున్న పని తనం వాళ్లదే. ఆ సంగతి బాబుకి తెలుసు కాబట్టే… ముందు బతికించుకుందాం పార్టీని, నేను మీతో ఉంటా అని ముందు నుంచి చెబుతున్నాడు. ఆవేశంతో బైటపడిన ఆ తమ్ముడికీ అదే భరోసా ఇచ్చాడు. ఎందుకంటే టీడీపీ ఓ సారి గెలిచి అధికారాన్ని ఎంజాయ్ చేసి వదిలేసే పార్టీ కాదు. వ్యవస్థని నిర్మించి… పిల్లర్ల లాంటి నాయకుల్ని తయారుచేసి, నిలబెట్టి ఓ దిశ చూపించి నడిపించే పార్టీ. తెలంగాణలో గమ్యం దూరంగా ఉండొచ్చేమో… గమనం మాత్రం మారదు. ఆగదు. ఇదంతా అభిమానుల చలవ. తమ్ముళ్ల కట్టుబాటు.

Link to comment
Share on other sites

very nice write up.

hope new young leaders emerge from these party members, and some will return back home... 

if cbn n other leaders explain what difference they could make in long run. Explain what is the very need of this party's existence even after significant number or leaders and members moved on to other parties. specifically why still TTDP is/will-be the best choice for TS, no matter which state the president belongs to, and should build confidence that TDP is a matured party and will not be biased against either AP or TS interests, but in fact brings better solutions, more harmony, development and strength(in no of MP) for both states. (despite of all the -ve propaganda, I still believe most of the TS still believes CBN is a statesman and not biased towards AP or against TS). I think now all that TTDP should do is to keep working constructively to address TS issues, till people realize anti-andhra will bring nothing to TS table except TRS political exploitation, till separation sentiments vanish and TS start looking at AP as a friendly state again, before TTDP gains remarkable strength again and rule.

 

Link to comment
Share on other sites

25 minutes ago, vasu4tarak said:

TG lo vunnantha Swachamaina party Karyakarthalu, pranam pette abhimaanulu Inkekkadaa choodaledu.. 

Very True but sentiment dominate chesindi anthe 2024 ki oka hope vastundi anukuntunna lets wait and see anthe 

Link to comment
Share on other sites

Everyone saying CBN left TTDP, IMO there is a reason.. 

When you are not valued, better to stay away for sometime...let time build the aura again and do a reentry... This works very well in resolving conflicts among humans

When sentiment dominates everything and people started hating you for wrong reasons, staying away is the best defense

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...