Jump to content

#CBNat40


OneAndOnlyMKC

Recommended Posts

  • Replies 223
  • Created
  • Last Reply
లెక్చరర్‌ పోస్టు ఇస్తామంటే వద్దన్నా: చంద్రబాబు 
27brk128-babu.jpg

అమరావతి: భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని వారి శ్రేయస్సు కోసం సుదీర్ఘ ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి భవిత కోసం తన విజన్‌తో సరికొత్త చరిత్రకు నాంది పలికిన దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి నాలుగు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంపై ‘ఈనాడు’ సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ డీఎన్‌ ప్రసాద్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో చంద్రబాబు తన రాజకీయ, జీవిత విశేషాలను ‘ఈటీవీ’తో పంచుకున్నారు. వాటిలో కొన్ని విశేషాలు..

మామూలుగా, జీవితంలో అమ్మకు సెలవు ఉండదు. ప్రతిరోజూ పనే. అలాగే రాజకీయాల్లో మీకు సెలవు ఉండగా చూడలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కానీ ఏదైనా అధికారిక పనుల్లో విదేశాలకు పోయినప్పుడు గానీ.. ఎప్పుడైనా సెలవుల్లో కుటుంబంతో బయటకువెళ్లినప్పుడు గానీ ఏదోఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఎప్పుడూ మీకు విసుగు అన్పించలేదా? 
నేను చేసే పని ఒక పవిత్రమైన భావనతో దాన్నో యజ్ఞంగా భావిస్తాను. అందుకే ఏ పనిచేసినప్పుడైనా దాంట్లోనే ఆనందం పొందుతాను. పనిలో నిమగ్నమై ఆనందంగా పనిచేసినప్పుడు విసుగు ఉండదు. ఎంత టైమైందో కూడా తెలియదు. ఇంకోవైపు ఫలితాలు వస్తుంటే.. ఆ ఫలితాలు చూసినప్పుడు పది మంది సంతోషంగా ఉండేటప్పుడు వచ్చే సంతృప్తి ఎక్కడా రాదు. అందుకే నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేననుకున్న లక్ష్యం కోసం నిరంతరం పనిచేస్తున్నా. దాంట్లో నిరంతరం ఆనందం పొందుతున్నా.

ఓ స్టూడెంట్‌ పాలిటిక్స్‌లో ఉన్నప్పుడు, యూత్‌లో ఉన్నప్పుడు కమ్యూనిజం వైపు ఆకర్షితులు కాకపోతే ఏదో లోపం ఉన్నట్టు.. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంటే దాన్ని కొంచెం ఆలోచించాలని సాధారణంగా అప్పట్లో అనుకుండేవాళ్లు. కానీ మీరు యూనివర్సిటీ రాజకీయాల్లో ఎన్‌ఎస్‌యూఐ వైపు ఎలా ఆకర్షితులయ్యారు? 
రాజకీయంగా ఆలోచించినప్పుడు ప్రజలకు రాజకీయంగా సేవచేయాలి అనుకున్నప్పుడు.. సైద్ధాంతిక ఆలోచన వేరే. ప్రాక్టికల్‌ ఆలోచన వేరే. నేను ఆ రోజు ప్రాక్టికల్‌ దృష్టితో ఆలోచించాను. ఫలానా పార్టీ వల్ల అయితే మనం అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోగల్గుతాం. మనం అనుకున్న పనులు చేయగల్గుతాం అన్పించింది. అది అడాప్ట్‌ చేసుకున్న తర్వాత వాస్తవమని కూడా రుజువైంది. ఓ వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకొనే సమయంలో ఏ దారిలో వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని చేరగలం అని ఆలోచించినప్పుడు.. ఎమోషనల్‌గా నిర్ణయించుకోవడం వేరే. వయస్సును బట్టి, అక్కడున్న పరిస్థితులు, పదిమందిని ఆకర్షించే పరిస్థితిని బట్టి వెళ్లడం వేరే. కానీ దూరదృష్టితో ఆలోచించినప్పుడు దాన్ని బట్టి వెళ్లడం వేరు. నేను అదే దారిలో వెళ్లాను. అదే నా జీవితాంతం జరిగింది.

మీరు స్కూల్‌లో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఈ స్టూడెంట్‌ భవిష్యత్తులో ఓ గొప్ప నాయకుడిగా కావడానికి కావాల్సిన లక్షణాలు ఉన్నాయని గుర్తించారు కదా. అంత చిన్న వయస్సులోనే నాయకత్వం పట్ల అంత ఆకర్షణ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? 
చిన్నప్పట్నుంచి నేను వినూత్నంగా ఆలోచించేవాడిని. నేనేదో ఇంటెలిజెంట్‌ అని చెప్పుకోవడం లేదు. నాలో ఎప్పటికప్పుడు.. మనవల్ల ఓ సమస్య పరిష్కారం కావాలని అనుకునేవాడిని. సమస్యను పరిష్కారం దృష్టితోనే చూసేవాడిని. మా వూరికి చిన్న ప్రైవేటు బస్సు వచ్చేది. రోడ్లు బాగాలేకపోతే వచ్చేది కాదు. నడిచివెళ్లే పరిస్థితి ఉండేది కాదు. గోతులతో ఆ రోడ్డు బాగుండేది కాదు. ఇది సమష్టి కృషితో సాధ్యమవుతుందని నేను ఇంటికొకర్ని ఎడ్లబండ్లు కట్టుకొని రావాలని ఆహ్వానించాను. రాళ్లతో రోడ్లను పూడ్చాం. దేనికైనా కృషి అవసరం. నేను చిన్నోడ్ని. విద్యార్థిని. మన వూరువాళ్లు వింటారా? మా వాళ్లు వింటారా? అనుకుంటే నేను చేయలేను. ప్రయత్నం చేశాను. ఫలించింది. ఫలితం వచ్చింది.

లక్ష్యం మనం నిర్ణయించుకోవాలి. దాన్ని చేరుకొనేందుకు నిరంతర శ్రమ, వ్యూహం ఉండాలని మీరు నిరంతరం చెబుతుంటారు కదా. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి రావడానికి మీరు ఏమైనా వ్యూహం పెట్టుకున్నారా? లేదంటే అలా వచ్చి ఈ స్థాయికి ఎదిగారా? 
చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడిని. తొలిసారిగా యూనివర్సిటీ రాజకీయాల్లోకి వచ్చి సామాజిక న్యాయం కోసం మేం పనిచేసి అంతకుముందున్న మొత్తం పరిస్థితిని తారుమారు చేసి సామాజిక న్యాయం చేశాం. అది నా తొలి విజయం. అది చూశాక నేను కూడా వర్సిటీ రోజుల్లో ఎంఏ పాసయ్యాను. పీహెచ్‌డీలో చేరాను. అప్పుడే నేనొక లక్ష్యం పెట్టుకోవాలని అనుకున్నా. అప్పటి పరిస్థితుల్లో యూనివర్సిటీ లెక్చరర్‌ పోస్టు ఇస్తామన్నారు. కానీ నేను తిరస్కరించాను. నేను ఎమ్మెల్యేగా పోటీచేస్తాను. గెలుస్తాను అనే సంకల్పంతోనే ఉండేవాడిని. ఓ దారిలో పోతే మనకంటూ మంచి జీవితం ఉంటుందని ఆలోచించినప్పుడు.. పోతే ఐఏఎస్‌కు పోవాలి. అందుకు ఆలిండియా సర్వీసెస్‌ పరీక్షలు రాయాలి. ఇప్పట్లో నాకంత ఓపికా లేదు. రాసినా పాసవుతాననే నమ్మకంలేదు. రెండోదారి ఏమిటని ఆలోచించాను. రాజకీయాల్లోకి వస్తే దాని ద్వారా ప్రజాసేవ చేయవచ్చు అని భావించాను.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...