Jump to content

బీజేపీకి ఇప్పుడు గుర్తొచ్చిందా? : చంద్రబాబు


sonykongara

Recommended Posts

బీజేపీకి ఇప్పుడు గుర్తొచ్చిందా? : చంద్రబాబు
24-02-2018 13:41:23
 
636550764844258345.jpg
అమరావతి: ఏపీ ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతలను ఆదేశించారు. శనివారం టీడీపీ ముఖ్యనేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని సూచించారు. ఏపీని ప్రత్యేకంగా చూస్తానన్న కేంద్రం తన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లే పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
 
అలాగే బీజేపీ కర్నూలు డిక్లరేషన్ అంశంపైనా చంద్రబాబు స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమను అభివృద్ధి చేశామన్నారు. తానూ రాయలసీమ బిడ్డనేనని విమర్శించేవారు గుర్తించుకోవాలని ఆయన అన్నారు. కనీవినీ ఎరుగనిరీతిలో రాయలసీమకు నీళ్లందించామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలాడుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా అని నిలదీశారు. కర్నూలులో సుప్రీంకోర్ట్‌ బెంచ్‌, అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేస్తే బీజేపీ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి, నేతలు అనుసరించాల్సిన వైఖరిపై సమావేశంలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Link to comment
Share on other sites

26 minutes ago, sonykongara said:
కర్నూలులో సుప్రీంకోర్ట్‌ బెంచ్‌, అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేస్తే బీజేపీ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. 

 

 

:super:

Link to comment
Share on other sites

1 hour ago, gutta_NTR said:

Enni rojulu ila ...vallu antunappudu atleast tdp leaders kinayna free hand ivvali...ilane voorukunte repu assembly lo ah vuna 4 mla’s racha chestaru...kapulaki bayam, pk ki bayam, bjp meeda bayam akarki local baffas meeda kooda react avvatla

Adedo cinemalo srihari Brahmi ni laagipetti okati kottandi ante ..Brahmi potta meeda touch chesthaadu..Atta vuntunnai mana valla reactions..Thappulu anni chesi inka manalni banda boothulu dobbutha vunnaru Sarai and Vishnu gaadu..TDP cadre attack chesi kummeyyali okasari..ala vundali attack meme chesam ani cheppelaaga..

Link to comment
Share on other sites

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని సూచించారు.  hahha

Link to comment
Share on other sites

Just now, Nfdbno1 said:

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని సూచించారు.  hahha

CBN cheppina cheppaka poyina default ga rasesukochu..Eppudu ee pandha maarchuthaaro eeyana..

Link to comment
Share on other sites

1 hour ago, niceguy said:

Disa Nirdesam ane kotha concept :P

March 5th tharvatha full attack ani mana valla inside Info..wait chesthunnam mari..

ee fulll attack.. on bjp idantha secondary bro..

 

ikkada rayalseema ani konthamandi drama start chesaru... appudu tg vishyam lo silent ga undi, tharavatha motham andhra vallani irikinchinnatu irikisthada... ippude noru therichi, right -wrong janalu mundu matladathada.. leka he being from rayalseema and thinking of elections, quiet ga undi, manifesto lo freebies announce chesthada? idi primary!

Link to comment
Share on other sites

6 hours ago, Nfdbno1 said:

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని సూచించారు.  hahha

సిబిఎన్ చెప్పింది మార్చ్ 5th వరకు నాయకులు నెమ్మదించాల శ్రేణులు శివాలెత్తాల అని, అంతే కానీ అందరినీ మూసుకొని కూర్చోమని కాదు, అర్ధం చేసుకోరు 

Link to comment
Share on other sites

కర్నూలులో సుప్రీం ధర్మాసనం! 
సీఎంతో టెలీ కాన్ఫరెన్స్‌లో  తెదేపా ముఖ్య నేతలు వెల్లడి 
  అప్పుడే భాజపా చిత్తశుద్ధి తెలుస్తుందని వ్యాఖ్య
ఈనాడు డిజిటల్‌, ఈనాడు, అమరావతి: కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్‌, అమరావతిని దేశ రెండో రాజధానిగా చేసినపుడే భాజపా చిత్తశుద్ధి అందరికీ అర్థమవుతుందని తెదేపా ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే.. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న భాజపా రాయలసీమ పేరుతో నాటకాలాడుతోందని విమర్శించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచేది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు. రాయలసీమలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరుగుతోందని ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. భాజపా నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దన్నారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి.. అనుసరించాల్సిన వైఖరిపై పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ భాజపా ప్రవేశపెట్టిన కర్నూలు డిక్లరేషన్‌ అంశాన్ని పార్టీ నేతలు ప్రస్తావించారు. ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా విషయం పక్కదారి పట్టేలా నేతలు వ్యవహరించొద్దని చంద్రబాబు ఆదేశించారు. అనంతలో కియా, చిత్తూరులో ఫాక్స్‌కాన్‌ కంపెనీల ఏర్పాటు తెదేపావల్లేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు.
సీమలో దేశ రెండో రాజధానిని పెట్టండి: ఆనందబాబు 
దేశ రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేయాలని సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడ్డ ప్రాంతమైన సీమలో దానికి రూపమిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. గుంటూరులోని రాష్ట్ర తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీ భాజపా ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతోందంటూ తప్పుబట్టారు. అమరావతికే నిధులివ్వకుండా కేంద్రం తాత్సారం చేస్తుంటే, రాష్ట్ర భాజపా నేతలు రెండో రాజధానిని సీమలో ఏర్పాటుచేయమని తీర్మానించటం ఏంటని ధ్వజమెత్తారు. పునర్వివిభజన చట్టంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజిని పొందుపర్చి నాలుగేళ్లవుతున్నా సరిపడా నిధులివ్వని కేంద్రంపై ఒత్తిడి తేవడం భాజపా నేతలకు చేతకాలేదని ఎద్దేవా చేశారు. తెదేపా పుణ్యమా అని ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు వైకాపా అజెండాను నెత్తినేసుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Link to comment
Share on other sites

అమరావతికే నిధులివ్వలేదు.. రెండో రాజధానా?
25-02-2018 03:51:06

బీజేపీ తీరు హాస్యాస్పదం: మంత్రి ఆనందబాబు
వైసీపీ బడి నుంచి వీర్రాజు బయటకు రావాలి: ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): అమరావతికే నిధులు ఇవ్వని బీజేపీ... రాయలసీమలో రెండో రాజధాని అనడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీగా ఉండి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు హితవు పలికారు. సీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో ఉంటే ఇప్పటి వరకూ కేంద్రం రూ.50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొందని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మూడున్నరేళ్లలో అనేక పరిశ్రమలు సీమలో ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 28 ఇరిగేషన్‌ ప్రాజెక్టులను మూడు నెలల్లో ప్రారంభించి జాతికి అంకితం చేస్తామన్నారు. వీటిలో సీమ ప్రాజెక్టులు 18 ఉన్నాయని తెలిపారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని సోము వీర్రాజును మిత్రధర్మం పాటించి ఎమ్మెల్సీని చేస్తే ఆయన వైసీపీ ఏజెంట్‌గా పని చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి కొత్తపేటలోని ట్రావెలర్స్‌ బంగ్లాలోనూ మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని ఢిల్లీ వీధుల్లో చూపిస్తామని, హోదా కోసం ఏ త్యాగానికైనా, ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. కాగా, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైసీపీ బడి నుంచి బయటకు వచ్చి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మాట్లాడారు. ధర్మాన్ని స్థాపించాలని సోము అంటున్నారని... అయనేమైనా శ్రీకృష్ణ పరమాత్ముడా లేక కేంద్రంలో అధర్మం జరుగుతోందా అని ప్రశ్నించారు. వీర్రాజు తీరు చూస్తుంటే భవిష్యత్తులో వైసీపీతో అంటకాగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకరన్‌ కూడా కూడా వీర్రాజుపై ఆరోపణలు చేశారు. వీర్రాజు వైసీపీకి కోవర్డులా, పెయిడ్‌ ఆర్టిస్టులా పనిచేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు.

Link to comment
Share on other sites

కలుగు లో పడుకొన్న పామేదన్నా ఉంటే బయటకొస్తుందేమోనని కుదుపుతున్నట్లున్నది, ఇలాంటివి చిన్నవి ఏమన్నా బయటకు తీసినా పెద్ద కర్ర తో నే కొట్టాలి ....ఈ విషయాల్లో చాలా అప్రమత్తత అవసరం చంద్రబాబు కి, మాట లో ధీటు ఉంటే బాగుంటున్దేమో !.......

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...