Jump to content

AP Police tech-tower in Mangalagiri


sonykongara

Recommended Posts

టెక్‌ టవర్‌ రెడీ
24-02-2018 07:59:50

మంగళగిరి: రాష్ట్ర పోలీసు శాఖ అధునాతన సొగసులతో కూడిన భవనాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటుంది. రాష్ట్ర పోలీసు శాఖకు ప్రధాన కేంద్రంగా మారిన ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌ మరో అద్భుతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుంది. బెటాలియన్‌ ఆవరణలో పూర్తి ఈశాన్యంగా టెక్‌ టవర్‌ పేరుతో బ్రహ్మాండమైన ఏడంతస్తుల భవనం నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది. సుమారు రూ.16కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనికి సమీపంలోనే రూ.40కోట్ల వ్యయంతో పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ కార్యాలయ భవనం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.
 
పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం గతంలో మంజూరైన నిధులను వెచ్చించి 6వ బెటాలియన్‌ ప్రాంగణంలో ఈ అధునాతన భవన సముదాయాలను నిర్మించారు.ప్రస్తుతం తుది మెరుగులను దిద్దుకుంటున్న ఈ భవనంలో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సరంజామాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో టెక్‌ టవర్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇందులోని ఏడంతస్తులలో తొలి నాలుగు అంతస్తులను కంప్యూటర్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌కు, ఆపై మూడంతస్తులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సదుపాయాల కోసం వినియోగించనున్నారు. ఒక్కో అంతస్తును 8500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు.

http://www.andhrajyothy.com/artical?SID=541195

Link to comment
Share on other sites

  • 1 month later...
పోలీసులకు అత్యాధునిక సాంకేతిక సౌధం
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

image.jpg

ఈనాడు, అమరావతి: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక సాంకేతిక సౌధం ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల అమ్ముల పొదిలో చేరనుంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి పోలీసు పటాలం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పోలీసు సాంకేతిక భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ప్రారంభించనున్నారు. రూ.10.67 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే పోలీసు విభాగానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్లను ఈ సాంకేతిక సౌధంతో అనుసంధానించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఇక్కడి నుంచి పర్యవేక్షించేందుకు అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ అండ్‌ స్టాండర్డైజేషన్‌, పోలీసు కమ్యూనికేషన్స్‌ ఆర్గనైజేషన్స్‌లను (పీసీవో) ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తారు.

స్వరూపం...
* నిర్మాణ అంచనా వ్యయం: రూ.10.67 కోట్లు
* అంతస్తులు: జీ ప్లస్‌ 3
* నిర్మిత ప్రాంతం: 34,100 చదరపు అడుగులు
* ఒక్కో అంతస్తులో నిర్మిత ప్రాంతం: 8,525 చదరపు అడుగులు

ప్రయోజనాలు
* సాంకేతిక అస్త్రాల ఆధారంగా నేరగాళ్ల కట్టడికి అవసరమైన వ్యూహాల రూపకల్పన.
* దర్యాప్తులో అత్యత్తుమ సాంకేతిక పద్ధతుల వినియోగంపై నిరంతర అధ్యయనం.
* నేరగాళ్ల సమగ్ర సమాచార నిధి నిరంతర విశ్లేషణ, పరిశీలన.
* పోలీసులు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక యాప్‌ల తయారీ.

Link to comment
Share on other sites

ఏపీ పోలీస్ టెక్ టవర్‌ను ప్రారంభించిన చంద్రబాబు
12-04-2018 13:43:48
 
636591374297686851.jpg
గుంటూరు జిల్లా: మంగళగిరిలో ఏపీ పోలీస్ టెక్ టవర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో మేజర్‌గా
టెక్ సర్వీస్ వింగ్.., ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, అక్టోపస్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ (ఇది తాత్కాలికం), పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ తదితర వాటికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రూ. 18 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల్లో భవనం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పోలీసులు కొంత వరకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారని, సర్వలెన్స్ కెమెరాలు, లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టం.. ఇవన్నీ ఉపయోగించుకోవడంవల్ల దొంగతనాలు, క్రైమ్‌ను నియంత్రణ చేసే అవకాశం ఉందన్నారు. భవిష్యత్‌లో ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేరాలు అరికట్టి, ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు కల్పిస్తామన్నారు. ఇందుకోసం మంచి ఫోరెన్సిక్ ల్యాబ్ వస్తుందని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ మాలకొండయ్య, స్థానిక నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

24 minutes ago, uravis said:

:cheers:  last time already started emo anukunna building choosi.

 

 

miru dini ni chusi untaru, AP Police headquarters ni last year start chesaru bro.  ippudu akkade Police tech-tower vasthundi  eroju cbn open chesadu

 

Edited by sonykongara
Link to comment
Share on other sites

  • 8 months later...

మంగళగిరిలో ఫోరెన్సిక్‌ ప్రయోగశాల

 

రేపటి నుంచి కార్యకలాపాలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ సైన్సు ప్రయోగశాల సేవలు మంగళవారం నుంచి అమరావతి కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న ఈ సంస్థ సిబ్బంది విభజన ఇటీవల పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 117 పోస్టులను కేటాయించగా...అందులో 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 45 మంది సిబ్బందితోనే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. త్వరలో మరో 30 మందిని పొరుగు సేవల ప్రాతిపదికన నియమించుకోనున్నారు. మంగళగిరి ఏపీ పోలీసు పటాలంలోని సాంకేతిక సౌధం భవనంలో ఈ ప్రయోగశాల కోసం తాత్కాలికంగా రెండంతస్తుల్లో 25 వేల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతాన్ని కేటాయించారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేంత వరకూ సాంకేతిక సౌధంలోనే రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నడవనుంది. దీనికి సంబంధించి కావాల్సిన అన్ని రకాల పరికరాలను ఇప్పటికే కొనుగోలు చేశామని ఏపీ ప్రభుత్వ ఫోరెన్సిక్‌ సలహాదారు డా.కేపీసీ గాంధీ ‘ఈనాడు’కు తెలిపారు. దాదాపు రూ.30 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలతో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు ఏపీకి సంబంధించి సంవత్సరానికి సగటున 15 వేల కేసులకు చెందిన నమూనాలు వెళ్తున్నాయి. ఇప్పటివరకూ వీటిని ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లడం ప్రయాసగా ఉండేది. ఎంతో సమయం కూడా వృథా అయ్యేది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు.

 

మంగళగిరిలో ఫోరెన్సిక్‌ ప్రయోగశాల

 

రేపటి నుంచి కార్యకలాపాలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ సైన్సు ప్రయోగశాల సేవలు మంగళవారం నుంచి అమరావతి కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న ఈ సంస్థ సిబ్బంది విభజన ఇటీవల పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 117 పోస్టులను కేటాయించగా...అందులో 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 45 మంది సిబ్బందితోనే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. త్వరలో మరో 30 మందిని పొరుగు సేవల ప్రాతిపదికన నియమించుకోనున్నారు. మంగళగిరి ఏపీ పోలీసు పటాలంలోని సాంకేతిక సౌధం భవనంలో ఈ ప్రయోగశాల కోసం తాత్కాలికంగా రెండంతస్తుల్లో 25 వేల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతాన్ని కేటాయించారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేంత వరకూ సాంకేతిక సౌధంలోనే రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నడవనుంది. దీనికి సంబంధించి కావాల్సిన అన్ని రకాల పరికరాలను ఇప్పటికే కొనుగోలు చేశామని ఏపీ ప్రభుత్వ ఫోరెన్సిక్‌ సలహాదారు డా.కేపీసీ గాంధీ ‘ఈనాడు’కు తెలిపారు. దాదాపు రూ.30 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలతో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు ఏపీకి సంబంధించి సంవత్సరానికి సగటున 15 వేల కేసులకు చెందిన నమూనాలు వెళ్తున్నాయి. ఇప్పటివరకూ వీటిని ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లడం ప్రయాసగా ఉండేది. ఎంతో సమయం కూడా వృథా అయ్యేది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు.

Link to comment
Share on other sites

 

న్యూఇయర్ రోజే, అతి ముఖ్యమన కార్యాలయం రేపు మంగళగిరిలో ప్రారంభం...
tower-31122018-1.jpg
share.png

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ సైన్సు ప్రయోగశాల సేవలు మంగళవారం నుంచి అమరావతి కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న ఈ సంస్థ సిబ్బంది విభజన ఇటీవల పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 117 పోస్టులను కేటాయించగా...అందులో 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 45 మంది సిబ్బందితోనే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. త్వరలో మరో 30 మందిని పొరుగు సేవల ప్రాతిపదికన నియమించుకోనున్నారు. మంగళగిరి ఏపీ పోలీసు పటాలంలోని సాంకేతిక సౌధం భవనంలో ఈ ప్రయోగశాల కోసం తాత్కాలికంగా రెండంతస్తుల్లో 25 వేల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతాన్ని కేటాయించారు.

 

tower-31122018-2.jpg

రాజధాని నగరంలో నిర్మిస్తున్న శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేంత వరకూ సాంకేతిక సౌధంలోనే రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నడవనుంది. దీనికి సంబంధించి కావాల్సిన అన్ని రకాల పరికరాలను ఇప్పటికే కొనుగోలు చేశామని ఏపీ ప్రభుత్వ ఫోరెన్సిక్‌ సలహాదారు డా.కేపీసీ గాంధీ తెలిపారు. దాదాపు రూ.30 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలతో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు ఏపీకి సంబంధించి సంవత్సరానికి సగటున 15 వేల కేసులకు చెందిన నమూనాలు వెళ్తున్నాయి. ఇప్పటివరకూ వీటిని ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లడం ప్రయాసగా ఉండేది. ఎంతో సమయం కూడా వృథా అయ్యేది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు.

Advertisem

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...