sonykongara Posted February 22, 2018 Share Posted February 22, 2018 చంద్రబాబు 22-02-2018 18:57:37 అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటన అనుభవాలను ఈ సందర్భంగా అనంత ప్రజలతో ఆయన పంచుకున్నారు. " ఇటీవల దావోస్‌కు వెళ్లినప్పుడు దావోస్‌లో ఓ కొత్త విషయం చూశాను. ఆయన ఏపీకి రావాలని వర్క్ చేస్తున్నాం.. కరువు అదికానీ జయప్రదమైతే ఈ అనంత జిల్లా కరువును సునాయశంగా ఎదుర్కొనవచ్చు. మన వేరుశెనగ పంటలోనే ఒక చిన్నవస్తువులాంటి దాన్ని తయారుచేస్తారు.. అది కెమికల్ కాదు.. దాన్ని మన పొలంలోనే కలిపేస్తే పడిన నీళ్లన్నీ కిందికి పోకుండా భూమిలోనే తేమ ఉంటుంది. ఈ తేమ ఎండకాచిన ఆర్నేళ్లపాటు ఉంటుంది. పంటకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లిస్తుంది. ఒకప్పుడు వర్షం పడలేదని నేను రెయిన్ గన్ తెచ్చాను.. కానీ దావోస్ ప్రయోగం సక్సెస్ అయితే రెయిన్ అవసరముండదు. పంట వేస్తే మళ్లీ పంట తీసుకునే అవకాశం వస్తుంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం.. వినూత్న ప్రయోగం" ఏపీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ విషయం చెప్పగానే ప్రజలంతా చప్పట్లు కొట్టి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబును అభినందించారు. ఇంకోవైపు.. నీటి సమస్య అటుంచితే రైతులకు మరోసమస్య కూడా ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. " పంటకు ఎరువులు వేయగానే వర్షం వస్తే.. ఎరువులన్నీ కొట్టుకునిపోతాయి. అయితే ఇక్కడ ఒక పదార్థం వేస్తే ఎరువులు మాత్రం కొట్టుకోని పోకుండా ఉంటాయి.. రనాఫ్ కావు. ఏ పంటకు ఏ ఎరువు వేస్తారో అది అక్కడే విధంగా మరో కొత్త ప్రయోగం చేస్తున్నాం. సాయిల్ టెస్ట్ అందుబాటులోకి వచ్చింది.. రానున్న రోజుల్లో డ్రోన్ ద్వారా మీ పొలంలో రన్ చేయించి ఆ సాయిల్‌ను క్లౌడ్‌కు పంపించి.. అదే సమయంలో మీ దగ్గరుండే ఫోన్ల ద్వారా భూసార పరీక్షల గురించి నేరుగా చూసుకునే పరిస్థితులు వస్తాయి. ఎక్కడైనా పొలంలో తెగెళ్లు ఉంటే చూసుకుని అక్కడ మాత్రమే మందులు వాడుకునేందుకు పరిస్థితులు రానున్నాయి" అని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted February 22, 2018 Share Posted February 22, 2018 Cloud aa Babu garu, ee paniki maalina janaala meeda intha prema enduku Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted February 22, 2018 Share Posted February 22, 2018 1 hour ago, adithya369 said: Cloud aa Babu garu, ee paniki maalina janaala meeda intha prema enduku prothsahinchi panikochche vaallani theliya cheyyataaniki Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.