Jump to content

బాబుపై రాజకీయ విమర్శలొద్దు


koushik_k

Recommended Posts

  • ఏపీ నేతలకు బీజేపీ అధిష్ఠానం నిర్దేశం
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబును గానీ, మిత్రపక్షం టీడీపీని గానీ రాజకీయంగా విమర్శించకూడదని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించుకుంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో తప్ప ఏ ఇతర పార్టీతోనూ పొత్తు సాధ్యం కాదని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం ద్వారా ఏమి చేశామన్నది మాత్రమే ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలందాయి. రాష్ట్రాభివృద్ధి, కేంద్రం నిధులను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని పార్టీ పెద్దలు నిర్దేశించారు.
 
 
రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక టీడీపీని ఏ విధంగా ఇరుకునపెట్టి దారికి తెచ్చుకోవాలో దృష్టి సారించాలని ఆదేశించారు. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో అధ్యక్షుడు హరిబాబు ఆదేశం ఢిల్లీ నుంచి వచ్చిందేనని, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లడమే ఇప్పుడు ప్రధాన కర్తవ్యమని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజకీయంగా టీడీపీ ఎక్కడా మనల్ని ఇబ్బంది పెట్టడంలేదని, చంద్రబాబు నుంచి పార్లమెంటులో గల్లా జయదేవ్‌ వరకూ ఏపీ అభివృద్ధి విషయంలోనే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని బీజేపీ తన శ్రేణులు, నేతల కు తేల్చిచెప్పింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో చేసిన తప్పులేంటి.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా.. ఏవి పెండింగ్‌ ఉన్నాయో వాటిపై గురిపెట్టి టీడీపీని అదుపు చేయాలన్నదే బీజేపీ అభిమతంగా కనిపిస్తోంది.
 
 
బాబుపై సానుకూలమే!
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రెండూ చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉన్నాయని కొందరు బీజేపీ నేత లు తెలిపారు. ‘రాష్ట్రంలో అన్ని పక్షాలూ మమ్మల్ని రాజకీయం గా ఇబ్బంది పెడుతున్నా... ఆఖరికి అడ్డంగా రాష్ట్రం గొంతు కోసిన కాంగ్రెస్‌ పార్టీ సైతండ్రామాలాడుతున్నా.. చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి నిధులివ్వాలంటున్నారు తప్ప బీజేపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూడడం లేదు. మహారాష్ట్రలో మిత్రపక్షమైన శివసేన ఇబ్బందులు పెడుతోంది. ప్రస్తుతం మిత్రుడైన బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కూడా బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరుండాలో గతంలో నిర్దేశించాలని చూశారు. ఒక్క చంద్రబాబు మాత్రమే ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. అందుకే ప్రజల్లో ఇప్పుడు ఆయనపై సానుభూతి పెరిగింది. ఈ పరిస్థితుల్లో టీడీపీని వదిలి ఇతరులతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో మా పార్టీ లేదు’ అని అంటున్నారు.
 
 
రాష్ట్ర బీజేపీలో నాలుగు వర్గాలు?
రాష్ట్ర బీజేపీలో పార్టీ వారితోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌, కాంగ్రెస్‌, వైసీపీ వర్గాల వారు ఉన్నారని ఆ పార్టీ నేతలు కొందరు అంటున్నారు. ఆర్‌ఎస్ఎస్ తో ఇబ్బంది లేదని, వాళ్లు పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతారు తప్ప ఎలాంటి ఆరోపణలకు దిగరని చెబుతున్నారు. అయితే టీడీ పీ పట్ల మరీ మెతక వైఖరి అవలంబించ డం కూడా సరికాదని.. అందుకే స్థానికంగా పంచాయతీ పరిధి వరకూ రాష్ట్ర బడ్జెట్‌పై నిలదీయడం మొదలెట్టాలన్నది పార్టీ అభిమతమంటున్నారు. అందుకు పార్టీలో ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

రాజమండ్రి: బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ప్రత్యేక హోదాతో సమానంగా అన్నీ సాధించామని చెప్పిన సీఎం ఇప్పుడు కేంద్రంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ లేకపోతే ఏపీలో అభివృద్ధే లేదని ఆయన పెర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...