Jump to content

LEADER

Husker

Recommended Posts

పార్టీకి మూల స్తంభాల్లాంటి కార్యకర్తల సంక్షేమం పట్ల తెదేపా ఎంత బాధ్యతగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సైతం తన పార్టీ కార్యకర్తల బాగోగులకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో తెలిపే సంఘటన ఇది.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షేక్ మహబూబ్ తెదేపాకు వీరాభిమాని. పార్టీకి సేవలందిస్తూ.. కొన్నాళ్ళ క్రితం జిల్లాలోని కామవరపుకోట మండల పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయితే నాలుగు సంవత్సారాల కిందట షేక్ మహబూబ్ ను భయంకరమైన, అరుదైన మోటార్ న్యూరో వ్యాధి సోకింది. వ్యాధినుంచి బయటపడేందుకు ఎంతో ఖర్చుచేశారు. కుటుంబం ఆర్థికంగా చిదికి పోయిందే తప్ప వ్యాధి ఏమాత్రం నయం కాలేదు. ఇతరుల సాయం లేనిదే తన పనులు తాను చేసుకోలేని స్థితి, ఎక్కడికీ కదల్లేని స్థితి. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటిస్తున్నారని తెలిసి తోటి కార్యకర్తల సాయంతో సభాస్థలికి వచ్చారు షేక్ మహబూబ్. తోటి కార్యకర్తలు, నాయకులు తెచ్చిన కారులోనే ఉండి కార్యక్రమాలను వీక్షిస్తున్నారు.

అయితే స్థానిక ప్రజాప్రతినిధులు మహబూబ్ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అతని నిస్సహాయ స్థితిని వివరించారు. చంద్రబాబు 
వెంటనే స్పందించారు. తానొక ముఖ్యమంత్రినన్న విషయం కూడా పక్కన పెట్టి ఒక సామాన్య కార్యకర్త కోసం తానే స్వయంగా మహబూబ్ ఉన్న కారు దగ్గరికి వచ్చారు. ఒకరు తల ఎత్తి పట్టుకుంటేనే కాని ముఖ్యమంత్రిని చూడలేని మహబూబ్ ను కారు కిటికీలోకి వంగి మరీ పరామర్శించారు. మరేమీ బెంగపడొద్దని ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున అప్పటికప్పుడు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మెరుగైన చికిత్సకు గల అవకాశాలను చూడమని, అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. దీన్ని కళ్లారా చూసిన ప్రజలు చంద్రబాబు ఔన్నత్యానికి ముగ్దులయ్యారు. ఇటువంటి అధ్యక్షుడు తమ తోడుంటే పార్టీకోసం ఎన్ని త్యాగాలైనా చేస్తామంటూ కార్యకర్తలు ఉద్విగ్నభరితులయ్యారు.

Image may contain: 3 people

Link to comment
Share on other sites

ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి వయసు నాలుగేళ్ళు. పేరు పవన్ కార్తీక్. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఇంట్లో సందడి చేసే వయసతనిది. కానీ విధి చిన్నచూపు చూడటంతో ఆ బాలుడు తీవ్రమైన వ్యాధి బారిన పడ్డాడు. శరీరంలో రక్తకణాలను తయారుచేసే బోన్‌మారో పనికి రాకుండా పోయింది. అతనికి శస్త్రచికిత్స ద్వారా బోన్‌మారో మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. అందుకు లక్షల ఖర్చవుతుంది. కానీ నిరుపేదలైన తల్లిదండ్రులకు అన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి. చూస్తూ చూస్తూ కన్నబిడ్డను వదులుకోలేరు. అలాగని లక్షల డబ్బును తేలేరు. చివరికి వారికి ఉన్న ఒకేఒక ఆశ... చంద్రబాబు నాయుడు.

ఆపన్నులకు దాదాపు ప్రతిరోజూ అందుబాటులో ఉంటూ... ప్రజల సమస్యలను, బాధలను వింటూ... మానవీయ దృక్పథంతో వీలైనంత సాయం చేస్తూ 'మనసున్న మారాజు' అని ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటికి ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను నిలబెట్టారాయన.

ఇది తెలిసిన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాల్లపాలెం గ్రామానికి చెందిన బాలుడి తల్లిదండ్రులు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తమ దీనస్థితిని చెప్పుకున్నారు. పవన్ కార్తీక్ పరిస్థితిని చూసి చలించిన చంద్రబాబు స్పందించి శస్త్రచికిత్సకు రూ.10లక్షలు మంజూరు చేశారు. కొడుకు పట్ల ఆ తల్లిదండ్రులు నిలుపుకున్న ఆశలను చిగురింపచేశారు.

Image may contain: 3 people, people standing

Link to comment
Share on other sites

sr NTR and cbn showed compassion, empathy towards when people suffering from illness. during uttarakhand floods cbn sent flight to bring stranded telugu people to hyderabad .

he is very good at disaster management. some of the examples west godavari and east godavari cyclone in november 1995, hudhud

compassion and empathy are important qualities that separate leaders (cbn) from feku (jagan).

when jagan  visit people in tough times , he says i will give compensation after coming to power. nobody want to hear such a stupid statement . but he keep on repeating that statement wherever he goes. even animals are better than jagan in showing compassion. it is unfortunate that some people are voting to this guy.

cbn helped people even when he was in opposition.  

Link to comment
Share on other sites

47 minutes ago, Kiran Edara said:

ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి వయసు నాలుగేళ్ళు. పేరు పవన్ కార్తీక్. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఇంట్లో సందడి చేసే వయసతనిది. కానీ విధి చిన్నచూపు చూడటంతో ఆ బాలుడు తీవ్రమైన వ్యాధి బారిన పడ్డాడు. శరీరంలో రక్తకణాలను తయారుచేసే బోన్‌మారో పనికి రాకుండా పోయింది. అతనికి శస్త్రచికిత్స ద్వారా బోన్‌మారో మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. అందుకు లక్షల ఖర్చవుతుంది. కానీ నిరుపేదలైన తల్లిదండ్రులకు అన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి. చూస్తూ చూస్తూ కన్నబిడ్డను వదులుకోలేరు. అలాగని లక్షల డబ్బును తేలేరు. చివరికి వారికి ఉన్న ఒకేఒక ఆశ... చంద్రబాబు నాయుడు.

ఆపన్నులకు దాదాపు ప్రతిరోజూ అందుబాటులో ఉంటూ... ప్రజల సమస్యలను, బాధలను వింటూ... మానవీయ దృక్పథంతో వీలైనంత సాయం చేస్తూ 'మనసున్న మారాజు' అని ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటికి ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను నిలబెట్టారాయన.

ఇది తెలిసిన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాల్లపాలెం గ్రామానికి చెందిన బాలుడి తల్లిదండ్రులు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తమ దీనస్థితిని చెప్పుకున్నారు. పవన్ కార్తీక్ పరిస్థితిని చూసి చలించిన చంద్రబాబు స్పందించి శస్త్రచికిత్సకు రూ.10లక్షలు మంజూరు చేశారు. కొడుకు పట్ల ఆ తల్లిదండ్రులు నిలుపుకున్న ఆశలను చిగురింపచేశారు.

Image may contain: 3 people, people standing

in pic you can see tanuku mla arimilli radha krishna  when cbn gave rankings in 2015 he got first in state.

Link to comment
Share on other sites

http://health.andhrajyothy.com/Healthmainnews-11-ChandrababuhelpsTDPfollower-7349

అనారోగ్యంతో కార్యకర్త.. అండగా నిలిచిన సీఎం
636547193470127483.jpg

బుట్టాయగూడెం, ఫిబ్రవరి 19: అతని పేరు షేక్‌ మహబూబ్‌ సుభానీ. ఊరు పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట. 1989 నుంచి మండల టీడీపీ కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి సోకడంతో మృత్యువుతో పోరాడుతున్నారు. టీడీపీకి విధేయుడైన ఆయనకు చనిపోయేలోగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని కోరిక. అయితే సుభానీ కోరికను చంద్రబాబు నెరవేర్చారు. పోగొండ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడకు వచ్చిన సీఎం.. సుభానీని కలిసి ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ. 20 లక్షల సాయం అందిస్తామని, భయపడవద్దని ధైర్యం చెప్పారు. చంద్రబాబు స్వయంగా వచ్చి మాట్లాడడంతో సుభానీ ఆనందం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

అభిమానితో అధినేత 
వైద్య ఖర్చులకు రూ.20 లక్షల సహాయం 
19hyd-state9a.jpg

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ తన అభిమాన నేతను కళ్లారా చూడాలన్న ఆ పార్టీ అభిమాని కోరిక ఫలించింది.  కామవరపుకోటకు చెందిన షేక్‌ మహబూబ్‌ సుభాని (42) కొన్నేళ్లుగా అంతుచిక్కని నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు పోగొండ జలాశయం ప్రారంభోత్సవ సమయాన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతనిని పరిచయం చేశారు. కదలలేని స్థితిలో కారులోనే ఉన్న సుభాని దగ్గరకు వచ్చిన ముఖ్యమంత్రి ఆయనను ఆప్యాయంగా పలకరించారు. పార్టీ మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన అతడి స్థితిని చూసి చలించిపోయారు. అతనికి మెరుగైన వైద్యం కోసం రూ.20 లక్షలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Link to comment
Share on other sites

ప్రభుత్వపరంగా ప్రజారోగ్యానికి ఎన్ని కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నా ఒక్కోసారి అనుకోని, అరుదైన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి కొన్ని కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేస్తాయి. ఒకేసారి లక్షల రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేయాల్సి వస్తే మధ్యతరగతి కుటుంబాలకు తలకు మించిన భారం అవుతుంది. ఇక పేద కుటుంబాలకే అలాంటి పరిస్థితి వస్తే... దేవుడే దిక్కు! అయితే అలాంటి కుటుంబాలకు దేవుడిలా దిక్కవుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన దృష్టికి వస్తే చాలు ఉదారంగా సాయం చేసి ప్రాణాలను నిలబెడుతున్నారు. అలా ఇప్పటికి చంద్రబాబు చేతుల మీదుగా ఎందరో చిన్నారుల ప్రాణాలు నిలబడ్డాయి. ఇప్పుడా జాబితాలో మరో చిన్నారి పేరు చేరింది.

రాజమహేంద్రవరానికి చెందిన జీవీవీ సత్యనారాయణకు కుమారునికి కాలేయ సమస్య ఏర్పడింది. కాలేయ మార్పిడికి రూ.20 లక్షలు అవుతుందనేసరికి ఆ పేద కుటుంబం దిక్కు తోచక ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని వేడుకుంది. సమస్య విన్న వెంటనే ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించారు.

Image may contain: 3 people, people standing

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...