Jump to content

వైసీపీ తరపున బరిలోకి వీపీఆర్


koushik_k

Recommended Posts

  • వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి 
  • విజయసాయిరెడ్డి ప్రకటన
  • ప్రస్తుత స్థితిలో విజయం ఖాయమే
  • ఇద్దరు జంప్‌ అయితే కష్టమే
  • వేమిరెడ్డి అభ్యర్థిత్వంతో ఆసక్తిగా జిల్లా రాజకీయాలు
ఎట్టకేలకు ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(వీపీఆర్‌)కల నెరవేరనున్నది. రాజ్యసభకు వెళ్లాలన్న ఆయన కోరిక త్వరలో తీరనున్నది. గతంలో ఓసారి వైసీపీ మొండి చేయి చూపినా, మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ సారి వీపీఆర్‌ కోరికను వైసీపీ మన్నించింది. వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిగా వీపీఆర్‌ను పోటీకి నిలుపుతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తిగా మారాయి. వైసీపీకి ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాజ్యసభ సీటు గెలుపునకు కావాల్సింది 44 మంది ఎమ్మెల్యేల మద్దతు. ప్రస్తుతం ఉన్న బలమే రాజ్యసభ ఎన్నికల వరకు కొనసాగితే వీపీఆర్‌ గెలుపు సునాయాసమే. వీరిలో ఎవరు పార్టీ మారినా వీపీఆర్‌ కష్టాలు తప్పవు.
 
 
నెల్లూరు(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సీటు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్‌)కి వైసీపీ తీపి కబురు అందించింది. గతంలో ఓసారి మొండి చేయి చూపినా, మారిన పరిస్థితుల దృష్ట్యా ఈసారి వీపీఆర్‌ కోరికను ఆ పార్టీ నెరవేర్చింది. వచ్చే నెలలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిగా వీపీఆర్‌ను నిలబెడుతున్నట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శనివారం విశాఖపట్నంలో ప్రకటించారు. దీంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీకి ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాజ్యసభ సీటు గెలుపుకు కావాల్సింది 44 మంది ఎమ్మెల్యేల మద్దతు. ప్రస్తుతం ఉన్న బలమే రాజ్యసభ ఎన్నికల వరకు కొనసాగితే వీపీఆర్‌ గెలుపు నల్లేరుమీద నడకే అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో మాదిరిగా కనీసం ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినా వీపీఆర్‌ కష్టాలు ఎదుర్కోక తప్పదు.
 
 
రాజ్యసభ సీటుపైనే పట్టు!
వీపీఆర్‌ ఆశించినట్లుగా రాజ్యసభ టికెట్టయితే దక్కింది. మరి గెలుపు సంగతేటమిటన్నదే ప్రస్తుత ప్రశ్న. పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న వీపీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం వైసీపీతోనే జరిగింది. 2014 ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరి ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఆర్థికంగా బలమైన సహకారం అందించారు. నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు తోడ్పాటునందించారు. అప్పట్లో వైసీపీ అధినేత జగన్‌ రాజ్యసభకు పంపుతామంటూ హామీ ఇవ్వడంతో వీపీఆర్‌ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, వీపీఆర్‌కు ఇస్తామన్న రాజ్యసభ సీటును విజయసాయిరెడ్డికి కేటాయించడంతో వీపీఆర్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆయన టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు జరిగాయి. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ నుంచి పిలుపందుకుని వారితో వీపీఆర్‌ చర్చించారు. ఒకానొక దశలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు వీపీఆర్‌ సిద్ధమయ్యారు. అయితే అనివార్య కారణాల వలన సీఎం జిల్లా పర్యటన రద్దవడంతో వీపీఆర్‌ చేరిక కూడా వాయిదా పడింది. అలా పలుమార్లు టీ డీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరిగినా ముహూర్తం మాత్రం కుదరలేదు.
 
 
ఇదే సమయంలో వీపీఆర్‌ జిల్లా వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. జిల్లాలో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు, యువతకు క్రికెట్‌ కిట్‌లు పంపిణీ, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కాగా ఇదే సమయంలో వైసీపీ నేతలు మళ్లీ వీపీఆర్‌ను సొంత గూటికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పలుమార్లు వీపీఆర్‌తో చర్చించారు. మళ్లీ పార్టీలో గతంలో మాదిరిగా చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. అయితే వీపీఆర్‌ మాత్రం రాజ్యసభ సీటుపై తనకు స్పష్టమైన హామీ ఇస్తేనే పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటానని సూచించారు. ఇదిలా జరుగుతుండగా టీడీపీ నేతలు కూడా వీపీఆర్‌తో వేగంగా చర్చలు జరపడం మొదలుపెట్టారు. మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర వీపీఆర్‌తో చర్చలు జరిపి పార్టీలో చేరాల్సిందిగా కోరారు. అయితే వీరితో కూడా తనకు రాజ్యసభ సీటుపై హామీ ఇవ్వాలని పట్టుబట్టారు.
 
 
రాజ్యసభ సీటుపై ముందుగా హామీ ఇవ్వలేమని మొదట పార్టీలో చేరితే పరిస్థితులను బట్టి న్యాయం చేస్తామని టీడీపీ నేతలు చెప్పారు. అయితే 2019 నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశమిస్తామని వారు వీపీఆర్‌కు స్పష్టం చేశారు. కానీ వీపీఆర్‌ మాత్రం రాజ్యసభ సీటుపైనే మొగ్గు చూపారు. ఇలా చర్చలు జరుగుతుండగా చిత్తూరు జిల్లాలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా వీపీఆర్‌తో జగన్‌, వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. వచ్చే నెలలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో సీటు ఇస్తామని వారు హామీ ఇవ్వడంతో వీపీఆర్‌ తిరిగి వైసీపీలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు.
 
 
గత నెల 28న గూడూరు నియోజక వర్గంలో జగన్‌ పాదయాత్రలో వీపీఆర్‌ తన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీ వీపీఆర్‌కు ఇచ్చిన హామీ ప్రకారం రాజ్యసభ సీటును ప్రకటించింది. కాగా 2014లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో గెలుపొందింది. అయితే వారిలో 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్‌ అయ్యారు. ప్రస్తుతం వైసీపీ బలం 45 మంది ఎమ్మెల్యేలు. రాజ్యసభ సీటును దక్కించుకోవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఉన్న మెజారిటీ ఎన్నికల వరకు కొనసాగితే వీపీఆర్‌ గెలుపు ఖాయమవుతుంది. ఒకవేళ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్‌ అయినా... మొదటి ప్రాధాన్యత ఓటు క్రమంలో రాజ్యసభ స్థానం టీడీపీకి దక్కుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీపీఆర్‌ రాజ్యసభలో అడుగుపెడతారా..? లేదా.. వేచిచూడాలి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...