Jump to content

Animation, Gaming city IN Vizag


sonykongara

Recommended Posts

విశాఖలో గేమింగ్‌ సిటీ
16-02-2018 02:49:18

గేమింగ్‌, యానిమేషన్‌, గ్రాఫిక్స్‌
సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం
డిస్నీల్యాండ్‌కూ ఆహ్వానం
వినోద నగరంలో అంతర్జాతీయ సంస్థల
ఏర్పాటే లక్ష్యంగా త్వరలో ఏవీజీసీ విధానం
ఏపీలో వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రాజెక్టు
లోకేశ్‌తో ‘ఫస్ట్‌ అమెరికా’ ప్రతినిధుల భేటీ
అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): యానిమేషన్‌, వీఎ్‌ఫఎక్స్‌, గ్రాఫిక్స్‌, కామిక్స్‌ రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విశాఖపట్నంలో వినోద నగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగు విభాగాలకు ఇటీవల కాలంలో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతోంది. దీంతో వీటికి చెందిన సంస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సిద్ధమవుతోంది. ఫిల్మ్‌, మీడియా, ఏవీజీసీ(యానిమేషన్‌, వీఎ్‌ఫఎక్స్‌, గ్రాఫిక్స్‌, కామిక్స్‌) సిటీ పేరుతో 40 ఎకరాల్లో వినోద నగరాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం సినిమాల్లో యానిమేషన్‌, గ్రాఫిక్స్‌ ఓ భాగంగా మారిపోయాయి. పూర్తిస్థాయి యానిమేషన్‌ సినిమాలూ ఎక్కువగానే వస్తున్నాయి. బాహుబాలి లాంటి సినిమా తర్వాత వీఎ్‌ఫఎక్స్‌, గ్రాఫిక్స్‌కు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. మరోవైపు గేమింగ్‌ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో విశాఖలో అంతర్జాతీయ స్థాయిలో వినోద నగరాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. వినోద రంగానికి సంబంధించిన పలు సంస్థలు ఈ నగరంలో ఏర్పాటయ్యేలా చూస్తారు.
 
దేశ, విదేశాల్లోని ప్రముఖ సంస్థలు తమ యూనిట్లను ఇక్కడ పెట్టేలా చూడటంతోపాటు అమెరికాకు చెందిన డిస్నీల్యాండ్‌ సంస్థతో కూడా మాట్లాడి, ఆ సంస్థనూ ఆహ్వానించాలని ఐటీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ సిటీకి సంబంధించిన పూర్తిస్థాయి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏవీజీసీ రంగాల్లోని ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి వచ్చేలా ఆకర్షించేందుకు కొత్తగా ఏవీజీసీ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినోద నగరంలో సంస్థలను ఏర్పాటు చేసే కంపెనీలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు, వారికి కలిగే ప్రయోజనాలు తదితరాలన్నీ ఈ విధానంలో ఉంటాయి.
 
ఫైబర్‌ గ్రిడ్‌తో వర్క్‌ ఫ్రమ్‌ హోం!
రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్‌ను ఉపయోగించుకుని వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రాజెక్టును కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు ఫస్ట్‌ అమెరికా(ఇండియా) కంపెనీ పేర్కొంది. ఇంటి నుంచే ల్యాండ్‌ రికార్డులను డిజిటలైజ్‌ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని కంపెనీ ఉపాధ్యక్షుడు రఘు పేర్కొన్నారు. ఇది విజయవంతమైతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల ల్యాండ్‌ రికార్డులను కూడా ఏపీలో ఇంటి దగ్గర కూర్చునే డిజిటలైజ్‌ చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఫలితంగా ఇంటి దగ్గర నుంచే పనిచేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చన్నారు.
 
ఫస్ట్‌ అమెరికా ప్రతినిధులు గురువారం సచివాలయంలో మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ఫైబర్‌గ్రిడ్‌ను ఉపయోగించుకుని గ్రామాల్లోని యువతీయువకులు ఇంటి నుంచే పని చేసుకునేలా ఒక మోడల్‌ అభివృద్ధి చేయాలని కోరారు. భూరికార్డుల డిజిటలైజేషన్‌ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలు, గృహిణులకు శిక్షణ ఇచ్చి ఇంటి నుంచే పనిచేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటు చేయాలని ఫస్ట్‌ అమెరికా యాజమాన్యాన్ని ఆహ్వానించారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ.. త్వరలోనే విజయవాడలో కంపెనీ ఏర్పాటు చేసి కార్యకలాపాలు విస్తరిస్తామన్నారు.
 
క్యుబెక్‌ మంత్రితో ఏపీ ఆర్సీ భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతున్న గేమింగ్‌, డిజిటల్‌ లెర్నింగ్‌ హబ్‌పై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఈ హబ్‌ ఏర్పాటుకు గతేడాది డిసెంబరులో యునెస్కో ఎంజీఐఈపీతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హబ్‌ను కెనడా దేశంలోని క్యుబెక్‌ ప్రావిన్స్‌ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రావిన్స్‌ అంతర్జాతీయ సంబంధాల వ్యవహారాల మంత్రి క్రిస్టియన్‌ పియారితో గురువారం ఢిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ సమావేశమయ్యారు. హబ్‌ ఏర్పాటుపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం కల్పిస్తోన్న సౌకర్యాలు, పరిపాలనలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సరికొత్త టెక్నాలజీ గురించి ఆమెకు వివరించారు. నూతన రాజధాని అభివృద్ధిని పరిశీలించడానికి అమరావతిని సందర్శించాలని ఆయన ఆహ్వానించారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

  • 2 months later...
కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్
16-04-2018 18:53:55
 
636595016341263692.jpg
అమరావతి: రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గేమింగ్ అండ్ కామిక్స్ రంగాలకు ఏపీని వేదిక చేసేలా పాలసీని రూపొందించారు. రూ.6,400 కోట్ల పెట్టుబడి ఆకర్షించే విధంగా పాలసీ రూపకల్పన చేశారు. సోమవారం సచివాలయంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం.. యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీ సెంటర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖలో 40 ఎకరాల విస్తీర్ణంలో యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీ ఏర్పాటుచేయనున్నారు.
 
 
రూ.5 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ ఉన్న తెలుగు, హిందీ, ఇంగ్లీష్ యానిమేషన్ సినిమాలకు 50 శాతం స్టేట్ జిఎస్టీ రాయితీ కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఐటీ పాలసీతో పాటు అదనంగా ఎంప్లాయ్‌మెంట్ రాయితీ కల్పించనున్నారు. మొదటి రెండు సినిమాలకు నిర్మాణ వ్యయంలో రూ.5 లక్షల రాయితీ, హార్డ్‌వేర్‌పై 25-35 శాతం రాయితీ, 24/7 విద్యుత్ సరఫరా, యూనిట్‌కు రూ.2 రాయితీ, ప్రత్యేక ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు.
 
 
వీటితోపాటు.. ఆక్వా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో ఆక్వా జోన్లు ఏర్పాటుచేయడం, ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడం, ఆక్వా రంగంలో కొత్త వ్యవస్థను రూపొందించడం వంటివి ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద.. టిడ్కో ద్వారా నిర్మించే ఇళ్లకు స్టాంప్ డ్యూటీ కల్పించారు. రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తూ కేబినేట్ నిర్ణయించింది.
Link to comment
Share on other sites

కొత్త యానిమేషన్‌, గేమింగ్‌ విధానంతో 6,400 కోట్ల పెట్టుబడులు!
17-04-2018 03:16:59
 
636595318182515824.jpg
  • జిల్లాల్లో వినోద పార్కులు..
  • విశాఖలో యానిమేషన్‌, గేమింగ్‌ సిటీ
  • ఇక్కడే పరిశ్రమలకు నీటి ప్రాజెక్టు
  • గురుకులాలకు 184 హిందీ టీచర్లు
  • సాగునీటి ప్రాజెక్టుగా తెలుగు గంగ..
  • అంచనా వ్యయం 6,671.62 కోట్లు
  • రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయాలు
అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించడమే లక్ష్యంగా నూతన యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ రంగాల్లో నూతన విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 2018-20 మధ్య అమల్లో ఉండే ఈ విధానం ద్వారా ఆయా రంగాల్లో రూ.6,400 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే పరిశ్రమలకు కీలకమైన నీటి వసతి కల్పించేందుకు రూ.412 కోట్ల అంచనాలతో పెందుర్తిలో సివరేజ్‌ సిస్టమ్‌, వేస్టువాటర్‌ ట్రీట్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా విశాఖ చుట్టుపక్కల ఉండే పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించే ప్రాజెక్టుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.
 
 
యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ రంగాల అభివృద్దికి మౌలిక వసతులు కల్పించడం, యువతీ యువకులకు శిక్షణ ఇవ్వడం కూడా నూతన విధానంలో భాగంగా ఉంటుంది. ఏపీ యానిమేషన్‌, గేమింగ్‌ సిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలో పలుచోట్ల గేమింగ్‌, యానిమేషన్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు ఏర్పాటు చేస్తారు. ఈ విధానంలో భాగంగా ఏపీలో నిర్మించే తెలుగు, హిందీ, ఆంగ్లం యానిమేషన్‌ సినిమాలకు రాష్ట్ర జీఎస్ టీలో 50 శాతం రాయితీ కల్పిస్తారు. ఆ సినిమా బడ్జెట్‌ రూ.5కోట్ల లోపు ఉండాలి. విశాఖపట్నంలో 40 ఎకరాల్లో యానిమేషన్‌, గేమింగ్‌ సిటీని ఏర్పాటుచేస్తారు. హార్డ్‌వేర్‌పై 25-30శాతం రాయితీ, 24 గంటలు విద్యుత్‌ సరఫరా, యూనిట్‌కి రెండు రూపాయల రాయుతీ, ప్రత్యేక ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తారు. ఐటీ దిగ్గజం ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు విశాఖలో అభివృద్ధి చేసిన 40 ఎకరాలను ఎకరా రూ.32.5లక్షల ధరకు కేటాయిస్తూ గతంలో జారీచేసిన జీవో-2లో మార్పుచేర్పులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 
Link to comment
Share on other sites

యానిమేషన్‌ రంగం జిగేల్‌!
విశాఖ, అమరావతిలో మొదటి దశలో అభివృద్ధి
2,500 ఎకరాల సమీకరణకు ఏపీఐఐసీ సన్నాహాలు
విశాఖలో 40 ఎకరాల్లో యానిమేషన్‌, గేమింగ్‌ సిటీ
amr-top2a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో యానిమేషన్‌ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకు పరిమితమైన ఈ రంగాన్ని రాష్ట్రంలోనూ పట్టాలెక్కించే ప్రయత్నం మొదలైంది. ఈ క్రమంలో ‘యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌, గేమింగ్‌, కామిక్స్‌ (ఏవీజీసీ) విధానాన్ని మంత్రి మండలి సొమవారం ఆమోదించిన విషయం తెలిసిందే. విశాఖలోని కాపులుప్పాడలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నుంచి సమీకరించే 40 ఎకరాల్లో
యానిమేషన్‌, గేమింగ్‌ సిటీ ఏర్పాటుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విధానానికి దేశీయంగా, విదేశాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాయి. నిపుణత కలిగిన యువతీ యువకులను సిద్ధం చేసి అందించడం వంటి అంశాలపై సమాచార, సాంకేతిక (ఐటీ) శాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఫిన్‌లాండ్‌కు చెందిన పీటర్‌ వెస్టర్‌ బేకా 50 వేల మంది విద్యార్థుల కోసం అమరావతిలో యూనివర్శిటీ ఏర్పాటుకు ఆసక్తి కబరుస్తోంది. విశాఖలో 20 నుంచి 25 కంపెనీలతో ‘యానిమేషన్‌ గేమింగ్‌ హబ్‌’ ఏర్పాటు నిమిత్తం యునెస్కో ముందుకొచ్చింది. ఇందుకోసం 5 వేల నుంచి 7 వేల ఎకరాల భూమిని సిద్ధం చేసి వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించే యోచనలో అధికారులు ఉన్నారు. విశాఖ, రాజమహేంద్రవరం, అమరావతి, గుంటూరు, చిత్తురు, అనంతపురం వంటి ముఖ్య నగరాలు, పట్టణాల్లో 2020 నాటికి రూ.6,400 కోట్ల పెట్టుబడులతో ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏవీజీసీ విధాన ప్రత్యేకతలివి....
* విశాఖపట్నం, అమరావతిలో మొదటి విడతగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 2,000 నుంచి 2,500 ఎకరాలు సిద్ధం చేసి ముందకొచ్చే సంస్థలకు ఐటీ పాలసీలో భాగంగా నిర్దేశించిన ధరలకు స్థలాలు కేటాయిస్తారు.
* 24 గంటలూ విద్యుత్తు సరఫరా, యూనిట్‌ విద్యుత్తుపై రూ.2 రాయితీ అందిస్తారు. అంతర్జాల సదుపాయాన్ని కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక లైను, ట్రిపుల్‌ ప్లే బాక్సులు ఏర్పాటు చేస్తారు.
* రాష్ట్రంలో రూ.5 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో నిర్మించే తెలుగు, హింది, ఆంగ్ల యానిమేషన్‌ సినిమాలకు 50 శాతం రాష్ట్ర జీఎస్‌టీ నుంచి రాయితీ.
* హార్డ్‌వేర్‌ సంబంధిత ఖర్చులపై 25 నుంచి 35 శాతం రాయితీ (సబ్సిడీ) అందించాలని నిర్ణయించి దీన్ని రూ.కోటికి పరిమితం చేశారు.
* ప్రభుత్వం కేటాయించే స్థలంలో సామాజిక అవసరాల కోసం 20 శాతాన్ని కంపెనీలు వినియోగించుకునే వెసులుబాటు.
* సంస్థలు నిర్మించే మొదటి రెండు యానిమేషన్‌ చిత్రాలకు నిర్మాణ ఖర్చులో రూ.5 లక్షలు ప్రభుత్వం ప్రోత్సాహకంగా చెల్లిస్తుంది.
* ఐటీ పాలసీ-2014-20 ప్రకారం అదనపు ఉద్యోగ కల్పన కోసం అందిస్తున్న రాయితీలు యానిమేషన్‌ విధానానికీ వర్తిస్తాయి.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
యానిమేషన్‌ రంగానికి ప్రోత్సాహం
పెట్టుబడులు పెట్టే సంస్థలకు చేయూత
పలు రాయితీలతో ప్రభుత్వ విధానం
విధాన మార్గదర్శకాలు జారీ
ఈనాడు - అమరావతి

యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌, గేమింగ్‌, కామిక్స్‌ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 2018-2020 విధానానికి సంబంధించి మార్గదర్శకాలు సోమవారం జారీ అయ్యాయి. రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి ముఖ్య నగరాలతోపాటు ఇతర ప్రధాన పట్టణాల్లో యానియేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌ రంగంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. పారిశ్రామిక, ఐటీ రంగాలను ప్రోత్సహిస్తూ ఇప్పటికే అనేక విధానాలు ప్రకటించటం తెలిసిందే. దక్షిణాదిన మిగతా రాష్ట్రాలతో సమానంగా యానిమేషన్‌ రంగంలోనూ పెట్టుబడులు ఆకర్షించేలా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేకించి విశాఖపట్నాన్ని యానిమేషన్‌, గేమింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దనుంది.

రాయితీలిలా..
* ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో స్థలాలు కేటాయిస్తారు.
* యానిమేషన్‌, గేమింగ్‌ సిటీలకు ఫైబర్‌ గ్రిడ్‌ నుంచి ప్రత్యేకంగా నిరంతరాయ అంతర్జాల సేవలు అందిస్తారు.
* సమీప సబ్‌స్టేషన్ల నుంచి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తారు. ఒక్కో యూనిట్‌పై రూ.2 రాయితీ అందిస్తారు.
* సంస్థలకు కేటాయించే స్థలంలో 20శాతాన్ని సామాజిక అవసరాల కోసం ఉపయోగించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తారు.
* యానిమేషన్‌, గేమింగ్‌లో నేర్పున్న విద్యార్థులను విశ్వవిద్యాలయాల స్థాయిలో తయారుచేసి నిపుణుల కొరతను అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
* రూ.కోటి విలువైన హార్డ్‌వేర్‌ పరికరాల కొనుగోళ్లలో కంపెనీలకు 25శాతం రాయితీ ప్రభుత్వం అందించనుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇది 35 శాతం వరకు వర్తిస్తుంది.
* యానిమేషన్‌ చిత్రాలు, గేమింగ్‌ నిర్మాణంపై ప్రభుత్వం తరఫున గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు. మొదటి రెండు చిత్రాలకే ఇవి వర్తిస్తాయి. కంపెనీలు చెల్లించే రాష్ట్ర వస్తు,సేవల పన్ను(ఎస్‌జీఎస్‌టీ)లో 50శాతం మొత్తాన్ని సర్కారు వాపసు చేయనుంది.

Link to comment
Share on other sites

On 4/19/2018 at 8:16 PM, sskmaestro said:

Manollu pictures and graphics tho extreme high expectations set chestunnaru.....

Gaming city ante nake sarigga idea ledhu annai..  but normal janalaki ardham avtundhi anukonu unitll it become reality.. but at present 6400 Crores Investments vasthunnai ani matram ardham ayindhi :cheers:

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...
విశాఖలో ‘డిజైన్‌’ వర్సిటీ
05-07-2018 03:51:27
 
  • ఎపి సిఎం చంద్రబాబుతో యునెస్కో ప్రతినిధి బృందం భేటీ
అమరావతి (ఆంధ్రజ్యోతి): విశాఖకు మరో ప్రతిష్ఠాత్మకమైన సంస్థ రానున్నది. గేమింగ్‌ ప్రపంచాన్ని శాసించేలా డిజైన్‌ యూనివర్సిటీ నెలకొల్పేందుకు యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌, కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) ముందుకొచ్చింది. గేమింగ్‌-డిజిటల్‌ లెర్నింగ్‌ హబ్‌ ఏర్పాటుపై రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఇడిబి)తో ఒప్పందం చేసుకున్న యునెస్కో ప్రతినిధి బృందం బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. విశాఖను ఇంటర్నేషనల్‌ గేమింగ్‌, డిజిటల్‌ లెర్నింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది ఇందుకోసం 100 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రతిపాదించింది. భవిష్యత్తులో గేమింగ్‌ టెక్నాలజీ ఉత్తమ ఆదాయ వనరుగా ఉంటుందని, యుబి సాఫ్ట్‌, శాంసంగ్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అత్యుత్తమ సంస్థలు కూడా ఇక్కడ తమ కేంద్రాలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నాయని యునెస్కో ప్రతినిధులు చెప్పారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
విశాఖలో ఐ హబ్‌
31-07-2018 03:14:05
 
  • ఎడ్యూటెక్‌, గేమింగ్‌ కంపెనీలకు అవకాశం
  • డిజైన్‌ వర్సిటీ, ప్రత్యేక స్కూల్‌ ఏర్పాటు
  • యునెస్కోతో ఒప్పందం... పలు కంపెనీలతో చర్చలు
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సైంటిఫిక్‌ లెర్నింగ్‌ను పెంచేందుకు ప్రపంచస్థాయి ఐ హబ్‌(ఇంటెలిజెన్స్‌ హబ్‌) ఏర్పాటుకు చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ (ఎడ్యుటెక్‌) రంగంలో ముందడుగు వేసేందుకు ఈ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేజీ నుంచి పీజీ వరకూ బోధనకు టెక్నాలజీ జోడించే పద్ధతులను ఈ హబ్‌ అభివృద్ధి చేస్తుంది. అందుకు అవసరమైన పరికరాలను కూడా సమకూరుస్తుంది. డిజిటల్‌ లెర్నింగ్‌ను ప్రోత్సహిస్తుంది. హబ్‌కు సహజోడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రుబికా కంపెనీతో కలిసి డిజైన్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.
 
విశాఖపట్నంలో ఈ ఐ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హబ్‌ ఏర్పాటు కోసం ఇప్పటికే యునెస్కో, మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐ హబ్‌లో తమ తమ శాఖలను ప్రారంభించేందుకు పలు కంపెనీలతో ఈడీబీ చర్చలు జరుపుతోంది. శాంసంగ్‌, మైక్రోసాఫ్ట్‌ తదితర కంపెనీలతో ఇప్పటికే నాలుగు దఫాలుగా చర్చలు సాగాయి. కొన్ని కంపెనీలు తమ అంగీకారాన్ని తెలిపాయి. మానసిక ఎదుగుదల లేని పిల్లల కోసం ఒక పాఠశాలను ఈ హబ్‌లో ఏర్పాటు చేస్తున్నారు.
 
వారికి ఏ రీతిలో పాఠాలు చెప్పాలన్న అంశాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి, నిర్ణయించి ఇక్కడ అమలు చేస్తారు. యావత్‌ ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి ఈ స్కూల్‌ సేవలందిస్తుంది. గేమింగ్‌ ఫర్‌ లెర్నింగ్‌ లక్ష్యంతో... గేమ్స్‌ను తయారుచేసే కంపెనీలకు ఇక్కడ స్థలం కేటాయిస్తారు. స్టార్టప్‌ కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలనూ కల్పిస్తారు. భాగస్వామ్య సదస్సులో ఐ హబ్‌ ఏర్పాటుపై యునెస్కోతో ఒప్పందం కుదిరిందని, దాన్ని ఆచరణలోకి తెచ్చే దిశగా చేసిన కృషి ఫలించిందని ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

twitter copy star makki ki makki mana daggara copy kodutunnadu ga.....originality zero vadi daggara.....malli edava santa natakalu "meme first" anukunta...

Lokesh edi chesthe danni same group daggara "maku bhi" ani standing in line

 

RTG copy, hitachi valla daggara valipoyadu, blockchain copy, modi&niti gadu suppport tho a drama modalu......manam edi chesthe with in two months lo akkada line kadtunnadu...phone tapping tho 1st lo nettukochadu behind scenes..ippudu inka antha open copy&paste.....

 

 

 

 

 

 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

  • 3 months later...
విశాఖ ఐ-హబ్‌లో భాగమవుతాం
04-12-2018 03:00:54
 
  • ముఖ్యమంత్రికి యునెస్కో ఎంజీఐఈపీ లేఖ
అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): విశాఖలో ఇంటెలిజెంట్‌ గ్లోబల్‌ హబ్‌(ఐ-హబ్‌) ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనను యునెస్కో స్వాగతించింది. డిజిటల్‌ మేథా సంపత్తికి సంబంధించి ఐ-హబ్‌ ఏర్పాటుచేసేందుకు 50 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ఇటీవల విశాఖలో జరిగిన టెక్‌-2018 సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. యునెస్కోకు అనుబంధంగా పనిచేస్తున్న మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌(ఎంజీఐఈపీ) సంచాలకులు ఆచార్య డాక్టర్‌ అనంత దురైయ్యప్ప దీనిపై చంద్రబాబుకు లేఖ రాశారు. యునెస్కో ఎంజీఐఈపీ-ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందంతో ఐ-హబ్‌ ఏర్పాటు... గ్లోబల్‌ డిజిటల్‌ విద్యా విధానాలను విస్తృతం చేసేందుకు ఉపయోగపడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీతో తాము ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...