Jump to content

‘విజయ్‌’ రాజకీయ ఏర్పాట్లు 


KING007

Recommended Posts

‘విజయ్‌’ రాజకీయ ఏర్పాట్లు 
వేగంగా బూత్‌ కమిటీల ఏర్పాట్లు 
సగం పూర్తయిన సభ్యుల చేరిక ప్రక్రియ 
61089812.jpg

చెన్నై: రాజకీయ పార్టీలు పెట్టబోతున్నట్లు అగ్ర నటులు రజనీ, కమల్‌ ప్రకటించారు. దానికితగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు విజయ్‌ తన రాజకీయరంగ ప్రవేశానికి గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయ్‌ ప్రజా సంఘం నిర్వాహకులు ఒక తమిళ పత్రికకు తెలిపారు. చెన్నైలో విజయ్‌ వీరితో సమావేశమయ్యారు. అందులో పాల్గొన్న నిర్వాహకులు కొందరు మాట్లాడుతూ సభ్యులను చేర్చడానికి రజనీ తన వెబ్‌సైట్‌ను జనవరి 2న ప్రారంభించారని, అయితే సభ్యులను తమ నాయకుడు విజయ్‌ గత ఏడాది సెప్టెంబర్‌లోనే సభ్యులను చేర్చడానికి మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రారంభించారని గుర్తు చేశారు. బూత్‌ కమిటీల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు మాత్రమే ప్రతి బూత్‌లో నిర్వాహకులను కూర్చోబెట్టి ఓటు నమోదును పరిశీలించే విధంగా బలమైన క్యాడర్‌ ఉందని, ఆ విధంగా మనకు కూడా బూత్‌ కమిటీలు ఉండాలని, ఎన్నికల విజయాన్ని బూత్‌ కమిటీలే నిర్ణయిస్తాయని విజయ్‌ ఈ సందర్భంగా చెప్పాడని సమాచారం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బూత్‌ కమిటీ ఏర్పాట్లు చేయమని అఖిల భారత విజయ్‌ ప్రజా సంఘం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్‌ను విజయ్‌ ఆదేశించినట్లు సమాచారం. దీని ప్రకారం తాము బూత్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఒక బూత్‌ కమిటీలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ఉప కార్యదర్శి, కోశాధికారి మొదలగు వారుంటారన్నారు.

నియోజకవర్గానికి 50 వేల మంది సభ్యులను చేర్చాలని అధిష్ఠానం తమకు సూచిందని, అందులో ప్రస్తుతం సగం పనులు పూర్తయ్యాయని ఓ అభిమాని తెలిపారు. 2016 ఎన్నికల్లోనే ఒక పెద్ద పార్టీ విజయ్‌ తండ్రితో చర్చలు జరిపిందని, అయితే దానికి విజయ్‌ అడ్డుకట్ట వేశారన్నారు. ఒకవేళ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఏఏ నియోజకవర్గాలు అడగాలో కూడా పట్టిక తయారు చేశామని, తంజావూరు, సేలం, మదురై, చెన్నైలో తమకు ఎక్కువ మద్దతు ఉందని ప్రజా సంఘం నిర్వాహకులు తెలిపారు. అయితే పొత్తుల గురించి నిర్వాహకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, మదురై జిల్లా నిర్వాహకులు మాత్రం విజయ్‌ ఒంటరిగా బరిలో దిగాలని కోరుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. పడమర మండల నిర్వాహకులు మాత్రం విజయకాంత్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ అన్నాడీఎంకేతో పొత్తువలన ఎక్కువ సీట్లు సాధించినట్లు గుర్తు చేశారు. కావున ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమమని వారు అభిప్రాయపడిరట్లు సమాచారం. టీటీవీతో పొత్తు పెట్టుకోవాలని దిండుక్కల్‌, తేని, డెల్టా జిల్లాల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. వీరి అభిప్రాయాలన్నీ విజయ్‌ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తంజావూరు జిల్లా విజయ్‌ ప్రజా సంఘం అధ్యక్షుడు విజయ్‌ శరవణన్‌ మాట్లాడుతూ బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయమని ఆరు నెలల ముందే అధిష్ఠానం తమతో చెప్పిందని, ఇది రాజకీయాల కోసమేనా అని ప్రస్తుతం చెప్పలేమని, తమ కోరిక విజయ్‌ త్వరలో రాజకీయ రంగంలోకి దిగాలన్నదేనని పేర్కొన్నారు. అఖిల భారత విజయ్‌ ప్రజా సంఘం అధ్యక్షడు బుస్సీ ఆనంద్‌ మాట్లాడుతూ బూత్‌ కమిటీల ఏర్పాటు సాధారణ చర్యని, రాజకీయ ప్రవేశం గురించి విజయే నిర్ణయం తీసుకోవాలని, అతను చెప్పినట్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...