Jump to content

jio mobile manufacture unit in tirupati !

sonykongara

Recommended Posts

  • 2 weeks later...

రిలయన్స్‌ ధమాకా
26-02-2018 02:42:26

రాష్ట్రంలో 52 వేల కోట్ల పెట్టుబడులు
ఎలక్ట్రా‌నిక్స్‌ నుంచి ఇన్నోవేషన్‌ దాకా..
చిప్స్‌ టూ సెట్‌టాప్‌ బాక్సుల వరకూ..
తిరుపతి, అమరావతి, విశాఖల్లో కేంద్రాలు
భాగస్వామ్య సదస్సులో కుదిరిన అవగాహన
 
(విశాఖ భాగస్వామ్య సదస్సు నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
సీఐఐ పెట్టుబడుల సదస్సులో ఆదివారం కీలక దినం. దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ఆంధ్రప్రదేశ్‌లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎలకా్ట్రనిక్స్‌, పెట్రో రంగాల్లో ఏకంగా రూ.52 వేల కోట్ల పెట్టుబడులకు రాష్ట్రప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఇన్నోవేషన్స్‌ నుంచి ఎలక్ర్టానిక్స్‌ దాకా.. చిప్స్‌ నుంచి ఫోన్లు, సెట్‌టాప్‌ బాక్సుల వరకూ రాష్ట్రంలోనే తయారు చేసేందుకు సిద్ధమైంది. తిరుపతి, అమరావతి, విశాఖపట్నం నగరాలను కేంద్రంగా చేసుకుని వివిధ దశల్లో పెట్టుబడులు పెట్టనుంది. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు సందర్భంగా ఆదివారం ఈ మేరకు సీఎం చంద్రబాబు, ఐటీశాఖ మంత్రి లోకేశ్‌, ఆ శాఖ కార్యదర్శి విజయానంద్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్‌ ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు.
 
పెట్టుబడులు ఇలా: తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో.. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రా‌నిక్స్‌ తయారీ కంపెనీని రిలయన్స్‌ ఏర్పాటు చేస్తుంది. రోజుకు 10 లక్షల జియో ఫోన్లు, సెట్‌టాప్‌ బాక్సులు, ఇతర ఎలకా్ట్రనిక్‌ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఒకేచోట 25వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రూ.37 వేల కోట్లతో విశాఖలో పెట్రోలియం, ఇతర రంగాలు, అమరావతిలో ‘స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ ఎలక్ట్రా‌నిక్స్‌’ కింద 100 ఎకరాల్లో రిలయన్స్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేయనుంది. అమరావతిలో ఎలక్ట్రా‌నిక్స్‌ , టెలికాం ఇంజనీరింగ్‌ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. ఈ క్యాంప్‌సలో 20 వేల వరకూ ఉద్యోగాలు వస్తాయి. ఈ కేంద్రంలో నెక్ట్స్‌ జనరేషన్‌ అండ్‌ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొల్యూషన్‌-సర్వీసెస్‌, ఇంటిగ్రేటెడ్‌ గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ సొల్యూషన్స్‌, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌, మల్టీపర్పస్‌ డిజిటల్‌ టెక్నాలజీ పార్క్‌ ఏర్పాటు చేయనుంది.

Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

:super:

Link to comment
Share on other sites

రిలయన్స్‌ పెట్టుబడులు 
తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ పార్కు, అమరావతిలో క్యాంపస్‌ 
కృష్ణా-గోదావరి బేసిన్‌లోమూడు ప్రాజెక్టులు 
విశాఖ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఐటీ, పెట్రోలియం రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ ముందుకొచ్చింది. రూ.55 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది. విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీఎంఎస్‌ ప్రసాద్‌, రిలయన్స్‌ జియో డిజిటల్‌ సర్వీసెస్‌ విభాగం అధ్యక్షుడు కిరణ్‌ థామస్‌, ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
మొదటి ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ రూ.15 వేల కోట్లు నేరుగా పెట్టుబడి పెడుతుంది. తిరుపతి సమీపంలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ పార్కు ఏర్పాటు చేస్తోంది. 10 లక్షల జియోఫోన్లు ఉత్పత్తి చేసే యూనిట్‌, సెట్‌టాప్‌ బాక్స్‌ తయారీ పరిశ్రమ, చిప్‌ డిజైనింగ్‌ యూనిట్‌ వంటివి ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో శిక్షణ కేంద్రం నెలకొల్పుతారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల్లో ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌, స్టార్టప్‌, వెంచర్‌ క్యాపిటల్‌, పరిశోధన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటిష్‌ పెట్రోలియం సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మరో ఒప్పందం జరిగింది. దీని విలువ రూ.40 వేల కోట్లు. దీనిలో భాగంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లో సహజ వనరుల వినియోగానికి సంబంధించి మూడు ప్రాజెక్టులు చేపడతారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో రిలయన్స్‌ విప్లవాత్మక మార్పులు తెస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ప్రజలకు ఉత్తమ సేవలందించాలన్నదే ముకేశ్‌ అంబానీ ఆకాంక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు.
హార్డ్‌వేర్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు 
తిరుపతిలో ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్‌ పార్కు ద్వారా హార్డ్‌వేర్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చంద్రబాబు అన్నారు. రిలయన్స్‌ సంస్థ తమ షాపింగ్‌ మాల్స్‌ కోసం రాష్ట్రం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని పెద్ద ఎత్తున సేకరించనుందని, దానిపై కూడా ఆ సంస్థ రానున్న రోజుల్లో పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ఇ-గవర్నెన్స్‌, ఇ-ప్రగతి ప్రాజెక్టులపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తోందని, త్వరలో ఆ సంస్థ నుంచి 20-25 మంది సాంకేతిక నిపుణులు అమరావతికి వచ్చి పనిచేయనున్నారని తెలిపారు.
ప్రతి మూడు నెలలకు ముఖ్యమంత్రి, ముకేశ్‌ సమీక్ష 
రాష్ట్రానికి రిలయన్స్‌ పెట్టుబడులు తీసుకురావడం వెనుక ఐటీ మంత్రి లోకేష్‌ కృషి చాలా ఉంది. ఆయన గత అక్టోబరు 23న ముంబయి వెళ్లి, ముకేశ్‌ అంబానీతో    భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, పెట్టుబడి అవకాశాల గురించి లోకేష్‌ ఆయనకు వివరించారు. ముకేశ్‌ సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత రిలయన్స్‌ ప్రతినిధులతో లోకేష్‌ సమావేశమయ్యారు. చివరకు పెట్టుబడుల ప్రతిపాదనలు సాకారమయ్యాయి. ఆదివారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) తర్వాత రిలయన్స్‌ ప్రతినిధులతో లోకేష్‌ మళ్లీ సమావేశమయ్యారు. ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బృందం ప్రతి వారం సమావేశమవుతుంది, ప్రతి నెలా మంత్రి స్థాయిలో సమీక్ష జరుగుతుంది. ప్రతి మూడు నెలలకు ముఖ్యమంత్రి, ముకేశ్‌ అంబానీ వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో సమావేశమై, పురోగతిని సమీక్షించనున్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

చిప్‌ డిజైనింగ్‌కు అమరావతి గమ్యస్థానం

ఫోన్ల విడి భాగాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. చిప్‌ డిజైనింగ్‌కు అమరావతి గమ్యస్థానం కానుందని చెప్పారు. తిరుపతి విమానాశ్రయం సమీపంలో రిలయన్స్‌ పెట్టుబడులు పెడుతుందని లోకేశ్‌ వెల్లడించారు. రూ.7వేల కోట్లతో రిలయన్స్‌ జియో ఫోన్లు, అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రిలయన్స్‌కు అనుబంధంగా మరో మూడు పరిశ్రమలు వస్తున్నాయని దాంతో సుమారు 25వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కళ్లకు కనిపించే అభివృద్ధిని, అసత్య ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.  గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ఈ నెల 15న ఉత్తర్వులు జారీ కానున్నాయని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.1500 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఇంకా రూ.1500 కోట్ల వరకూ రావాలని లోకేశ్‌ అన్నారు.

Link to comment
Share on other sites

49 minutes ago, Nandamuri Rulz said:

Endi deeni status... Permissions isthe kotlu kummaristhaa annnadu ga ambani... Permissions ivvaleda leka asalu permissions adagaleda

naaku doubt enti ante gas meeda cbn fight seyyakunda unte tirupati lo jio unit pedatha ani untadu. bayataki 7000 cr ani untadu kaani lopala maathram ee 30 cr unit ani planning sesi untadu ambani. :P

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

naaku doubt enti ante gas meeda cbn fight seyyakunda unte tirupati lo jio unit pedatha ani untadu. bayataki 7000 cr ani untadu kaani lopala maathram ee 30 cr unit ani planning sesi untadu ambani. :P

Intha complicated equation badhulu, Modi influenced ante dharmic happiness untundhi ga sodarulu andhariki.

Link to comment
Share on other sites

8 hours ago, LuvNTR said:

naaku doubt enti ante gas meeda cbn fight seyyakunda unte tirupati lo jio unit pedatha ani untadu. bayataki 7000 cr ani untadu kaani lopala maathram ee 30 cr unit ani planning sesi untadu ambani. :P

gas meedha CBN fight cheyyatam enti? enduku chestaru emani chestaru? all AP is asking for is a share in the royalties... and this is fight between center and state... ambani ekkada nunchi vachhadu ikkada?

Link to comment
Share on other sites

21 minutes ago, katti said:

gas meedha CBN fight cheyyatam enti? enduku chestaru emani chestaru? all AP is asking for is a share in the royalties... and this is fight between center and state... ambani ekkada nunchi vachhadu ikkada?

true. in fact, for business point of view,  it fetches more goodwill to them if the 50% royalty is paid to state.

with all the leaks, fires and other damages to environment, at least other parts of the state will be sympathetic to them. also, state can afford to do better job in alleviating pain of locals.

Edited by swarnandhra
Link to comment
Share on other sites

17 minutes ago, katti said:

gas meedha CBN fight cheyyatam enti? enduku chestaru emani chestaru? all AP is asking for is a share in the royalties... and this is fight between center and state... ambani ekkada nunchi vachhadu ikkada?

:P

Link to comment
Share on other sites

  • 8 months later...
రిలయన్స్‌ సెజ్‌ రెడీ!
13-12-2018 02:56:55
 
  • వచ్చే నెలలోనే శంకుస్థాపన
  • తిరుపతి సమీపంలో 150 ఎకరాల్లో...
  • 15వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
  • 25వేల మందికి ఉపాధి అవకాశాలు
  • రోజుకు పది లక్షల ఉపకరణాలు
  • అమరావతికీ రిలయన్స్‌ రాక?
  • స్టార్ట్‌ప్సపై ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌!
అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘రిలయన్స్‌ ఎలక్ర్టానిక్స్‌ సెజ్‌’ రాకకు రంగం సిద్ధమవుతోంది. తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఈ సెజ్‌ ఏర్పాటు కానుంది. ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి ముగియగానే... ‘రిలయన్స్‌’ సంస్థ ఎలక్ర్టానిక్ సెజ్‌పై దృష్టి సారించనుంది. జనవరిలోనే ఈ సెజ్‌కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ముకేశ్‌తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ తదితరులు పాల్గొననున్నారు. రిలయన్స్‌ ఎలక్ర్టానిక్స్‌ సిటీ కోసం ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించింది. ఇందులో రిలయన్స్‌ సంస్థ సుమారు రూ.15వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది. జియోఫోన్లు, సెట్‌టాప్‌ బాక్స్‌లతోపాటు రోజుకు దాదాపు పది లక్షల ఎలక్ర్టానిక్ వస్తువులు ఇక్కడ తయారవుతాయి.
 
ఈ ఒక్క సెజ్‌లోనే 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గతంలో లోకేశ్‌ ముంబై వెళ్లి ముకేశ్‌ అంబానీని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో ఎలక్ర్టానిక్స్‌ రంగంలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. ఈ ప్రతిపాదనపై ముఖేశ్‌ సానుకూలంగా స్పందించారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో రిలయన్స్‌తో ఎంవోయూ కూడా కుదిరింది. దీనిపై తదుపరి చర్చలు కూడా జరిగాయి. జనవరిలో శంకుస్థాపన చేయాలనే నిర్ణయం జరిగింది. రిలయన్స్‌ ఎలక్ర్టానిక్స్‌ సెజ్‌ రావడం కీలక పరిణామమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘ఇప్పటికే దేశవ్యాప్తంగా తయారయ్యే ప్రతి వంద సెల్‌ఫోన్లలో 30 మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. రిలయన్స్‌ క్లస్టర్‌ ప్రారంభించిన తర్వాత ఇది మరింత పెరుగుతుంది’’ అని చెబుతున్నాయి.
 
అమరావతిలో ‘ఆర్‌ అండ్‌ డీ స్టార్టప్‌’
తిరుపతిలో ఎలక్ర్టానిక్‌ సెజ్‌ స్థాపిస్తున్న రిలయన్స్‌ సంస్థ అమరావతిలోనూ పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ ‘రీసెర్స్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఫర్‌ స్టార్ట్‌ప్స’ను ప్రారంభించే అవకాశాలున్నాయి. రిలయన్స్‌ ఇండస్ర్టీ్‌సకు సంబంధించిన ఒక ప్రధాన కార్యాలయంగా ఇది రూపొందనుంది. ఈ ప్రతిపాదన ఇంకా తుది రూపానికి రాలేదని... ఎలక్ర్టానిక్స్‌ సెజ్‌ ప్రారంభ సమయానికి ఈ సెంటర్‌పైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
 
ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో ఐదు ఐటీ కంపెనీలు
మరోవైపు ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో ఐదు ఐటీ కంపెనీలు అమరావతికి రానున్నాయి. ఇందులో విజయవాడలో రెండు, మంగళగిరిలోని ఐటీ సెజ్‌లో మూడు ప్రారంభంకానున్నాయి. ఇవన్నీ చిన్న స్థాయి కంపెనీలే. అమెరికాలో కంపెనీలను నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రులు వాటి శాఖలను ఇక్కడ కూడా ప్రారంభించనున్నారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...

Lokesh: shenzhen lo oka big plant lo 1 lakh employees unnaru...manam 2 years lo 2 lakhs cheddam Hardware lo, cheyyagalam kuda

Ventane haters batch trolling lokesh meda :wall:

cut chesthe Reliance alone 25,000 employees  and all 25,000 to be filled in an year as Reliance wants 100% capacity by 2019 mid:pepper:

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...