Jump to content

Ramayapatnam Port


sonykongara

Recommended Posts

రామాయపట్నమే 

ప్రత్యామ్నాయం 
ప్రకాశం జిల్లాకు వరమే 
లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి 
ఈనాడు - అమరావతి 

నెల్లూరు జిల్లా దుగరాజపట్నం నౌకాశ్రయానికి ప్రత్యామ్నాయంగా మరోటి సూచించాలని కేంద్రం కోరిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా రామాయపట్నం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతం పూర్తి అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలోచించి నివేదికలను తయారు చేయించింది. యూపీఏ హయాంలో దేశంలో రెండు భారీ నౌకాశ్రయాల నిర్మాణానికి సంకల్పించారు. పశ్చిమబెంగాల్‌కు ఒకటి కేటాయించగా ఆంధ్రప్రదేశ్‌లో మరోటి ఏర్పాటుచేయాలని అప్పట్లో కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై సమగ్ర సర్వే చేయించి విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయపట్నం, నెల్లూరు జిల్లా దుగరాజపట్నం ప్రాంతాలను ఎంపిక చేసింది. నక్కపల్లికి సమీపంలో ఇప్పటికే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ నౌకాశ్రయాలు ఉండటంతోపాటు నౌకాదళ    అభ్యంతరాల నడుమ పక్కన పెట్టారు. దీంతో రామాయపట్నం వైపు మొగ్గు కనిపించింది. ఐదు వేల ఎకరాల విస్తీర్ణం, రూ.ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి, ఏడాదికి 30 మి.టన్నుల సరుకు రవాణా, ఆరు బెర్తుల సామర్థ్యంతో నౌకాశ్రయం ఏర్పాటుచేసేలా నివేదిక రూపొందించింది. అనుమతి వచ్చినట్లేనని భావిస్తున్న సమయంలో అప్పటి తిరుపతి ఎంపీ చింతా మోహన్‌ పార్లమెంటుసభ్యులతో సంతకాలు చేయించి ఒత్తిడి తెచ్చారు. దీంతో దుగరాజపట్నం నౌకాశ్రయానికి కేంద్రం సుముఖత తెలిపింది. సమీపంలోనే శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం(షార్‌) ఉన్నందున భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) దీనిపై అభ్యంతరాలు తెలిపింది. దగ్గర్లోనే ఉన్న కొల్లేరు సరస్సు రక్షణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చి నిర్మాణ ప్రతిపాదనలు ఏళ్లపాటు మూలనపడ్డాయి.
రైట్స్‌ నివేదిక 
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రామాయపట్నం నౌకాశ్రయంపై దృష్టి పెట్టింది. 2015లో రైట్‌ సంస్థతో నివేదికలు తయారు చేయించింది. సాగరమాలలో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తొలిదశలో 1,200 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు తయారుచేసింది. ఇక్కడ నౌకాశ్రయం నిర్మాణం వల్ల ఎనిమిది గ్రామాల పరిధిలో 2,200 మంది ప్రజలను తరలించాల్సి ఉంటుందని గుర్తించారు. రూ.420కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జిల్లా అధికారులు నివేదించారు.
వెనకబడిన జిల్లాకు వరం 
ఒక్క పెద్ద పరిశ్రమ కూడా లేని ప్రకాశం జిల్లాకు రామాయపట్నం నౌకాశ్రయం పెద్ద వరమే అవుతుంది. వలసపోతున్న లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. ఇక్కడ్నుంచి గ్రానైట్‌, పొగాకు, పత్తి, ఉప్పు, ఆక్వా, జీడిపప్పు ఎగుమతులు చేసేందుకు వీలుంటుంది. ఆంధ్ర, రాయలసీమతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ తదితర ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది.
అనుకూలతలు 
* పోర్టు ప్రతిపాదించిన ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో 7.91కిలోమీటర్ల సముద్రతీరం 
* 20 మీటర్ల లోతు 
*ఐదు కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారి, రైల్వేలైను 
* సమీపంలోనే బకింగ్‌హామ్‌ కాలువ, జలరవాణాకు అవకాశం

Edited by sonykongara
Link to comment
Share on other sites

రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేయాలి’
14-02-2018 01:50:07
ఒంగోలు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేయాలని, ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని పలు రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోరుతూ జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ, సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ ఎంఎల్‌, బీఎస్పీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
దుగ్గరాజుపట్నంలో పోర్టు ఏర్పాటు సాంకేతిక కారణాలతో వీలుకాదని, మరో ప్రతిపాదన ఇవ్వాలని కేంద్రం కోరినందున రామాయపట్నంలో ఏర్పాటుకు తక్షణం ప్రతిపాదనలు పంపించాలని సమావేశం కోరింది. అందుకోసం జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరింది. అంతేకాక వివిధ వర్గాలను కూడగట్టుకొని పోర్టు సాధన కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.

Link to comment
Share on other sites

4 hours ago, swarnandhra said:

environmental/security is the main issue at Dugarajapatnam. Is n't it? what difference does this financial viability report from Aecom make?

 

Basic gaa aaa Adani gaadi ki kaavaali emo idi koodaa - so financial incentives isthey work out ayyiddi Ani leaks pettinchi vuntaaru report lo

so first mokallu addam petti tharwatha saavu kaburu salla gaa cheppaaru 

Link to comment
Share on other sites

  • 5 months later...
  • 2 weeks later...
రామాయపట్నంలో సొంతంగా పోర్టు?
11-08-2018 02:27:21
 
636695512415159593.jpg
  • సాధ్యాసాధ్యాలపై రాష్ట్రం అధ్యయనం
అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభుత్వ సహాయ నిరాకరణ నేపథ్యంలో ప్రకాశం జిల్లా రామాయపట్నంలో సొంతంగా పోర్టు నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలను ప్రస్తుతం పరిశీలిస్తోంది. నిజానికి రామాయపట్నం సమీపంలోనే.. నెల్లూరు జిల్లాలో ఉన్న దుగరాజపట్నంలో కేంద్ర ప్రభుత్వం పోర్టు నిర్మించాలని రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దీనిపై ఇంతవరకూ పురోగతి లేదు. విభజన చట్టంలో ఉన్న హామీ కావడంతో దుగరాజపట్నం పోర్టు డిమాండ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరాదని, కేంద్రంపై ఒత్తిడి కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రామాయపట్నంలోనూ పోర్టు ఏర్పాటుకు డిమాండ్‌ ఉండడంతో అక్కడ రాష్ట్రప్రభుత్వం సొంతంగా పెట్టడం సాధ్యమో కాదో పరిశీలన చేయించాలని నిశ్చయించారు. వివిధ సాంకేతికాంశాలపై ఇప్పటికే అధ్యయనం మొదలైంది. సముద్ర అలలు వేగంగా వస్తే ఓడలకు ఇబ్బంది వస్తుంది. అలల తాకిడి తగ్గించడానికి మధ్యలో గోడ వంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది.
 
సరుకు దించుకుని.. ఎక్కించుకునే జెట్టీ వరకూ ఓడలు రావడానికి వీలుగా లోతుగా ఒక కాల్వను సముద్రంలో తవ్వాల్సి ఉంటుంది. దీనితోపాటు జెట్టీల నిర్మాణం కూడా జరగాలి. వీటికి సుమారుగా రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని నిపుణులు అంచనా వేశారు. ఇన్ని నిధులు సేకరించాలంటే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసి రుణాలు సేకరించాల్సి ఉంటుంది. పోర్టుపై వచ్చే ఆదాయంతో ఆ అప్పులు తీర్చాలి. కాకినాడలో రాష్ట్ర ప్రభుత్వ పోర్టు ఉంది. దానిపై వచ్చే ఆదాయాన్ని కూడా రెండు మూడేళ్లు ఈ రుణాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే అప్పులు రావడం తేలికవుతుందని నిపుణులు సూచించారు. అన్ని కోణాలపై అధ్యయనం జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనితోపాటు రామాయపట్నం పోర్టు నిర్వహణ ఆర్థికంగా లాభదాయకమా కాదా.. ఇతర సాంకేతిక అంశాలు సహకరిస్తాయో లేదో కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ పని ఇప్పటికే మొదలైంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే కేబినెట్‌ భేటీ ముందుకు ఈ నివేదిక వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కాగా.. ప్రకాశం జిల్లా వాడరేవులో వాణిజ్య రేవు నిర్మాణంపై పరిశీలన జరుపుతామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేంద్రం ప్రకటనల్లో ఎన్ని ఆచరణరూపం దాలుస్తాయో చెప్పలేమని ఈ వర్గాలు అంటున్నాయి. దీంతో రామాయపట్నం ప్రతిపాదనపై లోతైన ఆలోచన మొదలైంది. ఇటీవల ఒకట్రెండు పారిశ్రామిక సంస్థలు ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాయి.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
8 hours ago, sonykongara said:

akkada govt land undha, tenders pilavakunda sankusthapana enti, leda navayuga valla ke isthara edi

private port ayithe, vallaki istene legal issues vundavu. otherwise krishna patnam port exclusive zone rights kosam case veyyochhu vallu.

Edited by swarnandhra
Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

mines univ state okkate kadu pettedi australia collaboration tho, miru dani fix ayyaru ga good

They did not say when they declared it in assembley, Aus univ later came into picture.  Conviction unte state campus start cheyochu already ANU extension campus undhi with good amount of land dani extend cheyochu patichukune vadu ledhu adhinetha ki manasu anthakana ledhu

Link to comment
Share on other sites

2 minutes ago, bnalluri said:

They did not say when they declared it in assembley, Aus univ later came into picture.  Conviction unte state campus start cheyochu already ANU extension campus undhi with good amount of land dani extend cheyochu patichukune vadu ledhu adhinetha ki manasu anthakana ledhu

dani ke miru fix avvandi

Link to comment
Share on other sites

46 minutes ago, sonykongara said:

dani ke miru fix avvandi

Avunu anna, "kia ananthapuram baagundhi, maa pakasam ki kooda some" ani inko thread undhi. adhi chaala nijam, ippudu CBN modalu pettadu kaani prakasam lo panulu. paapam chaala venakabadina praantham. ee paatikae chaala abhivrudhi jarigi undaalssindhi. neellu lekapovatam valla antha. aa veligona meil ki ichina soranga eppudu poorthi cheyyalssindhi.

Link to comment
Share on other sites

6 minutes ago, AndhraBullodu said:

Avunu anna, "kia ananthapuram baagundhi, maa pakasam ki kooda some" ani inko thread undhi. adhi chaala nijam, ippudu CBN modalu pettadu kaani prakasam lo panulu. paapam chaala venakabadina praantham. ee paatikae chaala abhivrudhi jarigi undaalssindhi. neellu lekapovatam valla antha. aa veligona meil ki ichina soranga eppudu poorthi cheyyalssindhi.

pata vadi tisi vesi ippudu meil  ke iccharu

Link to comment
Share on other sites

10 minutes ago, AndhraBullodu said:

Avunu anna, "kia ananthapuram baagundhi, maa pakasam ki kooda some" ani inko thread undhi. adhi chaala nijam, ippudu CBN modalu pettadu kaani prakasam lo panulu. paapam chaala venakabadina praantham. ee paatikae chaala abhivrudhi jarigi undaalssindhi. neellu lekapovatam valla antha. aa veligona meil ki ichina soranga eppudu poorthi cheyyalssindhi.

wis32DQ.jpg

Link to comment
Share on other sites

24 minutes ago, sonykongara said:

wis32DQ.jpg

choosa anna, nuvvu pai pettina vaartha veligonda thread lo. adhae antunna, oka 2-3 nelala kritham maelukunnaru meil ki ichi ee panulu, saankethika paramayina addankulu anni tholaginchaaka. 4 savathsaraalu ayyindhi kadha manam adhikaaram loki vachi, ee paatiki prakaasam ki inka chaala cheyyalssindhi.

Link to comment
Share on other sites

2 hours ago, bnalluri said:

They did not say when they declared it in assembley, Aus univ later came into picture.  Conviction unte state campus start cheyochu already ANU extension campus undhi with good amount of land dani extend cheyochu patichukune vadu ledhu adhinetha ki manasu anthakana ledhu

univ announce cheyyatam, it takes few mins. YSR alane chesadu... but campus setup ki money ivvali kadha. eppudo sanction ayina universities ki ippati varuku own buildings levu.

Link to comment
Share on other sites

5 hours ago, katti said:

univ announce cheyyatam, it takes few mins. YSR alane chesadu... but campus setup ki money ivvali kadha. eppudo sanction ayina universities ki ippati varuku own buildings levu.

RIMS enni years lo classes start ayayi IIT enni years lo start ayyai classes No public univ in India started classes after completing its infra

Link to comment
Share on other sites

1 hour ago, bnalluri said:

RIMS enni years lo classes start ayayi IIT enni years lo start ayyai classes No public univ in India started classes after completing its infra

ika ala anukunte inka chesedhi emi ledhu... already announce chesina universities ke dikku ledhu... any sensible person would first get these into proper shape before announcing new ones. Some of the universities are now getting new buildings so they will announce new university in Prakasham district soon..

Link to comment
Share on other sites

  • 2 weeks later...
రామాయపట్నం వద్ద కొత్త పోర్టు 
రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో...దానికి సాంకేతిక అడ్డంకులను తొలగించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంది. కృష్ణపట్నం పోర్టు ఎక్స్‌క్లూజివ్‌ లిమిట్స్‌ పరిధిలో మరో పోర్టు ఏర్పాటుచేయకూడదన్న నిబంధన ఉండడంతో..ఆ పోర్టు లిమిట్స్‌ను డీనోటిఫై చేయాలని నిర్ణయించారు. మచిలీపట్నం డీప్‌ వాటర్‌ పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.1385 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదించారు. ప్రభుత్వం కొంత నిధిని కేటాయిస్తే ఈలోపే పనులు మొదలుపెట్టవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలుపగా.. ఆర్థిక ఇబ్బందులున్నాయని, అందుకే రుణం మంజూరుకు అనుమతించామని మంత్రివర్గం పేర్కొంది. రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధికి, పాలనా వ్యవహారాలు చూడడం కోసం ఏపీ మారిటైమ్‌ బోర్డును ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఏపీ పోర్ట్‌ డిపార్టుమెంట్‌ స్థానంలో కొత్తగా మారిటైమ్‌ బోర్డు ఏర్పాటు బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు.
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...