Jump to content

Benefits of Railway Zone

Jaitra

Recommended Posts

రైల్వే జోన్‌ సరిహద్దులపై మథనం 
విశాఖ డివిజన్‌లోని ఒడిశా ప్రాంతం మినహాయింపు 
కొత్త జోన్‌లోకి ఏపీ భూభాగం కలిపితే చాలన్న ప్రతిపాదన 
15 రోజుల్లో ప్రకటన రావొచ్చని  సుజనా ఆశాభావం

ఈనాడు, దిల్లీ: విశాఖ రైల్వే జోన్‌కున్న అడ్డంకులు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న జోన్‌ ఏర్పాటు అంశం గత నాలుగురోజుల తెదేపా ఎంపీల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం అటు రాజకీయంగా, ఇటు ప్రభుత్వపరంగా దృష్టిసారించింది. భువనేశ్వర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ కిందికి వచ్చే విశాఖ రైల్వే డివిజన్‌లో ఒడిశా ప్రాంతం కూడా ఉంది. దీంతో విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పడితే ఒడిశా ప్రాంతం కూడా అందులోకి వెళ్తుందన్న ఆందోళన అటు నుంచి వ్యక్తమవుతూ వచ్చింది. విశాఖ డివిజన్‌లోని ఒడిశా భూభాగాన్నంతా ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలోనే ఉంచేసుకొని, కేవలం ఆంధ్రప్రదేశ్‌  పాంతాన్ని మాత్రమే కలుపుకొని కొత్త జోన్‌ ఏర్పాటుచేస్తే సరిపోతుందని ఏపీ నాయకులు ఓ ప్రతిపాదనను తాజాగా తెరమీదికి తెచ్చారు. తొలి నుంచి జోన్‌కు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఒడిశాకు చెందిన కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్‌ దృష్టికీ ఇదే అంశాన్ని తీసుకెళ్లి ఆయన్ను ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశాలోనూ ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున దీన్నో రాజకీయ కారణంగా చూపి ప్రత్యర్థులు తమ రాష్ట్రంలో భాజపా విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన పార్టీ అగ్రనాయకత్వం వద్ద వాదిస్తున్నట్లు సమాచారం. ఈ కసరత్తు పూర్తయితే ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంటూరు, గుంతకల్లు, విజయవాడ డివిజన్లు, విశాఖ డివిజన్‌లోని ఆంధ్రప్రదేశ్‌ భూభాగం కలిపి కొత్త జోన్‌ ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు నాలుగు జోన్ల సరిహద్దులు మార్చాల్సి ఉంటుంది. లేదంటే అత్యధిక భూభాగం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలను మాత్రమే కొత్తజోన్‌లోకి తెచ్చి, దక్షిణ, నైరుతి రైల్వే జోన్ల పరిధిలో ఉన్న స్వల్పభాగాన్ని యథాతథంగా ఉంచితే సమస్య పరిష్కారమవుతుంది. దీనిపై రైల్వేబోర్డు కసరత్తు చేయాల్సి ఉంది. కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎంపికైన తొలిసారి రైల్వే మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినప్పుడు జోన్‌ ప్రకటించడానికి సిద్ధమయ్యారని, ప్రధానమంత్రి కార్యాలయం ఆఖరి నిమిషంలో మోకాలు అడ్డటంతో అది ఆగిపోయిందని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. వివిధ స్థాయుల్లో జరుగుతున్న చర్చల ఆధారంగా ఈ అంశంపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇంతవరకూ దీనిపై నోరు మెదపలేదు.

మాకు మీరే నష్టం చేస్తున్నారు: ఏపీ భాజపా నేతలతో ధర్మేంధ్రప్రధాన్‌: తమకు తెలుగుదేశం కంటే మీవల్లే నష్టం జరిగేలా ఉందని ధర్మేంధ్రప్రధాన్‌ ఆంధ్రప్రదేశ్‌ భాజపా నాయకులతో అన్నట్లు సమాచారం. రైల్వేజోన్‌ అంశంపై ఆయన్ను ఒప్పించేందుకు కలిసినప్పుడు ఆయన ఈమేరకు నిష్టూరమాడినట్లు తెలిసింది. సరిహద్దుల అంశంపై ఏపీ నాయకులు చేస్తున్న ప్రతిపాదనపట్ల ఆయన ఇప్పటికీ సంతృప్తి వ్యక్తంచేయడంలేదని తెలిసింది.

పార్లమెంటులో ఆందోళనతో కదలిక 
గత సోమవారం నుంచి భాజపా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉభయసభల్లో విభజన సమస్యల పరిష్కారంపై ఆందోళన చేయడంవల్ల మేలే జరిగిందన్న భావన దిల్లీలో వ్యక్తమవుతోంది. దీనివల్ల భాజపా అగ్రనాయకత్వం సమస్యలపై దృష్టిసారించే పరిస్థితి వచ్చిందని పేర్కొంటున్నారు. రాజకీయ అనుమతి లభించినట్లేనని భాజపా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

10ap-main8a.jpg

అరుణ్‌జైట్లీని కలిసిన సుజనాచౌదరి 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీ సీఎంరమేష్‌ శనివారం కలిశారు. సమస్యల అనుశీలనలో భాగంగా ఆయన్ను కలిసినట్లు సుజనాచౌదరి చెప్పారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ వస్తుందని, 15 రోజుల్లో ప్రకటన వస్తుందని తాము నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అందులోకి ఏయేప్రాంతాలు వస్తాయన్నది రైల్వేబోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, దానిపై తానేమీ మాట్లాడనన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన రూ.16వేల కోట్లను కేంద్రం ఇస్తుందన్నారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

* ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ కింద ఉన్న వాల్తేరు డివిజన్‌లో ఏపీ రూట్‌ 515.87 కిమీ(ట్రాక్‌ 1,384.84.కిమీ) ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతం 169.936 కిమీ (ట్రాక్‌ 228.27 కిమీ), ఒడిశా ప్రాంతం 420.651 కిమీ (ట్రాక్‌ 553.846 కిమీ) ఉంది. అంటే వాల్తేరు డివిజన్‌లో కిలోమీటర్ల వారీగా 46%, ట్రాక్‌వారీగా 63% ఆంధ్రప్రదేశ్‌ వాటా ఉంది. 

Link to comment
Share on other sites

1 minute ago, rk09 said:

benefits antu small article raasaadu bro....veelu untay adhi veyyandi

Link to comment
Share on other sites

కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎంపికైన తొలిసారి రైల్వే మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినప్పుడు జోన్‌ ప్రకటించడానికి సిద్ధమయ్యారని, ప్రధానమంత్రి కార్యాలయం ఆఖరి నిమిషంలో మోకాలు అడ్డటంతో అది ఆగిపోయిందని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి

Link to comment
Share on other sites

3 minutes ago, Nandamuri Rulz said:

కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎంపికైన తొలిసారి రైల్వే మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినప్పుడు జోన్‌ ప్రకటించడానికి సిద్ధమయ్యారని, ప్రధానమంత్రి కార్యాలయం ఆఖరి నిమిషంలో మోకాలు అడ్డటంతో అది ఆగిపోయిందని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి

eeedebbaaa...karnataka lo ayinaaa odipovaali ee luvdeeee gaadu... 

Link to comment
Share on other sites

7 minutes ago, Nandamuri Rulz said:

కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎంపికైన తొలిసారి రైల్వే మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినప్పుడు జోన్‌ ప్రకటించడానికి సిద్ధమయ్యారని, ప్రధానమంత్రి కార్యాలయం ఆఖరి నిమిషంలో మోకాలు అడ్డటంతో అది ఆగిపోయిందని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి

varni boodi gaa

Link to comment
Share on other sites

  • 3 weeks later...

oka zone vunte ee badalu tappevi

విశాఖ స్టేషన్‌లో బోగీలాట 
 అందుబాటులో లేని 100 కోచ్‌లు.. ఇతర డివిజన్లకు మళ్లింపు 
తక్కువ బోగీలతో, భారీ రద్దీతో నడుస్తున్న వాల్తేరు రైళ్లు 
vsp-top1a.jpg

ఇదో దోపిడీ.. 
ఖుర్దారోడ్‌ డివిజన్‌కు చెందిన పూరి - చెన్నై (22859/60) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వారపు రైలు ఇది. ఒకపక్క విశాఖ రైళ్లకు బోగీల కొరత పీడిస్తుంటే.. అధికారులు ఇక్కడున్నవాటిని తీసుకెళ్లి ఆ రైలుకు అమర్చారు. ఇలా 2 శీతల బోగీలు సహా 6 బోగీల్ని తగిలించి గత రెండు నెలలైంది. ఇలాగే మరికొన్ని బోగీలను ఖుర్దారోడ్‌, సంబల్‌పూర్‌ డివిజన్ల రైళ్లకు తగిలించి నడుపుతున్నారు.

విశాఖపట్నం:విశాఖ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలవాపైపు వెళ్తున్న రైళ్లన్నీ కిక్కిరిసి ఉంటున్నాయి. ఇక్కడి నుంచి అదనపు రైళ్లను నడిపేంత డిమాండ్‌ ఉంది. అదేం చిత్రమో.. రైల్వే అధికారులు ఇక్కడి బోగీలను తీసుకెళ్లి పక్క డివిజన్ల పరిధిలోని రైళ్లకు తగిలిస్తున్నారు. దీంతో విశాఖ స్టేషన్‌కు దాదాపు వంద బోగీల కొరత ఏర్పడింది.

ఎలా అంటే... : విశాఖలోని న్యూకోచింగ్‌ కేర్‌ (డిపో)కు నిరంతర ప్రయాణాల కోసమని 741 బోగీల్ని (కోచ్‌లను) కేటాయించారు. నిబంధనల ప్రకారం మరో 8 శాతం అదనంగా కలిపి 800 బోగీలను వాల్తేరు డివిజన్‌కు అందించారు. గత ఏడాదికాలంగా సుమారు వందకుపైగా బోగీలను వాల్తేరు డివిజన్‌ కొరతగా చూపిస్తూ వస్తోంది. గత జనవరి నుంచే చూస్తే రోజువారీ వినియోగానికి 670 నుంచి 712 లోపే బోగీలు అందుబాటులో ఉన్నట్టు గణాంకాలు చూపించింది. తాజాగా ఇది 699గా ఉంది. మరి మిగిలినవి ఏమయ్యాయని ఆరా తీస్తే.. వీటిని మరమ్మతు చేసేందుకు భువనేశ్వర్‌లోని మంచేశ్వర్‌ వ్యాగన్‌వర్క్‌ పీవోహెచ్‌ వర్క్‌షాప్‌కు పంపినట్టు తేలింది. సాధారణంగా ప్రతి నెలా మరమ్మతుల కోసం వెళ్లడం రివాజే. అయితే అలా వెళ్లినవన్నీ తిరిగి రావటం లేదు. నెలకు 30, 40 దాకా బోగీలను పంపుతోంటే వెనక్కి వస్తున్నవి 15 నుంచి 30 మధ్యలో ఉంటున్నాయి. అక్కడ మిగిల్చుకున్న వాటిని ఇతర డివిజన్లలో రద్దీ కారణం చూపించి పంపేస్తున్నట్టు రైలే విభాగాలు వెల్లడించాయి. వాల్తేరు డివిజన్‌లో సుమారు 100 బోగీల కొరతతో పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని తూర్పుకోస్తా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అటు నుంచి స్పందనే లేదు.

కొన్నిరూట్లకు కోతలు..: శీతల, స్లీపర్‌, జనరల్‌, లగేజీ.. ఇలా అన్ని విభాగాల్లోనూ బోగీల కొరత ఉంది. 215 స్లీపర్‌ బోగీలకుగాను 190 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో రిజర్వేషన్‌ సీట్ల కోసం వాల్తేరు డివిజన్‌ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. హాల్టింగ్‌కు వచ్చే రైళ్ల బోగీల్ని యుద్ధప్రాతిపదికన తీసి ఇతర రైళ్లకు అమరుస్తున్నారు. ఒక్కోసారి వాటికి మరమ్మతులు అవసరమైనా.. అవి అపరిశుభ్రంగా ఉన్నా.. పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇటీవల కాలంలో అపరిశుభ్రత, బోగీల్లో ఇతర సమస్యలపై పెద్దఎత్తున ఫిర్యాదులు రావటానికి ఇదే కారణం. పైగా ఇలా పెట్టెలను మార్చే క్రమంలో కనీసం అరగంట నుంచి 3 గంటలకు పైగా రైళ్లకు ఆలస్యమవుతోంది. గత కొన్ని రోజులుగా విశాఖ - హజ్రత్‌ నిజాముద్దీన్‌ సమతా ఎక్స్‌ప్రెస్‌ విశాఖ నుంచి 4 గంటల ఆలస్యంగా బయల్దేరుతోంది. విశాఖ - అమృత్‌సర్‌ హీరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ - ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లాంటి దూరప్రాంత రైళ్లన్నీ బోగీల మార్పిడితో ఆలస్యంగా బయలుదేరుతున్నాయి.

మరోవైపు కోచ్‌ల కొరత కారణంగా అధికారులు పలు రైళ్లకు కోతలు పెడుతున్నారు. సామాన్యులు ప్రయాణించే విశాఖ - పలాస, విశాఖ - రాయపూర్‌, విశాఖ - కోరాపూట్‌లాంటి రైళ్లలో జనరల్‌ కోచ్‌లకు కోతలు పెట్టారు. కేకేలైన్‌లో తిరుగుతున్న ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌లకు లగేజీ బోగీల్ని పంపించట్లేదు.

ప్రత్యేక రైళ్ల మాటే లేదు..: మరోపక్క అదనపు రైళ్లను నడపడంలోనూ వాల్తేరు డివిజన్‌ తీరు విమర్శలపాలవుతోంది. గత డిసెంబరు జనవరి నెలల్లో శబరిమల భక్తులకు, గతేడాది దీపావళి, దసరా, ఈ ఏడాది సంక్రాంతి పండుగలకు ప్రత్యేక రైళ్లను నడపలేకపోయింది. కనీసం రద్దీ రైళ్లకు అదనపు బోగీల్ని కూడా వేయలేకపోయింది. ఈ పరిస్థితిపై రైల్వే అధికారుల్ని సంప్రదించినప్పుడు.. కోచ్‌ల కొరత వాస్తవమేనని, ప్రతీ సమావేశంలోనూ జోన్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...