Jump to content

విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్?


sonykongara

Recommended Posts

విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్?
10-02-2018 17:00:35

న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలోని ప్రముఖమైన విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వారం, పది రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర సమాచార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే దీని కోసం రైల్వే పరిధిని తగ్గించి జోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ రైల్వేసెక్షన్‌తో కలిపి రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి కేంద్రం చర్యలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
 
కాగా వాల్తేరు డివిజన్‌లోని 80 శాతం ఒడిషాకు వదిలి పెట్టాలని నిర్ణయించారట. కాగా విశాఖ రైల్వే జోన్‌కు సహకరించాలంటూ ఒడిశాకు చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సుజనా చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలీకృతమైనట్లు, దాంతో వెంటనే రైల్వేజోన్ ప్రకటనకు రంగం సిద్ధం చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు అమిత్‌షా చెప్పినట్టు సమాచారం. రైల్వే జోన్‌కు సంబంధించిన స్పష్టమైన ప్రకటన మార్చి 5లోపు వచ్చే అవకాశం ఉందని కేంద్ర సమాచార వర్గాలు తెలిపాయి.

Link to comment
Share on other sites

సిగ్నల్‌! 

దిల్లీ: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. గత నాలుగైదు రోజులుగా పార్లమెంట్‌లో ఏపీ ఎంపీలు చేసిన ఆందోళన, భాజపా అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం చర్చోపచర్చల నేపథ్యంలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటుకు ఒడిశా నుంచి ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యనేతలు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కేంద్రమంత్రి సుజనా చౌదరి గత రెండు రోజులుగా చర్చలు జరిపారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుతో ఒడిశాకు ఎలాంటి ఇబ్బంది రాదని వారికి వివరించినట్టు సమాచారం. అలాగే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు విశాఖ రైల్వే డివిజన్‌తో జోన్‌ ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాల్తేరు డివిజన్‌లోని 80శాతం ప్రస్తుత జోన్‌లోనే కొనసాగేలా నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఒడిశా నేతలు ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. 
నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో పాటు సుజనాచౌదరి, రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌ కూడా హాజరయ్యారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు అభ్యంతరాలపై చర్చించిన నేతలు రెండు వారాల్లో ప్రకటన చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇది కేవలం పరిపాలనా సంబంధమైన వ్యవహారమేనని, పార్లమెంట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో వీలైనంత త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం సమావేశం అనంతరం తన కార్యాలయ సిబ్బందికి విధివిధానాలు ఖరారు చేయాలని, ఏర్పాటుకు కావాల్సిన పత్రాలు సిద్ధం చేయాలని పీయూష్‌గోయల్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్నందున ఆ అధికారులతో పాటు ఈస్ట్‌కోస్ట్‌ అధికారులతోనూ చర్చించాక సోమవారం నుంచి తుది ప్రక్రియ ప్రారంభించి పూర్తిచేసే అవకాశం ఉంది. అనంతరం ప్రధాని ఆమోదం తర్వాత గోయల్‌ ఓ స్పష్టమైన ప్రకటన చేయనున్నారు

Link to comment
Share on other sites

Waltair (or Visakhapatnam) railway division is one of the three divisions of East Coast Railway Zone (ECoR) of the Indian Railways. It covers the northern districts of Andhra Pradesh, parts of ChhattisgarhOrissa. The headquarters of the Waltair Railway Division are located at Visakhapatnam

 

How you guys are expecting orissa and Chhattisgarh area into new Vizag railway zone

Link to comment
Share on other sites

5 minutes ago, manaNTR said:

Waltair (or Visakhapatnam) railway division is one of the three divisions of East Coast Railway Zone (ECoR) of the Indian Railways. It covers the northern districts of Andhra Pradesh, parts of ChhattisgarhOrissa. The headquarters of the Waltair Railway Division are located at Visakhapatnam

 

How you guys are expecting orissa and Chhattisgarh area into new Vizag railway zone

Wiki source:

The geographical jurisdiction of East Coast Railway zone extends over three states encompassing almost all of Odisha along with parts of Srikakulam, Vizianagaram and Visakhapatnam districts of northeastern Andhra Pradesh and Bastar and Dantewada districts of Chhattisgarh state. The zonal headquarters is at Bhubaneswar in Odisha.

 

ivi manaki ichesthey okay Bhayya - Vizag port nundi lot of goods lifting and logistics support mana land nundeyy jarigey di - so our leaders better fight for our profitable lines - 

 

already chennai ni vadili vacchi mana M Manam kudusthunnaam

Link to comment
Share on other sites

6 minutes ago, DVSDev said:

Wiki source:

The geographical jurisdiction of East Coast Railway zone extends over three states encompassing almost all of Odisha along with parts of Srikakulam, Vizianagaram and Visakhapatnam districts of northeastern Andhra Pradesh and Bastar and Dantewada districts of Chhattisgarh state. The zonal headquarters is at Bhubaneswar in Odisha.

 

ivi manaki ichesthey okay Bhayya - Vizag port nundi lot of goods lifting and logistics support mana land nundeyy jarigey di - so our leaders better fight for our profitable lines - 

 

already chennai ni vadili vacchi mana M Manam kudusthunnaam

With out Vizag how they will give Vizag zone

Link to comment
Share on other sites

KK line mida asalu vadulukondi, no vupayogam to state, yes its getting 3000 cr profit. But nyayam ga alochisthe adi manadi kadu , chattisgadh di. port use chesikunnanduku yentho kontha vasthundi. So better not to think on that. manaku ports vunnayi ga - so atleast mana state lo vunnavi anni kalipi aa Vizag zone chesthe better.

Vizag zone vasthe ,

-passengers ki kontha use vuntundi, like starting/ending some trains - so more births/seats availability. currently all main trains are originating/ending at hq

-main ga zone level jobs local/state vallaku vasthayi, all these zone level jobs are recruited at zone hq. Remember old incidents faced by telugu people.

-every budget, zone level allocations, chance to concentrate on future/in-complete projects at zone level

Link to comment
Share on other sites

1 hour ago, rk09 said:

KK line mida asalu vadulukondi, no vupayogam to state, yes its getting 3000 cr profit. But nyayam ga alochisthe adi manadi kadu , chattisgadh di. port use chesikunnanduku yentho kontha vasthundi. So better not to think on that. manaku ports vunnayi ga - so atleast mana state lo vunnavi anni kalipi aa Vizag zone chesthe better.

Vizag zone vasthe ,

-passengers ki kontha use vuntundi, like starting/ending some trains - so more births/seats availability. currently all main trains are originating/ending at hq

-main ga zone level jobs local/state vallaku vasthayi, all these zone level jobs are recruited at zone hq. Remember old incidents faced by telugu people.

-every budget, zone level allocations, chance to concentrate on future/in-complete projects at zone level

Vijayawada and guntakal division  kaluputaru anta kada..if so still we will be profitable.

Link to comment
Share on other sites

From wiki

Vijayawada Division[edit]

Guntakal Division[edit]

Main article: Guntakal Railway Division

Guntur Division[edit]

Main article: Guntur Railway Division
Link to comment
Share on other sites

Waltair Division

Section Line Distance
Duvvada-Visakhapatnam-Palasa (B.G. - Double) Main Line 213 km Route
Vizianagaram-Singapuram road-Therubali (B.G. - Double) R – V Line 137 km Route
Kothavalasa–Kirandul line (B.G. - Single) K – K Line 446 km Route
Koraput-Rayagada (B.G. - Double) K – R Line 164 km Route
Kottavalasa-Simhachalam III Line 22 km Route
Bobbili – Salur Branch Line 18 km Route
Naupada-Gunupur   90 km Route
 
Link to comment
Share on other sites

except Duvvada and simhachalam lines all others may still remain with ECR

 

if separated, looks like operation wise a big problem for ECR's waltair division because all engines (300 disel + 200 electric) maintenance are happening at Vizag. But any away the new division can accommodate if other trains are entering into this new division. And also those engines are mainly for KK line.

Link to comment
Share on other sites

59 minutes ago, LION_NTR said:

Apart from our stae rail lines, Kk line motham revenue lo 20% vizag ki allocate chestharata.

reasonable deal if true. 

 

Just Complete AP ni oka zone ga chesi oka telugodi ni GM ga chesthe migathadi leader choosukuntadu. 

Link to comment
Share on other sites

evari zone rakes use chesukunte income vallki kattali - 

its like our RTC buses

once zone vatchina taruvatha, need to focus on both passenger and goods rakes. (its better if we have one coach factory) Currently, chala shortage vundi 

- ante mana bustand lo mana bus le vundetatlu

Link to comment
Share on other sites

రైల్వే జోన్‌ సరిహద్దులపై మథనం 
విశాఖ డివిజన్‌లోని ఒడిశా ప్రాంతం మినహాయింపు 
కొత్త జోన్‌లోకి ఏపీ భూభాగం కలిపితే చాలన్న ప్రతిపాదన 
15 రోజుల్లో ప్రకటన రావొచ్చని  సుజనా ఆశాభావం

ఈనాడు, దిల్లీ: విశాఖ రైల్వే జోన్‌కున్న అడ్డంకులు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న జోన్‌ ఏర్పాటు అంశం గత నాలుగురోజుల తెదేపా ఎంపీల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం అటు రాజకీయంగా, ఇటు ప్రభుత్వపరంగా దృష్టిసారించింది. భువనేశ్వర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ కిందికి వచ్చే విశాఖ రైల్వే డివిజన్‌లో ఒడిశా ప్రాంతం కూడా ఉంది. దీంతో విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పడితే ఒడిశా ప్రాంతం కూడా అందులోకి వెళ్తుందన్న ఆందోళన అటు నుంచి వ్యక్తమవుతూ వచ్చింది. విశాఖ డివిజన్‌లోని ఒడిశా భూభాగాన్నంతా ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలోనే ఉంచేసుకొని, కేవలం ఆంధ్రప్రదేశ్‌  పాంతాన్ని మాత్రమే కలుపుకొని కొత్త జోన్‌ ఏర్పాటుచేస్తే సరిపోతుందని ఏపీ నాయకులు ఓ ప్రతిపాదనను తాజాగా తెరమీదికి తెచ్చారు. తొలి నుంచి జోన్‌కు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఒడిశాకు చెందిన కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్‌ దృష్టికీ ఇదే అంశాన్ని తీసుకెళ్లి ఆయన్ను ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశాలోనూ ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున దీన్నో రాజకీయ కారణంగా చూపి ప్రత్యర్థులు తమ రాష్ట్రంలో భాజపా విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన పార్టీ అగ్రనాయకత్వం వద్ద వాదిస్తున్నట్లు సమాచారం. ఈ కసరత్తు పూర్తయితే ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంటూరు, గుంతకల్లు, విజయవాడ డివిజన్లు, విశాఖ డివిజన్‌లోని ఆంధ్రప్రదేశ్‌ భూభాగం కలిపి కొత్త జోన్‌ ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు నాలుగు జోన్ల సరిహద్దులు మార్చాల్సి ఉంటుంది. లేదంటే అత్యధిక భూభాగం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలను మాత్రమే కొత్తజోన్‌లోకి తెచ్చి, దక్షిణ, నైరుతి రైల్వే జోన్ల పరిధిలో ఉన్న స్వల్పభాగాన్ని యథాతథంగా ఉంచితే సమస్య పరిష్కారమవుతుంది. దీనిపై రైల్వేబోర్డు కసరత్తు చేయాల్సి ఉంది. కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎంపికైన తొలిసారి రైల్వే మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినప్పుడు జోన్‌ ప్రకటించడానికి సిద్ధమయ్యారని, ప్రధానమంత్రి కార్యాలయం ఆఖరి నిమిషంలో మోకాలు అడ్డటంతో అది ఆగిపోయిందని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. వివిధ స్థాయుల్లో జరుగుతున్న చర్చల ఆధారంగా ఈ అంశంపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇంతవరకూ దీనిపై నోరు మెదపలేదు.

మాకు మీరే నష్టం చేస్తున్నారు: ఏపీ భాజపా నేతలతో ధర్మేంధ్రప్రధాన్‌: తమకు తెలుగుదేశం కంటే మీవల్లే నష్టం జరిగేలా ఉందని ధర్మేంధ్రప్రధాన్‌ ఆంధ్రప్రదేశ్‌ భాజపా నాయకులతో అన్నట్లు సమాచారం. రైల్వేజోన్‌ అంశంపై ఆయన్ను ఒప్పించేందుకు కలిసినప్పుడు ఆయన ఈమేరకు నిష్టూరమాడినట్లు తెలిసింది. సరిహద్దుల అంశంపై ఏపీ నాయకులు చేస్తున్న ప్రతిపాదనపట్ల ఆయన ఇప్పటికీ సంతృప్తి వ్యక్తంచేయడంలేదని తెలిసింది.

పార్లమెంటులో ఆందోళనతో కదలిక 
గత సోమవారం నుంచి భాజపా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉభయసభల్లో విభజన సమస్యల పరిష్కారంపై ఆందోళన చేయడంవల్ల మేలే జరిగిందన్న భావన దిల్లీలో వ్యక్తమవుతోంది. దీనివల్ల భాజపా అగ్రనాయకత్వం సమస్యలపై దృష్టిసారించే పరిస్థితి వచ్చిందని పేర్కొంటున్నారు. రాజకీయ అనుమతి లభించినట్లేనని భాజపా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

10ap-main8a.jpg

అరుణ్‌జైట్లీని కలిసిన సుజనాచౌదరి 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీ సీఎంరమేష్‌ శనివారం కలిశారు. సమస్యల అనుశీలనలో భాగంగా ఆయన్ను కలిసినట్లు సుజనాచౌదరి చెప్పారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ వస్తుందని, 15 రోజుల్లో ప్రకటన వస్తుందని తాము నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అందులోకి ఏయేప్రాంతాలు వస్తాయన్నది రైల్వేబోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, దానిపై తానేమీ మాట్లాడనన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన రూ.16వేల కోట్లను కేంద్రం ఇస్తుందన్నారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

* ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ కింద ఉన్న వాల్తేరు డివిజన్‌లో ఏపీ రూట్‌ 515.87 కిమీ(ట్రాక్‌ 1,384.84.కిమీ) ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతం 169.936 కిమీ (ట్రాక్‌ 228.27 కిమీ), ఒడిశా ప్రాంతం 420.651 కిమీ (ట్రాక్‌ 553.846 కిమీ) ఉంది. అంటే వాల్తేరు డివిజన్‌లో కిలోమీటర్ల వారీగా 46%, ట్రాక్‌వారీగా 63% ఆంధ్రప్రదేశ్‌ వాటా ఉంది. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...