Jump to content

‘Made in AP’ Amaravati Drones


sonykongara

Recommended Posts

అమరావతి డ్రోన్స్‌ రెడీ!
20-01-2018 02:14:35
 
636520112765457531.jpg
  • ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ, ఓమ్నీ ప్రెజెంట్‌ భాగస్వామ్యంతో తయారు
  • తొలి దేశీయ ఉత్పత్తిగా రికార్డు
  • ఉత్తమ టెక్నాలజీ.. తక్కువ ధరకు లభ్యం
  • కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించిన సీఎం
  • పాలనలో ప్రభుత్వానికి చేదోడుగా వినియోగం
  • వాణిజ్య అవసరాలకు మార్చి నుంచి ఉత్పత్తి
అమరావతి, విశాఖపట్నం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): అమరావతి... నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని! అంతేకాదు... అంతర్జాతీయ మార్కెట్‌లో ఓ బ్రాండ్‌ కూడా కానుంది! ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు ఉపయోగపడేలా ‘అమరావతి డ్రోన్స్‌’ చక్కర్లు కొట్టడానికి సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్స్‌ సొసైటీ, ఓమ్నీ ప్రెజెంట్‌ రోబో టెక్‌ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ఈ డ్రోన్లను సీఎం చంద్రబాబు శుక్రవారం కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించారు. డ్రోన్ల వినియోగం వల్ల అద్భుతం ఫలితాలు సాధించవచ్చునని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో జలవనరుల శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యాటకం, ఆటవీ శాఖలకు డ్రోన్ల ఉపయోగం చాలా ఉందన్నారు. అంతేకాదు... తిరుపతిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ డ్రోన్ల ద్వారా ఇంటింటికీ ఆహారం సరఫరా చేసేలా వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారన్నారు. డ్రోన్ల వినియోగం పెరిగితే రేట్లు తగ్గుతాయని సీఎం చెప్పారు. డ్రోన్ల ఉత్పత్తిపై అధికారులు మరింత దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ప్రభుత్వమే డ్రోన్లు సరఫరా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ‘అమరావతి డ్రోన్స్‌’ విశిష్టత, పనితీరును ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు. విశాఖలో డ్రోన్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పిన తర్వాత తయారైన మొదటి డ్రోన్‌ ఇదేనని సీఎంకు చెప్పారు. సాంకేతికతంగా ఉన్నత శ్రేణికి చెందడమే కాకుండా, మార్కెట్లో మిగిలిన డ్రోన్లు కన్నా తక్కువ ధరకు అందుబాటులోకి వస్తోందన్నారు.
 
ఇలా అడుగులు పడ్డాయి!
టెక్నాలజీ వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... నూతన ఆలోచన, ఆవిష్కరణల కోసం ప్రత్యేకంగా ‘ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ’ని విశాఖపట్నం సన్‌రైజ్‌ స్టార్టప్‌ విలేజ్‌లో ఏర్పాటుచేసింది. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేవారితో స్టార్ట్‌పలను ప్రారంభించంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సొసైటీ... డ్రోన్ల తయారీపైనా దృష్టిసారించింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే రోబోటిక్‌ టెక్నాలజీ సంస్థ ‘ఓమ్నీ ప్రెజెంట్‌’తో కలిసి విశాఖలో నాలుగు నెలల క్రితం ‘అమరావతి డ్రోన్స్‌’ పేరుతో రిసెర్చ్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ లేబొరేటరీని ఏర్పాటుచేసింది. 2018 జనవరి నాటికి తొలి డ్రోన్‌ను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. నిపుణులను నియమించుకొని, డ్రోన్లకు అవసరమైన హార్డ్‌వేర్‌(విడి భాగాలు)ను విదేశాల నుంచి రప్పించి, దానికి సాఫ్ట్‌వేర్‌ను జత చేసి కలెక్టర్ల సదస్సు నాటికి తొలి డ్రోన్‌ను రూపొందించింది. వీటిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి ఇంకో రెండు నెలల సమయం పడుతుందని ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈవో ప్రొఫెసర్‌ వల్లీకుమారి చెప్పారు. మార్చి నెలాఖరుకు మార్కెట్‌లోకి 25 డ్రోన్లు తీసుకొస్తామని, అనంతరం ప్రతి నెలా 25 డ్రోన్లు తయారుచేస్తామని వివరించారు. వీటి ఉత్పత్తి కొనసాగిస్తూనే కొత్త రకం డిజైన్‌, ఫీచర్లతో నాలుగైదు రకాల డ్రోన్లను తీసుకురావాలనే ఆలోచన ఉందన్నారు.
 
 
ఉపయోగాలేమిటి?
ప్రభుత్వపరంగా ఈ డ్రోన్‌ను అనేక రకాలుగా ఉపయోగించుకునే వీలుంది. పంచాయతీరాజ్‌ శాఖ విషయానికి వస్తే... గ్రామాల్లో రహదారుల నిర్మాణం, వాటి నాణ్యత, గుంతలు పడిన రహదారులు, చెరువుల తవ్వకం, మట్టి తరలింపు, కాలువల నిర్మాణం, వాటిలో పూడికతీత వంటి అనేక విషయాలను ఈ డ్రోన్‌తో వీడియో తీసి, కార్యాలయంలో కూర్చొనే అక్కడి పరిస్థితిని తెలుసుకోవచ్చు.
 
 
ఇవీ ప్రత్యేకతలు..
  • విజువల్‌ సెన్సర్‌తో పని చేసే దీనికి 24 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది
  • 25 అప్లికేషన్లతో పని చేసే ఈ డ్రోన్‌కు ఆరు రెక్కలు ఉన్నాయి
  • దీని మోటారు 40 నిమిషాలు ఏకధాటిగా పనిచేస్తుంది
  • మోటారు మొరాయించినా సురక్షితంగా ల్యాండ్‌ కావడం దీని విశిష్టత
  • స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన దీని బరువు నాలుగు కిలోలు
  • మార్కెట్లో ఇలాంటి డ్రోన్‌ ఖరీదు రూ.5.5 లక్షలుకాగా.. రూ.3.5 లక్షలకే సిద్ధమైంది.
Link to comment
Share on other sites

‘Made in AP’ drones from March

 
V Kamalakara Rao | TNN | Updated: Jan 22, 2018, 13:08 IST
 
 
 
VISAKHAPATNAMVISAKHAPATNAM
VISAKHAPATNAM: Come March, and the city-based drone-manufacturing company — Research & Skill Development Centre (RSDC) — would be manufacturing 'Make In Andhra Pradesh' drones in bulk.
The drones would be sold to state-owned departments like police, municipal administration & urban development for various tasks and operations like mapping of cities and towns, besides being an effective surveillance system for the police as part of security arrangements for public meetings, gatherings, festivals among others.

One such drone, developed on experimental basis, was handed over to the Panchayati Raj department recently by chief minister N Chandrababu Naidu. The department plans to use the drone for mapping of villages in the state.

Now, the AP Innovation Society (APIS), which is the guiding force behind the manufacturing of drones in the city-based lab RSDC, says it can manufacture 25 drones in a month from March 2018. Confirming this to TOI, V Valli Kumari, chief executive officer of APIS, said all arrangements are being made to go for mass manufacturing of drones in the Vizag lab.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
Guest Urban Legend

Drones to track housing, infra projects in Amaravati

Chief Minister N. Chandrababu Naidu instructed the officials of AP-Capital Region Development Corporation (AP-CRDA) and Amaravati Development Corporation (ADC) to keep track of the progress of housing and various infrastructure projects in the capital region with the help of drones once in a fortnight and report the same to him.

With the help of data generated by the drones, necessary action to ensure timely completion of the projects would be taken, he said in a review meeting on the activities of the CRDA and ADC at the Secretariat on Wednesday.

He said drones were an efficient way to monitor the grounded projects.

Drone Corporation

The government formed the Drone Corporation as a subsidiary of A.P. State FiberNet Limited (APSFL) on Monday vide G.O MS No. 2 issued by the Energy, Infrastructure and Investment Department.

Keeping in view the potential of drones, the State had decided to utilize drones in sectors such as police, mining, municipal administration and urban development, agriculture and allied sectors, for monitoring, capturing images and videos at high resolutions, generating 2D maps, 3D models and point cloud models.

http://www.thehindu.com/news/national/andhra-pradesh/drones-to-track-housing-infra-projects-in-amaravati/article22755404.ece?utm_source=contentstudio.io&utm_medium=referral

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...