Jump to content

ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు - అడ్వాణీ


Ramesh39

Recommended Posts

ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు

తెదేపా ఎంపీల వద్ద నిరాశ వ్యక్తపరిచిన అడ్వాణీ

012028BREAK66-ADVANI.JPG

దిల్లీ :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తున్న తెదేపా ఎంపీలతో భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ మాట్లాడారు. సుమారు 10 నిమిషాల పాటు తెదేపా సభ్యులతో ఏపీ సమస్యలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా విభజన హామీలు, సభలో ఎందుకు నిరసన తెలుపుతున్నామో, ఇతర పరిణామాల గురించి తెదేపా నేతలు అడ్వాణీకి వివరించారు.

అనంతరం అడ్వాణీ వారితో మాట్లాడుతూ ఏపీకి కేంద్రం న్యాయం చేయాల్సి ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. ఒకరినొకరు గౌరవించుకోవాలని, సభా మర్యాదలు కాపాడుకోవాలని అన్నట్లు తెలుస్తోంది. ఏపీ వ్యవహారంపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతోనూ మాట్లాడానని ఎంపీలతో చెప్పారు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదంటూ ఆయన ఎంపీల వద్ద నిరాశ వ్యక్తపరిచినట్లు సమాచారం. లోక్‌సభలో నిన్న అరుణ్‌జైట్లీ సమాధానంపై తెదేపా ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

Ee musalodu epudaithe modi fake compaign/publicity ki longi bjp compaign committee ki chairman ga modi ni oppukunnaado desaaniki apude daridram start ayindi..... 

2014 lo adwani thaatha pm candidate ga unnaa same result vachedi.... inkaa strong govt undedi with trusted allies .....  

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...