Jump to content

Parliament lo


MVS

Recommended Posts

I am a fan of TDP. However, the current way of dealing this problem is not sufficient to get the required funds from BJP. May be CBN also knows this and want to buy some more time. TDP mps should protest much more aggressively in parliament. Take inspiration from Telangana movement 

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై రెండో రోజు, తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేసారు.... ఈ రోజు ఆందోళన తీవ్ర స్థాయిలో చేసారు. దీంతో 10 నిమషాలకే సభ వాయిదా పడింది... నిన్న ఒక ఎంపీ చనిపోవటంతో, సభ సంతాపం తెలిపి వాయిదా వేసారు, దీంతో నిన్న తెలుగుదేశం ఎంపీలు, పార్లమెంట్ బయట ఆందోళన చేసారు... ఇవాళ సభ ప్రారంభం అయిన వెంటనే, మన ఎంపీలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసారు... సభ ప్రారంభం అయిన వెంటనే, తెలుగుదేశం ఎంపీలు వెల్ లో కి వెళ్లి తీవ్ర ఆందోళన చేసారు....

Link to comment
Share on other sites

తెలుగుదేశం ఎంపీల ఆందోళనతో, సభ వాయిదా పడింది... ఇంగ్లీష్, హిందీలోనే కాదు, తెలుగులో కూడా నినాదాలు చేసారు... మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మిత్ర ధర్మం పాటించండి... మిత్రులకి న్యాయం చెయ్యండి... దగా పడ్డ మా రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అంటూ, ఆందోళన చేసారు... చిత్తరు ఎంపీ శివప్రసాద్, నారదుడి వేషంలో, సభలో కూడా ఆందోళన చేసారు... పార్లమెంట్ లోనే కాదు, రాజ్యసభలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది... దీంతో రాజ్యసభ రెండు గంటలకు వాయిదా పడింది... ఇది ఇలా ఉంటే, పార్లమెంట్ బయట సాక్షి టీవీ ముందు డ్రామా చేస్తున్నారు వైసీపీ ఎంపీలు..

Link to comment
Share on other sites

అంతకు ముందు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ అన్యాయం చేశారో అక్కడే న్యాయం జరగాలని, పార్లమెంటు సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాలని ఆయన అన్నారు. అప్పుడున్న పార్టీలే ఇప్పుడు పార్లమెంటులో ఉన్నాయని, ఏపీకి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని చంద్రబాబు అన్నారు. మూడున్నరేళ్లలో ఏపీకి చేసింది కొంతే, చేయాల్సింది చాలా ఉందని, ప్రజలు సంతృప్తి చెందేలా చూడాల్సింది కేంద్రమే ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...