Jump to content

చంద్రబాబుకు రాజ్‌నాథ్‌ ఫోన్‌.. మారిన వ్యూహం!


KING007

Recommended Posts

చంద్రబాబుకు రాజ్‌నాథ్‌ ఫోన్‌.. మారిన వ్యూహం!

02540704BRK98A.JPG

అమరావతి: బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంతో పోరాటానికి సిద్ధపడిన తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బుజ్జగింపులు మొదలయ్యాయి. ఆదివారం జరిగిన తెదేపా పార్లమెంటరీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమావేశం చివరి నిమిషంలో చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దని సూచించారు. ‘మీ ఆందోళనను అర్థం చేసుకున్నాం. అన్ని విషయాలు అమిత్‌ షా మీతో మాట్లాడతారు’ అని చంద్రబాబును రాజ్‌నాథ్‌ సముదాయించినట్లు సమాచారం. 

మారిన తెదేపా వ్యూహం

రాజ్‌నాథ్‌ సింగ్‌ నుంచి ఫోన్ రావడంతో తెదేపా వ్యూహం మారింది. తొలుత పార్లమెంటులో ఆందోళన చేయాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే, కేంద్రం నుంచి ఫోన్‌ రావడంతో వ్యూహాన్ని మార్చారు. కేటాయింపులపై ముందు కేంద్రంతో చర్చించాలని... పరిస్థితిని బట్టి ఆందోళన చేయాలా? వద్దా? అన్నది నిర్ణయిద్దామని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

ఫోన్‌కు ముందు..

అంతకుముందు ఇదే సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలందరూ పార్లమెంటులో తమ గళాన్ని గట్టిగా వినిపించాలని ఆదేశించారు. పోరాటంలో ఇది తొలి అడుగు మాత్రమేనని.. కేంద్రం వైఖరి చూశాక కలిసుండాలా? విడిపోవాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు ఎంపీలతో అన్నట్లు సమాచారం.

‘కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రజలందరూ అంటున్నారు. పార్టీలకు అతీతంగా దీనిపై నిరసన వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి కావాల్సింది నియోజకవర్గాల పెంపు కాదు. న్యాయంగా దక్కాల్సిన ప్రయోజనాలు. ఇప్పటికి నాలుగు బడ్జెట్లు చూశాం. ఇంకా సహనం ఎక్కడుంటుంది. కేంద్రంతో తాడో పేడో తేల్చుకుందాం. ప్రయోజనాలు దక్కేంతవరకు పోరాటాన్ని ఆపేది లేదు’ అని చంద్రబాబు ఎంపీలతో అన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కొందరు ఎంపీలు కేంద్రంపై నిప్పులు చెరిగినట్లు సమాచారం. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులూ రాజీనామా చేయాలని ఎంపీలు డిమాండ్‌ చేసినట్ల సమాచారం. ఈ సమావేశానికి తెదేపా ఎంపీతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి హాజరయ్యారు. పౌరవిమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. చైనా పర్యటన ముగించుకుని శనివారం రాత్రే ఆయన తిరిగొచ్చారు. అలసటగా ఉండటంతో రాలేకపోతున్నట్లు పార్టీ అధినేతకు వర్తమానం పంపినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

Apandi ra ayya me iddaru drama lu ..

 

Vadu ivvadu.. eyana edo chesestha ani vuguthadu .. vallu phone kotti em cheptharo teledu ayana manasu marchukoni adigo osthundi vopigaka poradatham vidipoyi chesedem ledu undi sadinchukovali antadu..  ika oka week avvagane shara mamule.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...