Jump to content

ప్రధాని గుప్పిట్లో..!


swarnandhra

Recommended Posts

ప్రధాని గుప్పిట్లో..!
03-02-2018 03:03:37
 
636532238184709477.jpg
  • రాష్ర్టాలకు నిధులపై కేంద్రం పట్టు..
  • నీతి ఆయోగ్‌ దయ.. మన ప్రాప్తం
  • పాత పద్ధతి మార్చేసిన కేంద్ర ప్రభుత్వం
  • అత్యధిక కేటాయింపులు నీతి ఆయోగ్‌కే
  • రాజకీయ అవసరాల మేరకే నిర్ణయాలు?
  • ఉత్తరాదివైపే మొగ్గు చూపుతారని ఆందోళన
  • ఇప్పటికే నవ్యాంధ్రకు ‘నీతి’ షాకులు
  • రాష్ట్రాలకు కేటాయింపులపై ‘రహస్యం’
  • అందుబాటులోకి రాని వివరణాత్మక నివేదిక
‘‘మీరు అడగాలి. నేను ఇవ్వను. మళ్లీ అడగాలి! అయినా ఇవ్వను! బతిమాలాలి! అప్పుడు కుదిరితే, నాకు ఇష్టమైతే ఇస్తా! అది కూడా మీకు అవసరమైనంత కాదు! నాకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇస్తా!’’... ఇది సినిమా డైలాగ్‌ కాదు! రాష్ట్రాలకు నిధుల విడుదల విషయంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న కొత్త విధానం!
 
 
అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ‘నీతి ఆయోగ్‌’ చేతిలోనే నిధులు! పద్ధతి ప్రకారం వాటంతట అవిగా రావాల్సిన సొమ్ములు కూడా ఇక నీతి ఆయోగ్‌ దయ తలిస్తేనే వస్తాయి. 2018-19 బడ్జెట్‌లో మోదీ సర్కారు చేసిన కొత్త ప్రయోగమిది! గతంలో ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం వేర్వేరుగా ఉండేవి. ప్రణాళికా సంఘం సలహా మండలిగా వ్యవహరించగా... ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు విడుదలయ్యేవి. రాష్ట్రాల బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రణాళికా సంఘం నిశితంగా పరిశీలించి, నిధుల అందుబాటును గమనించి, కేంద్రం నుంచి అందాల్సిన సహాయంపై సిఫారసు చేసేది. ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు కేంద్రం నుంచి ఆ మేరకు నిధులు అందేవి. మోదీ వచ్చాక పద్ధతి మారింది. ప్రణాళికా సంఘాన్ని తొలగించారు. ఆర్థిక సంఘాన్ని నిర్వీర్యం చేశారు. ‘ట్రాన్స్‌ఫామింగ్‌ ఇండియా’ అంటూ ‘నీతి ఆయోగ్‌’ పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. విధానపరమైన అధికారాలూ దానికే అప్పగించి... వ్యవస్థను ‘కేంద్రీ’కృతం చేశారు. ఇప్పుడు కొత్తగా బడ్జెట్‌లో అత్యధిక నిధులను కూడా నీతి ఆయోగ్‌ చేతిలోనే పెట్టారు. రాష్ట్రాలకు అందాల్సిన నిధుల గురించి సవివరమైన ప్రస్తావన, కేటాయింపులు చూపకుండా వదిలేశారు. అంటే... రాష్ట్రాలు ప్రతి అవసరానికీ నీతి ఆయోగ్‌ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే! నిధులు ఇచ్చేందుకు నీతి ఆయోగ్‌ పలు నిబంధనలు విధిస్తుంది. అనుకూలమైన రాష్ట్రాలకు ‘అనుకూలంగా’ నిర్ణయాలు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉంది.
 
 
ఉత్తరాది బడ్జెట్‌...
నీతి ఆయోగ్‌ చేతిలోనే అత్యధిక నిధులు పెట్టడంపై పలురకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజకీయంగా తమకు అనుకూలమైన రాష్ట్రాలకు నిధులు అందించేందుకే ఇలా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా ఉత్తరాది అవసరాలను దృష్టిలో ఉంచుకునే రూపొందించినట్లుందని పలువురు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాష్ట్రానికి ఏరకంగా చూసినా ప్రత్యేక సహాయం అవసరం. కానీ... నీతి ఆయోగ్‌ రాష్ట్ర ప్రభుత్వంపట్ల ఏమాత్రం సానుభూతి ప్రదర్శించడంలేదు. ఇటీవల సంస్థ ఉపాధ్యక్షుడు ఏపీకి వచ్చి... మీ వృద్ధి రేటు బాగుందికదా! మీకు ప్రత్యేక సహాయం ఎందుకు? ప్రత్యేక హోదా అవసరం ఏముంది? అంటూ వింత ప్రశ్నలు సంధించారు. ఇలాంటి రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ కొర్రీలు పెడుతూ పోతే రాష్ట్రానికి నిధులు రావడం కష్టమే’’ అని ఏపీ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.
 
 
ఏమిటీ రహస్యం?
బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమిచ్చారు? రాష్ట్ర బడ్జెట్‌ను ఎలా రూపొందించుకోవాలి? అనే అంశం అర్థంకాక ప్రభుత్వ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఎందుకంటే... ప్రతిసారీ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత, దానికి అనుబంధంగా ‘వివరణాత్మక నివేదిక’ను (ఎక్స్‌ప్లనేటరీ నోట్‌) కూడా అందుబాటులోకి తెస్తారు. ఢిల్లీలో ఉన్న రాష్ట్ర అధికారులే వెళ్లి ఈ నివేదికను తెచ్చుకుంటారు. ఇందులో... రాష్ట్రానికి కేంద్రం నుంచి అందే సహాయం గురించి పూర్తి వివరాలు ఉంటాయి. కానీ... ఈసారి వివరణాత్మక నివేదికనే బయటపెట్టలేదు. అంతా రహస్యంగా ఉంచేశారు. నీతి ఆయోగ్‌కే అధిక నిధులను కేటాయించినందున... ప్రత్యేకంగా నోట్‌ అక్కర్లేదనుకున్నారేమో!
Link to comment
Share on other sites

NITI AYOG created mainly to control funds the way they Gujju gang wants......

 

NITI ni addam petti 3 months lo 1.2 lakh crores release chesaru BULLET train ki...danikosam NITI committee stayed in  japan and got loans as if it is emergency...

Same NITI rejected AP SS and Polavaram funds....

Link to comment
Share on other sites

1 hour ago, swarnandhra said:

issue is not about just AP getting treated unfairly. bigger issue is institutions that provide some kind of checks and balances are getting cut/undermined. 

 

NITI anedi feeku  agenda ruddatam kosam create chesina fake organization....kanisam NITI lo okkadante okkadu south vadu ledu........

GIFT city ki ichina 2016 budget incentives&2018 incentives both were recommended by NITI ....adi dani paristiti....polavaram ki funds levu ani cheppindi same NITI...

 

INDIA PM GUJJU

BJP PRESIDENT GUJJU

RBI chief GUJJU.........

Designation Name
Chairperson Shri Narendra Modi(link is external)
Vice Chairperson Dr. Rajiv Kumar
Full-Time Member Prof. Ramesh Chand
Full-Time Member Profile - Shri V.K. Saraswat
Full-Time Member Profile - Shri Bibek Debroy
Full-Time Member Profile - Dr. V.K. Paul
Chief Executive Officer Shri Amitabh Kant
Link to comment
Share on other sites

35 minutes ago, Raaz@NBK said:

States ki nyayam ga ivalsina vi kuda ivvadam ledhu.. M lo B.odi :sleep:

Eppudaithe GST Peru medha Central ki powers vellayo aa roje matash IMO

deniki states kuda responsible.... prati state voopukuntu assemly lo pass chesayyi

Link to comment
Share on other sites

2 hours ago, AnnaGaru said:

 

NITI anedi feeku  agenda ruddatam kosam create chesina fake organization....kanisam NITI lo okkadante okkadu south vadu ledu........

GIFT city ki ichina 2016 budget incentives&2018 incentives both were recommended by NITI ....adi dani paristiti....polavaram ki funds levu ani cheppindi same NITI...

 

INDIA PM GUJJU

BJP PRESIDENT GUJJU

RBI chief GUJJU.........

Designation Name
Chairperson Shri Narendra Modi(link is external)
Vice Chairperson Dr. Rajiv Kumar
Full-Time Member Prof. Ramesh Chand
Full-Time Member Profile - Shri V.K. Saraswat
Full-Time Member Profile - Shri Bibek Debroy
Full-Time Member Profile - Dr. V.K. Paul
Chief Executive Officer Shri Amitabh Kant

Finance Secretary Hasmukh Adhia is Gujju.

PM's additional principal secretary PK Mishra, a retired Gujarat cadre IAS officer who served as principal secretary to Modi when he was chief minister 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...