Jump to content

తెలంగాణలో పొత్తులు ఉండవ్‌: BJP


koushik_k

Recommended Posts

  • తెలంగాణలో పొత్తులు ఉండవ్‌
  • 119 సీట్లలో పోటీకి సిద్ధం కండి
  • ఫిబ్రవరిలో నేనూ పర్యటనకు వస్తా
  • పనితీరు బాగుంది.. విజృంభించండి
  • రాష్ట్ర నేతలతో బీజేపీ చీఫ్‌ అమిత్‌షా
 
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి):‘‘తెలంగాణలో పార్టీ పరిస్థితి చాలా బావుంది. నేను చేయించిన అంతర్గత సర్వేలో మంచి స్పందనే వచ్చింది. కాంగ్రెస్‌ కంటే మెరుగ్గా ఉన్నాం. మరింత విజృంభించి పనిచేయండి. ఈ నెలలోనే మూడు రోజుల పర్యటనకు వస్తా’’ అని తెలంగాణ బీజేపీ నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, రాజకీయ సమీకరణలు, పొత్తులు, అసెంబ్లీ సీట్లు వంటి అంశాలపై షా గురువారం రాత్రి 11 గంటల వరకు సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు అన్ని విషయాలను సూక్ష్మస్థాయిలో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవని కూడా ఆయన స్పష్టం చేశారు. అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. ఏపీ నాయకులతో కంటే ఎక్కువ సమయం కేటాయించడం గమనార్హం. బూత్‌స్థాయిలో కమిటీల నిర్మాణం వేగంగా చేస్తున్నారని, మిగిలిన వాటినీ త్వరగా పూర్తిచేసి, పేజీ స్థాయిలో ప్రముఖ్‌లను నియమించాలని సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల అంశాన్ని ఏపీ నాయకులతో చర్చించినా, ఇక్కడ మాత్రం దానిపై ఎటువంటి ప్రశ్నలు అడగలేదని సమాచారం. ముందస్తు, జమిలి ఎన్నికల గురించి చర్చ జరగలేదని బీజేపీ నేతలు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనసభాపక్ష నేత జి.కిషన్‌ రెడ్డి, నాయకులు రామచంద్ర, మంత్రి శ్రీనివాస్‌, పేరాల చంద్రశేఖర్‌ బృందంతో షా చర్చించారు.
 
వారితో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, రాంమాధవ్‌ కూడా పాల్గొన్నారు. దక్షిణాదిన కర్ణాటక తర్వాత, తెలంగాణలోనే అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వ్యాఖ్యానించిన షా... ఇందుకు అనుగుణంగా రూపొందించిన కార్యక్రమాల షెడ్యూలును రాష్ట్ర పార్టీ ముఖ్యుల నుంచి తీసుకున్నారు. కొంతమంది కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చిన సందర్భంగా, టీఆర్‌ఎస్‌ పథకాలను ప్రశంసించడం తమకు ఇబ్బందిగా మారిందని, ఇదే సమయంలో అధికార టీఆర్‌ఎ్‌సతో పొత్తు ఉండవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోందని పార్టీ నేతలు వివరించారు. దీనిపై స్పందించిన షా.. విస్పష్ట వివరణ ఇచ్చారని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వివరించారు. ‘మజ్లిస్‌ పార్టీతో దోస్తానా చేసేవాళ్లతో మనం ఎలా కలసి వెళ్తాం? మంత్రులు వచ్చి పథకాలను పొగిడినంత మాత్రాన మరో అభిప్రాయం ఉండదు. అది రెండు ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. రాజకీయంగా మనదారి మనదే. పొత్తుల ప్రసక్తే లేదు. ఒంటరిగానే బరిలోకి దిగుదాం. అందుకు తగ్గట్టుగా మీరు పోరాడండి..’ అని తేల్చిచెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లగా, ప్రస్తుతం అది న్యాయ శాఖ పరిధిలో ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం. అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలపై అధిష్టానం సంతోషంగా ఉందని, ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలిచ్చారని తెలిపారు. ప్రతి ప్రాంతం గురించి అడిగి మరీ షా సమీక్షించారని తెలిపారు. వారు నిర్వహించిన సర్వేలో రాష్ట్ర బృందానికి మంచి మార్కులు పడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో పనిచేసి 2019లో అధికారంలోకి వస్తామన్నారు.
 
AP lo kuda same announcement cheyandi please 
Link to comment
Share on other sites

16 minutes ago, Uravakonda said:

Good move. asalu BJP ki unna actual balam ento telisipoddi ee debbaki.

Total Telangana state lo 4% vote share ki try cheyandi. adhe ekkuva meeku. seats lo MIM ni daatandi chalu. 2014 lo gelichinadanikanna ekkuva adhi meeku single ga ante.

akkada balam kadu - game plan

chivariki chatchuddi gorre

Link to comment
Share on other sites

From Eenadu

అధికారమే లక్ష్యంగా పనిచేయండి 
తెలంగాణ నేతలతో అమిత్‌షా

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి రావడానికి జాతీయ పార్టీ నుంచి ఎలాంటి సహాయసహకారాలైనా అందిస్తానని హామీ ఇచ్చారు. గురువారమిక్కడ తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి, రాంచంద్రరావు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘2019 ఎన్నికల నిమిత్తం జాతీయ అధ్యక్షుడితో చర్చించాం. 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలకు పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. సంస్థాగతంగా రాజకీయపరంగా పార్టీ రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పర్యటిస్తానన్నారు. తెరాస వైఫల్యాలు, నిరుద్యోగులు, దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. తెరాస నియంతృత్వ వైఖరిపై పోరాటానికి రోడ్‌మ్యాప్‌ రూపొందించడం కోసం త్వరలోనే హైదరాబాద్‌లో సమీక్ష చేస్తానన్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం చర్చకు రాలేదు. 119 నియోజకవర్గాలకు సిద్ధమవుతున్నాం. త్వరలోనే అభ్యర్థుల్ని సమాయత్తం చేస్తాం’’ అని లక్ష్మణ్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

It’s all TRS+BJP Strategy to divide anti incumbency votes and to see TRS in lead in both MP And MLA finally TRS will stay out of govt for a short while and say issue based support to central govt and finally get good portfolio for his daughter- BJP will enjoy MP loksabha and RajyaSabha Numbers from TRS.

 

the same game with INC+TRS in case in central INC pulls it off well

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...