Jump to content

ఈ బిల్డింగ్‌తో హైదరాబాద్ పేరు మార్మోగుతోంది


sonykongara

Recommended Posts

ఈ బిల్డింగ్‌తో హైదరాబాద్ పేరు మార్మోగుతోంది
29-01-2018 11:30:21
 
636528222197485761.jpg
హైదరాబాద్ అంటే అందరికీ చార్మినార్ గుర్తుకు వస్తుంది. అయితే రోజులు మారే కొద్దీ.. హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం, హైటెక్‌సిటీ కూడా ఆ లిస్ట్‌లో చేరాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో సరికొత్త నిర్మాణం చేరింది. నేషనల్ ఫిషరిస్ డెవలప్‌మెంట్ బోర్డ్ హెడ్‌క్వార్టర్ హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. చేప ఆకారంలో ఉన్న ఈబిల్డింగ్ చేపల ఉత్పత్తి, ఆ పరిశ్రమ అభివృద్ధిపై ఏర్పాటైంది. 2012లో దీని ప్రారంభోత్సవం జరిగింది. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 235 దగ్గరలో ఉన్న ఈ నిర్మాణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేప ఆకారంలో ఉన్న ఈ బిల్డింగును చూసి ప్రపంచ ఆర్కిటెక్ట్ నిపుణులు ఫిదా అవుతున్నారు. తమ విద్యార్థులకు దీన్నో ప్రమాణికంగా చెబుతున్నారు. నీలి కళ్లతో.. మొప్పలతో.. స్మైలీ ఫేస్‌తో ఉన్న ఈ బిల్డింగ్‌ మంత్రముగ్దులని చేస్తోంది.
 
 
ఒకదాన్ని పోలి ఉండేలా నిర్మాణాలను చేపట్టడాన్ని మిమెటిక్ ఆర్కిటెక్చర్ అంటారు. చేపల పరిశ్రమ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఎన్ఎఫ్‌డీబీ కేంద్ర కార్యాలయాన్ని కూడా చేపలాగే నిర్మించారు. ఇలాంటి మిమెటిక్ ఆర్కిటెక్చర్ అద్భుతాలు మరిన్ని ఉన్నాయి. అమెరికాలోని ఓహియోలో ఉన్న లాంగబెర్గర్ కంపెనీ హెడ్‌క్వార్టర్ పిక్నిక్ బాస్కెట్ ఆకారంలో ఉంటుంది. పైన్ ఆపిల్ ఆకారంలో ఉండే ఆస్ట్రేలియాలోని బిగ్ పైన్ ఆపిల్, పప్ షేప్‌లో ఉండే కాలిఫోర్నియాలోని టెయిల్ ఓ ది పప్, ఐస్ క్రీమ్ కప్ ఆకారంలో ఉండే ట్విస్టీ ట్రీట్(అమెరికా), షూ ఆకారంలోని బిగ్ షూ రిపేయిర్(అమెరికా), ట్రక్ ఆకారంలోని ది ప్యూరా ఇన్ కోస్ట్రోమా(రష్యా), పాల సీసాలా ఉండే హూడ్ మిల్క్ బాటిల్(మసాచూసెట్స్) ఈ లిస్టులో ఉన్నాయి.
Link to comment
Share on other sites

3 hours ago, sagarkurapati said:

Vizag lo central govt pedutha annaru funds evvaru chavaru malli tvs lo echesamu antaru

TV lo icchaam anteeyyy noru moosukoni raakundaa Usmania batch kottinatlu kotti funds ekkada release chesaaroo cheppandi Ani battalu ooda theesi kottaali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...