Jump to content

Bonda Uma


LuvNTR

Recommended Posts

60 కోట్ల భూమి హాంఫట్‌!
Andhra Jyoti, 29-01-2018 01:48:07
 
636527872855940540.jpg
  • సమరయోధుని భూమిలో మాఫియా పాగా
  • సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో ఏ8గా బొండా సుజాత
విజయవాడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): బ్రిటీష్‌ పాలన నుంచి భరతమాతకు విముక్తి కల్పించేందుకు నాడు తాత పోరాడాడు. ఆ త్యాగాన్ని గుర్తించి ప్రభుత్వం అందజేసిన భూమిని రక్షించుకునేందుకు నేడు ఆయన వారసులు భూమాఫియాతో పోరాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో చెలరేగిపోతున్న భూమాఫియా అరాచకాలకు అద్దం పట్టే ఉదంతమిది. ఈ భూదందాపై విచారణ చేపట్టిన సీఐడీ విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమ సతీమణి సుజాను ఏ8గా పేర్కొంటూ ఎఫ్‌ఐర్‌ నమోదు చేసింది.
  
కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన కేశిరెడ్డి సూర్యనారాయణ స్వాతంత్య్ర సమరయోధుడు. బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించిన ప్రభుత్వం 1957లో సూర్యనారాయణకు విజయవాడ సింగ్‌ నగర్‌లో బుడమేరు కాల్వ పక్కన ఉన్న సర్వే నంబర్‌ 6,7,32,40ల్లో 5.57 ఎకరాల భూమిని కేటాయించింది.
 
సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 1974లో సూర్య నారాయణ మరణించారు. సింగ్‌నగర్‌లోని భూమి వ్యవసాయానికి అనుకూలం కాకపోవడం.. బుడమేరు ముంపు ప్రమాదం ఉండడంతో సూర్యనారాయణ కుటుంబీకులు దాన్ని ఖాళీగా వదిలేశారు. విజయవాడ రాజధాని ప్రాంతమయ్యాక సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లోని భూముల బంగారమయ్యాయి. సూర్యనారాయణకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కూడా ఎకరం రూ.10 నుంచి 12 కోట్లకు చేరుకుంది. మొత్తం భూమి విలువ రూ.60 కోట్లపైచిలుకే.
 
కోట్ల విలువైన భూమి మాఫియా పాలు
అత్యంత ఖరీదైన భూమి కావడం, ఖాళీగా ఉండడంతోపాటు భూయజమానికి అంగ, అర్థబలం లేకపోవడంతో భూమాఫియా కన్ను దీనిపై పడింది. అబ్దుల్‌ మస్తాన్‌, రామిరెడ్డి కోటేశ్వరరావు పేరుతో నకిలీ దస్తావేజులు సృష్టించింది. సూర్యనారాయణకు కేటాయించిన 5.57 ఎకరాల భూమిని 1989లో ఆయన సోదరుడు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు వెంకటేశ్వరరావు.. తమకు విక్రయించినట్టు తప్పుడు డాక్యుమెంట్లు పుట్టించారు.
  
మాఫియా ముఠా.. భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి, కొంత మందిని అక్కడ కాపలా ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనవడు కె.సురేశ్‌ బాబు.. అక్కడికి వెళ్లగా ఆయనపై భూమాఫియా దాడి చేసింది. ‘ఈ భూమి మాది. మేం కొనుక్కున్నాం. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ దురుసుగా ప్రవర్తించింది. తమ భూమిని కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించారంటూ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో సురేశ్‌ బాబు కేసు నమోదు చేశారు. అయితే రాజకీయఒత్తిళ్ల కారణంగా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు.
 
తెరపైకి బొండా ఉమ భార్య!
సురేశ్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజులు మౌనంగా ఉన్న మాఫియా ముఠా ఇటీవల మళ్లీ భూమిపై పట్టు బిగించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా రవితేజ బయోటిక్స్‌ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు భార్య సుజాత తెరపైకి వచ్చారు. వివాదాస్పద భూమిలో కొంత భాగమైన 3500 చదరపు గజాలను డెవలప్‌ చేసేందుకు తాడిగడపకు చెందిన అబ్దుల్‌ మస్తాన్‌తో గత ఏడాది ఏప్రిల్‌ 12న సుజాత ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన నాలుగెకరాల పైచిలుకు భూమిని సాయిస్వరూప సంస్థకు డెవల్‌పమెంట్‌కు ఇచ్చి, జీపీఏ ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ కూడా ప్రముఖ రాజకీయ నాయకుడి బినామీదేనని సమాచారం.
 
 
విజయవాడకు చెందిన ప్రముఖ రాజకీయ నేతకు అనుచరుడిగా ఉన్న మాగంటి బాబు ఈ రెండు సంస్థల అగ్రిమెంట్లకు ఏజెంట్‌గా వ్యవహరించారు. ఈ ఒప్పందాల విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనవడు సురేశ్‌ బాబు మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
 
దీంతో సీఐడీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. గత ఏడాది అక్టోబరు 23న ఈ భూదందాపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో.. అబ్దుల్‌ మస్తాన్‌ను ఏ1గా, రామిరెడ్డి కోటేశ్వరరావును ఏ2గా, తిరుమలరాజును ఏ3గా, గుంటుపల్లి అశ్వత్త రామారావును ఏ4గా, వై.సింధుష్‌ రెడ్డిని ఏ5గా, ఓలేటి సీతామహాలక్ష్మిని ఏ6గా, మాగంటి బాబుని ఏ7గా, బొండా సుజాతను ఏ8గా ఎఫ్‌ఆర్‌ఐలో పేర్కొన్నారు.
 
అజిత్‌ సింగ్‌ నగర్‌లోని భూమికి ఎలాంటి లింక్‌ డాక్యుమెంట్లు లేకుండా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు రిజిస్ట్రేషన్‌ చేసేశారు. ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌(ఈసీ) లేకుండా రెవెన్యూ అధికారులు అడంగళ్‌లో పేర్లు మార్చేశారు. 1997లో సమరయోధుల భూవిక్రయాలకు సంబంధించి ప్రభుత్వం నిబంధనను సడలించి అమ్ముకునే అవకాశం కల్పించగా, మాఫియా మాత్రం ఆ భూమిని 1989లోనే వెంకటేశ్వరరావు నుంచి కొనుగోలు చేసినట్టు రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు పుట్టించడం గమనార్హం.
 
జీపీఏ రద్దు చేశాం: బొండా
బుడమేరు పక్కన ఉన్న 3500 చదరపు గజాల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి తాడిగడపకు చెందిన మస్తాన్‌తో అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న మాట వాస్తవమేనని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆ భూమిపై కేసులు ఉన్న విషయం మస్తాన్‌ తమకు చెప్పలేదని, ఎలాంటి వివాదాలు లేవని చెప్పడంతోనే జీపీఏ చేసుకున్నామన్నారు. ఆ భూమిపై కోర్టులో సివిల్‌ కేసులు ఉన్నాయని తెలియగానే జీపీఏను రద్దు చేసుకున్నట్లు చెప్పారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికే కొందరు ప్రత్యర్థులు ఈ కేసును వాడుకుంటున్నారని విమర్శించారు.
 
బొండా అనుచరుల చంపేస్తామంటున్నారు!
భూస్కాంలో ఏ2గా ఉన్న నిందితుడి ఫిర్యాదు
విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరులు తనను బెదరిస్తున్నారని భూవివాదం కేసులో ఏ2గా ఉన్న కోటేశ్వరరావు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు వెంకట సురేంద్ర కుమార్‌తో కలిసి పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ను కలిశారు. ‘కార్పొరేటర్‌ గండూరి మహేశ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మాగంటి బాబు, వణుకూరి రమేష్‌ కలిసి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేరు చెప్పి బెదిరిస్తున్నారు. వారి నుంచి మాకు ప్రాణహాని ఉంది. మా నాన్నను బినామీగా పెట్టి తనఖా రిజిస్ట్రేషన్‌ అని చెప్పి సంతకాలు చేయించారు. సీఐడీ పోలీసులు మా ఇంటికి వచ్చి అడిగినప్పుడు అన్ని వివరాలూ చెప్పాం. అప్పటి నుంచి కార్పొరేటర్‌ మహేశ్‌ అనుచరులు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.’ అని సవాంగ్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని సంయుక్త కమిషనర్‌ టి.కాంతిరాణాను సవాంగ్‌ ఆదేశించారు. 
Link to comment
Share on other sites

10 minutes ago, Seniorfan said:

Corrupt fellow ni PK entertain chesthada? veediki idhe last term...

CBN and PK will sure exchange opinion on PK’s candidates - based on strengths and weaknesses they will go by mutual consensus 

Link to comment
Share on other sites

Two years back oka sari Vijayawada vella correct ga aa roju road meedha bonda uma son and his friends celebrating umas sons birt with huge bike rally. Slogans are kapu dhebba kammodi abba anta . Assala emi ayna sambnadham undha aa rally lo caste ni lagadanki that to darely in capital area edhe pani TDP kamma politicians kodukulu chesthe ee patiki entha gola ayyedhi. Malli ethanu tv lo debates ki vachi sriranga neethulu. Emi ayna sare ee saari ethanki kakunda aa radha ni ayna entertain cheyya vachu 

Link to comment
Share on other sites

7 hours ago, sagarkurapati said:

Two years back oka sari Vijayawada vella correct ga aa roju road meedha bonda uma son and his friends celebrating umas sons birt with huge bike rally. Slogans are kapu dhebba kammodi abba anta . Assala emi ayna sambnadham undha aa rally lo caste ni lagadanki that to darely in capital area edhe pani TDP kamma politicians kodukulu chesthe ee patiki entha gola ayyedhi. Malli ethanu tv lo debates ki vachi sriranga neethulu. Emi ayna sare ee saari ethanki kakunda aa radha ni ayna entertain cheyya vachu 

Vallalo okadu athyuthsaham chesi Vuntadu. 

Uma wife kamma 

migathavi Anni Political angle lo choodatame 

another one - Ganta is also same category 

Link to comment
Share on other sites

కాల్వ గట్టుపై కోటీశ్వరులు!
30-01-2018 01:25:30
 
636528723288928325.jpg
  • రేకుల షెడ్డులో అబ్దుల్‌ మస్తాన్‌
  • అద్దె ఇంట్లో రామిరెడ్డి కోటేశ్వరరావు
  • వీరిద్దరివీ పూట గడవని కుటుంబాలే
  • 60 కోట్ల భూస్కాంలో విస్తుగొల్పే వాస్తవాలు
  • సమగ్ర నివేదిక కోరిన సీఎం చంద్రబాబు
విజయవాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అబ్దుల్‌ మస్తాన్‌.. తాడిగడప కాల్వ గట్టుపై వేసుకున్న చిన్న షెడ్‌ అతడి నివాసం. రామిరెడ్డి కోటేశ్వరరావు.. విజయవాడ కృష్ణలంకలో చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీళ్లిద్దరూ రూ.60 కోట్ల విలువైన ఆస్తికి యజమానులు. వీరితోనే విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమ సతీమణి సుజాత ఒకటిన్నర ఎకరం వివాదాస్పద స్థలాన్ని అభివృద్ధి చేస్తానని డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బెజవాడ భూదందాలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.
 
 
‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో.. అమాయకులను పావులుగా చేసుకుని భూమాఫియా సాగిస్తున్న అక్రమాలు బట్టబయలయ్యాయి. అబ్దుల్‌ మస్తాన్‌ తాడిగడపలోని చిన్న రేకుల షెడ్డులో ఉంటున్నారు. కొంత కాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కనీసం నోరు తెరచి మాట్లాడలేని స్థితి ఆయనది. రామిరెడ్డి కోటేశ్వరరావు కృష్ణ లంకలో చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. లారీ పనికి వెళితేనే కుటుంబం గడుస్తుంది. తన బీ ఫారం పట్టా స్థలాన్ని తాకట్టు పెట్టుకుని అప్పు ఇప్పించాలని ఎమ్మెల్యే బొండా ఉమ సన్నిహితుడైన కార్పొరేటర్‌ గండూరి మహేశ్‌ను కోరగా, అతను కోటేశ్వరరావును భూదందాలో పాత్రధారిగా మార్చేశాడు.
 
 
ఈ కేసుపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న సీఐడీ, తాజా పరిణామాలతో మరింత వేగం పెంచింది. కేసుకు ముఖ్యమైన ఆధారాలను సేకరిస్తోంది. రెవెన్యూ కార్యాలయంలోని అడంగల్‌లో సమరయోధుడి పేరు తొలగించి, మాఫియా పేర్లు చేర్చడంలో ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై దృష్టి సారించింది.
 
రిజిస్ట్రేషన్‌ అధికారుల తీరుపైనా ఆరా తీస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా సమరయోధునికి కేటాయించిన అసైన్డ్‌ భూములను అడ్డదారిలో రిజిస్ట్రేషన్‌ చేయడం, మళ్లీ వాటిలో ఒకదాన్ని రద్దు చేయడం వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎవరెవరు ఈ మాఫియాకు సహకరించారు? అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేయించిన రాజకీయ నేతలు ఎవరు అన్న కోణంలో సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
 
 
కార్పొరేటర్‌ నన్ను ఇరికించాడు: కోటేశ్వరరావు
సమరయోధుడి భూమిని కబ్జా చేసిన కేసులో కార్పొరేటర్‌ మహేశ్‌ తనను ఇరికించాడని అప్రూవర్‌గా మారిన కోటేశ్వరరావు ఆరోపించారు. సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తనకున్న 85 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునే స్థోమత లేక అద్దె ఇంట్లో ఉంటున్నానన్నారు. ‘మా చిన్నబ్బాయి, కార్పొరేటర్‌ మహేశ్‌ ఏడో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆ చొరవతోనే మహేశ్‌ను అప్పు అడిగాం. మాగంటి బాబు వద్ద అప్పు ఇప్పిస్తానని చెప్పి, కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నాడు. వారం తర్వాత రిజిస్ట్రార్‌ ఆఫీ్‌సకు వచ్చి సంతకాలు చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నాను.
 
 
సంతకాలు పెట్టినా డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఫోన్లు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నెల 18న మహేశ్‌ మా ఇంటికి వచ్చి స్థలం దస్తావేజులు ఇంట్లో ఉంచమని నా భార్యకు ఇవ్వగా, ఆమె తీసుకోలేదు. రెండు రోజుల తర్వాత సీఐడీ పోలీసులు వచ్చి తనిఖీలు చేశారు. నాకు నోటీసు ఇచ్చి, ఫొటోలు, కుటుంబ వివరాలు తీసుకెళ్లారు. నేను న్యాయవాది రవీందర్‌రెడ్డిని ఆశ్రయించాను.
 
సింగ్‌నగర్‌లోని భూదందా విషయంలో నన్ను ఏ2గా పెట్టడడంతో అవాక్కయ్యాను. కోట్లాది రూపాయల భూమి ఉంటే అద్దె ఇంట్లో ఎందుకు ఉంటాను? ఈ భూదందాతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యవహారంలో మాగంటి బాబు, వణుకూరి రమేష్‌, గండూరి మహేశ్‌లు పాత్రధారులు. న్యాయస్థానంలో కేసును అంగీకరించకపోతే నా కుటుంబం కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరిస్తున్నారు’ అని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
 
తమ భూమిని ఆక్రమించుకున్నారని 18 నెలల క్రితం తెలిసిందని, ఆ సమయంలో తాము ఊళ్లో లేమని స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణ మనవడు శ్రీనివాస్‌ తెలిపారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళితే సీఐ ముందే మాగంటి బాబు తమని బెదిరించారని తెలిపారు. ప్రతిసారీ ఎమ్మెల్యే బొండా ఉమా పేరు చెప్పేవారని అన్నారు. సీఎం చంద్రబాబు ఒక్కరే న్యాయం చేయగలరని అన్నారు. న్యాయం జరగకుంటే ఆత్మహత్య తప్ప తమకు గత్యంతరం లేదన్నారు.
 
 
అన్నీ అనుమానాలే....
కోట్ల విలువైన భూమికి యజమానులుగా చెబుతున్న అబ్దుల్‌ మస్తాన్‌, కోటేశ్వరరావుల పేరిట సృష్టించిన డాక్యుమెంట్లలో సమరయోధుడు సూర్యనారాయణ కుమారుడు వెంకటేశ్వరరావు దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసినట్టుగా రాశారు. కానీ సూర్య నారాయణకు వెంకటేశ్వరరావు స్వయాన అన్న.
 
తనకు చెందిన రవితేజ బయోటెక్‌ కంపెనీ కోసం అబ్దుల్‌ మస్తాన్‌ నుంచి ఒకటిన్నర ఎకరం స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఎమ్మెల్యే బొండా ఉమ చెబుతున్నారు. రూ.18 కోట్ల విలువ చేసే ఆ స్థలంలో గోతులు పూడ్చి, చదును చేసినందుకు సుమారు 3500 గజాల స్థలాన్ని రవితేజ బయోటెక్‌ కంపెనీకి ఇచ్చేలా ఒప్పందం రాసుకున్నారు. దీన్ని పరిశీలించిన పోలీసులు.. కేవలం కాగితాలపైన కథ నడిపించేందుకు రాసుకున్న ఒప్పందంగా దాన్ని పేర్కొంటున్నారు.
Link to comment
Share on other sites

రూ.18 కోట్ల విలువ చేసే ఆ స్థలంలో గోతులు పూడ్చి, చదును చేసినందుకు సుమారు 3500 గజాల స్థలాన్ని రవితేజ బయోటెక్‌ కంపెనీకి ఇచ్చేలా ఒప్పందం రాసుకున్నారు.

 

Abbabbbaaa - emi deal idi - ee deal isthey manam andaram yelli ee pani chesu kuntey podu - gotulu poodisthey 3500 sft land vijayawada lo anta .... 

Link to comment
Share on other sites

On 29/01/2018 at 8:02 PM, rk09 said:

Vallalo okadu athyuthsaham chesi Vuntadu. 

Uma wife kamma 

migathavi Anni Political angle lo choodatame 

another one - Ganta is also same 

On 29/01/2018 at 7:40 AM, fan no 1 said:

He will jump to Jenasena or demands ticket by playing kapu card...Bonda ki ivvakapote Radha ki ivvachu..

Ilaantollu janasena undatame better. Appudu PK ni corner cheyocchu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...