Jump to content

నా కుడి చేయి సరిగా పనిచేయడం లేదు: చంద్రబాబు

Saichandra

Recommended Posts

అనారోగ్యంగా ఉన్నా దావోస్ పర్యటనకు వెళ్లానని సీఎం చంద్రబాబు చెప్పారు. తన కుడి చేయి సరిగా పనిచేయడం లేదని, ఇప్పటిదాకా పదిసార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నానని తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఉన్న తనను డాక్టర్లు దావోస్ వెళ్ళొద్దని చెప్పారని, అయినా వినకుండా వెళ్ళానని ఆయన చెప్పుకొచ్చారు. దావోస్‌లో తన ఆరోగ్యం బావుండక నిద్రకూడా లేదని చెప్పారు. ఇదంతా ప్రజల కోసం చేస్తున్నానని, అయినా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.

Link to comment
Share on other sites

Swamiii manaki saametha vundaneyy vundi gaa 

Paachi pallodu sampadistheyy bangaaru pallodu thengi thinnnaadu Ani - eeyana gatham lo 9 years develop chesthey inko donganaayalu 6 years lo thengesaadu - aaa ruchi marigi inko donga  koduku  rastram meda ki ready ayyaadu

nuvvu aarogyam choosuko saami - entha chesinaa nee srama anta kukkala paalu chesthaaru - 

Link to comment
Share on other sites

17 minutes ago, dusukochadu said:

Enni chesina gratitude leni janam in AP. So, it's not worth it. 

100% true...Nenu kuda eppudo same cheppa....Just Amaravathi lo kurchoni Rajakeeyam seyyali development kaadu ani....mana vallaki pensions, scholarships, gorrelu, barrelu, cheeralu, mixie lu, vote ki 3000 Rs etc. ivi isthene votes vestharu.

Link to comment
Share on other sites

ఎందుకీ అక్కసు?
28-01-2018 02:18:57
 
636527027421155422.jpg
  • అభివృద్ధి చేస్తుంటే అడ్డంకులా?
  • ఎంత కష్టపడుతున్నా బురద చల్లడమా?
  • వీళ్లతో పోరాడాలా... సమస్యలపైనా?
  • పట్టిసీమ లేకుంటే ఏమిటి పరిస్థితి?
  • కృష్ణా డెల్టాకు, సీమకు నీళ్లొచ్చేవా?
  • గోదావరి-పెన్నానూ అనుసంధానిస్తాం
  • ‘సీమ’కు నీళ్లు ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం
  • విభజన వేళ గతుకుల రోడ్డులా రాష్ట్రం
  • ఇప్పటికి 370 కోట్ల డాలర్ల పెట్టుబడులు
  • చెయ్యి బాధిస్తున్నా దావోస్‌కు వెళ్లా
  • మూడు రోజులు ఒట్టి పెరుగు, మాత్రలే
  • అయినా... అన్ని సమావేశాల్లో పాల్గొన్నా
  • రాష్ట్రానికి కీలక సంస్థలు, పలు ఒప్పందాలు
  • పరిశీలనలో అమరావతి ఎయిర్‌వేస్‌: సీఎం
అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నా ఏదో ఒక బురద చల్లి ఆనందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లతో పోరాడాలా? రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలా అనేది అర్థం కావడంలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారు. దావోస్‌ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన... శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై భావోద్వేగంతో స్పందించారు.
 
రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాకూడదని, అరాచకం పెరిగిపోవాలని .. ప్రజల మధ్య చిచ్చు రేపాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని మండిపడ్డారు. లులూ సంస్థ విశాఖలో కార్యకలాపాలను స్థాపించేందుకు ముందుకు వస్తుంటే.. కొందరు ఎలా వస్తుందో చూస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘‘ఈ సంస్థ కొచ్చిన్‌లో నిర్వహిస్తోన్న కార్యకలాపాలు చూసి రాష్ట్రానికి పిలిచాం. వారు కోరినచోట భూములు ఇస్తే ఇప్పుడు అడ్డుకుంటామంటూ హెచ్చరికలు చేయమేమిటి? అభివృద్ధి చేయాలంటూనే ఇలా అడ్డగింతలేమిటి?’’ అని నిలదీశారు. తనకు ప్రజలపై నమ్మకం ఉందని... ఎవరు పనిచేస్తున్నారో... ఎవరు మాటలు చెబుతున్నారో వారు గ్రహించగలరని అన్నారు.
 
‘‘విభజన సమయానికి రాష్ట్రంలో సరైన మౌలిక సదుపాయాలు లేవు. రాష్ట్రం గతుకుల రోడ్డులా ఉంది. గన్నవరం విమానాశ్రయం రేకుల షెడ్డులా ఉండేది. అయినా.. మూడున్నరేళ్లలో 370 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అనంతపురం జిల్లాకు కియ కార్ల కంపెనీ వచ్చింది. రాయలసీమకు నీళ్లు, పరిశ్రమలు వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుస్తుంది.’’ అని వివరించారు. రాష్ట్రం కోసం తాను ఏ కష్టాన్ని లెక్క పెట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆయా అంశాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...
 
‘దావోస్’తో వచ్చిందిదీ..
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పటి నుంచి దావోస్ కు వెళ్తున్నాను. ఇప్పటికి 14సార్లు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో, టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందుతోందో ఈ సదస్సు వల్ల తెలుస్తుంది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ప్రపంచం భారత్‌ గురించి, అందునా .. ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడుకునేలా చేశాం. దావోస్‌ పర్యటనలో భాగంగా జ్యూరిక్‌తో సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం చేసుకున్నాం. మెడ్‌ టెక్‌తో ఒప్పందం కుదిరింది.
 
విశాఖలో 1000 నుంచి 2000 ఎకరాల్లో మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. దావోస్ లో మెడ్‌సిటీకి సంబంధించి 150 సంస్థలతో ఒప్పందం జరుగుతుందని భావించినా... 50 సంస్థలతో ఒప్పందం జరిగింది. అలీబాబా క్లౌడ్‌ డేటా సెంటర్‌ ఏపీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దేశంలో మొదటి కేంద్రాన్ని ముంబైలో ఏర్పాటు చేస్తోంది. రెండోది... ఏపీలో వస్తుంది. బ్లాక్‌ చెయిన్‌, హైబ్రీడ్‌ క్లౌడ్‌ హబ్‌, ఫిన్‌టెక్‌ వంటి పాలసీలు తీసుకురావడం వల్ల పలు ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దావోస్ లో హిటాచీతోనూ ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటికే మనం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ను అత్యుత్తమంగా నిర్వహిస్తున్నాం.
 
హిటాచీ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే... హెచ్‌పీ 3-డి ప్రింటింగ్‌ ప్లాంట్‌ కూడా స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎయిర్‌ బస్‌ కూడా టాటాతో కలసి రవాణా విమాన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌ రహేజాలో 1,35,000 మందికి ఉద్యోగాలను కల్పించారు. ఇప్పుడు... ఏపీలోనూ మైండ్‌ స్పేస్‌ కేంద్రాల ఏర్పాటుకు రహేజా సంసిద్ధత వ్యక్తం చేసింది. శాప్‌ గ్లోబల్‌ హెడ్‌తో సంప్రదింపులు జరిపాం. కాంప్రహెన్సివ్‌ ఫైనాన్స్‌ను అమలు చేసేందుకు శాప్‌ అంగీకరించింది.
 
సౌదీ ఆరమ్‌కో కాకినాడలో లేదా కృష్ణపట్నంలో రిఫైనరీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. కరువును నియంత్రించేలా రూపొందించిన విధానాలను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యూపీఎల్‌ సంస్థను కోరాం. వేదాంత గ్రూప్‌ రాష్ట్రంలో 20 లక్షల అమెరికన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతుంది. దావోస్ లోనూ ఏపీయే ప్రపంచాన్ని ఆకర్షించింది. అక్కడ ఏర్పాటు చేసిన వాహనాలతో పాటు .. తెలుగు వంటకాలు అందరిని ఆకట్టుకున్నాయి.
 
ఆవిష్కరణ కేంద్రంగా...
ఇన్నోవేషన్స్‌ అమలులో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం. శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతాం. ప్రపంచమంతా ఏకథాన్‌ నిర్వహిస్తాం. సాంకేతిక నైపుణ్యం వినియోగం, కొత్త ఆవిష్కరణలు, సంప్రదాయ సేంద్రీయ ఎరువుల విధానం .. తదితరాలతో ఏపీని వృద్ధి బాటలోకి తీసుకువెళతాం, సంప్రదాయ, సాంకేతికత మేళవింపుతో.. ప్రపంచంలోని టాప్‌-5 రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా నిలపడమే నా లక్ష్యం.
 
అమరావతి డిజైన్లు మారవు...
నార్మన్‌ ఫోస్టర్‌ రూపొందించిన అమరావతి నగర డిజైన్లు వాస్తుకూ, గాలి దిశకూ అనుకూలంగానే ఉన్నాయి. ఈ డిజైన్లను మార్చేందుకు వీల్లేదు.
 
రాష్ట్రం కోసమే తాపత్రయం
పది రోజులుగా కుడిచెయ్యి విపరీతంగా నొస్తోంది. ప్రతి సమావేశంలో నేను నోట్స్‌ రాసుకొంటాను. అది కూడా కుదరడం లేదు. ఇంత నొప్పితో దావోస్‌ పర్యటనకు వెళ్లాలా అనిపించింది. కానీ... నలుగురిని కలిస్తే రాష్ట్రానికి ఏదో ఒకటి తేగలమన్న నమ్మకంతో బయలుదేరి వెళ్లాను! అక్కడకు వెళ్లిన తర్వాత ఏదో తేడా చేసి విరేచనాలు పట్టుకున్నాయి. మూడు రోజులు ఒట్టి పెరుగు, మాత్రలతో సరిపెట్టుకొన్నాను. అయినా ఒక్క మీటింగ్‌ రద్దు చేసుకోలేదు. రాష్ట్రం బాగుపడాలన్నదే నా తాపత్రయం!
 
ఫోన్‌ చేస్తే చాలు
ఇంట్లో కూర్చొని ఒక ఫోన్‌ కాల్‌ చేస్తే .. కరెంటు సరఫరా, నీటి రాక, రేషను కార్డు, భూమి సమస్యలు, స్కాలర్‌షి్‌పలు వంటి పలు సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం. దీనికి .. ప్రభుత్వం అలేఖ్యా తరహాలో ఒక యాప్‌ను తీసుకువస్తుంది. ఈ యాప్‌లో తమ సమస్యలు చెబితే .. వెంటనే సంబంధిత శాఖకు సమాచారం చేరుతుంది. సమస్య పరిష్కారమయ్యే దాకా ఆ యాప్‌ వాకబు చేస్తూనే ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలన్నింటినీ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్‌టీజీ)కి అనుసంధానం చేస్తాం. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరును ఆర్‌టీజీ పరిధిలోకి తెచ్చాం. ఈ ఏడాది మార్చి నెల నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కాగిత రహిత కార్యాలయాలుగా మారుస్తాం!
 
అమరావతి ఎయిర్‌ వేస్‌
గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఒక టెర్మినల్‌ను నిర్మించాం. మరో టెర్మినల్‌, రన్‌వే నిర్మాణం కోసం భూమిని కేటాయించాం. ఈ రన్‌వే పూర్తయితే ఎలాంటి విమానమైనా వచ్చేందుకు వీలుంటుంది. విశాఖలోనూ ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భాగస్వామ్య సంస్థలు ముందుకు వస్తే... ప్రత్యేకంగా అమరావతి ఎయిర్‌వేస్‌ ఏర్పాటు గురించి పరిశీలిస్తాం.
 
అక్రమాస్తులు స్వాధీనం...
కొందరు అక్రమాలు చేసి అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో బంగారు మంచాలు చేయించుకుంటారు. అక్రమంగా సంపాదించే వారెవరైనా సంతోషంగా ఉండలేరు. బంగారు మంచాలపైనా సుఖంగా పడుకోలేరు. ప్రభుత్వ ఉద్యోగులూ కోట్లకు కోట్ల ఆస్తులు సంపాదించారు. ఈ ఆస్తులన్నీ ప్రజలవే! బిహార్‌, ఒడిసా తరహాలో.. అక్రమాస్తులు రాష్ట్రానికే చెందేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
 
పట్టిసీమే లేకుంటే...
‘‘నిన్న కూడా ఒకాయన పట్టిసీమలో 400 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. ఆ ప్రాజెక్టు మొదలు పెట్టిన రోజు నుంచి ఇవే ఆరోపణలు. వారికి భయపడి ఊరుకొంటే ఇవాళ విజయవాడకు తాగడానికి నీళ్లు దొరికేవి కావు. ఎగువ నుంచి కృష్ణా జలాలు రాకున్నా... పట్టిసీమ ద్వారా నీళ్లిస్తున్నాం. మంచి పంట పండిందని రైతులు ఆనందంగా చెబుతున్నారు. ఈ ఏడాది వందకు పైగా టీఎంసీల నీటిని తెచ్చాం. వచ్చే ఏడాది 160 టీఎంసీల నీటిని తెస్తాం. రాయలసీమలో బాగా ఇబ్బంది పడుతున్న మడకశిర, హిందూపూరం, మదనపల్లి, కుప్పం వంటి ప్రాంతాలకు కూడా నీరిస్తాం. నీళ్లు ఇస్తుంటే అభినందించాలి. కానీ, ఎందుకింత అక్కసు? గోదావరి - పెన్నా నదులను అనుసంధానిస్తాం.
 
2027 నాటికి సంపూర్ణ సేంద్రీయం
ఇప్పటికే రాష్ట్రంలో సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాం. 2027 నాటికి రాష్ట్రం సంపూర్ణంగా సేంద్రీయ వ్యవసాయంగా మారుతుంది.
 
ఆశించినంత ఆదాయం లేదు
జీఎస్టీ వల్ల పన్ను ఆదాయం తగ్గింది. కానీ... కేంద్రానికి ఐటీ ఆదాయం పెరిగింది. రెండు వేల నోటు రద్దు అవుతుందనే ప్రచారం వల్ల కూడా డబ్బులు దాచుకోకుండా ఐటీ చెల్లించి తెలుపు చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. జీఎస్టీ పెరిగితేనే రాష్ట్రానికి లాభం ఉంటుంది.
 
అందరితో ఆనందం
పూర్వం కుటుంబ సభ్యులంతా కలసి ఒకే ఇంట్లో ఉండేవారు. పండుగలు, శుభకార్యాలూ కలసి సంతోషంగా చేసుకునేవారు. ఆ సందడే వేరు. కుటుంబ సభ్యుల బంధాలూ బంధుత్వాలతో ఇల్లు కళకళలాడమే కాదు.. మానవత్వమూ ఉండేది. రోజంతా కష్టపడి రాత్రికి ఇంటికివెళ్లి కుటుంబ సభ్యులతో కలసి భోంచేస్తూ అరగంట గడిపితే ఎంత ఆనందమో! కుటుంబ వ్యవస్థలోనే ఆనందం ఉంది.
 
ఈ ఆత్మీయానురాగాలు, మమకారం కలకాలం ఉండాలన్న అభిప్రాయంతోనే పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో అమ్మకు నమస్కరించే ఆచారం తెలుగిళ్లలో ఉండేది. ఈ సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించేందుకే అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించాం. గతంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారు సొంత గ్రామాలకు రావాల్సిన సమయం వచ్చేసింది.
 
ప్రకృతికి ప్రణామం
మన సంప్రదాయాలనూ, సంస్కృతిని మరచిపోతున్నాం. ప్రకృతిని ఆరాధించి, సంరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. హరిత వనాలను పెంచాలి. రాష్ట్రంలో ఒకప్పుడు మైనస్ గా ఉన్న అడవుల పెంపకం, చెట్ల పెంపకం ఇప్పుడు వృద్ధిలోకి వచ్చింది. దీనిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో సంప్రదాయ విధానాలను గౌరవించేలా చాలా కార్యక్రమాలను చేపడుతున్నాం.
 
ఏరువాక, జల సిరికి హారతి, వనం మనం వంటి కార్యక్రమాలు చేపట్టాం. నాగదేవత మా ఇలవేల్పు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి పోయినప్పుడు పుట్టకు భువనేశ్వరి పూజలు చేస్తుంటే మేమంతా భక్తితో నమస్కారాలు చేశాం. అది చూసిన ఊరిలో ఒక పెద్దాయన... పాత రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నాడు. ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయంలో ఒకటి. దానిని కాపాడుకోవాలి.
 
చర్చలు మంచివేగా...
చదువుకున్న వాళ్లు ఐదుగురు పిల్లలను కనాలని.. నిరక్షరాస్యులు పిల్లలను కనవద్దని ఓ చైనా ఆర్థిక వేత్త సూత్రీకరించారు. చదువుకున్నవాళ్లయితే సంపాదిస్తారని, పిల్లలను ఉన్నత విద్య అందించి, ప్రయోజకులను చేస్తారని... నిరక్షరాస్యులకు అది సాధ్యం కాదని ఆయన ఇలా చెప్పారు. దీనిపై చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఇది చైనాలో చర్చకు దారితీసి... దేశాభివృద్ధికి దోహదపడింది.
Link to comment
Share on other sites

మాది మిత్ర ధర్మం
అందుకే మాట్లాడటం లేదు
మా వాళ్లను ఆపుతున్నా
వారు వద్దనుకుంటే నమస్కారం పెట్టి అప్పుడు మాట్లాడతాం
భాజపా నేతల విమర్శలపై వారి నాయకత్వమే ఆలోచించాలి
కేసుల కోసమే జగన్‌ రాయబారం
ఆయన అవినీతి ఆస్తుల్ని కేంద్రం స్వాధీనం చేసుకోవాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
ఈనాడు - అమరావతి
27ap-main1a.jpg
‘కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అతడివే (జగన్‌ను ఉద్దేశించి) కాదు.. అక్రమంగా ఎవరు ఆస్తులు సంపాదించినా స్వాధీనం చేసుకుని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. బిహార్‌, ఒడిశాలో అదే చేశారు. ఈ భయం లేకపోతే కొన్ని రోజులు జైలుకు వెళ్లి వచ్చినా ఫర్వాలేదు.. అస్తులుంటే బాగుపడతామని అనుకుంటున్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని, ఎర్రచందనం అక్రమ రవాణాతో సంపాదించిన వారి ఆస్తుల్ని, అవినీతితో రూ.కోట్లలో కూడబెట్టినవారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి. అదే వారికి విధించే నిజమైన శిక్ష. సంపాదించిన ఆస్తులన్నీ పోయి జీరోకి వస్తేనే భయముంటుంది’
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

‘భాజపా నేతలు కొందరు చేస్తున్న విమర్శలపై నేను స్పందించను. మిత్ర ధర్మానికి కట్టుబడి ఉన్నా. దీనిపై వాళ్ల నాయకత్వమే (లీడర్‌షిప్‌) ఆలోచించుకోవాలి. మిత్ర ధర్మంవల్లే మా వాళ్లను ఆపుతున్నా. శుక్రవారమూ విమానాశ్రయంలో తాడేపల్లిగూడెంకు చెందిన మా నాయకుడు కనపడితే గట్టిగా మందలించా. మాట్లాడొద్దని చెప్పా. ఒకవేళ వాళ్లు (భాజపా) వద్దనుకుంటే నమస్కారంపెట్టి అప్పుడు మాట్లాడుకుందాం’ అని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్‌ పర్యటన విశేషాలను వివరించడానికి శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన    విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వైకాపా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా కుయుక్తులకు పాల్పడుతోందని, ప్రజలు బాగుపడటం చూసి ఓర్వలేకపోతోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే భాజపాతో కలిసి పని చేస్తామని జగన్‌ ప్రకటించడం గురించి ప్రస్తావించగా... ‘ఇది మొదటిసారా? ఎప్పటి నుంచో రాయబారాలు సాగడం లేదా? రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు ప్రత్యేక హోదా అడిగారా? ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ఎందుకు వాయిదా వేసుకున్నారు? నిమిషానికో మాట మాట్లాడి ప్రజల్ని మోసగించడం, మభ్యపెట్టడమే తప్ప వాళ్లలో చిత్తశుద్ధి ఉందా? ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పడానికే ఇదంతా. అతడికి కావాల్సింది కేసుల నుంచి గట్టెక్కడమే’ అని స్పందించారు.

గవర్నరుపై విమర్శలు చేయను..
గవర్నరు వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై విమర్శలు చేయబోనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గవర్నరును మార్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు...‘దానిపై వివాదం అవసరం లేదు. కొన్ని వ్యవస్థల గురించి మాట్లాడకూడదు. కొందరు రాజకీయాల కోసం మాట్లాడతారు. నా పద్ధతి అది కాదు. గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వారిపై విమర్శలు చేయడం, బజారులో మాట్లాడటం మంచిది కాదు’ అని బదులిచ్చారు.

అలాంటి వాళ్లు రాష్ట్రానికి అవసరమా?
ప్రజలు బాగుపడుతుంటే వైకాపా నాయకులు ఓర్వలేకపోతున్నారని, అలాంటి వాళ్లు ఈ రాష్ట్రానికి అవసరమా? అన్న విషయాన్ని ప్రజలే ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘విశాఖపట్నంలో షాపింగ్‌మాల్‌ కడుతుంటే పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందంటున్నారు. లులు గ్రూపు వాళ్లు వద్దని పారిపోతుంటే వెంటపడి ఒప్పించి తీసుకొచ్చా. కొచ్చిలో వాళ్ల షాపింగ్‌మాల్‌కు రోజూ 80వేల మంది వస్తున్నారు. తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శనానికి ఎంతమంది వస్తున్నారో అంతమంది వస్తున్నారు. అలాంటి పెద్ద సంస్థను పట్టుకొస్తే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వాళ్లను నా స్వార్థం కోసం తెచ్చానా? విశాఖకు ఫిన్‌టెక్‌, బ్లాక్‌చెయిన్‌ సంస్థలు వస్తున్నాయి. ఇంత చేస్తుంటే ఏదో అక్రమం జరిగిపోయిందని ఎవడో ఒకడు రాస్తున్నాడు. మూడున్నరేళ్లలో వచ్చిన పరిశ్రమలు వాళ్లకు కనిపించడం లేదు. కియా రావడంతో అనంతపురం స్వరూపమే మారిపోయింది. శ్రీసిటీలో అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. తిరుపతి హార్డ్‌వేర్‌ హబ్‌గా మారింది. ఆటోమొబైల్‌, హార్డ్‌వేర్‌, ఆగ్రోప్రాసెసింగ్‌ ఇలా అన్ని రంగాల్లో ముందున్నాం’ అని పేర్కొన్నారు. ‘శ్రీకాకుళం నుంచి పెన్నా వరకూ నదుల అనుసంధానం జరగాలి. ఎక్కడ కురిసిన నీరు అక్కడ రిజర్వాయర్లలో నిల్వ చేసుకోవాలి. భూగర్భాన్నే రిజర్వాయరుగా మార్చుకోవాలి. వచ్చే సంవత్సరం 160 టీఎంసీల జలాలు తెస్తాం. ఇంత చేస్తున్నా ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ప్రజలు బాధపడి అశాంతి రేగి వారికి రాజకీయ లబ్ధి చేకూరాలన్నదే వాళ్ల తపన. ప్రజలు బాగుపడితే చూడలేకపోతే ఎలా? రాజకీయ పార్టీలు ప్రజల కోసం పని చేయాలే తప్ప స్వార్థం కోసం చిచ్చు పెట్టకూడదు. ఇలాంటి రాజకీయ పార్టీలు, నాయకులు అవసరమా? ప్రజలే ఆలోచించుకోవాలి’ అని స్పష్టం చేశారు.

వారికేం అనుభవం ఉంది?
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తుంటే ఉద్యోగాలే రావడం లేదని, ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలొస్తాయని కొందరు వక్రీకరించి మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మాట్లాడుతున్న వ్యక్తులకు ఏం అనుభవం ఉందని ఆయన ప్రశ్నించారు. తాను ఏ విషయంలోనూ రాజీ పడటం లేదని, రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. ‘మీరు బాగా వృద్ధి సాధిస్తున్నారు కాబట్టి మీకు ఇవ్వడం లేదని కొందరంటున్నారు. వాళ్లు ఏదో ఇస్తారని నేను పని చేయడం మానేసి పేద అరుపులు అరవాలా? వాళ్లు ఏ రూ.10వేల కోట్లో ఇచ్చినా, నేను కష్టపడటం మానేస్తే అది ఏ మూలకూ చాలదు. ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది’ అని పేర్కొన్నారు.

2 వారాల్లోనే భూ వినియోగ మార్పిడి
టెక్నాలజీ వినియోగంవల్ల పింఛన్లు, రేషన్‌ పంపిణీలో పారదర్శకత సాధించామని, దుబారా అరికట్టామని చంద్రబాబు తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ వందసార్లు తిరగాల్సిన అవసరం లేకుండా అనేక మార్పులు తెచ్చామని, భూధార్‌తో భూ వివాదాలు ఉండవని పేర్కొన్నారు. నాలా చట్టంలో సవరణలవల్ల రెండు వారాల్లోనే భూవినియోగ మార్పిడి పత్రాలు జారీ చేయగలమని తెలిపారు.

తీవ్రమైన చేతి నొప్పితోనే దావోస్‌ వెళ్లా..
ఒకపక్క రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఎంతో శ్రమపడుతూ, మరోపక్క అభివృద్ధికి అడ్డుతగులుతున్న విపక్షాలతోనూ పోరాటం చేయాల్సి వస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా తాను దావోస్‌కి వెళ్లానని చెప్పారు. ‘ఇటీవల నేను ఎక్కువ సమయం మైకు పట్టుకుని మాట్లాడా. సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ప్రతి విషయాన్నీ రాస్తూ ఉంటా. గంటలకొద్దీ మైకు పట్టుకుని మాట్లాడటం, పెన్నుతో రాయడంవల్ల నా కుడిచేయి పది రోజుల నుంచి విపరీతంగా నొప్పి పుడుతోంది. పది రోజుల్లో 11 సార్లు ఫిజియో థెరపీ చేసినా నొప్పి తగ్గలేదు. దావోస్‌కి వెళ్లవద్దని కొందరు సూచించినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వెళ్లే తీరాలని నిర్ణయించుకున్నా. తీరా దావోస్‌ బయల్దేరే రోజు నా పొట్టలో ఇబ్బంది ఏర్పడింది. విమానంలో నిద్ర లేదు. దావోస్‌ వెళ్లాక రెండు రోజులు ఇబ్బంది పడ్డా. పెరుగన్నం, టాబ్లెట్‌లతోనే గడిపా. దావోస్‌ నుంచి తిరిగి వచ్చే రోజే ఆరోగ్యం కొంత కుదుటపడింది’ అని ముఖ్యమంత్రి వివరించారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend
11 minutes ago, sonykongara said:
ఎందుకీ అక్కసు?
28-01-2018 02:18:57
 
636527027421155422.jpg
  • అభివృద్ధి చేస్తుంటే అడ్డంకులా?
  • ఎంత కష్టపడుతున్నా బురద చల్లడమా?
  • వీళ్లతో పోరాడాలా... సమస్యలపైనా?
  • పట్టిసీమ లేకుంటే ఏమిటి పరిస్థితి?
  • కృష్ణా డెల్టాకు, సీమకు నీళ్లొచ్చేవా?
  • గోదావరి-పెన్నానూ అనుసంధానిస్తాం
  • ‘సీమ’కు నీళ్లు ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం
  • విభజన వేళ గతుకుల రోడ్డులా రాష్ట్రం
  • ఇప్పటికి 370 కోట్ల డాలర్ల పెట్టుబడులు
  • చెయ్యి బాధిస్తున్నా దావోస్‌కు వెళ్లా
  • మూడు రోజులు ఒట్టి పెరుగు, మాత్రలే
  • అయినా... అన్ని సమావేశాల్లో పాల్గొన్నా
  • రాష్ట్రానికి కీలక సంస్థలు, పలు ఒప్పందాలు
  • పరిశీలనలో అమరావతి ఎయిర్‌వేస్‌: సీఎం
అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నా ఏదో ఒక బురద చల్లి ఆనందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లతో పోరాడాలా? రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలా అనేది అర్థం కావడంలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారు. దావోస్‌ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన... శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై భావోద్వేగంతో స్పందించారు.
 
రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాకూడదని, అరాచకం పెరిగిపోవాలని .. ప్రజల మధ్య చిచ్చు రేపాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని మండిపడ్డారు. లులూ సంస్థ విశాఖలో కార్యకలాపాలను స్థాపించేందుకు ముందుకు వస్తుంటే.. కొందరు ఎలా వస్తుందో చూస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘‘ఈ సంస్థ కొచ్చిన్‌లో నిర్వహిస్తోన్న కార్యకలాపాలు చూసి రాష్ట్రానికి పిలిచాం. వారు కోరినచోట భూములు ఇస్తే ఇప్పుడు అడ్డుకుంటామంటూ హెచ్చరికలు చేయమేమిటి? అభివృద్ధి చేయాలంటూనే ఇలా అడ్డగింతలేమిటి?’’ అని నిలదీశారు. తనకు ప్రజలపై నమ్మకం ఉందని... ఎవరు పనిచేస్తున్నారో... ఎవరు మాటలు చెబుతున్నారో వారు గ్రహించగలరని అన్నారు.
 
‘‘విభజన సమయానికి రాష్ట్రంలో సరైన మౌలిక సదుపాయాలు లేవు. రాష్ట్రం గతుకుల రోడ్డులా ఉంది. గన్నవరం విమానాశ్రయం రేకుల షెడ్డులా ఉండేది. అయినా.. మూడున్నరేళ్లలో 370 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అనంతపురం జిల్లాకు కియ కార్ల కంపెనీ వచ్చింది. రాయలసీమకు నీళ్లు, పరిశ్రమలు వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుస్తుంది.’’ అని వివరించారు. రాష్ట్రం కోసం తాను ఏ కష్టాన్ని లెక్క పెట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆయా అంశాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...
 
‘దావోస్’తో వచ్చిందిదీ..
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పటి నుంచి దావోస్ కు వెళ్తున్నాను. ఇప్పటికి 14సార్లు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో, టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందుతోందో ఈ సదస్సు వల్ల తెలుస్తుంది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ప్రపంచం భారత్‌ గురించి, అందునా .. ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడుకునేలా చేశాం. దావోస్‌ పర్యటనలో భాగంగా జ్యూరిక్‌తో సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం చేసుకున్నాం. మెడ్‌ టెక్‌తో ఒప్పందం కుదిరింది.
 
విశాఖలో 1000 నుంచి 2000 ఎకరాల్లో మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. దావోస్ లో మెడ్‌సిటీకి సంబంధించి 150 సంస్థలతో ఒప్పందం జరుగుతుందని భావించినా... 50 సంస్థలతో ఒప్పందం జరిగింది. అలీబాబా క్లౌడ్‌ డేటా సెంటర్‌ ఏపీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దేశంలో మొదటి కేంద్రాన్ని ముంబైలో ఏర్పాటు చేస్తోంది. రెండోది... ఏపీలో వస్తుంది. బ్లాక్‌ చెయిన్‌, హైబ్రీడ్‌ క్లౌడ్‌ హబ్‌, ఫిన్‌టెక్‌ వంటి పాలసీలు తీసుకురావడం వల్ల పలు ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దావోస్ లో హిటాచీతోనూ ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటికే మనం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ను అత్యుత్తమంగా నిర్వహిస్తున్నాం.
 
హిటాచీ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే... హెచ్‌పీ 3-డి ప్రింటింగ్‌ ప్లాంట్‌ కూడా స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎయిర్‌ బస్‌ కూడా టాటాతో కలసి రవాణా విమాన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌ రహేజాలో 1,35,000 మందికి ఉద్యోగాలను కల్పించారు. ఇప్పుడు... ఏపీలోనూ మైండ్‌ స్పేస్‌ కేంద్రాల ఏర్పాటుకు రహేజా సంసిద్ధత వ్యక్తం చేసింది. శాప్‌ గ్లోబల్‌ హెడ్‌తో సంప్రదింపులు జరిపాం. కాంప్రహెన్సివ్‌ ఫైనాన్స్‌ను అమలు చేసేందుకు శాప్‌ అంగీకరించింది.
 
సౌదీ ఆరమ్‌కో కాకినాడలో లేదా కృష్ణపట్నంలో రిఫైనరీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. కరువును నియంత్రించేలా రూపొందించిన విధానాలను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యూపీఎల్‌ సంస్థను కోరాం. వేదాంత గ్రూప్‌ రాష్ట్రంలో 20 లక్షల అమెరికన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతుంది. దావోస్ లోనూ ఏపీయే ప్రపంచాన్ని ఆకర్షించింది. అక్కడ ఏర్పాటు చేసిన వాహనాలతో పాటు .. తెలుగు వంటకాలు అందరిని ఆకట్టుకున్నాయి.
 
ఆవిష్కరణ కేంద్రంగా...
ఇన్నోవేషన్స్‌ అమలులో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం. శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతాం. ప్రపంచమంతా ఏకథాన్‌ నిర్వహిస్తాం. సాంకేతిక నైపుణ్యం వినియోగం, కొత్త ఆవిష్కరణలు, సంప్రదాయ సేంద్రీయ ఎరువుల విధానం .. తదితరాలతో ఏపీని వృద్ధి బాటలోకి తీసుకువెళతాం, సంప్రదాయ, సాంకేతికత మేళవింపుతో.. ప్రపంచంలోని టాప్‌-5 రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా నిలపడమే నా లక్ష్యం.
 
అమరావతి డిజైన్లు మారవు...
నార్మన్‌ ఫోస్టర్‌ రూపొందించిన అమరావతి నగర డిజైన్లు వాస్తుకూ, గాలి దిశకూ అనుకూలంగానే ఉన్నాయి. ఈ డిజైన్లను మార్చేందుకు వీల్లేదు.
 
రాష్ట్రం కోసమే తాపత్రయం
పది రోజులుగా కుడిచెయ్యి విపరీతంగా నొస్తోంది. ప్రతి సమావేశంలో నేను నోట్స్‌ రాసుకొంటాను. అది కూడా కుదరడం లేదు. ఇంత నొప్పితో దావోస్‌ పర్యటనకు వెళ్లాలా అనిపించింది. కానీ... నలుగురిని కలిస్తే రాష్ట్రానికి ఏదో ఒకటి తేగలమన్న నమ్మకంతో బయలుదేరి వెళ్లాను! అక్కడకు వెళ్లిన తర్వాత ఏదో తేడా చేసి విరేచనాలు పట్టుకున్నాయి. మూడు రోజులు ఒట్టి పెరుగు, మాత్రలతో సరిపెట్టుకొన్నాను. అయినా ఒక్క మీటింగ్‌ రద్దు చేసుకోలేదు. రాష్ట్రం బాగుపడాలన్నదే నా తాపత్రయం!
 
ఫోన్‌ చేస్తే చాలు
ఇంట్లో కూర్చొని ఒక ఫోన్‌ కాల్‌ చేస్తే .. కరెంటు సరఫరా, నీటి రాక, రేషను కార్డు, భూమి సమస్యలు, స్కాలర్‌షి్‌పలు వంటి పలు సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం. దీనికి .. ప్రభుత్వం అలేఖ్యా తరహాలో ఒక యాప్‌ను తీసుకువస్తుంది. ఈ యాప్‌లో తమ సమస్యలు చెబితే .. వెంటనే సంబంధిత శాఖకు సమాచారం చేరుతుంది. సమస్య పరిష్కారమయ్యే దాకా ఆ యాప్‌ వాకబు చేస్తూనే ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలన్నింటినీ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్‌టీజీ)కి అనుసంధానం చేస్తాం. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరును ఆర్‌టీజీ పరిధిలోకి తెచ్చాం. ఈ ఏడాది మార్చి నెల నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కాగిత రహిత కార్యాలయాలుగా మారుస్తాం!
 
అమరావతి ఎయిర్‌ వేస్‌
గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఒక టెర్మినల్‌ను నిర్మించాం. మరో టెర్మినల్‌, రన్‌వే నిర్మాణం కోసం భూమిని కేటాయించాం. ఈ రన్‌వే పూర్తయితే ఎలాంటి విమానమైనా వచ్చేందుకు వీలుంటుంది. విశాఖలోనూ ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భాగస్వామ్య సంస్థలు ముందుకు వస్తే... ప్రత్యేకంగా అమరావతి ఎయిర్‌వేస్‌ ఏర్పాటు గురించి పరిశీలిస్తాం.
 
అక్రమాస్తులు స్వాధీనం...
కొందరు అక్రమాలు చేసి అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో బంగారు మంచాలు చేయించుకుంటారు. అక్రమంగా సంపాదించే వారెవరైనా సంతోషంగా ఉండలేరు. బంగారు మంచాలపైనా సుఖంగా పడుకోలేరు. ప్రభుత్వ ఉద్యోగులూ కోట్లకు కోట్ల ఆస్తులు సంపాదించారు. ఈ ఆస్తులన్నీ ప్రజలవే! బిహార్‌, ఒడిసా తరహాలో.. అక్రమాస్తులు రాష్ట్రానికే చెందేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
 
పట్టిసీమే లేకుంటే...
‘‘నిన్న కూడా ఒకాయన పట్టిసీమలో 400 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. ఆ ప్రాజెక్టు మొదలు పెట్టిన రోజు నుంచి ఇవే ఆరోపణలు. వారికి భయపడి ఊరుకొంటే ఇవాళ విజయవాడకు తాగడానికి నీళ్లు దొరికేవి కావు. ఎగువ నుంచి కృష్ణా జలాలు రాకున్నా... పట్టిసీమ ద్వారా నీళ్లిస్తున్నాం. మంచి పంట పండిందని రైతులు ఆనందంగా చెబుతున్నారు. ఈ ఏడాది వందకు పైగా టీఎంసీల నీటిని తెచ్చాం. వచ్చే ఏడాది 160 టీఎంసీల నీటిని తెస్తాం. రాయలసీమలో బాగా ఇబ్బంది పడుతున్న మడకశిర, హిందూపూరం, మదనపల్లి, కుప్పం వంటి ప్రాంతాలకు కూడా నీరిస్తాం. నీళ్లు ఇస్తుంటే అభినందించాలి. కానీ, ఎందుకింత అక్కసు? గోదావరి - పెన్నా నదులను అనుసంధానిస్తాం.
 
2027 నాటికి సంపూర్ణ సేంద్రీయం
ఇప్పటికే రాష్ట్రంలో సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాం. 2027 నాటికి రాష్ట్రం సంపూర్ణంగా సేంద్రీయ వ్యవసాయంగా మారుతుంది.
 
ఆశించినంత ఆదాయం లేదు
జీఎస్టీ వల్ల పన్ను ఆదాయం తగ్గింది. కానీ... కేంద్రానికి ఐటీ ఆదాయం పెరిగింది. రెండు వేల నోటు రద్దు అవుతుందనే ప్రచారం వల్ల కూడా డబ్బులు దాచుకోకుండా ఐటీ చెల్లించి తెలుపు చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. జీఎస్టీ పెరిగితేనే రాష్ట్రానికి లాభం ఉంటుంది.
 
అందరితో ఆనందం
పూర్వం కుటుంబ సభ్యులంతా కలసి ఒకే ఇంట్లో ఉండేవారు. పండుగలు, శుభకార్యాలూ కలసి సంతోషంగా చేసుకునేవారు. ఆ సందడే వేరు. కుటుంబ సభ్యుల బంధాలూ బంధుత్వాలతో ఇల్లు కళకళలాడమే కాదు.. మానవత్వమూ ఉండేది. రోజంతా కష్టపడి రాత్రికి ఇంటికివెళ్లి కుటుంబ సభ్యులతో కలసి భోంచేస్తూ అరగంట గడిపితే ఎంత ఆనందమో! కుటుంబ వ్యవస్థలోనే ఆనందం ఉంది.
 
ఈ ఆత్మీయానురాగాలు, మమకారం కలకాలం ఉండాలన్న అభిప్రాయంతోనే పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో అమ్మకు నమస్కరించే ఆచారం తెలుగిళ్లలో ఉండేది. ఈ సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించేందుకే అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించాం. గతంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారు సొంత గ్రామాలకు రావాల్సిన సమయం వచ్చేసింది.
 
ప్రకృతికి ప్రణామం
మన సంప్రదాయాలనూ, సంస్కృతిని మరచిపోతున్నాం. ప్రకృతిని ఆరాధించి, సంరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. హరిత వనాలను పెంచాలి. రాష్ట్రంలో ఒకప్పుడు మైనస్ గా ఉన్న అడవుల పెంపకం, చెట్ల పెంపకం ఇప్పుడు వృద్ధిలోకి వచ్చింది. దీనిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో సంప్రదాయ విధానాలను గౌరవించేలా చాలా కార్యక్రమాలను చేపడుతున్నాం.
 
ఏరువాక, జల సిరికి హారతి, వనం మనం వంటి కార్యక్రమాలు చేపట్టాం. నాగదేవత మా ఇలవేల్పు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి పోయినప్పుడు పుట్టకు భువనేశ్వరి పూజలు చేస్తుంటే మేమంతా భక్తితో నమస్కారాలు చేశాం. అది చూసిన ఊరిలో ఒక పెద్దాయన... పాత రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నాడు. ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయంలో ఒకటి. దానిని కాపాడుకోవాలి.
 
చర్చలు మంచివేగా...
చదువుకున్న వాళ్లు ఐదుగురు పిల్లలను కనాలని.. నిరక్షరాస్యులు పిల్లలను కనవద్దని ఓ చైనా ఆర్థిక వేత్త సూత్రీకరించారు. చదువుకున్నవాళ్లయితే సంపాదిస్తారని, పిల్లలను ఉన్నత విద్య అందించి, ప్రయోజకులను చేస్తారని... నిరక్షరాస్యులకు అది సాధ్యం కాదని ఆయన ఇలా చెప్పారు. దీనిపై చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఇది చైనాలో చర్చకు దారితీసి... దేశాభివృద్ధికి దోహదపడింది.

rey verri pushpams bjp leaders idhi chadivi aina maarandi ra 

fight with ur high command than with local govt ./.appaudey meeku AP lo brathuku political ga ...ledha ndhuku paniki raakundapotharu congi jumpers 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...