Jump to content

Budameru Rivulet


sonykongara

Recommended Posts

బుడమేరు ప్రక్షాళనకు సన్నద్ధం
26-01-2018 10:41:20
 
636525600851057331.jpg
  • వారంలో ఇంజనీర్లతో సమావేశం
  • ఇరిగేషన్‌ ఎస్‌ఈ రమేష్‌బాబు వెల్లడి
  • ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందన
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : బుడమేరు కాలువ ఆధునికీకరణ, విజయవాడ పల్లపు ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడడం, ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేపట్టాలి? అనే విషయాలపై సమీక్షించడానికి వారం రోజుల్లో సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహిస్తుట్టు ఇరిగేషన్‌ ఎస్‌ఈ రమే్‌షబాబు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గత నాలుగు రోజులుగా ‘బుడమేరు కథలు’ పేరుతో ఆంధ్రజ్యోతి ప్రచురిస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. బుడమేరు నదిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, విజయవాడ పల్లపు ప్రాంతాలకు పొంచివున్న ముంపు ముప్పును తప్పించే అంశంపై దృష్టిపెట్టినట్టు ఆయన తెలిపారు. ఇంజనీరింగ్‌ అధికారులతో నిర్వహించే సమావేశంలో ఒక క్లారిటీ వస్తుందని, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నగరంలో భారీగా ఆక్రమణలు వున్నందున వాటిని ఎలా చేయాలి అనే దానిపై కూడా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.
 
 
ఇలా చేస్తే బాగుంటుంది
  • బుడమేరు లోతు ప్రస్తుతం 2 నుంచి 2.5 మీటర్లు వుంది. దీన్ని కనీసం మరో రెండు మీటర్లు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి.
 
  • వెలగలేరు వద్ద వున్న అండర్‌ టెన్నల్‌ను నాలుగు వేల క్యూసెక్కుల కెపాసిటీ నుంచి 15000 క్యూసెక్కుల కెపాసిటీకి పెంచి వరద నీరు ఉదృతికి తగ్గట్లు వచ్చిన నీరు వచ్చినట్లు వెళ్లి పోయే విధంగా పనులు చేపట్టాలి. అవసరమైన చోట్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి.
  • గుణ దల, సింగ్‌నగర్‌, ఎనికేపాడు వద్ద వున్న రోడ్డు బ్రిడ్జిలను కనీసం 10 మీటర్ల ఎత్తుకు పెంచాలి. అప్పుడే వరద నీరు సులభంగా కాలువల్లో ప్రవహించి విజయవాడ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా వుంటాయి. దీంతో పాటు కాలువపై అవసరమైన చోట్ల రైల్వే బ్రిడ్జిలు నిర్మించాలి. వీటిని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపట్టాలి.
  • కాలువ చుట్టూ దాదాపు 356.74 ఎకరాలు భూసేకరణ చేయాల్సిన అవసరం వుంది. అప్పుడే కాలువ వెడల్పు చేసి వరద నీరు సులభంగా కాలువల్లో వెళ్లడానికి వీలుంటుంది. దీనికోసం దాదాపు 300 కోట్ల రూపాయలు అవసరం వుందని అధికారులు ప్రతిపాదించారు. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా మంత్రులు చర్యలు తీసుకోవాలి.
  • బుడమేరు నుంచి కొల్లేరు సరస్సుకు వెళ్లే బుడమేరు నీరు ఉప్పుటేరుకు వెళుతుంది. దీని కెపాసిటీ ప్రస్తుతం 11 వేల క్యూసెక్కులు మాత్రమే వుంది. దీన్ని మరో 5 వేల క్యూసెక్కులకు స్థాయి పెంచాలి.
Link to comment
Share on other sites

బుడమేరుకు మంచి రోజులు
30-01-2018 09:03:26

డైవర్షన్‌ చానల్‌ ఎత్తు పెంపునకు ప్రణాళికలు
ఇంజనీర్ల కీలక సమావేశంలో నిర్ణయం
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : బుడమేరుకు మంచి రోజులు రానున్నాయి. దాని స్థితిగతులపై ఫొటోలతో సహా ఇటీవల ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయిన కథనాలకు స్పందించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్‌ శాఖను ఆదేశించిన విషయం విదితమే. దీంతో ఇరిగేషన్‌ ఎస్‌ఈ రమే్‌షబాబు స్వయంగా రంగంలోకి దిగి సంబంధిత ఈఈలు, డీఈలు, ఏఈఈలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా బుడమేరు డైవర్షన్‌ చానల్‌ బాగుపడితే కానీ భారీ వర్షాల సమయంలో విజయవాడను ముంపు ప్రమాదం నుంచి తప్పించలేమని భావించారు. ప్రధానంగా ఇరిగేషన్‌ పాత్ర ఉన్నప్పటికీ బుడమేరులో విద్యుత్‌ లైన్లు, రైల్వేట్రాక్‌లు, బ్రిడ్జిలు, నేషనల్‌ హైవేకు సంబంధించిన రోడ్డుపై బ్రిడ్జిలు ఉన్నందున వాటిని తొలగించి ఆ స్థానంలో పెద్ద కల్వర్టులు, సప్లయి చానళ్లు, రైల్వే బ్రిడ్జిలను ఎత్తు పెంచడం, డైవర్షన్‌ చానల్‌ను 12 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు వచ్చినా సులభంగా కాల్వ ద్వారా కొల్లేటి సరస్సులోకి వెళ్లే విధంగా డైవర్షన్‌ చానల్‌ నిర్మాణం ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు. దీంతో బుడమేరు నుంచి విజయవాడకు వరద ముప్పు లేకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతతో జాతీయ రహదారులు, పోలవరం కుడికాల్వకు సంబంధించిన ఐదో డివిజన్‌ ఇంజనీర్లు, రైల్వేశాఖ, పవర్‌ కార్పొరేషన్‌, వీటీపీఎస్ రంగంలోకి దిగి ఎవరి కార్యాచరణ వారు చేపట్టాల్సి వుందని నివేదికలో పొందుపర్చారు. దీన్ని కలెక్టర్‌కు సమర్పించి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఉన్నతాధికారులు భావించారు. త్వరలో పనులు కార్యరూపం దాల్చడానికి తిరిగి ఈ వారంలోనే రెండోసారి అన్ని శాఖల అధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...